
● తోడుగా వెళ్లి...
జగనన్న కాలనీలో ఉంటున్న మల్లేష్, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.