పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
ములకలచెరువు : పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో జరిగింది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని సోంపల్లి పంచాయతీ అడివి నాయుని చెరుపల్లికి చెందిన మస్తాన్ అప్పకు చెందిన రెండు ఆవులు ఇంటి సమీపంలోని ఒక చెట్టు కింద కట్టేశాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో ఆవులు ఉన్న చెట్టు పైన పిడుగు పడింది. పిడుగుతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. రూ.లక్ష రూపాయ లు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.
వైద్యం కోసం వచ్చిన వ్యక్తి..
బి.కొత్తకోట : వైద్యం కోసం వచ్చిన మండలంలోని చలిమామిడికి చెందిన శ్రీనివాసులు (70) గురువారం బి.కొత్తకోటలో మృతి చెందాడు. స్థానిక ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం కోసం వచ్చాడు. అక్కడ కూర్చున్న కొంతసేపటికి కుప్పకూలిపోయాడు. అతన్ని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై మెడికల్ ఆఫీసర్ కిరణ్‌కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విద్యుత్ షాక్‌తో రైతు..
వేముల : మండలంలోని వేల్పుల గ్రామంలో గురువారం రాత్రి వల్లూరు లక్ష్మీనారాయణ అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ తనకున్న పొలంలో అరటి పంట సాగు చేశాడు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో గాలివాన వస్తున్న సమయంలో తోట వద్దకు వెళ్లాడు అక్కడ మోటార్ స్టార్టర్‌కు ఉన్న ఫీజులు తీసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు
సారా విక్రేత అరెస్ట్
నిమ్మనపల్లె : సారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్‌ఐ సి.తిప్పేస్వామి తెలిపారు. గురువారం అగ్రహారం పంచాయతీ అరిపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్.లక్ష్మయ్య నాటుసారా తెచ్చి స్థానికంగా విక్రయిస్తు న్నట్లు సమాచారం అందడంతో.. సిబ్బందితో కలిసి దాడులు చేసి అతని వద్ద నుంచి 10 లీ టర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని పై కేసు నమోదు చేసి, రిమాండు ని మిత్తం కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.
విద్యార్థికి పాము కాటు
మదనపల్లె : పాము కా టుకు గురై విద్యార్థి ప రిస్థితి విషమంగా మా రిన ఘటన గురువారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. చింతపర్తి గ్రామం పాతకోటపల్లెకు చెందిన శ్రీనాథరెడ్డి కుమారుడు నిశాంత్‌రెడ్డి(14) వేసవి సెలవు లు కావడంతో పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పా ము అకస్మాత్తుగా విద్యార్థిని కాటువేయడంతో అ పస్మారకస్థితికి వెళ్లి పరిస్థితి విషమించింది. వెంట నే కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లె ప్ర భుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి


