ముందంజలో సౌరాష్ట్ర జట్టు
కడప వైఎస్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహంగా సాగుతోంది. రెండవ రోజు గురువారం వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 42 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన ఆంధ్ర జట్టు నిర్ణీత 71 ఓవర్లకు 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 77 పరుగులు, ఆనంద్ జోషయ్య 40 పరుగులు చేశారు. సౌరాష్ట్ర జట్టులోని మోహిత్ ఉల్వా 3 వికెట్లు తీశారు.
ఉత్సాహంగా సాగుతున్న కూచ్‌బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
ముందంజలో సౌరాష్ట్ర జట్టు
ముందంజలో సౌరాష్ట్ర జట్టు


