రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రాజంపేట : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందారు. చిట్వేలి మండలం నాగవరానికి చెందిన మూరి అనిత(28) పెద్దఓరంపాడులోని తన పుట్టింటి నుంచి రాజంపేటకు ఆటోలో బయలుదేరారు. కడప–రేణిగుంట జాతీయ రహదారిపై రాజంపేట పట్టణ శివారులోని అశోక్ గార్డెన్స్ వద్ద వీరి ఆటోను టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మూరి అనిత(28) అక్కడికక్కడే మృతిచెందారు. ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ అంజి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అతడిని కడప రిమ్స్ తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు చేరుకు బోరున విలపించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అమరావతికి వెళ్తూ
యానిమేటర్‌కు గాయాలు
ఓబులవారిపల్లె : అమరావతి పునర్నిర్మాణ సభకు వెళ్తూ ఒంగోలు వద్ద బస్సు టైర్ పగిలి జరిగిన ప్రమాదంలో యానిమేటర్ పట్ర కవితకు తీవ్రగాయాలయ్యయి. స్థానికుల వివరాల మేరకు.. అమరావతిలో మోదీ సభకు గురువారం రాత్రి మండలంలోని ఎస్‌హెచ్‌జీ బృందాల మహిళలు ఆర్‌ర్టీసీ బస్సులో బయలుదేరారు. ఒంగోలు చేరగానే.. బస్సు వెనుక టైర్ పెద్ద శబ్దంతో పేలింది. ఓబులవారిపల్లె మండలం శంకరాపురం దళితవాడకు చెందిన పట్ర కవిత, మంగళంపల్లె గ్రామానికి చేందిన గీతకు గాయాలయ్యాయి. వారిని తిరుపతి బర్డ్ ఆసుపత్రికి తరలించారు. సభకు వెళ్తూ పట్ర కవిత గాయపడినా నాయకులు పట్టించుకోలేదని రైల్వేకోడూరు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జోతి చిన్నయ్య విమర్శించారు.
చెట్టుకు ఉరివేసుకొని
తిరుపతి వాసి మృతి
రాయచోటి : రాయచోటి రూరల్ మండలం జంగంరెడ్డిగారిపల్లె సమీపంలో చింత చెట్టుకు ఉరివేసుకుని కోటకొండ రెడ్డప్ప(40) మృతి చెందినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న రెడ్డప్ప జంగమరెడ్డిగారిపల్లెలోని కుమార్తె డేరంగుల మాధవి ఇంటికి ఐదు రోజుల కిందట వచ్చారు. మద్యం తాగడం మానుకోవాలంటూ కుమార్తె మాధవి చెప్పింది. మద్యానికి బానిసైన రెడ్డప్ప మద్యం తాగకుండా ఉండలేక గురువారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్లి మామిడితోటలోని చింత చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందారు. రెడ్డప్ప కుమార్తె డేరంగుల మాధవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


