నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
సీఎండీ శివశంకర్
పీలేరు: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిండమే లక్ష్యమని ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శివశంకర్ అన్నారు. మంగళవారం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లె పర్యటించి విద్యుత్ వినియోగంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టాప్ సోలార్ ప్లాంట్లు, డిజిటల్ మీటర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, కనెక్షన్లు సమస్యలు, బిల్లుల వివాదాలు, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా 14 సమస్యలుగుర్తించి పరిష్కార మార్గం చూపినట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్దేశిత గ్రామాలు, పట్టణాల్లో పరిశీలన కార్యక్రమం చేపట్టాలని కోరారు. వినియోగదారులు తమ సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ సీఎం 89777 16661 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈఈ అమీర్‌బాషా, రూరల్ ఏఈ రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


