వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం

Dec 24 2025 4:08 AM | Updated on Dec 24 2025 4:08 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం ● బీసీ నాయకుడిపై దాడి హేయమైన చర్య

రాయచోటి అర్బన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే బలమని.. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్‌రెడ్డి , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌ కాలనీలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ మిథున్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమై వారి కష్టనష్టాలను శ్రద్దగా విని, ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కడప– బెంగళూరు రైల్వే లైనుకు

నిధులు మంజూరు చేయండి...

కడప – బెంగళూరు రైల్వే లైన్‌ పనులకు తక్షణమే నిధులు మంజూరు చేసి ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ రైల్వే లైను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమని ఎంపీ పేర్కొన్నారు. రాయచోటి ప్రాంతంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు, బైపాస్‌ రోడ్డు నిర్మాణాలు అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి సహకారంతో విజయవంతంగా పూర్తయ్యాయని గుర్తుచేశారు. మదనపల్లె–పీలేరు కనెక్టివిటీ రోడ్లను కూడా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించామని తెలిపారు. కడప– బెంగళూరు రైల్వే లైనుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారని ఎంపీ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైల్వేలైను ప్రాజెక్టుకు మంజూరు జరగకపోతే, రాన్ను రోజుల్లో అంచనా వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీంతో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఎంపీ మిథున్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎంపీగా మిథున్‌ రెడ్డి ప్రజా గొంతుకగా

నిలుస్తున్నారు: శ్రీకాంత్‌ రెడ్డి

రాజంపేట పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలను ఎంపీ మిథున్‌ రెడ్డి పార్లమెంటు వేదికగా గళమెత్తి ఈ ప్రాంత గౌరవాన్ని ప్రాధాన్యతను దేశ స్థాయిలో పెంచుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి కొనియాడారు. ప్రజల తరపున నిర్బయంగా పోరాడే నాయకుడిగా ఎంపీ మిథున్‌ రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

రాయచోటిలో ఎంపీ

మిథున్‌ రెడ్డికి ఘన స్వాగతం..

తొలుత రాయచోటికి విచ్చేసిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పట్టణమంతా వైఎస్సార్‌సీపీ నినాదాలతో మార్మోగింది. చిత్తూరు రింగ్‌ రోడ్డు నుంచి వైఎస్సార్‌సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీతో ఎంపీకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్‌ఎన్‌ కాలనీలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి ఎంపీ చేరుకోగా అక్కడ మహిళలు హారతులిచ్చారు. గజమాలతో సత్కరించారు.

మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌ రెడ్డి

ఎంపీ మిఽథున్‌ రెడ్డికి హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు, నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకుడు విజయభాస్కర్‌ను పరామర్శిస్తున్న ఎంపీ మిథున్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి

బీసీ నాయకుడు విజయభాస్కర్‌పై జరిగిన దాడి అత్యంత హేయమైనదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న విజయభాస్కర్‌ను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిడి తెలుసుకుని, ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే , పార్టీ శ్రేణులపై అన్యాయంగా , అక్రమంగా దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పి.దేవనాథరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్థన్‌ రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఫయాజ్‌ బాషా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారీ మహమ్మద్‌ ఖాన్‌, మండల కన్వీనర్‌ యధుభూషణరెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి జాఫర్‌ అలీకాన్‌, కౌన్సిలర్లు, రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, సర్పంచులు, యువత పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం 1
1/2

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం 2
2/2

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement