26 నుంచి షూటింగ్‌బాల్ పోటీలు
మదనపల్లె సిటీ: మదనపల్లె వశిష్ట పాఠశాలలో 26 వతేదీ నుంచి 27వతేదీ వరకు 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ –బాల,బాలికల షూటింగ్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని రాయలసీమ జిల్లాల షూటింగ్‌బాల్ అసోసియేషన్ కన్వీనర్ నరేష్ తెలిపారు. ఈ పోటీలు 26న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.
వెబ్‌సైట్‌లో సీనియారిటీ జాబితా
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ జోన్ –4 పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వపు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు(గవర్నమెంట్) సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్ https://rjdsekadapa. blogpot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శామ్యూల్ తెలిపారు. కావున ఉపాధ్యాయులు ఈ జాబితాను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారులు వారి వెబ్‌సైట్‌లో ప్రకటించాలని సూచించారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
రాయచోటి టౌన్: ఈ నెల 30వ తేదీ నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్‌ఓ కె.మధుసూధన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతుఊ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసులకు,విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు.పరీక్ష సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
పక్కా గృహాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
రామాపురం: పక్కా గృహాల కోసం అర్హులైన లబ్ధిదారులు గ్రామ సచివాలయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని హౌసింగ్ పీడీ సాంబశివయ్య పేర్కొన్నారు. మండలంలోని నల్లగుట్టపల్లె బీసీకాలనీ, కుమ్మరపల్లె గ్రామాలలో శుక్రవారం నిర్మాణ దశలో ఉన్న పక్కాగృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుమ్మరపల్లె గ్రామంలో పూరి ఇంటిలో నివాసం ఉన్న ప్రజలతో మాట్లాడుతూ గ్రామాల్లో గతంలో మంజూరైన గృహాల్లో నిర్మించుకోలేకపోయినా ఎస్టీ లబ్ధిదారులకు రూ75వేలు, ఎస్సీ బీసీ లబ్ధిదారులకు రూ50వేలు అదనంగా ప్రభుత్వం అందజేస్తోందన్నారు. త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. మండల హౌసింగ్ ఏఈ ఎల్‌వి ప్రసాద్, సచివాలయం అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
పరిసరాలశుభ్రతతోనే వ్యాధులు దూరం
రాయచోటి అర్బన్: పరిసరాల శుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి అన్నారు.శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య,ఆరోగ్యశాఖ ఉద్యోగులు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను మలేరియా రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని తెలిపారు. మురుగునీరు ఇంటి పరిసరాల్లో నిల్వలేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈగలు,దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. 2027 నాటికి జీరో మలేరియాను, 2030 నాటికి మలేరియా నిర్మూలనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు కిరణ్‌కుమార్, శివ రామరాజు, మలేరియా సబ్‌యూనిట్ అధికారి జయరామయ్య, శ్రీనివాసులరెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ బలరామరాజు, ల్యాబ్ టెక్నీ షియన్‌లు నాయక్, వెంకట్రామిరెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, శ్రీనాథరెడ్డి, సూపర్‌వైజర్‌లు వెంకటేశ్వర్‌రెడ్డి, నూర్జహాన్ తదితరులు పాల్గొ న్నారు.
26 నుంచి షూటింగ్‌బాల్ పోటీలు
26 నుంచి షూటింగ్‌బాల్ పోటీలు


