సమస్యకు.. పరిష్కారమేదీ !
నా రేషన్ కట్
● కలెక్టరేట్‌కు క్యూ కడుతున్న బాధితులు
● వ్యయ ప్రయాసలకోర్చి
పదేపదే తిరుగుతున్నా దక్కని ఫలితం
● పింఛన్ రేషన్, రెవెన్యూ సమస్యలతోనే
ఎక్కువమంది సతమతం
● ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో సమస్యల
పరిష్కార వేదిక కార్యక్రమం
● గతంలో దరఖాస్తులు ఇచ్చిన వారే
పదేపదే వస్తున్న వైనం
సాక్షి రాయచోటి : దూరాన్ని.. భారాన్ని లెక్క చేయకుండా కలెక్టరేట్‌కు వచ్చే బాధితుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. వ్యయ ప్రయాసలకోర్చి అర్జీ ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఫలితంగా బాధితులు పదే పదే కలెక్టరేట్‌కు కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. అర్జీ చేతబట్టి అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకుంటూనే ఉన్నారు. ఈ వారం కూడా జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులు పోటెత్తారు. కలెక్టర్ నీరజ్‌కుమార్, జేసీ ఆదర్శ రాజేంద్రన్‌లు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
పదేపదే తిరుగుతున్నా..
జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి సుమారు 250–300 మంది వరకు వస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాక వచ్చిన వారే మళ్లీమళ్లీ వస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా తీసుకుని పరిష్కారానికి చొరవ చూపుతున్నా క్షేత్ర స్థాయిలో అధికారులు అర్జీలను బుట్టదాఖలు చేస్తున్నారు.
రెవెన్యూ సమస్యలే అధికం
జిల్లాలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. ప్రధానంగా భూములు, ఆన్‌లైన్, మ్యూటేషన్, సర్వేలు, రికార్డుల సమస్యలు...భూముల ఆక్రమణలు, దౌర్జన్యాలు, కబ్జాల సమస్యలతోనే బాధితు లు అధికారులకుమొర పెట్టుకుంటున్నారు.అలాగే రేషన్‌కార్డులు, పెన్షన్లు, నిరుద్యోగులు ఉపాధి, ఇంటి స్థలాలు, గ్రామాల్లో స్థానిక సమస్యలతోనూ అనేక మంది వస్తున్నారు.
నా భర్త మరణ ధృవీకరణ పత్రానికి నా ఆధార్ నెంబరు లింక్ చేసిన కారణంగా నా రేషన్ కార్డు రద్దయింది. పేద వర్గానికి చెందిన నా రేషన్ కార్డు రద్దు కావడంతో రేషన్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా రేషన్ కార్డు పునరుద్ధరించాలని అధికారులను వేడుకున్నాను. – వి.పద్మావతమ్మ,
నడింపల్లె, కలికిరి మండలం, అన్నమయ్య జిల్లా
సమస్యకు.. పరిష్కారమేదీ !


