దరఖాస్తు చేసుకోండి
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి కొత్తగా ప్రైవేట్ పాఠశాలల ప్రారంభించేందుకు ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు నుంచి ఉత్తర్వులు అందాయని తెలిపారు. httpr://cre.ap.gov. in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని నిబంధనలను అనుసరించి అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. గడువు తేదీ దాటిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోరని డీఈఓ పేర్కొన్నారు.
పల్లకిలో ఊరేగిన
శ్రీ భద్రకాళీ సమేతుడు
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడు పల్లకిలో ఊరేగారు. సోమవారం రాత్రి ఆలయ మూల విరాట్ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి, శ్రీ భద్రకాళీ అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఆలయమాఢ వీధులలో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. స్థానిక భక్తులతో పాటు కన్నడ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
సంతోష్ ట్రోఫీకి మహేంద్ర, షేక్ అబ్దుల్లా ఎంపిక
మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సంతోష్ పుట్‌బాల్ టోర్నమెంట్‌కు మదనపల్లెకు చెందిన మహేంద్ర, షేక్ అబ్దుల్లా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా పుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్,మురళీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ విజయవాడలో ఈనెల4 నుంచి 14వతేది వరకు నిర్వహించిన క్యాంపులో పాల్గొన్నారు. డిసెంబర్ 17 నుంచి 21వతేదీ వరకు అనంతపురం ఆర్‌డీటీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అక్కడ ప్రతిభ కనబరచడంతో సంతోష్ పుట్‌బాల్ ట్రోఫీకి ఎంపిక చేశారు. వీరి ఎంపికపై అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, సెక్రటరీ డ్యానియల్ ప్రదీప్,సభ్యుల జాన్ కమలేష్, సాగర్, మహేంద్ర, నరేష్ తదితరులు అభినందించారు.
● ఒంటిమిట్ట, సిద్దవటం ప్రజల డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
కడప సెవెన్‌రోడ్స్ : ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా వైఎస్సార్ కడపజిల్లాలోనే కొనసాగించాలని ఆ మండలాలకు చెందిన జేఏసీ నాయకులు డి మాండ్ చేశారు. రెండు మండలాల్లోని వివిధ గ్రా మాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు సోమవారం ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బి. రాజగోపాలయ్య, అరవిందకుమార్, జవహర్, మోహన్‌రెడ్డి, రామకృష్ణయ్య మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్‌టీ నెం. 1500ను తక్షణమే రద్దు చే యాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో కలుపడం వల్ల తమ మండలాలకు చెందిన ప్రజ ల భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుందన్నారు. కడప తమకు కూతవేటు దూరంలో ఉందన్నారు. కొత్తగా ప్రకటించిన అన్నమయ్య జిల్లా కేంద్రమై న రాయచోటికి వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్ర యాణం చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్ర జల మనోభావాలు అర్థం చేసుకుని కడపజిల్లాలో నే కొనసాగించాలని కోరారు. ఈ నిరసన కార్య క్రమంలో మాజీ జెడ్పీటీసీ చలమయ్య, జేఏసీ నాయకులు రామదాసు, యానాదయ్య, ఒంటిమిట్ట మాజీ సర్పంచ్ నరసయ్య, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య, టీడీపీ నాయకులు హరిప్రసాద్ పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోండి
దరఖాస్తు చేసుకోండి


