జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్
రాయచోటి : దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో శనివారం రెండో రోజు కూడా ఆకస్మిక తనిఖీలు, పరిశీలనలను జరిపారు. జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండులు, ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేశారు. నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణ కోసమే తనిఖీలు, సోదాలు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి తెలిపారు. ఆకస్మిక తనిఖీలలో సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సీఐలు, ఎస్‌ఐలు, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు బలగాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.
మామిడి చెట్లు నరికివేత
చిన్నమండెం : మండల పరిధిలోని దేవగుడిపల్లె గ్రామం కొండమూలకు చెందిన బూసర శ్రీనివాసులు అనే రైతుకు చెందిన మామిడిచెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసినట్లు బాధిత రైతు తెలిపారు. ఆయన కథనం మేరకు.. తనకు గల 3 ఎకరాల పొలంలో మామిడిచెట్లను సాగు చేసినట్లు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అందులో 15 మామిడిచెట్లను నరికివేశారని తెలిపారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్


