అక్రమానికి సరికొత్త మార్గం ! | - | Sakshi
Sakshi News home page

అక్రమానికి సరికొత్త మార్గం !

May 2 2025 1:05 AM | Updated on May 2 2025 1:05 AM

అక్రమ

అక్రమానికి సరికొత్త మార్గం !

దర్జాగా రైలులో

రేషన్‌ బియ్యం దిగుమతులు

అరక్కోణం ప్యాసింజర్‌ ద్వారా జిల్లాకు చేరుతున్న వైనం

చిత్తూరు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కోడూరుకు దిగుమతి

అటువైపు దృష్టి సారించని

రైల్వే పోలీసులు

రాజంపేట : తెల్లవారగానే ఇంటి వద్ద బియ్యంబండి వస్తోందంటూ..హారన్‌ శబ్దం..గత ప్రభుత్వం చౌకదుకాణం బియ్యాన్ని సరఫరాచేసే బండికాదు..ఇది రైలు..అరక్కోణంనుంచి కడప వరకు నడిచే ప్యాసింజర్‌ రైలు. ఇప్పుడు ఈరైలులో బియ్యం బస్తాలను రైల్వేకోడూరు స్టేషన్‌ వరకు తరలిస్తున్నారు. దీంతో ఈ బండి ఇప్పుడు బియ్యం బండిగా ప్రయాణికులు పిలవాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. అరక్కోణం నుంచి వచ్చే ప్యాసింజర్‌ రైలు చిత్తూరు, తిరుపతిజిల్లాలో పాటు తమిళనాడు సరిహద్దు పల్లెల నుంచి బియ్యం రైల్వేకోడూరు ఎందుకు తీసుకొస్తున్నారో ప్రయాణీకులు అంతుపట్టడంలేదు. బియ్యం తరలింపు వారి హడాహుడి అంతా ఇంతాకాదు..రైల్వేస్టేషన్‌ రాగానే బియ్యం బస్తాలను దించుకోవడంతోనే డోర్‌లో సమయం సరిపోతోంది. ప్రయాణీకులు దిగాలంటే ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కూడా ఇదే పరిస్ధితి రైల్వేకోడూరు స్టేషన్‌లో నెలకొంది.

బోగీలలో చిన్నచిన్న

గోనెసంచులోకి బియ్యం..

బోగీలలో చిన్నచిన్న గోనెసంచుల్లోకి బియ్యం మారుస్తుంటారు. చిన్న చిన్న సంచులను సీట్ల కింద తోసేస్తుంటారు. కనిపించకుండా చేస్తున్న తీరుతెన్నులను ప్రయాణికులు చూసి నివ్వెరపోయారు. ఈ బియ్యం ప్రభుత్వం అందజేసే చౌకదుకాణం బియ్యంగా ప్రయాణికులు గుర్తించారు.

కొద్దిరోజులుగా జరుగుతున్న

బియ్యం రవాణా

అరక్కోణం ప్యాసింజర్‌ రైలులో చౌకదుకాణం బియ్యం రవాణా కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 20 మంది ప్యాసింజర్‌లోని వివిధ ఫార్మసిన్‌లో బియ్యం సంచులను ఎగుమతి చేసుకుంటారు. రేణిగుంట –అరక్కోణం మధ్యలో ఉన్న ప్రాంతాల నుంచి ఈ బియ్యం తీసుకొస్తున్నారనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అరక్కోణం ప్యాసింజర్‌లో రవాణా అవుతుంటే రేణిగుంట రైల్వేపోలీసులు ఏమీ చేస్తున్నారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

రైల్వేకోడూరు అక్రమ రేషన్‌ బియ్యం నిల్వకు కేంద్రమా అన్న అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని రైల్వేకోడూరులో తరలించడమేమిటి అనేది చర్చనీయాంశంగా మారింది.రేషన్‌ తరలింపు వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేస్తే అక్రమార్కులు వెలుగులోకి వస్తారనే వాదన వినిపిస్తోంది.

అక్రమానికి సరికొత్త మార్గం !1
1/1

అక్రమానికి సరికొత్త మార్గం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement