లారీ డ్రైవర్ల సమస్యను పరిష్కరించండి
ఓబులవారిపల్లె : మంగంపేట ఏపీఎండీసీలో లారీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీఎండీసీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ అనుబంధ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏపీఎండీసీ బైరెటీస్ ప్రాజెక్టులో డిస్పాచ్‌లో 400 మందికి పైగా డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం మంచినీరు కూడా డ్రైవర్లకు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి నాగిపోగు పెంచలయ్య, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, డ్రైవర్ల సంఘం యూనియన్ నాయకులు నాగార్జున, మహేంద్ర, సుబ్రమణ్యం, సీఐటీయూ నాయకుడు సిహెచ్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


