రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు కుట్ర | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు కుట్ర

Jan 5 2026 8:07 AM | Updated on Jan 5 2026 8:07 AM

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు కుట్ర

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు కుట్ర

వాల్మీకిపురం : ఆంధ్రరాష్టాన్ని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని, తన చేతులతో కరువునేలకు మరణ శాసనం రాశారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వలాభాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం తెలంగాణ సీఎంతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టును ఆపేయడం ఎంత దుర్మార్గమో ప్రజలు గమనించాలన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టును ఆపేస్తున్నట్లు తెలంగాణ సీఎం స్వయంగా అసెంబ్లీలో వెల్లడించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజనాలను తన స్వార్థం కోసం అమ్ముకోవడం దేశ చరిత్రలోనే ఎక్కడా చూసి ఉండమన్నారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి తన చేతిలోకి చంద్రబాబు తీసుకున్నాడన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం చేతకాని తనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మకంగా, విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకొని రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును మొదలుపెట్టారన్నారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలతో కేసులు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో చంద్రబాబు నాయుడు హయాంలో ప్రాజెక్టు పూర్తిగా పడకేసిందన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమకు ద్రోహం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగడానికి ఎలాంటి నైతిక హక్కు లేదని, ప్రజల ప్రయోజనాలను కాపాడలేని మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని తీవ్రంగా స్పందించారు. ఈ సమావేశంలో నాయకులు చింతల ఆనంద రెడ్డి, పులి శివారెడ్డి, బిడ్డల కేశవ రెడ్డి, మహబూబ్‌బాషా, శ్యామ్‌, శంకర్‌ రెడ్డి, సుధాకర, మదనమోహన్‌రెడ్డి, సురేష్‌ రెడ్డి, నీళ్ల భాస్కర్‌, రఘు, చికెన్‌మస్తాన్‌, సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సీఎంతో చేతులు కలిపి

ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు

మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement