బైక్‌లకు వరండా.. బుడతలకు ఎండ
చౌడేపల్లె మండలంలోని కోటూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 108మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే రూముల సమస్య వల్ల కేవలం నాలుగు గదుల్లో విద్యార్థులు కూర్చోవాల్సి ఉంది. ఇటీవల ఓ దాత సహకారంతో నాడు–నేడు ద్వారా చేపట్టిన పనులు మధ్యలో ఆపేసిన భవనానికి ఫ్లోరింగ్ వేసి వినియోగించుకుంటున్నారు. ఇంతవరకు బాగున్నా... అసలే రూముల సమస్య ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు తెచ్చిన బైక్‌లను పాఠశాల వరండాలో పార్క్ చేస్తున్నారు. దీంతో మండుటెండలో విద్యార్థులు కూర్చోవాల్సి వస్తోంది. ఉపాధ్యాయుల తీరుపై పిల్లల తల్లితండ్రులు మండిపడుతున్నారు. – ఎన్. రసూల్, చౌడేపల్లి


