నేడు హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై వాదనలు
రాయచోటి అర్బన్: రాయచోటి జిల్లా కేంద్రంగా యథథాతథంగా కొనసాగించాలనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) హైకోర్టులో బుధవారం వాదనలు జరగనున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును ఇటీవలే హైకోర్టు స్వీకరించిందని, బుధవారం జరగనున్న వాదనలకు 7వ నంబరింగ్ పొందిందన్నారు. ఈ అంశంపై ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు రాయచోటి నియోజకవర్గ ప్రజల ఆందోళనలు న్యాయస్థానం ద్వారా పరిష్కారం పొంది, ప్రజలకు మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని శ్రీకాంత్ రెడ్డి వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి


