● పుంగనూరుపై కక్షకట్టి | - | Sakshi
Sakshi News home page

● పుంగనూరుపై కక్షకట్టి

Jan 7 2026 7:41 AM | Updated on Jan 7 2026 7:41 AM

● పుం

● పుంగనూరుపై కక్షకట్టి

● పుంగనూరుపై కక్షకట్టి

కుప్పం నెపంతో

విడగొట్టి.. వివక్ష!

30 ఏళ్ల ముందుచూపుతో..

మదనపల్లె: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ఫ్లోరైడ్‌నీటితో ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు 2020లో సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని విడగొట్టి వివక్ష చూపిస్తోంది. పనులు చేపట్టకుండా కాంట్రాక్టును రద్దు చేయడమేకాక పథకాన్ని కుదించి ప్రజలకు అన్యాయం చేస్తోంది.

– వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు వర్తింపజేయాల్సిన ఆవశ్యకతను అప్పటిమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంిపీ పీవీ.మిథున్‌రెడ్డి గుర్తించి.. నిర్మాణానికి కృషి చేశారు. దాంతో వాటర్‌గ్రిడ్‌ పథకం పరిధి పెరిగి 27 మండలాల్లోని 4,938 పల్లెలు, మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో 2054 నాటి జనాభాకు అనుగుణంగా వాటర్‌గ్రిడ్‌కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికోసం ఐదు నియోజకవర్గాలకు రూ.1,550 కోట్లు, మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీలకు రూ.850 కోట్లను పనులకు కేటాయించారు.

పనులు మొదలయ్యే దశలో...

గండికోట రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను ఐదు నియోజకవర్గాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతానికి కలిపి 13,94,757 మంది జనాభాకు తాగునీటిని అందించే వాటర్‌గ్రిడ్‌ పనులకు 2023లో టెండర్లు నిర్వహించగా రివర్స్‌ టెండరింగ్‌లో రూ.1,825.68 కోట్లకు టెండర్‌ దాఖలైంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.76.08 కోట్లు మిగలగా, కాంట్రాక్టు సంస్థ గండికోట రిజర్వాయర్‌ నుంచి ఐదు నియోజకవర్గాల్లో పైప్‌లైన్‌, ట్యాంకులు, సంపులు, రీట్రిట్‌ప్లాంట్‌ నిర్మాణం తదితర వాటిపై సమగ్ర సర్వే పూర్తి చేసింది. ఇక పనులకు చర్యలు చేపడుతుండగా కూటమి ప్రభుత్వం రాకతో పథకానికి సంబంధించి కాంట్రాక్టును తప్పించింది.

18 మండలాలకే గ్రిడ్‌

పేజ్‌–1 పేరుతో చేపట్టిన పనులను తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజజకవర్గాల్లోని 18 మండలాలకే పరిమితం చేసింది. ఈ పనులకు 2025 ఏప్రిల్‌ 7 రూ.1,939.42 కోట్లతో కాంట్రాక్టు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకో గా 2027 అక్టోబర్‌ నాటికి పనులు పూర్తి చేయాలి.

ఫేజ్‌–1కే రూ.2,370 కోట్లు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదు నియోజకవర్గాల కు నీటిని అందించే పనులను రూ.1,825 కోట్లకే కాంట్రాక్టు అప్పగించింది. కూటమి ప్రభుత్వం ఈ కాంట్రాక్టును రద్దుచేసి వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు నియోజకవర్గాలకు కుదించి టెండర్లు నిర్వహించగా అంచనా వ్యయం రూ.2,370 కోట్లుగా, టెండర్‌ ఒప్పందం విలువ రూ.1,939 కోట్లకు అప్పగించింది. రెండు నియోజకవర్గాల్లో పని తగ్గినా విలువ తగ్గలేదు. పైగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒప్పంద విలువ కంటే రూ.114 కోట్లు అదనం. ప్రభుత్వం పని తగ్గించినా పని విలువ తగ్గకపోగా.. పెరగడం గమనార్హం.

ఫేజ్‌–2కి రూ.2,989 కోట్లు

వాటర్‌గ్రిడ్‌ పథకం నుంచి పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలను తొలగించిన ప్రభుత్వం..కొత్త ఎత్తుగడ వేసింది. పథకానికి ఫేజ్‌–2 అని పేరుపెట్టి మరో రూ.2,989 కోట్లకు ప్రతిపాదన పెట్టింది. ఈ విడతలో పుంగనూరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు అమలు చేయబోతున్నట్లు నివేదికలు పంపారు. ఇది ఎప్పటికి ఆమోదం పొందుతాయో, ఎప్పుడు టెండర్లు నిర్వహిస్తారు, ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి.

రూ.2,400 కోట్లతో ఐదు నియోజకవర్గాలకు వెఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాటర్‌గ్రిడ్‌ పథకం మంజూరు

టెండర్లు, సర్వే పూర్తయి పనుల చేపట్టే సమయంలో కూటమి ప్రభుత్వం రాక

పథకం రద్దు చేసి 3 నియోజకవర్గాలకే పరిమితం

కక్షగట్టి పుంగనూరు నియోజకవర్గం తొలగింపు

ఇప్పుడేమో రెండు విడతలపేరుతో కాలయాపన

3 నియోజకవర్గాల పథకానికి రూ.2,370 కోట్లు

రెండో విడత పేరుతో రూ.2,989 కోట్లు

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2020లో తంబళ్లపల్లె సహా మదనపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు 30 ఏళ్లదాక...2054 వరకు నీటిసమస్య ఉండకూడదని భావించారు. ఇంటింటికి తాగునీరు అందించేలా రూ.2,400 కోట్లతో గండికోట ప్రాజెక్టు నుంచి 3.37 టీఎంసీల కృష్ణా జలాలను తరలించే భగీరథ పథకానికి నాంది పలికారు.

కుప్పంను వాటర్‌గ్రిడ్‌ పరిధిలోకి తెవాలన్న నెపంతో పుంగనూరు నియోజకవర్గాన్ని పథకం నుంచి తొలగించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలుచేసిన పథకం పనులు కూటమిపాలనలో కొనసాగించి ఉంటే పాతికశాతం పనులు పూర్తయ్యేవని ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నారు. కుప్పానికి పథకం వర్తించాలంటే తీవ్ర జాప్యం అవుతుంది, తద్వారా పుంగనూరుకు పథకం అమలు కాకుండా అడ్డుకట్ట వేయొచ్చన్న ప్రయత్నంగా తెలుస్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఫేజ్‌–1 పేరుతో తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లోని 18 మండలాలకే వాటర్‌గ్రిడ్‌ పథకం అమలు చేస్తున్నారు. వీటి పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో మంచినీళ్లు ఎప్పుడిస్తారో అని ప్రజలు బాబు తీరుపై తూర్పారబడుతున్నారు.

● పుంగనూరుపై కక్షకట్టి 1
1/4

● పుంగనూరుపై కక్షకట్టి

● పుంగనూరుపై కక్షకట్టి 2
2/4

● పుంగనూరుపై కక్షకట్టి

● పుంగనూరుపై కక్షకట్టి 3
3/4

● పుంగనూరుపై కక్షకట్టి

● పుంగనూరుపై కక్షకట్టి 4
4/4

● పుంగనూరుపై కక్షకట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement