ఈ–గవర్నెన్స్‌పై అవగాహన అవసరం
జెడ్పీ సీఈఓ ఓబులమ్మ
కడప సెవెన్‌రోడ్స్: ఈ–గవర్నెన్స్ అప్లికేషన్స్‌పై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ సూచించారు. ఈ–గవర్నెన్స్‌పై మంగళవారం ఉమ్మడి జిల్లాకు చెందిన డిప్యూటీ ఎంపీడీఓలు, సీనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరిపాలన రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులను ఆకళింపు చేసుకుంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. సాంకేతిక వల్ల సత్వర, పారదర్శక సేవలను అందించవచ్చన్నారు. ఉద్యోగులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.


