మూర్చవ్యాధితో పొలంలోనే రైతు మృతి
కలకడ : మండలంలోని నడిమిచెర్ల గ్రామంలో ఓ రైతు మూర్చవ్యాధితో పొలంలో పడి మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. నడిమిచెర్ల గ్రామానికి చెందిన రైతు నరసింహులు (45) మంగళవారం రాత్రి వరి పొలం వద్దకు వెళ్లాడు. బుధవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా బురదలో పడి ఉన్నాడు. నరసింహులుకు మూర్చవ్యాధి ఉన్నట్లు, అందువల్లే మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు నరసింహులుకు భార్య నిర్మల, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిరు పేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


