శబరిమల యాత్రకు మాజీ మంత్రి, ఎంపీ
పుంగనూరు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి బుధవారం కేరళలోని శబరిమల యాత్రకు వెళ్లారు. గత 35 రోజులుగా అయ్యప్ప దీక్షలో ఉన్న ఎమ్మెల్యే, ఈనెల 14న మకర సంక్రమణం, రోజున సదుం అయ్యప్ప ఆలయంలో దీక్షలు విరమించనున్నారు, ఇందులో భాగంగా కాలినడకన వెళ్లి శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు గురువారం తిరుగు ప్రయాణమై తిరుపతి చేరుకోనున్నారు.
కుక్కల దాడిలో గొర్రె మృతి
చౌడేపల్లె : కుక్కల దాడిలో గొర్రె మృతిచెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కోటూరుకు చెందిన నరసింహులు, రాజేష్‌లు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మేతకోసం గ్రామ పరిసర పంట పొలాల్లోకి తీసుకెళ్లగా వీధి కుక్కల గుంపు గొర్రెలపై దాడి చేశాయి. వీటిలో ఒకటి మృతిచెందగా మరో మూడు గాయపడ్డాయి. సుమారు రూ:15 వేలు నష్టం వాటిల్లినట్లు బాఽధితులు తెలిపారు. నిత్యం కుక్కల బెడద పశువులతోపాటు మనుషులపై విరుచుకుపడుతున్నాయని అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కారు ఢీకొని కూలీ మృతి
బి.కొత్తకోట : బైక్‌పై బి.కొత్తకోటకు వస్తున్న కూలీని వెనుక వస్తున్న కారు ఢీకొనడంతో మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు. మండలంలోని టేకులపెంటకు చెందిన కె.కృష్ణప్ప (54) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పనుల నిమిత్తం టేకులపెంటనుంచి బైక్‌పై బి.కొత్తకోటకు బయలుదేరాడు. మార్గమధ్యలో గట్టులో కొంతసేపు ఉండి బి.కొత్తకోటకు వెళ్లేందుకు దిన్నిమీదపల్లె వద్దకు రాగానే మదనపల్లె నుంచి బి.కొత్తకోటకు వస్తున్న స్కార్పియో కారు కృష్ణప్పను బలంగా ఢీకొంది. ఈ ఘటనతో బైక్ ధ్వంసమై, రోడ్డుపక్కన పడింది. కారు కూడా అదుపుతప్పి పక్కకు వెళ్లింది. కృష్ణప్ప రెండు కాళ్లు విరిగి, ముఖం, గడ్డం, సున్నిత భాగాలపై బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో కృష్ణప్పను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం
ఢీ కొని జింకకుగాయాలు
ములకలచెరువు : రోడ్డు దాటుతున్న జింకల మందను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఒక జింకకు తీవ్రగాయాలైన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఫారెస్టు అధికారి శ్రీనివాసులు కథనం మేరకు.. బురకాయలకోట సమీపంలో జింకలు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని జింకను స్వాధీనం చేసుకున్నారు. జింకకు చికిత్స అందించి వారి సంరక్షణలో పెట్టినట్లు చెప్పారు.
యువకుడు ఆత్మహత్య
మైదుకూరు : భార్య కాపురానికి రాలేదని మనస్థాపంతో మైదుకూరు మున్సిపాలిటీలోని నానుబాల పల్లెకు చెందిన ఎద్దుల చంటి (30) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నానుబాలపల్లెకు చెందిన చంటికి బద్వేల్ మండలం రూపరాంపేటకు చెందిన హేమతో 9 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూలి పనులకు వెళ్లి జీవించే చంటి వివాహమైన ఏడాదికి తండ్రి నుంచి వేరుపడి విడిగా కాపురం ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్య హేమ 5 నెలల కిందట పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనస్థాపానికి గుర య్యాడు. ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి విజయన్న ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
శబరిమల యాత్రకు మాజీ మంత్రి, ఎంపీ
శబరిమల యాత్రకు మాజీ మంత్రి, ఎంపీ
శబరిమల యాత్రకు మాజీ మంత్రి, ఎంపీ
శబరిమల యాత్రకు మాజీ మంత్రి, ఎంపీ


