రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు
పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మండలంలోని ఠాణావడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణావడ్డిపల్లెకు చెందిన సి.వెంకటేష్ (28) ద్విచక్రవాహనంలో యల్లంపల్లె నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటేష్‌కు ఎడమకాలు విరిగింది. తలకు బలమైన గాయమైంది. స్థానికుల సాయంతో క్షతగాత్రున్ని చికిత్సనిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


