8న కాకినాడలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎంపికలు
మదనపల్లె సిటీ: శాప్ ఆదేశాల మేరకు ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి ఎంపికలు ఈనెల 8వ తేదీన కాకినాడలోని డీఎస్‌ఏ మైదానంలో జరగనున్నట్లు అన్నమయ్య జిల్లా స్పోర్ట్సు అథారిటీ అధికారి చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల ద్వారా రాష్ట్రం నుంచి ప్రతిభావంతులైన గిరిజన క్రీడాకారులను గుర్తించి ఫేజ్–2కు పంపడం జరుగుతుందన్నారు. అథ్లెటిక్స్, అర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిప్టింగ్, రెజ్జింగ్, హాకీ, పుట్‌బాల్ క్రీడల్లో ఎంపికలుంటాయన్నారు. జిల్లాలోని అర్హత కలిగిన గిరిజన క్రీడాకారులు ఈ అవకాశం వినియోగించుకుని ఎంపిక పోటీలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9985113210ను సంప్రదించాలని కోరారు.
మదనపల్లె సిటీ: జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మారింది. ఇందులో భాగంగా స్థాని బీటీ కాలేజీలో జిల్లా ఎస్‌సి సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం సోమవారం ప్రారంభించారు. కాలేజీలో రూము నంబర్ 145 కేటాయించారు. కార్యక్రమంలో డీఎస్‌డబ్యూఓ దామోదర్, ఏఎస్‌డబ్యూఓ గంగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు
రాయచోటి: జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా, అధిక ధరలకు విక్రయించినా వారి లైసెన్సులను రద్దు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి శివనారాయణ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, కొరత ఉన్నట్లు నిబంధనలు అతిక్రమించి చూపిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నూతనంగా రూపొందించిన నానా యూరియా, నానో డీఏపీ ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. రైతులు ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్‌పీ ధరలను చూసి కొనుగోలు చేయాలని.. డీలర్ నుంచి రశీదు పొందాలని సూచించారు.
మదనపల్లె రూరల్: శ్రామికులకు ఉపాధిహామీ చట్టంలో 100 రోజులు ఉంటే, వికసిత్ భారత్–జి రామ్ జి చట్టంలో 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ వెంకటరత్నం తెలిపారు. సోమవారం మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ సంక్రాంతి గ్రామం, వికసిత్ భారత్–జి రామ్ జి చట్టంపై అవగాహన సభలు నిర్వహించారు. కొత్తవారిపల్లె గ్రామపంచాయతీలో సర్పంచ్ బోర్‌వెల్ మహేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డ్వామా పీడీ వెంకటరత్నం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం కంటే మెరుగ్గా ఈ చట్టాన్ని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంలో 125 రోజుల ఉపాధితో పాటు, వేతనాలు ఆలస్యమైతే ఆలస్యపు సమయానికి పరిహారం ఇస్తుందన్నారు. సకాలంలో పనులు కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జలవనరుల అభివృద్ధి, ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ, వ్యవసాయ అభివృద్ధి కోసం పనులు చేపడతామన్నారు. సీటీఎం, కోళ్లబైలులో నిర్వహించిన గ్రామసభల్లో స్వచ్ఛ సంక్రాంతి– స్వచ్ఛ గ్రామం కార్యక్రమంలో డీపీఓ రాధమ్మ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య పనులు గుర్తించి రోజువారీ చెత్తసేకరణ కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ జరపాలన్నారు. గ్రామంలో చెత్త దిబ్బలను గుర్తించి వెంటనే తొలగించాలన్నారు. కార్యక్రమంలో డీడీఓ అమరనాథరెడ్డి, సర్పంచ్ ఆనందపార్థసారధి, ఏపీడీ నందకుమార్‌రెడ్డి, ఎంపీడీఓ తాజ్‌మస్రూర్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్‌నాయక్, ఏపీఓ పాల్గొన్నారు.
8న కాకినాడలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎంపికలు
8న కాకినాడలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎంపికలు


