ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మండలంలో జరిగింది. కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లెకు చెందిన మాధవ, తిరుపతి రోడ్డులోని టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్నాడు. అతడి కుమారుడు రెడ్డిగణేష్, ఇంటి నుంచి బైక్‌లో మదనపల్లెకు వస్తుండగా, మార్గమధ్యంలో తట్టివారిపల్లె చెరువుకట్టపై వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓ కారు ఓవర్‌టేక్ చేస్తుండగా, కారు వెనుకనే రెడ్డిగణేష్ బైక్‌లో వెళుతున్నాడు. కారు ముందుకు వెళ్లగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్ వాహనాన్ని ముందుకు తిప్పాడు. అప్పటికే పక్కనే బైక్‌పై వెళుతున్న రెడ్డిగణేష్‌ను బస్సు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగ్గా, గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు, బైక్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


