అన్నమాచార్య రేడియోకు గౌరవప్రదమైన గుర్తింపు
● కేంద్రం రూ.10లక్షల ఆర్థికసాయం
● స్టేషన్‌డైరక్టర్‌ను అభినందించిన
చాన్స్‌లర్ గంగిరెడ్డి
రాజంపేట : అన్నమాచార్య యూనవర్సిటీలో నిర్వహిస్తున్న అన్నమాచార్య రేడియో 89.6కు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆదివారం అన్నమాచార్య యూనవర్సిటీ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి అన్నమాచార్య రేడియో అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. స్టేషన్ డైరక్టర్ డాక్టర్ కాసిగారి ప్రసాద్ సమర్థవంతంగా రేడియో నిర్వహించారన్నారు. ఈ రేడియోకు కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ పథకం కింద 2025–2026 యేడాదికి రూ.10లక్షలు ఆర్ధికసహాయం అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి, ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


