మిట్స్ అశ్వ్–26 పోస్టర్ ఆవిష్కరణ
కురబలకోట : మదనపల్లి దగ్గర అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అశ్వ్–26 ఫెస్టివల్ వెబ్‌సైట్, పోస్టర్లను చాన్స్‌లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి ఆదివారం ఆవిష్కరించారు. టెక్నికల్, కల్చరల్, స్పోర్ట్స్ విభాగాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 25, 26 తేదీలలో వీటిని నిర్వహిస్తున్నట్లు వీసీ యువరాజ్ తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలలో డిప్లమా, ఇంజినీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు www.mits.ac.in లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఉత్సవ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, గాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో పోస్టల్ ఉద్యోగి మృతి
వీరబల్లి్ : మట్లి పంచాయతీ, కృష్ణాపురం గ్రామానికి చెందిన కంపా రమణయ్య కుమారుడు కంపా చందు (21) నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఆదివారం కృష్ణాపురంలో చందు మృతదేహానికి ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చిన్నవయస్సులోనే పోస్టల్ ఉద్యోగం సంపాదించి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, బండి రమణయ్య, ఆర్‌ఎం రెడ్డి, జయచంద్ర నాయుడు, పుల్లగూర భూషణం, కృష్ణాపురం, మట్లి గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
10,11 తేదీల్లో పౌర హక్కుల సంఘం సభలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈ నెల 10, 11న తిరుపతి నగరం బైరాగి పట్టెడలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించే పౌరహక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కోరారు. ఆదివారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో మహాసభలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఈ సభల్లో మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రముఖ గాంధేయవాది హిమాంశు కుమార్, సామాజిక కార్యకర్త బేలబాటియా, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
మిట్స్ అశ్వ్–26 పోస్టర్ ఆవిష్కరణ


