బైక్ ఢీకొని అన్నదమ్ములకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ ఢీకొని అన్నదమ్ములు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. కలిచెర్ల పంచాయతీ నత్తి ఓబన్నగారిపల్లెకు చెందిన కాలేనాయక్ కుమారులు బాబూనాయక్ (52), అతడి తమ్ముడు కృష్ణానాయక్ (45) ద్విచక్రవాహనంలో వ్యక్తిగత పనులపై సిద్ధవరం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, నత్తి ఓబన్నగారిపల్లె క్రాస్ వద్ద కలిచెర్ల వైపు నుంచి బైక్‌పై వస్తున్న మరో యువకుడు వేగంగా ఢీకొన్నాడు. ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ తీవ్రంగా గాయపడగా, ప్రమాదానికి కారణమైన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన బాధితులను స్థానికులు 108 అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. పెద్దమండ్యం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
బైక్ ఢీకొని అన్నదమ్ములకు తీవ్రగాయాలు


