ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి
రాయచోటి : పోలీసు శాఖపట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటిలోని పోలీసు కార్యాలయంలో రాజంపేట సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. నేరస్తులకు శిక్షపడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్లను నిర్ణీత గడువులోగా కోర్టులో దాఖలు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే నేరాలను అరికట్టడానికి బీట్ పోలీసులు, రక్షక్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని కోరారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెడ్గే, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నేర సమీక్షలో జిల్లా అదనపు
ఎస్పీ వెంకటాద్రి


