పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
బొమ్మయ్యగారిపల్లె రైతు సేవా కేంద్రంలో పోలీసు
బందోబస్తుతో యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు
రొంపిచెర్ల రైతు కేంద్రంలో పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ చేస్తున్న అఽధికారులు
రొంపిచెర్ల: పోలీసు బందోబస్తుతో చిత్తూరు జిల్లాలోని పలు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయాఽధికారులు శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. నాలుగు రోజుల క్రితం గానుగచింత రైతు సేవాకేంద్రంలో యూరియా కోసం రైతులు ఘర్షణ పడటం అందరికీ విధితమే. వ్యవసాయ శాఖ అధికారులు దీనిని దృష్టిలో పెట్టుకుని రొంపిచెర్ల–2, బొమ్మయ్యగారిపల్లె రైతు సేవా కేంద్రాల్లో యూరియాను పోలీసు బందోబస్తుతో పంపిణీ చేయాల్సి వచ్చింది. ఒక రైతుకు ఒక బస్తా వంతున మాత్రమే ఇచ్చారు. రెండు రైతు సేవా కేంద్రాల్లో 800 బస్తాలకు శుక్రవారం 405 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు ఏవో శ్రావణి తెలిపారు. మిగిలిన యూరియా బస్తాలను సోమవారం ఇస్తామని చెప్పారు. యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా పంపిణీలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఖాదర్‌వల్లీ, వీహెచ్‌ఏలు ఉదయశ్రీ, తిరుమల, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ


