రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు | - | Sakshi
Sakshi News home page

రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు

Apr 30 2025 1:50 AM | Updated on Apr 30 2025 1:50 AM

రాజంప

రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు

కడప పార్లమెంటు పరిశీలకుడిగా కొండూరు అజయ్‌రెడ్డి

తిరుపతి పార్లమెంటు పరిశీలకులుగా ఎంపీ రఘునాథ్‌రెడ్డి

హిందూపురానికి రమేష్‌కుమార్‌రెడ్డి..

సాక్షి రాయచోటి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంతోపాటు ఎక్కడికక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలతోపాటు ఇతర అక్రమాలను నిలదీయడంలో భాగంగా.. పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీకులను నియమించింది. అందుకు సంబంధించి కడప పార్లమెంటు పరిశీలకులుగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేత కొండూరు అజయ్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్లమెంటుకు సంబంధించి పరిశీలకులుగా కడప నగర మేయర్‌ కె.సురేష్‌బాబును నియమించారు. గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేసిన అనుభవంతోపాటు జెడ్పీ చైర్మన్‌గా కూడా సురేష్‌బాబు పని చేసి ఉన్నారు.

● తిరుపతి పార్లమెంటు పరిశీలకులుగా రాజంపేటకు చెందిన రాష్ట్ర నాయకులు, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డిని పార్టీ నియమించింది. తిరుపతి జిల్లాలో మేడా రఘునాథరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. అంతేకాకుండా రాయ చోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డిని కూడా హిందూపురం నియోజకవర్గ పరిశీలకులుగా పార్టీ నియమించింది. ఎక్కడికక్కడ జిల్లాలో అందరినీ సమన్వయం చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్ఫలితాలు సాధించేలా, ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాలు చేయడమే లక్ష్యంగా పరిశీలకులను నిమించారు.

రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు 1
1/3

రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు

రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు 2
2/3

రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు

రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు 3
3/3

రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement