వైఎస్.షర్మిలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి
మదనపల్లె : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు ఆదివారం మదనపల్లె వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విజయవాడలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్.షర్మిల మాట్లాడుతూ దేశంలో ఇంటర్నల్ టెర్రరిజాన్ని బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సహిస్తున్నారని, మోదీ టెర్రరిస్ట్ అంటూ మాట్లాడారన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే విధంగా ఉన్నాయని, ఆమైపె దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుచేసిన వారిలో బీజేపీ నాయకులు బండి ఆనంద్, భగవాన్, జర్మనీ రాజు, కిరణ్ కుమార్, నాగరాజు, వెంకటరాజు, సాయిప్రసాద్, శ్రీకాంత్, పిల్లస్వామి నాయక్, మధుసూధన్‌రావు, శరత్ ఉన్నారు.
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె : కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కళత్తూరు పంచాయతీ గళ్లవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు జ్యోతీష్ (25) మదనపల్లెలోని ఓ హోటల్‌లో కిచెన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. సొంత పనులపై స్వగ్రామానికి వెళ్లి తిరిగి ఆదివారం ద్విచక్రవాహంలో వస్తుండగా మార్గమధ్యంలోని ముత్తుకూరు క్రాస్ వద్ద పుంగనూరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న కారు ఢీకొంది. ప్రమాదంలో జ్యోతీష్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. సంబంధింత పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉస్మాన్ నగర్‌లో రౌడీల వీరంగం
రాజంపేట : పట్టణంలోని ఉస్మాన్ నగర్‌లో శనివారం రాత్రి కొంతమంది రౌడీలు వీరంగం సృష్టించారు. రౌడీల దాడిలో గాయపడిన వెంకటరమణ, కొడుకు రెడ్డయ్యలను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సీసీ కెమెరా ల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. రౌడీ మూకలు సీసీ కెమెరాలు పగులగొట్టారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజా తెలిపారు.
వైఎస్.షర్మిలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి
వైఎస్.షర్మిలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి


