ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
సిద్ధవటం: యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను గురువారం గ్రామస్తులు టక్కోలులో అడ్డుకున్నారు. ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఉచితంగా పెన్నా పరివాహ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించిన కొందరు ఉచిత ఇసుక ముసుగులో మండలంలోని డేగనవాండ్లపల్లి, టక్కోలు, మాచుపల్లి, లింగంపల్లి గ్రామాల నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కడపకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా టక్కోలు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుక ముసుగులో ప్రతి రోజు దాదాపు 50 ట్రాక్టర్ల ద్వారా పెన్నా పరివాహ ప్రాంతాలైన డేగనవాండ్లపల్లి, మాచుపల్లి లింగంపల్లి తదితర గ్రామాల నుంచి ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమం రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు.
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత


