బొలేరో వాహనం ఢీకొని కూలీకి తీవ్ర గాయాలు
మదనపల్లె : బొలేరో వాహనం ఢీకొని బీహార్ వలస కూలీ తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. బీహార్‌కు చెందిన రఘుకుమార్(24) ఉపాధి నిమిత్తం కురబలకోటకు వచ్చి అంగళ్లు ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న నర్సరీ, ఎరువుల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. వంటగ్యాస్ అయిపోవడంతో సిలిండర్ కోసం ద్విచక్రవాహనంలో అంగళ్లుకు వచ్చి తిరిగి వెళుతుండగా, ఫ్లై ఓవర్ సమీపంలో రాయచోటి నుంచి మదనపల్లె వైపు వస్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో రఘుకుమార్ తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
బొలేరో వాహనం ఢీకొని కూలీకి తీవ్ర గాయాలు


