లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ క్లీనిక్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ క్లీనిక్‌పై అవగాహన

Apr 26 2025 12:40 AM | Updated on Apr 26 2025 12:40 AM

లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ క్లీనిక్‌పై అవగాహన

లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ క్లీనిక్‌పై అవగాహన

రాయచోటి టౌన్‌ : లీగల్‌ ఎయిడ్స్‌ డిఫెన్స్‌ క్లీనిక్‌పై జైలులో నిందితులు, ఖైదీలకు అవగాహన ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.బాబాఫకృద్దీన్‌ అన్నారు. రాయచోటి సబ్‌ జైలును శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌పై వివరించారు. ఎలాంటి కేసుల్లో ఇక్కడికి వచ్చారు? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటూ ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే రాయచోటి మండల శాఖ న్యాయ సేవాధికార సంస్థ(కడప)ను సంప్రదించవచ్చునని చెప్పారు. అంతకుముందు జైల్లో వసతులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అడిషనల్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ అఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఎన్‌.తేజశ్విని, రాయచోటి సబ్‌ జైల్‌ ఇన్‌చార్జి సూపరిటెండెంట్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement