
ఎల్లమ్మతల్లీ..కరుణించమ్మా..
పెనగలూరు: ఎల్లమ్మ తల్లీ కరుణించమ్మా.. మమ్మేలు తల్లీ.. అంటూ భక్తులు అమ్మను కొలిచారు. పెనగలూరు మండలంలోని సింగనమల గ్రామంలో ఎల్లమ్మతల్లి జాతర శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే జాతరకు సుదూర ప్రాంతాల నుంచి బంధుమిత్రులు రావడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు.శనివారం సాయంత్రం ఎల్లమ్మ తల్లిని గ్రామంలో ఊరేగించారు. అనంతరం గంగమ్మ, అంకాలమ్మ, మారమ్మ విగ్రహాలను తీసుకొచ్చి గ్రామ చావిడి వద్ద తాత్కాలికంగా వేపాకులతో ఆలయాలు నిర్మించి అక్కడ అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. శనివారం రాత్రి భక్తులు పొంగళ్లు సమర్పించారు.ఆదివారం కూడా పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని గ్రామస్తులు తెలిపారు. 41 సంవత్సరాల తర్వాత జాతర నిర్వహించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎల్లమ్మతల్లీ..కరుణించమ్మా..