చేపల కోసం విషప్రయోగం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని రంగసముద్రం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషపూరితమైన ద్రావణాన్ని కలిపేశారని మండలంలోని రంగసముద్రం, రాపూరివాండ్లపల్లి పంచాయతీ ప్రజలు కలెక్టర్, మత్స్య శాఖ, డీపీవో, డీఎల్‌పీవో, మండల అధికారులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. విష ప్రయోగంతో చెరువులోని చేపలు మృతిచెందాయని వారు పేర్కొన్నారు. చేపలు నీటిలో తేలియాడడం, రంతా కలుషితమై దుర్వాసన రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన చేపలు తిన్న కుక్కలు రోగాల బారిన పడుతున్నాయని, కలుషిత నీటిని తాగి పశువులు, ప్రజలకు ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులకు వారు తమ గోడును వెళ్ళబోసుకున్నట్లు తెలిపారు. నీటిని కలుషితం చేసిన వారిని గుర్తించి, చూసీ చూడనట్లు వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్‌కు రెండు గ్రామాల ప్రజల ఫిర్యాదు


