అకాల వర్షం.. అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అపార నష్టం

May 2 2025 1:05 AM | Updated on May 2 2025 1:05 AM

అకాల

అకాల వర్షం.. అపార నష్టం

లక్కిరెడ్డిపల్లి : అకాల వర్షాలు రైతుకు అపార నష్టాన్ని మిగిల్చాయి. గురువారం సాయంత్రం కురిసిన తేలికపాటి వర్షానికి ఈదురు గాలుల బీభత్సం తోడవడంతో మండలంలోని మద్దిరేవుల, కస్తూరురాజుగారిపల్లి, దప్పేపల్లి గ్రామాల పరిధిలోని మామిడి రైతుల తోటలలో కాయలు పూర్తిగా నేలరాలాయి. పెనుగాలుల బీభత్సానికి మండలంలోని మామిడి రైతుల పంట చేతికందే సమయంలో కుదేలైపోయాడు. పక్వానికి వచ్చిన మామిడి పంట కాస్త నేలరాలిపోగా మామిడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్‌లో నేలరాలిన మామిడి కాయలకు ధరలు లేకపోవడంతో రైతన్న పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా మారింది. ప్రతి సంవత్సరం మామిడి పంట పక్వానికి వచ్చే సమయంలో ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోతూనే ఉన్నాయని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మామిడి రైతు ఇన్సూరెన్సును ప్రభుత్వానికి చెల్లించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులు ఎకరాకు రూ. 2250లు చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి కేంద్ర ప్రభుత్వానికి మామిడి రైతులు ఆన్‌లైన్‌ ద్వారా ఇన్సూరెన్సు కోసం డబ్బులు చెల్లించారు. ఉద్యాన అధికారులు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

నష్టపోయిన మామిడి రైతును

అన్ని విధాలా ఆదుకోవాలి..

అకాల వర్షాలకు నష్టపోయిన మామిడి రైతును అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌ రెడ్డి, జెడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యాన శాఖ అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. అలాగే మండలంలో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.రమేష్‌ కుమార్‌ రెడ్డి కోరారు. అలాగే మామిడి రైతుకు ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం తక్షణమే ప్రకటించాలన్నారు.

గాలివీడులో..

గాలివీడు : గాలివీడు మండలంలో గురువారం జోరుగా గాలివాన కురిసింది. రాయచోటి ప్రధాన రహదారిపై పెద్ద వృక్షం నేలకొరిగింది. అంతేగాక చాలాచోట్ల మామిడి తోటల్లో మామిడి పండ్లు ఈదురు గాలులకు నేల పాలయ్యాయి. రహదారులపై వాహనదారులు పలు అవస్థలు పడ్డారు.

ఈదురు గాలుల బీభత్సం

కోతకు వచ్చే సమయంలో

నేలరాలిన మామిడి కాయలు

అకాల వర్షం.. అపార నష్టం 1
1/1

అకాల వర్షం.. అపార నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement