సదరన్ సర్టిఫికెట్ల పరిశీలన
రాయచోటి టౌన్ : దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్లను పరిశీలిన నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉదయం 10 గంటల నుంచి దివ్యాంగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అంతకు ముందుగా వారి వద్ద ఉన్న సదరన్ సర్టిఫికెట్‌ల జీరాక్స్‌ను కూడా పొందుపరిచి భౌతికంగా డాక్టర్ మాధవరెడ్డి పరిశీలించారు. నకిలీ సర్టిఫికెట్లు పొంది పింఛన్ పొందుతున్నారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తనిఖీల నిర్వహణ చేపట్టారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన వారిని భౌతికంగా పరిశీలించి వారికి ఇచ్చిన పర్సెంటేజ్‌ను సవరిస్తున్నారు. కార్యక్రమాన్ని డాక్టర్ బండారు కిరణ్‌కుమార్ పర్యవేక్షించారు.
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ
కళాశాలకు న్యాక్ బి ప్లస్ గ్రేడ్
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) నుంచి బీ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. న్యాక్ బృందం కళాశాల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నైపుణ్యం, పరిశోధన, విద్యార్థుల పురోగతి వంటి అంశాలను సమీక్షించి ఈ గ్రేడ్‌ను మంజూరు చేసిందని ప్రిన్సిపల్ తెలిపార. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలను సాదించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ విజయంతో కళాశాల విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి
సంబేపల్లె : అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం శెట్టిపల్లె పంచాయతీ డీసీ వడ్డిపల్లెకు చెందిన కుంచపు శివయ్య, వెంకట్రమణమ్మలపై అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకులు దాడి చేశారు. స్థానికుల కథనం మేరకు గతంలో జరిగిన ఎన్నికల్లో శివయ్య, వెంకటరమణమ్మలు వైఎస్సార్‌పీకి మద్దతుగా నిలిచారన్న కసితో అధికారపార్టీ నాయకుల అండతో అదే గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలు భాస్కర్‌తో పాటు మరో నలుగురు శివయ్య, వెంకటరమణమ్మలపై గురువారం దాడి చేశారు. శివయ్య కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. దాడిపై శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.భాస్కర్, మరో వ్యక్తి కలిసి శుక్రవారం శివవయ్యపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై శుక్రవారం పోలీసులను వివరణకోరగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మార్షల్ ఆర్ట్స్‌లో
బంగారు పతకం
కడప ఎడ్యుకేషన్ : ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్–2025లో మార్షల్ ఆర్ట్స్(పెన్– కాక్ సిలాట్)లో కడప బాలాజీ ఎంబీఏ కళాశాల విద్యార్థి జాన్ బెన్ని బంగారు పతకం సాధించినట్లు కరస్పాండెంట్ లేవాకు నితీష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జేఎన్‌టీయూ యూనివర్సిటీ తరపున బాలాజీ ఎంబీఏ కళాశాల విద్యార్థి బంగారు పతకం సాధించడం తమకెంతో గర్వకారణమన్నారు. ఇందుకు విద్యార్థికి రూ. 10 వేలు నగదుతో సత్కరించామని తెలిపారు.
సదరన్ సర్టిఫికెట్ల పరిశీలన
సదరన్ సర్టిఫికెట్ల పరిశీలన
సదరన్ సర్టిఫికెట్ల పరిశీలన


