
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది.

మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) దుమ్మురేపగా... జానీ బెయిర్‌స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.

గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్ తలా ఒక వికెట్ తీశారు.

ఆదివారం జరగనున్న క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
















Photo Courtesy : PTI