మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్‌లో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారు. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్‌ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్‌ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మావిగన్‌ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్‌ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్‌ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్‌కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగ్‌ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారు. భవన డిజైన్లకే రూ.401 కోట్లు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427?. వాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే ఇచ్చారు. ఫైవ్‌స్టార్ హోటల్స్‌కు కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే!. తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్‌కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు?. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే’ అని తెలిపారు. జంగిల్ రాజ్‌గా రాష్ట్రం.. ప్రజల బాగోగులను చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు.
జూనియర్ ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కేజీలు..! ఎలా తగ్గారంటే..
మే 20న టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ చిత్ర నిర్మాతలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. ఆయన న్యూలుక్‌కి సంబంధించిన పోస్టర్లు అభిమానులను థ్రిల్‌కి గురయ్యేలా చేసింది. ఎంత స్మార్ట్ లుక్‌లో కనిపించారంటే మన హీరో తారక్‌నే కదా అనే సంభ్రమాశ్చర్యాలకు లోను చేసేలా అద్భుతమైన లుక్‌లో కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలోని తన పాత్రం కోసం ఆయన కేవలం నాలుగు నెలల్లో దాదాపు 15 కేజీలు తగ్గారని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. అందుకోసం ఆయన ఎంతలా కష్టపడ్డారో..ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారంటే.!ఆ మూవీలో హంతకుడు పాత్ర కోసం ఆయన్ను మరింత సన్నగా ఉంటే బాగుంటదని చెప్పానని అన్నారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. ఆయన తన పాత్ర కోసం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా కష్టపడతారని అనుకున్నా కానీ ఇంతలా తను రూపురేఖల్ని మార్చుకుంటారని తాము ఊహించలేదన్నారు. తాను అలా స్మార్ట్‌గా అవ్వడంతో ఆయన భార్య, తల్లి తనపై చాలా కోపంగా ఉన్నారని కూడా చెప్పారు. అందుకోసమే ఎన్జీఆర్ నాలుగు నెలలపాటు షూటింగ్‌కి కూడా రాలేదన్నారు. ఒకానొక సమయంలో దాదాపు 15 కేజీలు తగ్గారు. అది చూసి మధ్యలోనే చాలు ఆపేయండని కోరినా..ఆయన ఆపలేదంటూ నాటి సంఘటనలు గుర్తు తెచ్చుకున్నారు. ఆ హీరో మరీ అంతలా కష్టపడటం కూడా చాలా బాధగా అనిపించిందన్నారు.అందుకోసం ఏం చేశారంటే..ట్రైనర్ డెక్కన్ క్రానికల్ ప్రకారం..స్మార్ట్ చురుకైన శరీరాకృతి కోసం కార్డియో- వ్యాయామాలు, రెసిస్టెన్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఉదయం 45 నుంచి 90 నిమిషాల సెషన్లు ఇవే చేసినట్లు తెలిపారు. అలాగే ఆహార పరంగా సాధారణంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించడానికి బదులుగా, తక్కువ ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని ఎంచుకున్నట్లు డైట్ ట్రైనర్ కుమార్ మన్నవ తెలిపారు. ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని ఈ విధానం సులభంగా తగ్గేలా చూసి సరికొత్త లుక్‌తో కనిపించేలా చేసిందన్నారు. ముఖ్యంగా డ్రాగన్ పాత్రకు అనుగుణమైన ఆహార్యంతో అందర్నీ ఆశ్చర్యపరిచారని చెబుతోంది చిత్ర బృందం. తామెవ్వరూ ఇంతలా మార్చుకుంటారని గానీ, ఇంత స్పీడ్‌గా బరువు తగ్గి స్మార్ట్‌గా మారిపోతారని ఊహిచలేదని చెబుతోంది మూవీ బృందం. (చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!)
హార్మూజ్‌పై పట్టుకు ఇరాన్ ప్లాన్.. అథారిటీ ఏర్పాటు
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నౌకలపై రుసుములు విధిస్తోంది. జలసంధిలో ఇరాన్ సరికొత్తగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఏర్పాటు చేసింది. కొత్త “Hormuz Safe” ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఇరాన్ ఆర్థిక లాభాలు పొందుతోంది. దీని వల్ల ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ప్రభావితం అవుతోంది.హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను బలపరచడానికి ఇరాన్ కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. జలసంధి నిర్వహణ బాధ్యతలను పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (Persian Gulf Strait Authority) అనే ఈ సంస్థను అప్పగించింది. ఇందులో భాగంగా చెక్పాయింట్లు అమలు చేస్తోంది. నౌకలపై ట్రాన్సిట్ అనుమతులు జారీ చేసి, రుసుములు వసూలు చేస్తోంది. ముఖ్యంగా టోల్ ఫీజులు వసూలు చేయడం, నౌకల కార్గో వివరాలు, జెండా, గమ్యం వంటి సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నౌకలకు రెండు మిలియన్ డాలర్ల వరకు టోల్ ఫీజులు విధిస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ $10 బిలియన్ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఇరాన్ ఈ సంస్థ ద్వారా హార్మూజ్ జలసంధిపై తన భౌగోళిక ప్రభావాన్ని పెంచుకోవడం, ఆర్థిక లాభం పొందడం, అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలని ప్లాన్ చేసింది.ఇదే ఉదాహరణ.. కాగా, Agios Fanourios-I అనే ట్యాంకర్ ఇరాక్ క్రూడ్ ఆయిల్‌తో వియత్నాం వైపు బయలుదేరింది. కానీ ఏప్రిల్ చివరి నుండి దుబాయ్ తీరంలో నిలిపివేయబడింది. మే 10న ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే హార్మూజ్ గుండా ప్రయాణం కొనసాగింది. సాధారణంగా 5 గంటల్లో పూర్తయ్యే ప్రయాణం, ఇరాన్ జోక్యం వల్ల 2 రోజులు పట్టింది. మరోవైపు.. ఈ జలమార్గం గుండా కేవలం కొద్ది సంఖ్యలో నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అమెరికాకు చెందిన సిన్మాక్స్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ విశ్లేషణ ప్రకారం.. ఏప్రిల్ 18 నుండి మే 6 మధ్య 60 కంటే తక్కువ నౌకలు మాత్రమే ఈ జలసంధి గుండా ప్రయాణించగలిగాయి. యుద్ధానికి ముందు, సాధారణంగా ఒక రోజులో సుమారు 120 నుండి 140 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించేవి, వాటిలో దాదాపు సగం చమురు ట్యాంకర్లే ఉన్నాయి.ప్రభావంప్రపంచ చమురు సరఫరా: హార్మూజ్ గుండా 20% గ్లోబల్ ఆయిల్ వెళ్తుంది.మార్కెట్ కలకలం: ఆలస్యం, రుసుములు, అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.ప్రాంతీయ ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.ప్రపంచ ప్రతిస్పందన: UK, France వంటి దేశాలు 40 దేశాల సమావేశం ఏర్పాటు చేసి, యూరోపియన్ ఎస్కార్ట్ ప్లాన్‌పై చర్చిస్తున్నాయి.
‘బిహార్’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దరిమిలా రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌ను కొత్త నిర్ణయం తీసుకున్నారు. పట్నాలోని విలాసవంతమైన బంగ్లాను వదిలి, ఒక ఆశ్రమానికి తన నివాసాన్ని మార్చారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.షేక్‌పురా హౌస్ ఖాళీ.. ఆశ్రమంలోనే బసదర్భంగాలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ తాను పట్నాలోని పాత నివాసాన్ని ఖాళీ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఐఐటీ పట్నాకు సమీపంలో ఉన్న ‘బిహార్ నవనిర్మాణ ఆశ్రమం’ ఇకపై తన నివాసమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ తన ముద్ర వేసేంత వరకు, అంటే తదుపరి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాను ఈ ఆశ్రమంలోనే ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇంతకాలం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ‘షేక్‌పురా హౌస్’ బంగ్లా నుండి కార్యకలాపాలు సాగించారు.ఘోర పరాజయం.. నితీష్‌పై తీవ్ర విమర్శలుఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఘోర పరాభవం తర్వాత పీకే రూట్ మార్చారు. ఇదే సమయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ కుమారుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కావడంపై మండిపడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజల వలసలను ఆపలేని ముఖ్యమంత్రి, తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు మాత్రం గట్టి పునాది వేసుకున్నారని పీకే ఎద్దేవా చేశారు.ఓటర్లకు పిలుపు.. రూ.10 వేల పథకంపై ఎటాక్కుల మతాలకు, డబ్బు ఆశలకు లొంగకుండా ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ వంటి నాయకుల మాటలకు మోసపోవద్దన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద సుమారు 1.5 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేసిన రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని ఉద్దేశిస్తూ.. కేవలం పదివేల రూపాయల కోసం ఓట్లను అమ్ముకోవద్దని పీకే ఓటర్లను హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్!
‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
ఛాయ్ చటుక్కున తాగరా భాయ్..!
క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు
ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు!
కేన్స్ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..!
‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?
టెక్కలి గర్భంలో అరుదైన ఖజానా!
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
ఒకే ఒక్క ఫ్లాప్.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్
తెలంగాణలో కార్మికులకు గుడ్‌న్యూస్.. వేతనాలు భారీగా పెంపు
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
ఛాయ్ చటుక్కున తాగరా భాయ్..!
క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు
ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు!
కేన్స్ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..!
‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?
టెక్కలి గర్భంలో అరుదైన ఖజానా!
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
ఒకే ఒక్క ఫ్లాప్.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్
తెలంగాణలో కార్మికులకు గుడ్‌న్యూస్.. వేతనాలు భారీగా పెంపు
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
ఫొటోలు
తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
సినిమా
పాసవ్వాలా... ఫెయిలవ్వాలా... అంతా పైసల పైనే
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఎగ్జామ్ సిరీస్ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కానీ ఇప్పటి పరిస్థితులలో చదువుకునేవారు తక్కువయ్యారు... చదువు కొనేవారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ‘ఎగ్జామ్’. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది. దాదాపుగా వాస్తవిక ఘటనలతో, చిన్నపాటి సినిమాటిక్ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సర్గుణమ్. ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కథాంశానికి వస్తే... తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డీఎస్పీ మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో మారుమల్లిని ఝాన్సీ కిడ్నాప్ చేసి తైకారాకు తాను డీఎస్పీగా వెళుతుంది. ఓ డీఎస్పీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు. కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతారు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది? స్టేషన్‌కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా? లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్‌లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్యా వ్యవస్థలో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా... ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసల మీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. – హరికృష్ణ ఇంటూరు
ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు
కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం తారక్ చాలా బక్కచిక్కిపోయాడు. గతంలో పలు ఈవెంట్స్‌లో అలానే కనిపించాడు. అయితే అంతలా బరువు తగ్గిపోవడానికి కారణాన్ని ఇన్నాళ్లకు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో చెప్పాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'మూవీ షూటింగ్ మొదలుపెడదామనగా.. ఎన్టీఆర్‌ని కొంచెం సన్నబడమని చెప్పాను. కానీ ఆయన మాత్రం నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. తారక్ భార్య, తల్లి, ఫ్రెండ్సే కాదు నా టీమ్ కూడా నన్నే తిట్టారు. నేనే ఇదంతా చేశానని అన్నారు. ఎందుకంటే మరీ బక్కగా, బలహీనంగా కనిపించాడు. నేను కూడా చాలాసార్లు ఇక సరిపోతుంది ఆపేయమని చెప్పా. అయినా వినలేదు''కథ కోసం, తన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆయనని ఆపడం చాలా కష్టం. ఇంత పట్టుదల గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, వ్యక్తిగతంగా సమస్య ఉందని వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. పాత్ర కోసం పడిన కష్టమే అది' అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు.వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఆఫ్గాన్ డ్రగ్ మాఫియా కంపెనీలో పనిచేసే నరహంతకుడిగా కనిపించబోతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. అనిల్ కపూర్, జిబు మేనన్, ఖుష్బూ, అశుతోష్ రాణా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. అతిపెద్ద దేశభక్తి సినిమా: ప్రశాంత్ నీల్)#PrashanthNeel says, 'We spent four months looking at him ( #NTR ) suffer.'“I told him that if you became THINNER for the role of the assassin, it would help.His wife, his mother, all his friends and my whole team were UPSET with me.” pic.twitter.com/FpJ7Puj0BW— Whynot Cinemas (@whynotcinemass_) May 20, 2026
కేన్స్ చిత్రోత్సవాల్లో హారర్ సినిమా టీజర్
నటుడు ఆదవ్ కన్నదాసన్, నటి వాణి భోజన్ జంటగా నటించిన చిత్రం తాళ్ తిరవా. బర్మన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్. కేఆర్ సహ నిర్మాత. భరణి శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.. సురేష్ మీనన్, సుబ్బుపంజా ముఖ్య పాత్రలు పోషించిన ఇందులో బాల తారలు లిసా, లలిత నటించారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది ఒక గ్రామంలో గుర్తించిన పురాతన రాతి పలకంపై రాసిన అక్షరాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, అనర్థాల ఇతివృత్తంతో రూపొందిస్తున్న మూవీ అని చెప్పారు.ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి అయిందన్నారు. మూవీ టీజర్‌ను మంగళవారం (మే 19) నాడు కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రపంచ సినీ ప్రముఖులను అలరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే తాళ్ తిరవా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశామని, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈచిత్రానికి ఓషో. వెంకట్ సంగీతాన్ని సమకూర్చగా, సాల్మన్బోస్ చాయాగ్రహణం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by தாழ் திறவா (@thazhthiravaa)
మంచు మనోజ్‌కి మరో కీలక పాత్ర.. ఆ సీనియర్ హీరోతో ఢీ
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్‌గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్‌తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం.
క్రీడలు
పడిలేచిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందా..?
ఐపీఎల్ 2026లో కేకేఆర్ ప్రస్తానం ఆసక్తికరంగా కొనసాగుతోంది. సీజన్ తొలి 6 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈ జట్టు, అనూహ్యంగా తదుపరి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. చివరి లీగ్ మ్యాచ్‌లో (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ తేడాతో గెలిచి.. రాజస్థాన్ ముంబై ఇండియన్స్ చేతిలో, పంజాబ్ కింగ్స్ లక్నో చేతిలో ఓడితే కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.పైన అనుకున్నట్లుగా అన్నీ జరిగి కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరితే పెను సంచలనమవుతుంది. సీజన్ ప్రారంభంలో వివాదాలు (ముస్తాఫిజుర్ రహ్మాన్), గాయాలతో సతమతమైన ఈ జట్టు.. ఓ దశలో నైరాశ్యంలోకి కూరుకుపోయి, గెలుపు లేకుండానే సీజన్‌ను ముగించేలా కనిపించింది. అయితే ఆ జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు హోప్ కోల్పోకుండా తమవంతు ప్రయత్నాలు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానే తన కుర్రాళ్లలో అనునిత్యం స్పూర్తి నింపుతూ, పతనావస్థలో ఉన్న జట్టును తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కించాడు.అన్నీ కలిసొచ్చి కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరితే, ఆపై టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందునుంచీ ఈ జట్టు బలహీనంగా ఏమీ లేనప్పటికీ.. బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో తడబాట్ల వల్ల వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఎప్పుడైతే పేసర్ కార్తీక్ త్యాగి, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లైన్లోకి వచ్చారో, అప్పుడే కేకేఆర్ ఫేట్ మారడం మొదలైంది. ఈ త్రయం దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. వీరికి అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కెమరూన్ గ్రీన్ లాంటి పేసర్లు కూడా తోడైతే కేకేఆర్ బౌలింగ్ యూనిట్ తిరుగులేని శక్తిగా మారిపోతుంది.బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో కేకేఆర్ సీజన్ ప్రారంభం నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తూ వస్తుంది. అంగ్కృష్ రఘువంశీ, రింకూ సింగ్ దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో రాణిస్తూ వస్తున్నారు. కేకేఆర్ విజయాల ట్రాక్ ఎక్కిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా లైన్లోకి వచ్చాడు. రోవ్‌మన్ పావెల్ అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై గెలుపులో పావెల్ కీలకపాత్ర పోషించాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన మనీశ్ పాండే మంచి ఫామ్‌లో ఉండటం కేకేఆర్‌కు అదనంగా కలిసొచ్చే విషయం. మొత్తంగా రహానే, గ్రీన్ ఫామ్ మాత్రమే కేకేఆర్‌ను కలవరపెడుతుంది. వీరు కూడా లైన్లోకి వచ్చి తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సత్తా చాటితే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది.
టీమిండియా శ్రీలంక పర్యటన షెడ్యూల్ విడుదల
భారత అండర్ 19 క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటన 2026 షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. కొత్త అండర్-19 వరల్డ్‌కప్ సైకిల్లో భాగంగా భారత యువ జట్టు జూలైలో ద్వీప దేశంలో పర్యటిస్తుంది. ఈ టూర్లో మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు నిర్వహించనున్నారు. జూన్ 30న భారత జట్టు కొలంబో చేరుకోనుండగా.. జూలై 4 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ లేదుబీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం ఒక్క ఆటగాడు కేవలం ఒక అండర్-19 వరల్డ్‌కప్ మాత్రమే ఆడగలడు. దీంతో గత అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో పాల్గొనడు.ట్రై సిరీస్మరోపక్క భారత్-ఏ జట్టు ఇదే సమయంలో శ్రీలంకలో ట్రై సిరీస్ ఆడనుంది. అందులో ఇండియా-ఏ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. జూన్ 9 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఇండియా-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొంటాయి.ఇండియా అండర్-19 జట్టు శ్రీలంక టూర్ పూర్తి షెడ్యూల్జూలై 4- తొలి వన్డే- హంబన్టోటాజూలై 6- రెండో వన్డే- హంబంటోటా జూలై 9- మూడో వన్డే - హంబంటోటాజూలై 13-16 తొలి యూత్ టెస్ట్ - గాలే జూలై 20-23 రెండో యూత్ టెస్ట్ - కొలంబో ఈ సిరీస్‌తో 2028 అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు కొత్త కోర్ గ్రూప్‌ను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. శ్రీలంక టూర్ తర్వాత ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు వచ్చి యూత్ సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు రాజ్‌కోట్‌లో మూడు యూత్ లిస్ట్-ఏ మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు రాజ్‌కోట్‌లో తొలి యూత్ టెస్ట్.. అక్టోబర్ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లో రెండో యూత్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఈ సీజన్ మొత్తం అంతే.. అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరినప్పటికి ముంబై ఇండియన్స్ ఆట తీరు మాత్రం మారడం లేదు. బుధవారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. మరోసారి ముంబై బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో కార్భిన్ బాష్ (32), హార్దిక్ పాండ్యా(26) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ విజయంలో మనీష్ పాండే(45), రావ్మన్ పావెల్(40) కీలక పాత్ర పోషించారు.ముంబై బౌలర్లలో కార్భిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ తలా వికెట్ సాధించారు. ఈ ఏడాది సీజన్లో ముంబైకి తొమ్మిదవ పరాజయం కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని పాండ్యా అంగీకరించాడు."బ్యాటింగ్‌లో మేము 20 పరుగులు తక్కువ చేశాము. పవర్‌ప్లేలోనే మేం కీలక వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. ఒకవేళ నేను, తిలక్ వర్మ క్రీజులో మరికాసేపు నిలదొక్కుకుని ఉండి ఉంటే కనీసం 15 నుంచి 20 పరుగులు అదనంగా వచ్చేవి. అప్పుడు మాకు గెలిచేందుకు మంచి అవకాశం ఉండేది. అయినప్పటికి మా బౌలర్లు గేమ్‌ను ఆఖరివరకు తీసుకొచ్చారు.స్కోర్ బోర్డులో పెద్దగా పరుగులు లేనప్పటికి మా బౌలర్లు పోరాడిన తీరు నిజంగా అద్భుతం. పిచ్ బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉంది. కానీ బౌలర్లకు కూడా సహకరించే ఇలాంటి పిచ్‌లపై ఆడటం నాకు ఇష్టమే. ప్రస్తుతం ఐపీఎల్ పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలంగా మారుతోందని అన్పిస్తోంది. బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఈ రోజు మాత్రం పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలంగానే ఉంది. ఇక ఈ సీజన్ అంతటా మా ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. మేం చాలా క్యాచ్‌లు వదిలేశాం. ఎవరూ కావాలని క్యాచ్‌లు విడిచిపెట్టారు. కానీ మ్యాచ్‌లు గెలవాలంటే ఫీల్డింగ్ చాలా ముఖ్యం. క్యాచ్‌లే మ్యాచ్ ఫలితాలను నిర్ణయిస్తాయి. మ్యాచ్ స్వరూపాన్నే మార్చే క్యాచ్‌లను జారవిడిస్తే , జట్టు ఎప్పడూ వెనుకబడే ఉంటుంది. మా చివరి మ్యాచ్ మాకు చాలా ప్రత్యేకమైనంది. 25,000 మంది చిన్నారుల ముందు ఆడనున్నాము. స్టేడియానికి వచ్చే ఆ పిల్లల ముఖాల్లో నవ్వులు పూయించడమే మా లక్ష్యం. గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు. ముంబై తమ చివరి మ్యాచ్‌లో మే 24 వాంఖడే స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి భారత్
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు భారత్ ఐదో స్థానంలో ఉండగా తాజాగా పాకిస్తాన్‌పై 2–0తో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించడంతో ఆ జట్టు ముందంజ వేసింది. డబ్ల్యూటీసీ (2025–27)లో భాగంగా ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి 4 ఓడిన శుబ్‌మన్ గిల్ సేన మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్ ఖాతాలో మొత్తం 52 పాయింట్లు ఉండగా... పాయింట్ల శాతం (48.15) ప్రకారం ప్రస్తుతం ఆరో స్థానంలో నిలిచింది.గత ఏడాది దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో పరాజయం పాలవడం జట్టు ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపించింది. 2026లో ఇంకా ఒక్క టెస్టు కూడా ఆడని టీమిండియా... జూన్ 6 నుంచి అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో తలపడనుండగా ఈ టెస్టు డబ్ల్యూటీసీలో భాగంగా లేదు. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌లలో జరిగే పర్యటనలు భారత్‌కు కీలకం కానున్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా... దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
బిజినెస్
ఢిల్లీ-ఎన్సీఆర్లో ‘చక్కా జామ్’
జాతీయ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్)లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా రవాణా ఛార్జీలను పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో గురువారం (మే 21) నుంచి మూడు రోజుల పాటు భారీ ‘చక్కా జామ్’(రవాణా బంద్) నిరసన ప్రారంభమైంది. వాణిజ్య వాహన సంఘాలు పిలుపునిచ్చిన ఈ సమ్మె మే 23 వరకు కొనసాగనుంది. టాక్సీ ఆపరేటర్లు, ఆటో-రిక్షా డ్రైవర్లతో పాటు పలు రవాణా కమ్యునిటీ డ్రైవర్లు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఢిల్లీ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.68 యూనియన్లు.. 4 లక్షల టాక్సీలు..ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్‌కు చెందిన దాదాపు 68కి పైగా అనుబంధ యూనియన్లు ఈ మూడు రోజుల ఆందోళనలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు నాలుగు లక్షల మంది రిజిస్టర్డ్ టాక్సీ యజమానులు సమ్మెలో పాల్గొంటున్నారని, ప్రయాణికులను చేరవేసే సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్లు ప్రకటించాయి.ప్రభావితం కానున్న సేవలుఈ సమ్మె కారణంగా సాధారణ ఆటో-రిక్షాలు, కమర్షియల్ టాక్సీ సర్వీసులతో పాటు ప్రముఖ యాప్ ఆధారిత క్యాబ్ ప్లాట్‌ఫామ్‌లైన ఓలా, ఉబెర్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. అయితే, ఢిల్లీ మెట్రో, డీటీసీ బస్సుల రాకపోకలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.డిమాండ్లు ఇవే..ఈ వారం ప్రారంభంలోనే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధు, ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు తమ డిమాండ్లతో కూడిన లేఖలను పంపింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం..గత 15 ఏళ్లుగా టాక్సీ ఛార్జీలను పెంచలేదని, తక్షణమే ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో నడుస్తున్న వాణిజ్య వాహనాలపై ఉన్న ఆంక్షలను సమీక్షించాలి. ‘గత దశాబ్దంన్నర కాలంగా ఛార్జీల నిర్మాణం మారలేదు. కానీ సీఎన్జీ ధరలు, పర్మిట్లు, ఇన్సూరెన్స్ ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పదేపదే చర్చలు జరిపినా ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవడం లేదు’ అని చాలక్ శక్తి యూనియన్ ఉపాధ్యక్షుడు అనుజ్ కుమార్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం దిగిరాకపోతే..ట్రావెల్ ఆపరేటర్ల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. రాబోయే రెండు వారాల్లోగా ప్రభుత్వం ఛార్జీల సవరణను ప్రకటించకపోతే ఈ నిరసనను మరింత ఉధృతం చేస్తామని రవాణా సంస్థల ప్రతినిధులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
శామ్సంగ్ వేతన వివాదానికి తాత్కాలిక బ్రేక్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు గ్లోబల్ సెమీకండక్టర్ (చిప్) సరఫరా గొలుసును కుదిపేస్తుందని భావించిన శామ్సంగ్ కార్మిక సమ్మె ముప్పు తాత్కాలికంగా తొలగిపోయింది. యాజమాన్యంతో కుదిరిన తాత్కాలిక వేతన ఒప్పందం నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ప్రారంభం కావాల్సిన ప్రణాళికాబద్ధమైన సమ్మెను నిలిపివేస్తున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన కార్మిక సంఘం (యూనియన్) ప్రకటించింది.బుధవారం రాత్రి వరకు ఇరు పక్షాల మధ్య చర్చలు పదే పదే విఫలమవడంతో సమ్మె ఖాయమని అందరూ భావించారు. అయితే, దక్షిణ కొరియా కార్మిక మంత్రి కిమ్ యంగ్-హూన్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించడంతో చర్చలు మళ్లీ పుంజుకున్నాయి. చివరి నిమిషంలో యాజమాన్యం, యూనియన్ ఒక అంగీకారానికి వచ్చాయి. మరింత మెరుగైన కార్మిక సంబంధాలను నిర్మించడానికి ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తాత్కాలిక ఒప్పందంపై దాదాపు 48,000 మంది యూనియన్ సభ్యులు మే 22 నుంచి 27 వరకు ఓటింగ్ (రాటిఫికేషన్) జరపనున్నారు.ఉద్యోగుల అసంతృప్తి ఎందుకంటే..శామ్సంగ్ దక్షిణ కొరియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యాలయాల్లో ఒకటిగా పేరుపొందింది. అయితే, తమ ప్రధాన చిన్న ప్రత్యర్థి సంస్థ అయిన ఎస్ కే హైనిక్స్ ఇస్తున్న వేతనాలతో పోలిస్తే శామ్సంగ్ ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉండటం వారిలో అసంతృప్తిని రగిల్చింది. కంపెనీలోని వివిధ వ్యాపార విభాగాల మధ్య బోనస్‌లను పంచే విధానంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా భారీగా లాభాలు ఆర్జించే మెమరీ వ్యాపార విభాగం, నష్టాల్లో నడుస్తున్న లాజిక్ చిప్ విభాగం మధ్య పనితీరు బోనస్‌లను ఎలా కేటాయించాలనే దానిపై యాజమాన్యానికి, యూనియన్‌కు మధ్య వివాదం నడిచింది. నష్టపోయే విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా లాభాల వాటా సక్రమంగా దక్కాలన్నది వారి డిమాండ్.బోనస్‌లపై ఉన్న 50% గరిష్ట పరిమితిని రద్దు చేయాలని, బోనస్‌లను నేరుగా కంపెనీ సాధించే ఆపరేటింగ్ లాభాలతో ముడిపెట్టాలని ఉద్యోగులు పట్టుబట్టారు. వేతనాలు, సామూహిక బేరసారాలపై యాజమాన్యంతో జరిపిన చర్చలు పలుమార్లు విఫలమయ్యాయి. దాంతో ఇటీవల ప్రపంచవ్యాప్త సరఫరాకు ముప్పు తెచ్చేలా 18 రోజుల పాటు ప్రణాళికాబద్ధమైన సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే చివరి నిమిషంలో కార్మిక మంత్రి మధ్యవర్తిత్వంతో తాత్కాలిక ఒప్పందం కుదిరి సమ్మె విరమించుకున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
ట్రంప్ పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా రూపొందించిన అధునాతన గేమింగ్ చిప్‌పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్విడియా ఫ్లాగ్షిప్ గేమింగ్ జీపీయూకు చెందిన చైనా-ఫ్రెండ్లీ వెర్షన్ ‘RTX 5090D V2’ గ్రాఫిక్స్ కార్డే లక్ష్యంగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 15న చైనాలో తన అధికారిక పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సెన్ హువాంగ్‌తో సహా పలువురు సీనియర్ యూఎస్ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. అయితే, ఈ హై-ప్రొఫైల్ పర్యటన ముగిసిన వెంటనే చైనా ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించడం చర్చకు దారితీసింది.RTX 5090D V2 ప్రత్యేకత ఏంటి?అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి చైనా మార్కెట్ కోసమే ఎన్విడియా ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ ఈ RTX 5090D V2. ఇది కంపెనీకి చెందిన టాప్-ఎండ్ RTX 5090 సవరించిన వెర్షన్. అమెరికా నిబంధనలకు అనుగుణంగా దీని మెమరీ, బ్యాండ్‌విడ్త్ సామర్థ్యాలను తగ్గించారు. ప్రాథమికంగా ఇది చైనీస్ గేమర్స్, డిజిటల్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినప్పటికీ ఎన్విడియా శక్తివంతమైన బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ దీనికి అనుసంధానమై ఉండటంతో చైనా పరిశోధకులు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ పరంగా అమెరికాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే చైనా వ్యూహంలో భాగంగానే ఈ చిప్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అలీబాబా కొత్త ఏఐ చిప్ఇదే తరుణంలో అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తూ చైనా టెక్ దిగ్గజం అలీబాబా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ‘జెన్వు ఎమ్890’ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్ తన మునుపటి మోడల్ కంటే ఏకంగా మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. జెన్వు సిరీస్‌లో భాగంగా కంపెనీ ఇప్పటికే 5,60,000 కంటే ఎక్కువ చిప్‌లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. చైనా మార్కెట్లో ఎన్విడియా భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనే అలీబాబా ఈ ప్రకటన చేయడం చాలా కచ్చితమైన వ్యూహం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
పునరుత్పాదక ఇంధన రంగంలోకి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ పునరుత్పాదక ఇంధన రంగం (సోలార్, పవన విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపన) పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలోకి 110–120 బిలియన్ డాలర్ల (రూ.11.52 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు రానున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 7 లక్షల ఎకరాల భూ సమీకరణ కోసమే సుమారు 10–15 బిలియన్ డాలర్ల (రూ.96,000–1,44,000 కోట్లు) పెట్టుబడులు అవసరమని తెలిపింది. 2025 చివరికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 250 గిగావాట్లకు చేరుకున్నట్టు తెలిపింది. 2015 నాటికి ఉన్న 80 గిగావాట్లతో పోలి్చతే మూడు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. 2026 మార్చి నాటికి స్థాపిత సామర్థ్యం 275 గిగావాట్లకు చేరినట్టు పేర్కొంది. 2030 నాటికి 270–300 గిగావాట్ల సోలార్, పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా తోడు కానున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. 2026–2030 కాలంలో 6.5 లక్షల ఎకరాలు ఒక్క సోలార్ ఇన్స్టాలేషన్లకే అవసరమవుతుందని.. మిగిలిన 50వేల ఎకరాలు పవన విద్యుత్‌కు కావాల్సి వస్తుందని పేర్కొంది. 500 మెగావాట్ల లక్ష్యం సాధ్యమే సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం ఒక్కో మెగావాట్‌కు రూ.3–4 కోట్లు, పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ల (భూమిపై)కు సంబంధించి ఒక మెగావాట్ సామర్థ్యం కోసం రూ.8–9 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని కొలియర్స్ ఇండియా తెలిపింది. దేశీయంగా తయారీ సామర్థ్యాలు మరింత మెరుగుపడుతున్నందున 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సులభంగానే చేరుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. అప్పటికి ఒక్క సోలార్ ప్రాజెక్టుల సామర్థ్యమే 400–450 గిగావాట్ల మేర ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం 146 గిగావాట్ల సామర్థ్యం మేర ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం రియల్ ఎస్టేట్ రంగానికి అవకాశాలు కలి్పస్తుందని.. ముఖ్యంగా భూ సమీకరణ, పునరుత్పాదక ఆధారిత పారిశ్రామిక పార్కుల్లో అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది.
ఫ్యామిలీ
'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా?
మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ఈమె, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను వివాహం చేసుకున్న తర్వాత, మే 12న అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగా..ట్విషా కుటుంబం, ఆమె అత్తగారి కుటుంబాల మధ్య ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. అదీగాక ఈ విషాద ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు కూడా. తాజాగా ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేసుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. కూతుళ్ల పట్ల భారతీయ కుటుంబాల మనస్తత్వంపై విమర్శలు గుప్పించారు. వాళ్లు కూతుళ్లను ఒక వస్తువుల్లా చూస్తారని, ముఖ్యంగా అత్తారింటికి పంపే సరుకులా చూస్తారని అన్నారామె. కన్యాదానం తర్వాత కూతురు అత్తగారింట్లో మృతి చెందడం గౌరప్రదం కదా అంటూ ఆక్రోశించారు. పెళ్లితోనే తల్లిదండ్రులు కూతుళ్లను తిరిగి తెచ్చుకోకూడని ఓ వస్తువులాంటి వారు కదా అని వ్యగ్యంగా మాట్లాడారు. Twisha's death is proof that many Indian parents think their daughter is a commodity that is delivered to the in-laws and has no return policy. The girl can die at the In-laws. That is only honorable after Kanya Daan. Ok?— Chinmayi Sripaada (@Chinmayi) May 19, 2026 అలాగే బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన వరకట్న వేధింపుల కేసులు, మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్‌లో వివాహానికి ముందే ఆర్థిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ పెళ్లైన యువతుల గురించి ఎన్నో విషాద వార్తలు వస్తున్నాయి. పెళ్లైన ఈ యువ, విద్యావంతులైన మహిళల్లో చాలామంది, విషాదాలు జరగకముందే ఊపిరాడనంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయమని తమ తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ భారతీయ సమాజం కూతుళ్లను పెళ్లయ్యాక వదిలేయడానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఎవరి మాట వినొద్దు..మీరు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి లేదంటే మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకురారు అని యువతకు హిత బోధ చేశారామె. View this post on Instagram A post shared by Bollywood Bubble (@bollywoodbubble) (చదవండి: థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమూ..)
'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్రామ నేపథ్యం నుంచి విదేశాలకు వలస వెళ్లి విజవయంతంగా స్థిరపడ్డాయి. వారిలో కొందరు తమ మూలాలను చూసుకునేందుకు వెనక్కి వచ్చి మరి భారతగడ్డపై అడుగుపెడుతుంటారు. పైగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు, తమ పూర్వీకుల ఇళ్లను చూసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. నిజంగా నాడు వాళ్లు అభివృద్ది చెందాలని కష్టపడి ఉండకపోతే..తాము అక్కడ ఉండే వాళ్లం కాదన్న ఆలోచన ఉబ్బితబ్బిబైలా చేయడమే కాదు సగర్వంగా అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగాన్నే పొందాడు ఈ భారత సంతతి వ్యక్తి. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అసలేం జరిగిందంటే..గోల్డ్ వాటర్ వ్యవస్థాపకుడు విజయ్ తిరుమలై అమెరికాలో రోడ్‌షోకు వెళ్లేమందు వార్షిక చిత్తిరై ఉత్సవం నిమిత్తం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం తన తండ్రి గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన నాన్న, మామయ్యలు పెరిగిన ఇల్లు తదితరాలను గుర్తు చేసుకుంటూ..ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, నీటి సరఫరా లేదని చెప్పారు. అయినప్పటికీ బాల్యంలో ఇక్కడే పాలిటెక్నిక్ చదవి ఈ చుట్టుపక్కలే ఆడుకుంటూ ఎంజాయ్ చేశారని అన్నారు. ఇక తన కుటుంబం ఏ స్థాయికి చేరుకుందో గుర్తుచేసుకుంటూ..తన కజిన్స్ , ఇతర కుటుంబసభ్యులు అమెరికాలో బే ఏరియా, టొరంటో తదితర ప్రాంతాల్లో స్టార్టప్‌లు, బిగ్టెక్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ..మమ్మల్ని మంచి స్థాయిలో స్థిరపడేలా పెంచినందుకు మా తల్లిదండ్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞతలని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే తమ పూర్వీకుల ఇంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఇంటిలోనే తన తండ్రి, మామయ్యల బాల్యం సాగిందని చెప్పారు. అయితే నెటిజన్లు వలసలు, త్యాగాల ఫలితం ఉన్నత స్థాయికి ఎదగడంతో ముడిపడి ఉన్న కుటుంబ చరిత్రను ఈ ఇల్లు గుర్తు చేస్తుందని అన్నారు. మరొక నెటిజన్ శెభాష్ విజయం..ఒక తరం అభివృద్ధి చెందడం కోసం ఇంకో తరం కష్టపడి త్యాగాలు చేస్తుంది. ఇది అద్భుత కుటుంబ కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.Yesterday took some time off ( before i head off for a US road show) to visit my dad's village for the annual festival ( Chittirai) to the temple where we do our part for renovations etcThis is the house my dad and my uncles grew up, no electricity, no running water, nothing,… pic.twitter.com/S8ZohHFMLM— Vijay Thirumalai (@vijaythirumalai) May 18, 2026 (చదవండి: ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..)
మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది కాలానుగుణంగా ఉంటేనే మంచిది. అందులోనూ భగభగలాడే ఈమండుటెండల్లో వేడిని తట్టుకోవాలంటే..వంటగదిలో ఈ చిన్నమార్పులు తప్పనిసరి. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారం వేసవి వేడికి ఇబ్బందికరంగా మారిపోతుంది. అలాగని ఆరోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలా? అంటే కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతర్గత శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పకుండా ఉండేలా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలని అంటున్నారు. మరి అవేంటో చూద్దామా.!.తీపి పదార్థాలు..తేనె, బెల్లం 'ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే శరీరంలో వేడి అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్జూరపు పొడి, స్టీవియా, మంక్ ఫ్రూట్ షుగర్ లేదా దాగా మిశ్రి వంటి వాటికి మారమని సూచిస్తున్నారు నిపుణులు.చిరుధాన్యాలుజొన్న, మక్కీ, రాగి, కుట్టు, బ్రౌన్ రైస్‌లు ఆరోగ్యకరమైనవే కానీ వేసవిలో మాత్రం అంత మంచివికావని అంటున్నారు. ఎందుకంటే వేసవిలో ఇవి జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుందట. అందుకు బదులుగా జొన్న, జౌ (బార్లీ), సమక్, కాంగ్ని, తెల్ల బియ్యం, ఓట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.పప్పుధాన్యాలుకందిపప్పు, మినపపప్పు, కుల్తీ, మోత్(మట్కీ), సోయాబీన్ తదితరాలుబరువుగా ఉండి, గ్యాస్‌ను ఏర్పరుస్తాయనిన్ హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటికి బదులుగా, పెసరపప్పు, మసూర్ పప్పు, లోబియా, కాబూలీ శనగలను తీసుకోండి.కూరగాయలువంకాయ, బీట్రూట్, పాలకూర వంటివి శరీరంలో వేడిని పెంచి, జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున, వాటిని అధికంగా తీసుకోకపోవడమే మేలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా సొరకాయ, టిండా(ఇండియన్ బేబీ పంప్కిన్), కద్దు(ఆనపకాయ), పర్వాల్(దొంకాయ రకం), దోసకాయ వంటివి అధిక నీటి శాతం కలిగి ఉండటం వల్ల గొప్ప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి.పాల ఉత్పత్తులుగేదె పాలు వంటి బరువైన పదార్థాలు సహజంగానే జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అదేవిధంగా, అధికంగా ఉండే పెరుగుకు - దాని శీతలీకరణ గుణాలు ఉన్నప్పటికీ ఇది కూడా మండుటెండలకు అస్సలు మంచిది కాదు. రైతా లేదా పులచటి మజ్జిగాలో తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణుల.మసాలాలుసాధారణంగా, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పరిధిని దాటినప్పుడు, తేలికపాటి ఆహారం తీసుకోవడం, అధిక మసాలాలు ఉన్న వంటకాలకు దూరంగా ఉండటం మేలు. అయితే, ఎండు అల్లం (సౌంత్), దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, మెంతి గింజలు, పిప్పలి వంటి వేడి చేసే మసాలాలు అసిడిటీని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి, వాటి వాడకాన్ని పరిమితం చేయాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటికి బదులుగా, రుచికోసం సోంపు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, లెమన్‌గ్రాస్ ఉపయోగించమని సూచిస్తున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..)
ఎడ్యుకేషన్‌పై ఐఏఎస్ అధికారి ఆసక్తికర పోస్ట్..!
మన విద్య విధానం విద్యాపరంగా గెలుపు సాధించడం ఎలా, కఠినతరమైన పరీక్షలను ఎదుర్కోవడం ఎలా తదితరాలనే నేర్పిస్తోంది. జీవితానికి అవసరమైనవి, అత్యంత కీలకమైన పాఠాలను నేర్పించడంలేదట. చదువు అన్ని జీవన నైపుణ్యాలను నేర్పింస్తుందని పొరబడుతున్నాం. అది నిజంగా భావోద్వేగ పరంగా స్ట్రాంగ్ ఉండటం దగ్గర నుంచి జీవితానికి అవసరమై కీలక పాఠాలనేవ ఏమి నేర్పించలేకపోతుందంటూ ఓ ఐఏఎస్ అధికారిణి పెట్టిన పోస్టు అందర్నీ ఆకర్షించడమే కాదు ఆలోచనాత్మకంగా ఉంది. ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం రాశారంటే..ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా..ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక కాలేజీలలో ఉన్నత చదువుని పొందా, ఐఏఎస్ వంటి మంచి గౌరవనీయమైన ఉద్యోగాన్ని దక్కించుకున్నానని అన్నారు. అయితే తాను పొందిన ఉన్నత విద్య పోటీపరీక్షలకు, వృత్తిపరమైన బాధ్యతలకు సిద్ధం చేయగలిగింది కానీ భావోద్వేగ పోరాటాలకు, ఒంటిరితనాన్ని ఎదుర్కోవడం వంటి సవాళ్లకు సిద్ధం చేయలేకపోయిందని రాశారు. నిజానికి మనమంతా విద్యార్థి దశలో గెలుపుని ఎలా అందుకోవాలో నేర్చుకోవడానికి ఏళ్ల తరబడి టైం స్పెండ్ చేస్తాం, కానీ సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఒక్క రోజు కూడా కేటాయించం అని పోస్టులో రాసుకొచ్చారామె. మనం కెమిస్ట్రీలో ఆవర్తన పట్టికను తెగ కంఠస్థం చేస్తాం, అయితే బాధను ఎలా అధిగమించాలో మాత్రం నేర్చుకోం. నిజానికి విద్యార్థులంతా విద్యా సంబంధితమైన అన్నింటిని నేర్చుకుంటారు, కానీ దుఃఖం, ఒత్తిడి లేదా వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పించదు లేదా ఏ గురువు నేర్పే ప్రయత్నం చేయరని అన్నారు. అంతేగాదు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులుగా అణిచేయడం లేదా నియంత్రించడమే నేర్పిస్తారని, అది కాస్త ఒత్తిడికి గురిచేస్తుందని ఆమె నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ప్రతి స్టూడెంట్‌కి వ్యాసాలు రాయడం ప్రోత్సహిస్తాం, కానీ అసౌకర్యాన్ని ఎలా వ్యక్తపరచాలో, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టతరమైన పరిస్థితుల్లో కాదు అనే మాట ఎలా చెప్పాలి వంటి అనేక విషయాలను నేర్పాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారామె. ప్రతి స్కూలు స్టూడెంట్ చెప్పే సమాధానాలకు బహుమతులు ఇస్తుంది, వారినే విజేతలుగా పేర్కొంటుంది. కానీ జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసిన వారే నిలదొక్కుకుంటారని ఆమె అంటున్నారు. అలాగే గణితం నేర్పిస్తాం గానీ ఆర్థిక ఒత్తిడిని ఎలా నిర్వహించాలో నేర్పదన్నారు. కేవలం డబ్బు సంపాదించడమే విద్య నేర్పిస్తుందే కానీ, దాన్ని నిర్వహించడం నేర్పదని పోస్టులో రాసుకొచ్చారామె. ఆమె పోస్టులకు పలువురు నెటిజన్లు మద్దతిస్తూ..విద్య కేవలం వృత్తి జీవితాన్నే నేర్పిస్తుందే తప్ప జీవితానికి కీలకమైన జీవన నైపుణ్యాలనే నేర్పించలేకపోతుందంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..)
అంతర్జాతీయం
విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్
అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 1996 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో (94) పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో అధికారికంగా విచారణ ప్రారంభమైంది.ఈ చార్జ్‌షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇదే విషయంపై అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మయామిలో మాట్లాడుతూ.. "30 ఏళ్ల కిందట హత్యకు గురైన నలుగురు అమెరికన్ల కుటుంబాలు ఇప్పటికి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు సాధరణ పౌరులు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీలక పాత్ర. అతడి అరెస్ట్ కోసం త్వరలోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అతడు తనంతట తాను అమెరికాకు వస్తాడని ఆశిస్తున్నాము. లేకపోతే ఇతర మార్గాల్లో మేమే రప్పిస్తామని" ఆయన పేర్కొన్నారు.అసలు 1996లో ఏమి జరిగిదంటే?'బ్రదర్స్ టు ది రెస్క్యూ' మయామి కేంద్రంగా పనిచేసే ఒక మానవతావాద సంస్థ. అప్పటిలో క్యూబాలోని కమ్యూనిస్ట్ దారుణాలను తట్టుకోలేక చిన్న పడవల్లో సముద్రం గుండా అమెరికాకు పారిపోయే క్యూబన్ శరణార్థులను ఆకాశం నుండి గుర్తించి, వారిని రక్షించడం ఆ సంస్థ పని. ఈ సంస్థకు చెందిన మూడు చిన్న సివిలియన్ విమానాలు 1996 ఫిబ్రవరి 24న ఫ్లోరిడా జలసంధి మీదుగా ప్రయాణించాయి. అయితేఅంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఈ ఘటనలో కార్లోస్ కోస్టా, అర్మాండో అలెజాండ్రే జూనియర్, మారియో డి లా పెనా, పాబ్లో మోరల్స్ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. ఆ సమయంలో రావుల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అతడి ఆదేశాల మేరకే అమెరికా సివిలియన్ విమానాలను కూల్చివేశారని అమెరికా న్యాయశాఖ నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్ల తర్వాత కాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్‌తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్‌లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్‌కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్మూద్ అహ్మదినెజాద్కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్‌ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి.
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైళ్లులలో మగ్గుతున్న 956 మంది ఖైదీలను విడుదల చేయాలని నహ్యాన్ ఆదేశించారు.సమాజంలో క్షమాగుణాన్ని,సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వివిద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ జరిమానాలు లేదా ఆర్థికపరమైన బకాయిలు చెల్లించలేక జైళ్లలోనే ఉంటున్న ఖైదీల అప్పుల మొత్తాన్ని యూఏఈ అధ్యక్షుడే స్వయంగా చెల్లించనున్నారు. దీంతో బయటకు వచ్చిన ఖైదీలు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు అజ్మాన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్-నుఐమి కూడా తన పరిధిలోని జైళ్ల నుండి 230 మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి సైతం 227 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో మొత్తం 1400కు పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా ప్రతీ ఏడాది రంజాన్, రంజాన్, బక్రీద్, జాతీయ దినోత్సవాల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఒక ఆనవాయితీగా వస్తోంది.
జాతీయం
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
చెన్నై: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో మిత్రపక్షం కాంగ్రెస్ కూడా చేరబోతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారం తెలిపారు. వారిద్దరూ ఈ నెల 21న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు. ఈ క్రమంలో తమ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని అన్నారు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లోకి తమ పార్టీ అడుగుపెడుతోందని స్పష్టంచేశారు. మరోవైపు విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సైతం మంత్రియోగం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై లోక్‌భవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1967లో అధికారం కోల్పోయింది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ పలు కూటముల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చేరే అవకాశం రాలేదు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంపై వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రజాహిత పరిపాలన లక్ష్యాలను వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నిరాశే.. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే, 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు. 1952 నుంచి 1967 వరకు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. సి. రాజగోపాలాచారి, కె. కామరాజ్, ఎం. భక్తవత్సలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే, 1967లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. ప్రత్యేకంగా 2006-11 మధ్య డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికార భాగస్వామ్యం కోరినా ఫలితం లేకపోయింది.
కొత్త కబురు ఏమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మే 13న కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ పొదుపు సూత్రాల నేపథ్యంలో జరిగిన ఆ భేటీలో కీలక ప్రకటనలు వెలువడొచ్చని అంతా భావించారు. కానీ, అలా జరగేలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని విదేశీ పర్యటన తదనంతరం జరుగుతున్న భేటీ కావడంతో ఎలాంటి నిర్ణయాలు వెలువడనున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమ ఆసియా ఘర్షణ, దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా ఉండే అవకాశం ఉంది. చమురు ధరలు, ఇంధన సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే నిశితంగా పర్యవేక్షణ చేస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్న ఉన్నత స్థాయి అనధికారిక మంత్రుల బృందం ఈ సంక్షోభాన్ని పరిశీలిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తగ్గించే చర్యలను సూచిస్తోంది. ఈ బృందంలో హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. “చమురు, ఇంధనం, LPG నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎటువంటి సమస్య లేదు” అని ఇప్పటికే స్పష్టం చేసింది.మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలుఈ సమావేశానికి మరో రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. మోదీ 3.0 ప్రభుత్వం జూన్ 10న తన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంలో మంత్రివర్గ విస్తరణ, మార్పులు జరిగే అవకాశాలపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. గత వారం అధికార వర్గాలు కూడా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని సంకేతాలు ఇచ్చాయి. మంత్రిత్వ శాఖల పనితీరు, సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష జరుగుతోందని సమాచారం. రెండో వారంలోనే మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశం ఆర్థిక, రాజకీయ పరంగా కీలకంగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావం, చమురు ధరల పెరుగుదలపై చర్చలు జరగనున్నాయి. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఈ సమావేశం తర్వాత కేంద్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నదీజలాల్లో తగ్గిపోతున్న ఆక్సిజన్
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎగసి వాతావరణ మార్పులు సర్వసాధారణమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ధాటికి వర్షాలు తగ్గి పంటదిగుబడి దారుణంగా పడిపోయి ప్రజలకు ఆకలికష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. వాతావరణ మార్పులు అనేవి ఒక్క మానవాళికే కాదు జలచరాలకూ కొత్త పెనుసమస్యగా దాపురించిందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరికలు చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో నదీజలాల ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయని దీంతో నదీజలాల నుంచి ఆక్సిజన్ నెమ్మదిగా అదృశ్యమవుతోందన్న ప్రమాదహెచ్చరికలను చైనాలోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలసహితంగా వెల్లడించారు. 1985 ఏడాది నుంచిచూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21,000 ప్రధాన నదుల్లో ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 1985 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ముఖ్యమైన నదీజలాల్లో ఆక్సిజన్ 2.1 శాతం తగ్గిందని వెల్లడైంది. ఉష్ణోగ్రతలు ఇలాగే అత్యధిక స్థాయిల్లో కొనసాగితే నదీజలాల్లో ఆక్సిజన్ క్షీణత మరింత పెరిగే ఆస్కారముంది. ఆక్సీజన్ తగ్గిపోతే ప్రాణవాయువును పీల్చి బతికే జలచరాల మనుగడే ప్రశ్నార్థకమంగా మారే ప్రమాదముంది. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘సైన్సెస్ అడ్వాన్సెస్’జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమయ్యాయి. ఆమ్లజని గాఢత తగ్గుతూ పోతే వచ్చే శతాబ్దంచివరినాటికి తూర్పు అమెరికా మొదలు భారత్ దాకా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో నదుల్లో చేపల వంటి జలచరాల సంఖ్య దారుణంగా పడిపోతాయి. అప్పుడు నదీజలాల్లో వెతికినా ఒక్క చేప కూడా దొరకదని అధ్యయనం ముందస్తు ప్రమాదఘంటికలు మోగించింది. సాధారణంగా భౌతిక, రసాయన శాస్త్ర భావనల ప్రకారంచూసినా వేడి నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మానవప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావం అతిగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ఆయువు పోయాల్సిన ఆమ్లజనికి మనిషే స్వయంగా ఆయువు తీస్తున్నాడని నివేదిక ఘాటు వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతమున్న క్షీణతరేటును పరిగణనలోకి తీసుకుంటే ఈ శతాబ్దంచివరినాటికి నదుల్లో ఆక్సిజన్ 5 శాతం తగ్గిపోయే అవకాశముంది. నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం మత్స్యకారులకు, మత్స్యసంబంధ వృత్తులతో జీవనం సాగించే జనాభాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో కీలక రచయిత, నంజియాంగ్ సిటీలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఎన్విరాన్మెంటల్ విభాగ శాస్త్రవేత్త క్వీ గువాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతే దానిని డీఆక్సిజనరేషన్గా పిలుస్తాం. ఇది చేపల సంతతిపై, వాటి మనుగడపై దుష్ట్రభావం చూపిస్తుంది. నాణ్యమైన ఆక్సిజన్ లేకపోతే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. చేపలు, రొయ్యలు, ఇతరత్రా చలజరాల దిగుబడి తగ్గిపోతే మత్స్యకారులతోపాటు మత్స్యరంగం అభివృద్ధి సైతం కుంటుబడుతుంది. ఇది పరోక్షంగా ఆయా దేశాల జీడీపీపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ క్షీణతరేటు విపరీతంగా పెరిగిపోతే నదీమతల్లులు చివరకు జలచరాల మృత్యుకుహరాలుగా రూపాంతరంచెందుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, చీసాపీక్ బే, లేక్ ఎరీ లాంటి ప్రాంతాల్లో చేపలు కనీసం శ్వాసించే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మత్స్యసంపదకు ఆలవాలమైన ప్రాంతాలన్నీ డెడ్ జోన్లుగా మిగిలిపోతాయి’’అని శాస్త్రవేత్త హెచ్చరించారు. గంగానది మరింత దారుణం ‘‘పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సగటు మరింత పెరుగుతున్న ఈ రోజుల్లో గంగానదిలో ఆక్సిజన్ పాళ్లు ఏకంగా 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షీణిస్తున్నాయి. తూర్పు అమెరికా, ఆర్కిటిక్, భారత్, దక్షిణ అమెరికాలోని నదుల్లో ఈ శతాబ్దం చివరినాటికి ఆక్సిజన్ దాదాపు 10 శాతం క్షీణించనుంది. బ్రెజిల్‌లోని అమెజాన్ వంటి ఉష్ణమండల నదుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1980 నుంచి చూస్తే అమెజాన్ నదిలో ఆక్సీజన్లేని డెడ్జోన్ ప్రాంతాల్లో రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికి అదనంగా 16 రోజులు పెరుగుతూ పోతోంది’’అని శాస్త్రవేత్త క్వీ గువాన్ తెలిపారు. అందరి ఆయువును నిలబెట్టే ఆక్సీజన్‌ను నదుల్లో నిలుపుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని శాస్త్రవేత్తలు హితబోధచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్
మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ముమ్మాటికీ ద్రోహులే
రాయ్‌బరేలీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముమ్మాటికీ ద్రోహులు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారంతా కలిసి భారత రాజ్యాంగంపై నిత్యం దాడి చేస్తున్నారని, దేశ ప్రయోజనాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ తన సొంత నియోజకర్గం రాయ్‌బరేలీలో రెండో రోజు బుధవారం కూడా పర్యటించారు. స్థానిక విప్లవవీరుడు ‘వీరా పాసీ’ సంస్మరణార్థం న్విహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీ ఇళ్లకు వచ్చి మోదీ, అమిత్ షాల గురించి మాట్లాడితే నిలబడి గట్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లు ద్రోహులేనని తేల్చిచెప్పాలని సూచించారు. రాజ్యాంగం, అంబేడ్కర్, గాం«దీజీలపై దాడి చేస్తూ దేశాన్ని అమ్మేస్తున్నవారు ద్రోహులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కుల గణన చేపట్టకుండా జాప్యం చేస్తూ, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ రాజ్యాంగంపై నిత్యం 20 గంటలూ దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. త్వరలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహారం సహా అన్నింటి ధరలు ఎగబాకుతాయని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఎరువుల ధరలు సైతం పెరగడం తథ్యమని అన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా సామాన్య ప్రజలే నష్టపోతారని, అంబానీ, అదానీలపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. అంబానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దాన్ని విదేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడని, ఆ సొమ్మును నరేంద్ర మోదీకి చేరవేస్తున్నాడని రాహుల్ ధ్వజమెత్తారు. రాబోయే సంక్షోభం నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడలేదని, దాని ప్రభావం రెండు మూడు నెలల్లో కనిపిస్తుందని అన్నారు. చమురు ధరల విషయంలో ప్రభుత్వం తప్పేమీ లేదని మోదీ అంటున్నారని ఆక్షేపించారు. కానీ, తప్పంతా మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లదని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రాహుల్ విమర్శించారు.‘అది నాయకత్వ లక్షణం కాదు.. గిమ్మిక్’ ప్రధాని మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలొనీకి మెలొడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడంపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందించారు. ‘అది నాయకత్వ లక్షణం కాదు.. ఉత్తి గిమ్మిక్’ అని తేల్చిచెప్పారు. ఒకవైపు పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని పట్టించుకోకుండా ఇటలీలో చాక్లెట్లు ఇస్తున్నారని మోదీపై మండిపడ్డారు. మన రైతులు, కార్మికులు, వ్యాపారులు కష్టాల్లో ఉంటే మోదీ మాత్రం నవ్వుతూ రీల్స్ చేస్తున్నారని, అది చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారని రాహుల్ విమర్శించారు. రాజకీయాల్లో ఆయన రాహువు బీజేపీ చీఫ్ నబీన్ మండిపాటున్యూఢిల్లీ: ప్రధాని మోదీ ద్రోహి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ మాటలు ఆయన అరాచక మనస్తత్వాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ధ్వజమెత్తారు. 140 కోట్ల మంది ప్రజలను దారుణంగా కించపర్చారని, రాహుల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బుధవారం డిమాండ్ చేశారు. భారత రాజకీయాల్లో రాహుల్ ఒక ‘రాహువు’అని ఆరోపించారు. ఆయన తన ఆలోచనా విధానంతో దేశ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండడంతో అది తట్టుకోలేక నిరాశ, అసంతృప్తికి గురై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని, మానసిక సమతుల్యత కోల్పోతున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు.
ఎన్ఆర్ఐ
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
క్రైమ్
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు.
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి
వరంగల్ లీగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు.
పోలీసుల అలసత్వమే ప్రాణం తీసిందా?
యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్‌కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్‌జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.పోలీసుల అలసత్వమేనా?ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్‌స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.ఫేమస్ అవుతున్న టైంలో.. పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్‌కి దగ్గరగా ఉండే స్టైల్‌తో పాటు పాప్ కల్చర్‌కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్‌గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.పంజాబ్‌లోనే ఎందుకిలా?ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్ఫీల్డ్ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..పంజాబ్‌లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్‌లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్‌స్టర్ కల్చర్‌తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
వీడియోలు
రంగాని అర్ధరాత్రి నరికి చంపారు.. నిందితుడు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే.!
అది తన కష్టం..! విజయ్ గెలుపుపై జగన్ రియాక్షన్
నువ్వు ఒకడిని కంటావ్.. నీ కొడుకు కూడా... పేదవాళ్ళు నలుగురిని కనాల
ప్రెస్ మీట్ మధ్యలో జగన్ కామెడీ.. పుష్ప శ్రీవాణితో బాబు మేనిఫెస్టో చదివించి..
అబ్బా కొడుకులిద్దరికి కలిపి చెప్తున్నా.. జగన్ స్ట్రాంగ్ రిప్లై
పెట్రోల్ ధరలపై లోకేష్ దొర అన్న మాటలు.. వీడియోలు ప్లే చేసి ఏకిపారేసిన జగన్
నందమూరి హరికృష్ణ శవం దగ్గర.. చంద్రబాబు పొత్తులు
జగన్ మంచోడు కనుకనే... ఈ రోజు మీరందరు బ్రతికున్నారు
ఢిల్లీకి పరుగులు.. అమిత్ షాతో పవన్ అర్జెంట్ మీటింగ్
బాలకృష్ణ గన్ తో ఇద్దరిని టపా..టపా అంటూ కాల్చితే.. బాబు శవ రాజకీయాలుపై జగన్ కౌంటర్


