టెక్కలి గర్భంలో అరుదైన ఖజానా! | iridium deposits in Tekkali | Sakshi
Sakshi News home page

టెక్కలి గర్భంలో అరుదైన ఖజానా!

May 21 2026 1:54 PM | Updated on May 21 2026 2:31 PM

iridium deposits in Tekkali

ఇన్నాళ్లూ అక్కడ భూ ఉపరితలంపై ఉన్న గ్రానైట్‌ కొండలనే చూసి మురిసిపోయాం. దాని ద్వారా కొద్దో గొప్పో ఆదాయం, ఉపాధి లభిస్తున్నందుకు సంతోషపడిపోతున్నాం. కానీ ఆ ప్రాంతం తన గర్భంలో దాచుకున్న అతి అరుదైన, విలువైన ఇరీడియం నిక్షేపాలు వెలికి తీస్తే టెక్కలి ప్రాంతాన్ని, తద్వారా జిల్లాను సంపన్నం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

 శ్రీకాకుళం జిల్లా: ఏపీలో అరుదైన నిక్షేపాలు ఉన్నాయని, వాటి ప్రాసెసింగ్‌ నిర్వహణతో దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం అందజేయవచ్చునని, దీని కోసం నేషనల్‌ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్‌ కింద సుమారు రూ.16,300 కోట్లను కేటాయిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించా రు. దీంతో టెక్కలి పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్‌ క్వారీల్లో అరుదైన నిక్షేపాల కోసం కొన్ని రకాల అంతర్జాతీయ బృందాలు శాటిలైట్‌ ద్వారా సర్వేలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. కొన్నేళ్ల కిందట ఇండో జర్మన్‌ బృందాలు ఇదే మాదిరిగా రహస్యంగా సర్వేలు చేయడం, ఇప్పుడు ఏపీలో రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ ప్రాజెక్టు కోసం కేంద్రం ప్రకటన చేయడంతో అప్పట్లో చేసిన శాటిలైట్‌ రహస్య సర్వేలు నిజమని తెలుస్తోంది. ఇప్పుడు ఐబీఎం, ఎన్‌ఎంసీ ఆధ్వర్యంలోనే విదేశీ బృందాలు శాటిలైట్‌ ద్వారా అరుదైన నిక్షేపాల కోసం టెక్కలి పరిసర ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నట్లు సమాచారం.  

గ్రానైట్‌కు అరుదైన గుర్తింపు 
టెక్కలి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్‌కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు గ్రానైట్‌ను ఎగుమతి చేస్తుంటా రు. అయితే ఇదే ప్రాంతంలో లభించే గ్రానైట్‌ ముడి సరుకును ప్రాసెసింగ్‌ చేసిన తర్వాత అద్భుతమైన విధంగా వివిధ రకాల ఆకృతులు రూపుదిద్దుకోవ డంపై విదేశీయులు మక్కువ చూపుతుంటారు. ఇదే టెక్కలి పరిసర ప్రాంతాల్లో రంగు రాళ్లు ఉన్నాయంటూ కొంత మంది రహస్యంగా క్వారీల్లో అన్వేషణ చేశారు. అంతే కాకుండా అరుదైన నిక్షేపాలు ఉన్నా యంటూ గత కొన్నేళ్ల క్రితం ఇండో జర్మన్‌ కంపెనీలు చేసిన సర్వేల్లో భాగంగా క్వారీల అంతర్భాగంలో అరుదైన ఇరీడియం నిక్షేపాలు ఉన్నట్లు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మాంగనీస్, థోరియం వంటి నిక్షేపాలను గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.  

జర్మనీ బృందం ఆధ్వర్యంలో..  
టెక్కలి పరిసరాల్లో కొద్దిరోజులుగా జర్మనీకి చెందిన ప్రత్యేక మైనింగ్‌ బృందాలు ఈ సర్వే నిర్వహించి నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సంస్థకు చెందిన డైటర్‌ సవాజ్, క్లాస్‌ మైకేల్‌ కూనేలు ఆధునిక క్రాఫ్ట్‌లు, అత్యాధునిక డ్రోన్‌ల సాయంతో ఈ సర్వేను రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌(ఐబీఎం), నేషనల్‌ మైనింగ్‌ కార్పొరేషన్ల సహకారంతోనే ఈ సర్వే జరిగినట్టు అనధికారిక సమాచారం. అయితే సర్వేల్లో భాగంగా ఇరీడియం, మాంగనీస్, థోరి యం వంటి నిక్షేపాలు ఉండవచ్చునని ఆశాభావం నిజమైతే గ్రానైట్‌ క్వారీ నిర్వాహకుల పంట పండుతుంది.  

ఖనిజాల వెలికితీత 
కేంద్రం ప్రకటించిన మేరకు ఏపీలో రేర్‌ ఎర్త్‌ మినరల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తే మరిన్ని అరుదైన నిక్షేపాల వెలికితీత జరుగుతుంది. ప్రధానంగా టెక్కలి పరిసర ప్రాంతాల్లో లభించే ఖనిజాలు, బీచ్‌ శాండ్‌ పరిశోధనలతో విలువైన ఖనిజ సంపద బయట పడే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ప్రాజెక్టు ఏర్పాటులో కేంద్రం ప్రకటించిన జాబితాలో శ్రీకాకుళం పేరు కూడా ఉండడంతో గ్రానైట్‌ వర్గాల్లో విస్తృ తమైన చర్చ కొనసాగుతోంది.    


 

Advertisement
 
Advertisement
Advertisement