breaking news
Pawan Kalyan
-
కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు
-
అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు
-
పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో
-
తెరవెనుక లోకేష్ వ్యూహం.. జనసేనకు మరోసారి షాక్!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. అయితే ఈ సీట్ల కేటాయింపుపై జనసేన పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాము ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కకపోవడంతో పాటు, కేటాయించిన స్థానాలపై జనసేన శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి.సగం కూడా ఇవ్వని టీడీపీస్థానిక ఎన్నికల్లో తమ పార్టీ బలానికి తగినట్లుగా ఎక్కువ స్థానాలు కేటాయించాలని జనసేన నాయకులు తొలుత గట్టిపట్టుపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 మున్సిపాలిటీలు కేటాయించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, జనసేన అడిగిన సీట్లలో కనీసం సగం కూడా కేటాయించలేదని తెలుస్తోంది. తుది సర్ధుబాటు ప్రకారం జనసేనకు కేవలం 21 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు మాత్రమే దక్కాయి.ఎన్నికలు లేని స్థానాల కేటాయింపుపై ఆగ్రహంకూటమిలో భాగంగా కేటాయించిన స్థానాలపై జనసేన కేడర్ మండిపడుతోంది. కేటాయించిన వాటిలో కొన్ని స్థానాలు ప్రస్తుతం ఎన్నికలు లేనివి లేదా నామమాత్రపు హోదా ఉన్నవేనని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు ఈ సీట్ల కేటాయింపు నిరాశ కలిగించిందని ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.పవన్ రాజీ ధోరణిపై కేడర్ నిరసనపొత్తు ధర్మం పేరుతో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజీ పడుతున్న తీరుపై జనసైనికులు సామాజిక మాధ్యమాల్లో తమ నిరసన గళం వినిపిస్తున్నారు. అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో పార్టీ భవిష్యత్తును దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటులో టీడీపీ తన పట్టు నిరూపించుకోగా, జనసేన కేడర్ మాత్రం తమ అంచనాలు తలకిందులవడంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?
-
పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి
-
నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్
-
ఇంతన్నాడు అంతన్నాడు 10% ముష్టికి బానిసయ్యాడు
-
సీట్ల లెక్కలపై జనసేనలో అసంతృప్తి.. పవన్ పై కార్యకర్తల ఆగ్రహం?
-
జనసేన బండారం మొత్తం బయటపెట్టిన MLA బొలిశెట్టి శ్రీనివాస్
-
చంద్రబాబు డబుల్ యాక్షన్.. విజయ్ ముందు పవన్ కు అవమానం
-
కూటమిలో సీట్ల హైడ్రామా.. బాబు Vs పవన్
-
మీ మాటే వేదం.. జనసేన క్యాడర్ కు పవన్ షాక్
-
జనసేన.. తగ్గేదేలే 2091 సీట్లు ఇవ్వాల్సిందే
-
కూటమిలో సీట్ల చిచ్చు.. నో కాంప్రమైజ్
-
పీఠాలపై పేచీ!
సాక్షి, అమరావతి: మునిసిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. సీట్ల లెక్కలు తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సోమవారం సమావేశమైనా ఎలాంటి స్పష్టత రాలేదు. కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ డుమ్మా కొట్టడం గమనార్హం. పొత్తు చర్చలు తాము ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడమే పవన్ గైర్హాజరుకు కారణమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.మేయర్, చైర్మన్ పీఠాలపై పేచీమునిసిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కోరుతున్న మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా లేకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. జనసేన ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఆ పార్టీ కోరుతున్న స్థానాలకు టీడీపీ ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పొత్తు చర్చలు కొలిక్కి రాకముందే రిజర్వేషన్లు ఎలా ప్రకటిస్తారని జనసేన నేతలు నిలదీస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షమంటూనే తమను లెక్కలోకి తీసుకోకుండా టీడీపీ పెత్తనం చెలాయిస్తోందన్న అసంతృప్తి జనసేన శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.భేటీ తర్వాత ఎవరి దారి వారిదేసమావేశం ముగిసిన తర్వాత కూటమి పార్టీ నేతలు ఎవరి దారి వారు పట్టడం చర్చనీయాంశమైంది. జనసేన, బీజేపీ నేతలు నేరుగా బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుతో విడిగా సమావేశమై మంతనాలు జరిపారు. సమావేశంలో ఏం జరిగిందన్న దానిపై మూడు పార్టీల నేతలు నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో పొత్తు చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.నెల్లూరు మేయర్ మాదేనంటూ హడావుడిచర్చలు ఇంకా తేలకముందే నెల్లూరు మేయర్ పీఠం బీజేపీకి ఖరారైందంటూ బీజేపీ నేతలు హడావుడి చేయడం గమనార్హం. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మౌనం వహించింది. టీడీపీ నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదు. సీట్ల పంపకమే తేలకుండా ఒక్కో పార్టీ ఒక్కో ప్రకటన చేయడం కూటమిలో సమన్వయ లోపానికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నేడు మళ్లీ భేటీప్రతిష్టంభన నేపథ్యంలో మంగళవారం మరోసారి సమావేశం కావాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి పవన్‌కళ్యాణ్ హాజరవుతారని చెబుతున్నారు. అయితే మేయర్, చైర్మన్ పీఠాలపై టీడీపీ పట్టు వీడకుంటే ఈ భేటీ కూడా ఫలితం లేకుండానే ముగిసే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. -
టీడీపీ వర్సెస్ జనసేన
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట వెన్నుపోటు పార్టీ కూటమిలో పెద్ద చిచ్చు రగిలింది. ఆదివారం పోలవరం జిల్లా కాకవాడలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో దాడి చేయగా.. ‘కూటమి ప్రభుత్వం మీ అయ్య జాగీరా’ అంటూ జనసేన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు ఊడిగం చేస్తున్నా ఇంతలా మాటలంటారా అంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మాభిమానం దెబ్బతినేలా మాటలంటున్నా ఇంకా కొనసాగాలా.. ఇదే కరెక్ట్ టైమ్ మనం బైటకు రావడానికి అని జనసైనికులు పోస్టులు పెడుతున్నారు.ప్రతి సారీ మనం ఎందుకు తగ్గాలి? రాజకీయంగా మనం కూడా ఎదగాలి కదా.. కాదూ కూడదంటే పొత్తుకు నమస్కారం పెట్టి ప్రతి చోటా అభ్యర్థులు ఉన్నారు.. పోటీ చేసి చూపిస్తారు.. అని రవితేజ పవనిజం పేరుతో ఓ జనసైనికుడు పోస్టు పెట్టాడు. ‘చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఆయనకు మద్దతుగా ఎవరూ రోడ్డుపైకి రాకపోతే, అప్పుడు జన సైనికులు, వీర మహిళలు రోడ్లపైకి వచ్చారు’ అంటూ పవన్ కాకవాడ సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో రెచ్చిపోయాయి. వాటిని జనసైనికులు తీవ్రస్థాయిలో కౌంటర్ చేస్తున్నారు. టీడీపీని ఉద్ధరించినట్టు మాట్లాడితే ఊరుకోం.. ‘‘వాళ్ల పార్టీకి సీట్లు కేటాయిస్తే అభ్యర్ధిని కూడా మనమే (టీడీపీ) సప్లయ్ చేయాల్సి వచ్చింది. వాళ్ల కార్యకర్తలకు తిండి పెట్టడానికి డబ్బులు లేవు.. మనల్నే అడుక్కున్నారు. వీళ్లు వచ్చేశారంట టీడీపీని కాపాడడానికి..’’ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ‘‘కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే, అది కుక్క బుద్ధి మాత్రమే చూపిస్తుంది. కుక్క నిజ స్వరూపం ఈ రోజు చూపించింది’’ అంటూ పరోక్షంగా పవన్‌పై ఓ కార్యకర్త చంద్రబాబు వీడియోను జత చేసి పోస్టు చేశారు. ‘‘పొత్తు పేరుతో మీరు నెత్తిన పెట్టుకుంటే పెట్టుకోండి కానీ తెలుగుదేశం కార్యకర్తల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఆ సన్నాసులు టీడీపీని ఉద్దరించినట్లు మాట్లాడితే ఊరుకునే చేతకాని దద్దమ్మలం కాదు మేం.. ఆ కులసేన అధినేతను కాస్త నోరు దగ్గరపెట్టుకుని మాట్లాడమని చెప్పండి..’’ అని మరో టీడీపీ కార్యకర్త ఘాటు పోస్టు పెట్టాడు. ‘‘ సొంతంగా రెండు చోట్ల ఎమ్మెల్యేగా గెలవలేక, సొంత కార్యకర్తల వల్లే రెండు చోట్ల ఓడిపోయా అని పిల్ల సైనిక్లను తిట్టిపోసిన ఆయన మాటకు విలువ ఉందా’’.. ఇదీ మరో కార్యకర్త ప్రశ్న.‘‘మీ నాయకులు మీ సైనికులు మీ వీర మహిళలు మీ వెనకే నిలబడలేదు. మా లీడర్ కోసం రోడ్డు ఎక్కారా పవన్ కళ్యాణ్‌గారూ’’ అని మరో కార్యకర్త నిలదీశాడు. ‘‘ఒక్క కేబినెట్ మీటింగ్‌కి రారు.. వీరు త్యాగాలు చేసేశారా... గోదావరి జిల్లాలు దాటితే పావలాకి పనికిరాడు వీరు త్యాగాలు చేశాడా.. ఒకర్ని అడుక్కునే స్టేజ్‌లో ఉన్న మీరు త్యాగాలు చేశారా..?’’ మరో టీడీపీ కార్యకర్త ప్రశ్న ఇది.పొత్తుపెట్టుకుని జనసేన గెలిచిందంటే ఊరుకోం టీడీపీ కార్యకర్తల పోస్టులపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. నేరుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర నాటక అకాడమీ సభ్యురాలు శివపార్వతి రంగంలోకి దిగారు. ‘ఎక్స్’లో వరుస పోస్టులతో టీడీపీపై విరుచుకుపడ్డారు. ‘కూటమి ప్రభుత్వం నీ అయ్యా జాగీరా? అన్ని పార్టీల భాగస్వామ్యంతో వచ్చిందది. ఎవడురా నన్ను మాట్లాడొద్దు అనేది.. మీ తొక్కలో రూల్స్ మడిచి పెట్టుకోండి’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా పార్టీ నాయకుడిని కానీ, మా పార్టీ గురించి కానీ ఇష్టం వచ్చినట్లు వాగితే మామూలుగా ఉండదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పవన్‌ను చూసి నవ్విన వాళ్ళే ఆయన సపోర్ట్ కోసం దేబిరించారు తప్ప ఆయన ఎవరినీ నాకు ఇది చేయండి అని అడగలేదన్నారు. ‘2014లో సపోర్ట్ చేస్తే అధికారం రాగానే పవన్ కళ్యాణ్ ఎవరు అని అన్నారు. అలా అన్నవాళ్లే 2019లో 23కే పరిమితమయ్యారు. లక్షల మంది కేడర్ పెట్టుకుని సంపాదించిన సీట్లు 23 జస్ట్ మాకన్నా 2 ఎక్కువ అంతే’ అని పేర్కొన్నారు. వెంట వెంటనే గెలిచిన చరిత్ర కూడా ఎక్కడా లేదు అని వ్యాఖ్యానించారు. జనసేనకి బలం లేదని, రెండు చోట్ల ఓడిపోయారని, పొత్తు పెట్టుకుని గెలిచారని అంటే ఊరుకొనేది లేదని జనసేన శ్రేణులు టీడీపీని హెచ్చరించాయి. పరోక్షంగా లోకేశ్ పైనా విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. ‘టీడీపీ వాళ్లు చేసే అతికి జనసేన వాళ్ళు ఎవరైనా గట్టిగా స్పందిస్తే కేసులు పెట్టించి, వాళ్ళ మీద కోవర్ట్ ముద్ర వేస్తున్నారు. పైకి కూటమి స్ఫూర్తి, పొత్తు ధర్మం అని కథలు చెప్తారు’ అంటూ పేర్కొన్నారు. -
‘పవన్ చెప్పేది ఏంది బోడి..’ తెలుగు తమ్ముళ్ల సెటైర్లు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో జనసైనికులు రోడ్లపైకి వచ్చి మద్దతుగా నిలిచారని, అందుకే స్థానిక ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ‘చంద్రబాబు అరెస్టు సమయంలో మేమేం చేయలేదా?’ అని తెలుగు తమ్ముళ్లు పవన్‌ను నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్టయిన సమయంలో తాము కూడా నిరసనలు తెలిపామని, అసలు ఆయన్ని అరెస్ట్ చేసే సమయంలోనే అల్లర్లు సృష్టించి అడ్డుకునే ప్రయత్నాలు సైతం చేశామని.. అందుకే అప్పటి ప్రభుత్వం భారీ భద్రత మధ్య తరలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆఖరికి.. పొరుగు రాష్ట్రంలోనూ నిరసనలు నిర్వహించిన సంగతి పవన్‌కి గుర్తు లేదేమోనని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. తాము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమని, అధినేత విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అదే సమయంలో పవన్ చంద్రబాబు కోసం ఆనాడు అర్ధరాత్రి రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేయలేదని.. ఆనాడు మంగళగిరి ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలోనే అది జరిగిందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ పాత జనసేన ట్వీట్లను తెరపైకి తెచ్చారు.మా వల్లే 21 స్థానాలు..!గత ఎన్నికల్లో జనసేన సాధించిన విజయాలపైనా టీడీపీ మాములు సెటైర్లు వేయడం లేదు. కూటమి విజయంలో తమ పార్టీ కేడర్ చేసిన కృషే ఎక్కువని, అసలు 21 సీట్లు కూడా ఇవ్వడం ఎక్కువేనని.. తమ జోక్యం లేకుండా అన్ని సీట్లు గెలిచేది కాదని కొన్ని పేజీలు, కొందరు టీడీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేసి(తాము లేకపోవడం వల్లే) ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని గుర్తు చేస్తున్నారు. @Telugu360 @PawanKalyan @JanaSenaParty ఏం త్యాగం చేసారు రా?? ప్రశాంత్ కిషోర్ పొత్తు వద్దు ఒంటరిగా పోటీ చేయండి అంటే... అరెస్ట్ చేసినప్పుడు నువ్వు వచ్చి రోడ్ మీద పోడుకున్నావు అని పొత్తుకి సరే అన్నారు.. అంతకు మించి పదవులు ఇచ్చారు. @JaiTDP లేకపోతే mla కే దిక్కు లేదు ఎప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా @PawanKalyan https://t.co/6iusmGJuiN— SreenuTalks (@Sreenutalks9) October 11, 2026స్థానిక ఎన్నికల వేళ లొల్లి తప్పదా?రాష్ట్రస్థాయి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు చిచ్చు పెట్టొచ్చనే ఊహాగానాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్, పీవీఎన్ మాధవ్‌లు పదే పదే భేటీ అవుతుండడం.. ఒక ఒప్పందానికి రాలేకపోతున్నారనే వాదనను మరింత బలపరుస్తోంది. దీనికి తోడు బలం ఉన్న చోట్ల ఒంటరిగా పోటీ చేసి తీరతామని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఇప్పుడు అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే తరహా కామెంట్లు చేయడం.. ఈ క్రమంలో తామే ఎక్కువ త్యాగాలు చేసినట్లు మాట్లాడడం.. తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం సహించడం లేదు. స్థానిక ఎన్నికల హడావుడి పెరిగే కొద్దీ కూటమిలో సీట్ల లెక్కలతో పాటు ఈ రాజకీయ మాటల యుద్ధం కూడా వేడెక్కే అవకాశముంది. ఈ తరుణంలో.. జనసేనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న పవన్ డిమాండ్‌ను, ఇప్పుడు టీడీపీ కేడర్ జనసేనపై చేస్తున్న ట్రోలింగ్‌ను చంద్రబాబు సీరియస్‌గా తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.Tweets delete chey ra pichi na kodka @JanaSenaParty 🤦 https://t.co/pVGlLAMrsq— Balaa (@BalaaOnX) October 11, 2026 ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలి -
కూటమిలో జనసేనకు సమాన గౌరవం కావాలి! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
స్థానిక ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలి: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ, బీజేపీలతో పాటు జనసేనకు కూడా సమాన ప్రాధాన్యత దక్కాలని పేర్కొన్నారు. రంపచోడవరం మండలం కాకవాడి గండిలో నిర్వహించిన ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.2014లో కూటమికి మద్దతు ఇచ్చినప్పటికీ తాను ఎలాంటి పదవీ తీసుకోలేదని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కూటమిలోని మూడు పార్టీలకు సమాన ప్రాధాన్యత ఉండాలని స్పష్టం చేశారు.చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచిన సమయంలో జనసైనికులు రోడ్లపైకి వచ్చి ధైర్యం, భరోసా ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ సమయంలో మరెవరూ బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. దీంతో స్థానిక ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: బాబు సర్కార్ నిర్వాకం.. రైతుకు శాపం -
ఆకాశం నుంచి దిగొచ్చాడని 90 వేల ఓట్లు మెజారిటీ వచ్చిందనుకుంటున్నావా..
-
జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో
-
దమ్ముంటే రాయలసీమ ప్రాజెక్ట్ కట్టు, అబద్దాలలో బాబు, పవన్ పోటీ పడుతున్నారు
-
మొత్తం డొల్ల.. 2 కోట్లతో పిఠాపురంలో రోడ్లు.. పవన్ బండారం మొత్తం బయటపెట్టిన సాక్షి
-
SIR దెబ్బతో బాబు, పవన్ లో టెన్షన్.. EVMల మాయాజాలం.. AP ఎన్నికలు చెల్లవు!
-
చంద్రబాబు, పవన్ భేటీ
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఏ ప్రాతిపదికన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను పంచుకోవాలో చర్చించినట్లు సమాచారం. విశాఖ, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్లలో ఎవరు పోటీ చేయాలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.తిరుపతి అసెంబ్లీ జనసేన చేతిలో ఉండడంతో ఆ కార్పొరేషన్‌ను కూడా అదే పార్టీకి కేటాయించాలా లేక వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అనే విషయంపై మంతనాలు జరిపినట్లు సమాచారం. తాము కోరుకుంటున్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీల జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రెండు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో విభేదాలు పెరుగుతుండడం, స్థానిక ఎన్నికల్లో అవి ఇంకా ముదిరి గొడవలు జరిగే ఆస్కారం ఉండడంతో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపైనా సమాలోచనలు చేసినట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కొంత ఇబ్బంది నెలకొన్నట్లు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్లడంతో కూటమి వ్యూహం బయటపడిపోయిందని, దాన్ని సరిదిద్దుకునేందుకు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. -
వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియవనుకున్నారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజంగానే అధికంగా అసత్యాలు చెబుతారన్న నానుడి ఉంది. వాటితో పాటు కొన్ని చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో పలచన అవుతున్నారన్న భావనకు అవకాశం ఇస్తున్నారు. పల్లె పండగ పేరుతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఒక సభ జరిగింది. అది నిజంగా పల్లె పండగ అవుతుందా, లేదా? అన్నది పక్కనబెడితే ఎవరు ఏ కాస్త అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినా మంచిదే. కాకపోతే గతంలో ఏమీ జరగనట్లు, ఇప్పుడే అన్ని జరుగుతున్నట్లు కలరింగ్ ఇస్తే సరిపోతుందా? మొత్తం వాగ్దానాలన్నీ నెరవేర్చేసినట్లు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేసినట్లు స్పీచ్‌లు ఇస్తే వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియకుండా పోతుందా? ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉపాధి అంతంత మాత్రంగానే ఉండడం తదితర అనేక సమస్యలతో గ్రామీణాంధ్ర కొట్టుమిట్టాడుతోంది.ముందుగా ఆయన చేసిన చిత్రమైన వ్యాఖ్యలు చూద్దాం. ఏపిలో ఎల్‌నినో ప్రభావం ఉందని చెబుతూనే తాము ప్రార్దన చేయడం వల్లే వరుణ దేవుడు కరుణించి విశాఖలో 27 సెంటిమీటర్ల వర్షం కురిపించాడట. వర్షాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటే వచ్చే చిక్కేమిటన్నది ఆయనకు అవసరం లేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అది మాట్లాడేసి జనాన్ని నమ్మించే యత్నం చేయడం ఆయనకు అలవాటే. బంగళాఖాతంలో వాయుగుండం వల్ల ఇటీవల ఉత్తరాంధ్రలో వర్షాలు పడ్డాయి. దానివల్ల రైతులకు కొంత మేలు, మరికొంత నష్టం జరిగింది. దానిని పక్కనబెడితే కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు విశాఖలో తాగు నీటి సమస్య ఉందని, ఈ ఏడాది తాము ఏమీ చేయలేమని, వచ్చే ఏడాదికి తీర్చుతామని చెప్పారు. దాంతో విశాఖ ప్రజలు తమ ఖర్మ ఇంతేనా అని సరిపెట్టుకున్నారు. అప్పుడే ఆ మాట చెప్పకుండా తాను ప్రార్దన చేయబోతున్నానని, వర్షాలు పడబోతున్నాయని చెప్పి ఉంటే.. వర్షాలు పడిన వెంటనే టీడీపీ మీడియా ఇక చంద్రబాబుకు దైవశక్తులు ఉన్నాయని ఊదరగొట్టేసి ఉండేదేమో! కాని అప్పటికి కరువు గురించే మాట్లాడారు.కరువుకు క్రెడిట్ తీసుకోరా?చంద్రబాబు ఒక్క విశాఖ గురించే ప్రార్దన చేశారా? లేక రాష్ట్రం అంతటా వర్షాలు పడాలని ప్రార్దించారా అన్నది పలువురి ప్రశ్న. చంద్రబాబు చెప్పేది నిజమే అయితే రాయలసీమలో వర్షాలు పడాలని ఎందుకు ప్రార్దనలు చేయలేదని వారు అడుగుతున్నారు. పలు చోట్ల చీని తోటలు ఎండిపోయాయి. వర్షాలు లేక పంటలే వేయలేకపోయారు. నెలల తరబడి కృష్ణా డెల్టాలో సరిపడా వర్షాలు లేక శివారు భూములకు నీరు సరిగా అందలేదు. ఆ సమయంలో చంద్రబాబు ఈ ప్రార్ధనలేవో చేసి వర్షాలు తెప్పించి ఉండాలి కదా! అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ఇలా వర్షాలకు క్రెడిట్ తీసుకుంటే కరువుకు కూడా బాధ్యత వహించాలి అన్న సంగతి తెలియదా! ఈ నేపధ్యంలోనే చంద్రబాబు పాలనలో ఆయా సంవత్సరాలలో వచ్చిన కరువులను ప్రస్తావించి ఆ సమస్యను ప్రత్యర్దులు ఆయన ఖాతాలో వేస్తుంటారు.చంద్రబాబు ఈ స్పీచ్ ఇచ్చిన రోజే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపి, తెలంగాణలలోని కొన్ని ప్రాంతాలు కరువు పీడితంగా ఉన్నాయని ఢిల్లీలో తెలిపారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఏదో తాత్కాలిక రాజకీయం కోసం జనాన్ని సెంటిమెంట్ రాజకీయాలతో మభ్య పెట్టే బదులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడితే బాగుంటుంది. అందులోను ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యలతో ప్రజలలో పలచన అవవడం మంచిదా! ఎల్లో మీడియా కూడా ఈ వ్యాఖ్యలను ప్రచురిస్తే చంద్రబాబుకు నష్టం వస్తుందని అనుకున్నదేమో కాని, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది.ఇలాంటి మాటలు చెబితే ఎలా! ఇక 22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. గతంలో డావోస్ వెళ్లిన సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడితే అది జాతీయ మీడియాలో సైతం వైరల్ అయింది. ప్రసంగంలో పొరపాటు దొర్లితే సరిచేసుకోవచ్చు. కాని ఒకటికి రెండుసార్లు అవే తప్పులు చెబితే ప్రజలకు భిన్నమైన సంకేతం వెళుతుంది. పైగా 22 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ పచ్చి అబద్దాలను చెబితే జనం చెవిలో పూలు పెట్టడం కాదా! నిరుద్యోగ భృతి ఎగవేయడం కోసం ఇలాంటి మాటలు చెబితే ఎలా! పది లక్షల కోట్ల అప్పు తాము అధికారంలోకి వచ్చేనాటికి ఉందని మరో అబద్దం చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకున్నా, అందులో ఆయన ఏడేళ్ల పాలనలో ఎంత అప్పు చేసింది, జగన్ ఐదేళ్లలో ఎంత అప్పు అయింది వివరించకుండా, మొత్తం జగన్ ఖాతాలో వేయడంలోని దురుద్దేశాన్ని సామాన్యులు పసికట్టకపోవచ్చేమో కాని, బుద్ది జీవులు కనిపెట్టలేరా!ఆ పని ఎప్పటికి చేయలేరుకూటమి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిందట. టీడీపీ, జనసేన ఉమ్మడి మానిఫెస్టో కాపీని దగ్గరపెట్టుకుని వరసగా ఇచ్చిన హామీలు చదువుతూ ఈ మాట చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఉంటే ఒప్పుకోవచ్చు. కాని ఆ పని ఎప్పటికి వారు చేయలేరు. ఎందుకంటే ప్రజలను తాము మోసం చేస్తున్నామని వారికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా తన వంతు అసత్యాలు చెప్పారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో 880 కి.మీ.రోడ్లే వేశారని ఆయన అంటున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వం 7600 కిలోమీటర్ల రోడ్డు వేసిందని వైఎస్సార్సీపీ నేతలు జవాబు ఇస్తున్నారు.పవన్ ముద్ర కనబడుతోందట!అలాగే గ్రామాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి సంస్కరణలు తెచ్చి గ్రామాలకు అభివృద్ది రూపం ఇచ్చిన ఘనత జగన్ ది కాదనగలరా? బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తన ఉపన్యాసంలో గ్రామ సచివాలయాల ప్రస్తావన తెచ్చారు. అవి ఎవరి టైమ్‌లో వచ్చింది తెలియదా!. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు భలే పొగుడుకున్నారు. చంద్రబాబు తన స్పీచ్‌లో పల్లె వికాసంలో పవన్ కళ్యాణ్ ముద్ర కనబడుతోందని చెబుతున్నారు. పవన్ ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ది చేస్తున్నారట. లక్షకు పైగా పంట కుంటలు, పశువుల షెడ్లు, నీటి తొట్టెలు నిర్మించారట. పల్లెకు ఆయన హుషారుతో పట్టాభిషేకం చేస్తున్నారట.ఇదీ చదవండి: బాబు 'బీసీ' బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్‌ఫ్లాప్! ఇక పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబులో అద్బుతమైన ఆర్ధిక ప్రణాళిక ఉందని అంటున్నారు. సీఎంతో సహకారం అందిస్తున్నారని ఆయన అన్నారు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం అని చెప్పాలి. బాగా పనిచేస్తే దండ వేస్తామని, లేకుంటే దండిస్తామని చెప్పడం ద్వారా వారికి వార్నింగ్ ఇచ్చారన్నమాట. మరి కూటమి ఎన్నికల హామీల మాటేమిటని మాత్రం ఎవరూ అడగకూడదన్నమాట. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె పండగను కాంట్రాక్టర్ల పండుగగా అభివర్ణించారు. పాలకుల విధానాలే పల్లెలకు శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా పట్టాభిషేకం వంటి సినిమా డైలాగులు కాకుండా నిజంగా గ్రామాలకు మేలు చేస్తే ఎవరైనా సంతోషిస్తారు.- కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ నోటా.. అబద్దాల ముఠా అంత ఫేక్...! బయటపడ్డ కూటమి ప్లాన్
-
పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ రోడ్డున పడేసారు
-
నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదని ఆయన చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే పని చేస్తున్నానని ఆయన అన్నారని ఎల్లో మీడియా అత్యంత ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ఇండియా టుడే మీడియా కేరళంలో నిర్వహించిన ఒక సదస్సులో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.నిజంగా ఆయన అదే ప్రకారం పనిచేస్తే మంచిదే. కాని ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాలలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిలో లేరన్న మాట మినహాయించి, ప్రభుత్వంలో లోకేష్‌కు తెలియకుండా ఏమి జరగవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఇది ఏమైనా మంచి పనుల కోసం అయితే ఫర్వాలేదు. పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని రెడ్‌బుక్ పేరుతో ఏపీలో సాగుతున్న అరాచకాలన్నిటికి ఆయనే బాధ్యుడున్న విమర్శ వైఎస్సార్సీపీతో సహా వివిధ సంఘాలు చేస్తుంటాయి. ఇందులో చాలావరకు నిజం ఉందనిపించేలా ఆయన పార్టీ సమావేశాలలో వైఎస్సార్సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టించడం గురించి రెడ్‌బుక్ పేజీలు అంటూ ప్రసంగిస్తుంటారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని రెచ్చగొట్టేవారు. అధికారంలోకి వచ్చాక టీడీపీవారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయించే పనిలో ఉన్నారు. ఎక్కడైనా అలా ఎత్తివేయకపోతే డీజీపీని పంపిస్తానని ముఖ్యమంత్రి మాదిరే ప్రకటనలు చేశారు. నిజానికి ఇదంతా సీఎం లేదా, హోం మంత్రి పరిధిలో ఉండే విషయం. అయినా పెత్తనం అంతా లోకేష్‌దే అన్నమాట.ఇక పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఎక్కడ ఉంటారో తెలియదు. కాని మొత్తం ఆ పరిశ్రమకు సంబంధించిన అంశాలన్నిటిపైన నిర్ణయాలు ఈయనే ప్రకటిస్తుంటారు. విదేశాలకు టూర్లు వెళుతుంటారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లినా పారిశ్రామికవేత్తలతో తాను చర్చలు జరుపుతానని ఆయనే ఈ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 99 పైసలకే పరిశ్రమలకు భూములు ఇస్తా.. తన ఇష్టం అన్నట్లుగా కొంతకాలం క్రితం ఆయన మాట్లాడారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా అదే పరిస్థితి. లోకేష్ పేషీకి తెలియకుండా బిల్లులు పాస్ అవడం అరుదని చెబుతున్నారు.గత టరమ్‌లో టీడీపీ ప్రభుత్వంలో చెట్టు-నీరు స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేల కోట్ల అవినీతి టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది. దాని ప్రకారం కొందరి బిల్లులు నిలిచిపోయాయి. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటున్నారట. లోకేష్ ఏ బిల్లుల గురించి చెప్పారో కాని, ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తాము ఇప్పటికే చాలావరకు బిల్లులు క్లియర్ చేశామని, మరో 200 కోట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో ఆర్దిక మంత్రి ప్రస్తావనను తెచ్చినప్పటికి అది నామమాత్రమే అన్నది తెలుస్తూనే ఉంది.ప్రభుత్వ విషయాలలోనే కాదు.. పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి హోదాలో కూడా ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు 15 శాతం సీట్లే ఇస్తామని స్పష్టం చేసింది కూడా ఆయనే. ఒకవైపు పార్టీపరంగా సమావేశాలు నిర్వహిస్తూ, మరో వైపు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ, ఇంకో వైపు తన ఇమేజీని పెంచుకోవడం కోసం ఎల్లో మీడియాను, ఐటీడీపీ తదితర సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.సాధారణంగా దేశస్థాయిలో జరిగే సదస్సులకు చంద్రబాబే వెళుతుండేవారు. కాని ఈ మధ్యకాలంలో ఢిల్లీ, లేదా ముంబై తదితర నగరాలలో జాతీయ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు లోకేషే హాజరవుతున్నారు. ఆయా సభలలో లోకేష్, చంద్రబాబులు పరస్పరం పొగుడుకోవడం, తండ్రికి బహిరంగ కార్యక్రమాలలో పాదాభివందనం చేస్తున్న ఘట్టాలు అందరు గమనిస్తున్నవే. ఇదంతా పీఆర్లో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు.ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?కాగా, డీఎస్సీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు యధా ప్రకారం తండ్రి మాదిరి అసత్యాలు చెప్పడానికి ఆయన పెద్దగా ఫీల్ అవలేదు. ఎన్నికల కమిషన్‌పై వచ్చిన విమర్శలకు కూడా ఆయన ఇచ్చిన జవాబు తన తండ్రికే వర్తిస్తుందన్న సంగతి ఆయన గమనించనట్లే వ్యవహరించారు. గతంలో ఓటమి ఎదురైనప్పుడు ఈసీపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసింది తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే తనకు సీఎం పదవి ఇప్పుడు ప్రాధాన్యం కాదని ఆయన చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే సీఎం పదవిలో లేరన్నమాటే కాని, మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోనే ఉందని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆఫీస్ వద్దే జనం ఎక్కువగా కనిపిస్తారట.2014 టరమ్‌లో లోకేష్ ఎన్నికలలో పోటీచేయలేదు. కాని పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలానికి చంద్రబాబుపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత మంత్రిగా చేయించారని అంటారు. అప్పట్లో షాడో ముఖ్యమంత్రి అన్న విమర్శ రాలేదు. ఆ తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి జనంలో తిరగడానికి కృషి చేశారు. వాటిలో యువగళం ఒకటి.2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు ప్రధానంగా పర్యటనలు, ఉపన్యాసాలకే పరిమితం అవుతుంటే, లోకేష్ కథ నడుపుతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా చంద్రబాబుతో దాదాపు సమానంగా సానుకూల కథనాలు అనండి.. భజన స్టోరీలు అనండి.. నిత్యం ఇస్తుంటాయి. లోకేష్‌ను సీఎం చేయాలన్న వాదన కుటుంబంలోను, ఆయన మద్దతుదారులలో బలంగా ఉన్నప్పటికి, వివిధ కారణాల రీత్యా అది జరగడం లేదన్న అభిప్రాయం ఉంది.ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేయవలసి ఉందని అంటారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ సంభోధించడమే కాక, సభలలో వారిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నిస్తున్నారు. పవన్ ఈయనను ఓరే అన్నంత చనువు ఉన్నంతగా ఆ మధ్య చెప్పారు. కాని పవన్ అసలు ఎవరిని ఓరేయ్, అరేయ్ అనరని ఆయన మద్దతుదారులు చెబుతూ లోకేష్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది వేరే కథ. బహుశా తను సీఎం పదవి తీసుకున్నా పవన్ సహకారం అవసరమన్న భావనతో ఆయనతో సలహా, సంప్రదింపులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కల్పించడం లోకేష్ లక్ష్యం కావచ్చు. కాని, పవన్‌కు తెలియకుండానే ప్రభుత్వంలోని అనేక విషయాలు జరుగుతుంటాయి. డీఎస్సీకి అక్రమాల ఆరోపణలపై పవన్ ఇంతవరకు ప్రత్యక్షంగా లోకేష్‌కు మద్దతుగా ఖండన ఇవ్వకపోవడం కూడా గమనించదగిందే.ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలి. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిని రెండేళ్లపాటు పవన్ కళ్యాణ్‌కు కూడా ఇవ్వాలని జనసేనలో కొందరు ప్రచారం చేశారు. కాని మొహమాటం లేకుండా అది కుదిరే పని కాదని లోకేష్ మీడియా ముందు ఆ రోజుల్లోనే కుండబద్దలు కొట్టారు. బహుశా ఆ అవకాశం పవన్‌కు వస్తే తన భవిష్యత్తుకు అడ్డంకి అవుతుందని అనుకొని ఉండవచ్చు. అంతేకాక పవన్‌కు డిప్యూటి సీఎం పదవిపై కూడా టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ కాకుండా సర్దుకుపోయారు. ఇప్పుడు పవన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో బయటపడడం లేదు. లోకేష్ తనకు సీఎం పదవి ప్రాధాన్యం కాదని అన్నారే తప్ప, ఈ టరమ్ అంతా చంద్రబాబే సీఎంగా ఉంటారని, వచ్చే ఎన్నికలలో సీఎం అభ్యర్ధి కూడా ఆయనే అని లోకేష్ స్పష్టంగా చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.2029 ఎన్నికలలో లోకేష్‌నే సీఎం అభ్యర్ధిగా ఫోకస్ చేస్తారా? లేదా? అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలం క్రితం లోకేష్ సీఎం కాబోతున్నారంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కాని అది జరగలేదు. ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలలో ఒక వైఎస్ జగన్ తప్ప మరే సీఎం కుమారుడు, లేదా కుమార్తె ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం కోసం లోకేష్ ఎదురుచూస్తుండవచ్చు.1986 ప్రాంతంలో ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను వారసుడుగా ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకుని వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరింప చేశారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కాని ఆ తర్వాత అతనిలో ఉన్న పొటెన్షియాల్టిని గమనించి, లోకేష్ భవిష్యత్తుకు ఆటంకం అవుతాడని సందేహించి ఆయనను పక్కన పెట్టేశారని చెబుతారు. ఒకప్పుడు ఎన్టీఆర్ వద్ద కర్షక పరిషత్ చైర్మన్‌గా ఉంటూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు లోకేష్ ఆ పాత్ర పోషిస్తున్నారు.లోకేష్ తన కుమారుడు కనుక వారసత్వ, కుటుంబ రాజకీయాల సమస్య, విమర్శలు రావని చంద్రబాబు భావిస్తుండవచ్చు. అందుకే పార్టీలోను, ప్రజలలోను లోకేష్ పట్ల సానుకూలత పెంచేందుకు వివిధ ప్లాన్లు అమలు చేసున్నారనుకోవచ్చు. కాలచక్రం అలా ఉంటుందన్నమాట. కాకపోతే లోకేష్ పాజిటివ్ కోణం కన్నా, నెగిటివ్ ధోరణిలోనే ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లోకేష్ కోరిక ఈ టరమ్‌లో తీరుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే. మనసులో ఎంత బలమైన కోర్కె ఉన్నా కొంత కాలం అణచుకోక తప్పదు కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రముఖుల నివాళి.. ఆలోచనల్లో యువకుడు
‘కాలానికి ముందే ఆలోచించిన వ్యక్తి, ఆలోచనల్లో ఆయన యువకుడు, సింగీతంగారు చూపిన మార్గం రాబోయే తరాలకు స్ఫూర్తి, ఆయనొక దిగ్గజ దర్శకుడు, ఇది ఒక అసాధారణ అధ్యాయానికి ముగింపు’’ అంటూ పలువురు చిత్రరంగ ప్రముఖులు లెజెండరీ డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శనివారం రాత్రి సింగీతం శ్రీనివాసరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు ఈ విధంగా స్పందించారు.⇒ సింగీతంగారు తాను ఆశించినట్లే తనలోని యవ్వనం (ఆలోచనల రీత్యా) తోనే తుది శ్వాస విడిచారు. ఆయనలోని ఆ యవ్వనం చాలామందికి ఉండదు. ఆ లక్షణం అబ్బాలని ఆయన చేయి పట్టుకుని నడిచిన స్నేహితులు, శిష్యుల్లో నేనూ ఉన్నాను. సింగీతంగారిని కలిసినప్పట్నుంచి ఆయన్ను ఆరాధిస్తున్నాను. ఇప్పుడు ఆయనలా జీవించాలని ఆశిస్తున్నాను. – కమల్‌హాసన్⇒ కొత్త ఆలోచనలను అన్వేషించడంలో సింగీతంగారికి ఉన్న ధైర్యం, అద్భుతమైన ఊహాశక్తి భారతీయ సినిమాకు ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను అందించాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సింగ్ గీతం’ సినిమా కథల పట్ల ఆయనకు ఉన్న అంతులేని తపనకు అద్భుతమైన నిదర్శనం. వయసు పైబడినా ఆయన మనసులో యువకుడే. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత, ఏదైనా సృష్టించాలనే ఉత్సాహం ఆయనలో ఎప్పుడూ ఉండేవి. – చిరంజీవి⇒ భారతీయ సినిమాకే ఒక కొత్త ముద్ర వేసిన ‘ఆదిత్య 369, తెలుగులో మొట్టమొదటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆధారిత చిత్రమై, బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించి, జానపద చిత్రాలలో ఇప్పటికీ తిరుగులేనిదిగా నిలిచిన ‘భైరవ ద్వీపం’, ΄పౌరాణిక చిత్రం ‘శ్రీ కృష్ణార్జున విజయం’.... ఈ మూడు చిత్రాల్లో ఒకే దర్శకుడితో నేను సాంఘిక, చారిత్రక, జానపద, ΄పౌరాణిక అనే నాలుగు ప్రధాన జానర్లలోని పాత్రలను పోషించాను. – బాలకృష్ణ⇒ 94 ఏళ్ల వయసులో కూడా సినిమాల పట్ల నిత్యయవ్వనంతో కూడిన ఆలోచనలు ఉన్న వ్యక్తి సింగీతంగారు. మీకున్న అంకితభావమే మీ గొప్ప వారసత్వం. – రవితేజ⇒ ‘పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, ‘మైకేల్ మదన కామరాజు’ లాంటి చిత్రాల్లో సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన రూ పొందించిన ‘అమెరికా అమ్మాయి, పంతులమ్మ’ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేసింది. – పవన్ కల్యాణ్ ⇒ ప్రియమైన సింగీతంగారు... మీరు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. – నాగార్జున⇒ సినిమాని విభిన్న కోణాల్లో చూపించవచ్చని నమ్మిన అరుదైన దర్శకుడు సింగీతంగారు. ఆయన మరణం తెలుగు సినిమా చరిత్రలో ఒక అసాధారణ అధ్యాయానికి ముగింపు. – వెంకటేశ్⇒ సింగీతం శ్రీనివాసరావుగారు ఒక లెజెండ్. అద్భుతమైన ఊహాశక్తి, ధైర్యం, ప్రతిభ కలిగిన దర్శకుడు. భారతీయ సినిమా ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది. – మహేశ్‌బాబు⇒ ‘ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి’... ఇలా కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు సింగీతం శ్రీనివాసరావుగారు. – ఎన్టీఆర్⇒ మన దేశం చూసిన అత్యంత ప్రత్యేకమైన సినీ దర్శకుల్లో సింగీతంగారు ఒకరు. ఆయన సృజనాత్మకతను ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పని, ఆయన చూపిన దార్శనికత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. – అల్లు అర్జున్⇒ సింగీతం శ్రీనివాసరావుగారు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ, ఏ ఒక్క జానర్ లేదా ఫార్ములాకు తనను తాను పరిమితం చేసుకోలేదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక పాఠ్యపుస్తకం వంటిది. తమ సినిమాల మాయాజాలంతో నన్ను ప్రేమలో పడేలా చేసిన దర్శకుల్లో ఒకరిగా ఆయన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. – మంచు విష్ణు⇒ గొప్పవాళ్లలోనే గొప్పవారైన ఒకరు వెళ్లిపోయారు. ఒక అసాధరణ జీవితం గడిపి, తన మేధస్సుతో మనల్ని ఆశీర్వదించిన గొప్ప బాలుడు ఆయన. ఫోన్ చేసినా, మేసేజ్ చేసినా... 94 సంవత్సరాల వయసులో కూడా తాను చేయబోయే సినిమాలను గురించిన ఆలోచనతోనే మాట్లాడేవారు. ఆ వయసులో ఆ ఉత్సాహం, ఉత్సుకత అద్భుతం. ఆయన శకంలో నేనూ ఉన్నందుకు గర్వపడుతున్నాను. – నాని ⇒ సింగీతం సార్... మీ నమ్మకాలు, ఆలోచనలు, మీ కథలు మాతో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ‘పెళ్ళి చూపులు’ సినిమా విడుదలైనప్పట్నుంచి మీరు నాపై చూపిన ప్రేమ, ఆ ప్యాయతలను మర్చిపోలేను. మీ విజన్‌లో నుంచి వచ్చిన ‘సింగ్ గీతం’లో నేను భాగం అయినందుకు సంతోషంగా ఫీలయ్యాను. – విజయ్ దేవరకొండ⇒ సాంకేతిక సాధనాలు, సరైన బడ్జెట్లు లేని సమయాల్లోనే తన చుట్టూ ఉన్న వారందరికంటే పెద్ద కలలు కనే ధైర్యం చేసిన వ్యక్తి సింగీతం శ్రీనివాసరావుగారు. సింగిల్ డైలాగ్ లేకుండా సినిమా తీశారు. మనల్ని కాలంతో ప్రయాణించేలా చేశారు. కామెడీ నుంచి ఫ్యాంటసీ నుంచి హ్యూమన్ డ్రామా వరకు... జానర్ల మధ్య ఎలాంటి గీతా లేదని చె΄్పారు. సినిమాకు ఉన్న ఏకైక నిజమైన పరిమితి ఊహ మాత్రమేనని ఆయన మా తరానికి చూపించారు. – రాజమౌళి⇒ కళాఖండాలను రూ పొందించినా, నిరాడంబరుడిగానే చివరి వరకూ మసలిన దార్శనిక ముని సింగీతం శ్రీనివాసరావుగారు. ఒక ప్పుడు ఆయనతో సినిమా చేద్దామనుకున్నా కథ కలిసి రాలేదు. కానీ నా కల ఆగిపోలేదు. ’సింగ్ గీతం’ రూపంలో వైజయంతి పతాకం మీద శాశ్వతంగా వెలుగుతూనే ఉంటుంది. మరణం లేని మహనీయుడు. – అశ్వినీదత్⇒ సింగీతం శ్రీనివాసరావుగారు తీసిన ప్రతి సినిమా ప్రయోగాత్మకమే. ఆయన పద్మభూషణ్ పురస్కారానికి అర్హులు. పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేయాలని ఎన్నోసార్లు ఆయన్ను కోరాము. ప్రయోగాత్మక చిత్రాలు తీసిన సింగీతం వంటి దర్శకుడికి సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సింగీతం పేరును పద్మ అవార్డులకు సిఫార్సు చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నాను. – కాట్రగడ్డ ప్రసాద్⇒ ‘ఆదిత్య 369’ సినిమా సింగీతం శ్రీనివాసరావుగారు నాకు ఇచ్చిన వరం. ఆ సినిమా నిర్మాతగా నన్ను ఇప్పటికీ గుర్తిస్తున్నారు. ఈ మధ్యే ఆయన ఓ కథకు ఐడియా ఇస్తానని అన్నారు. గద్దర్ అవార్డుల్లో సింగీతంగారికి బీఎన్‌రెడ్డి పురస్కారం లభించడం, ఆ జ్యూరీ సభ్యుడిగా నేను ఉండటం నా అదృష్టం. – శివలెంక కృష్ణ ప్రసాద్ -
అందరికీ ఇళ్లు ఇస్తాం
తెనాలి/సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ నాయకత్వంలో తాను, పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గ్రామీణ్ 2.0 పథకం కింద రాష్ట్రంలో చేపట్టే ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీఎం ప్రారంభించారు. 175 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పేదలకు పట్టాభిషేకం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 60–70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పేదల సమస్యలను పరిష్కరిస్తున్నామని విశాఖ, విజయవాడ, మంగళగిరిల్లో పైసా ఖర్చు లేకుండా 60 వేలమంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు. వీటి విలువ రూ.52 వేల కోట్లుగా ఉంటుందని, ప్రతి పేదవాడికి రూ.కోటి విలువైన ఇంటి జాగా ఇచ్చి కోటీశ్వరులను చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పారు. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి 75 వేల ఇళ్లు మంజూరైతే అడిగిన వెంటనే కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మూడు లక్షల ఇళ్లను ఇచ్చారన్నారు. రాబోయే ఆరు నెలల్లో మరో మూడు లక్షల ఇళ్లను, వచ్చే సంవత్సరం మరో మూడు లక్షల ఇళ్లను ఇస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2029 లోపు నూటికి నూరుశాతం అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. మార్చి నాటికి భూముల సర్వే పూర్తి 2019–24 మధ్య రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరిగిందని, పేదలకిచ్చిన ఆరు లక్షల ఇళ్లను రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. భూసేకరణలో పెద్దఎత్తున అవినీతి చేశారన్నారు. పేదలకిచి్చన ఇళ్లు నివాసయోగ్యం కాదన్నారు. 2014–19లో తాము 17 లక్షల ఇళ్లు శాంక్షన్ చేసి 8 లక్షలు పూర్తి చేశామన్నారు. భూముల రీ సర్వే మార్చి నాటికి పూర్తిచేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా చేస్తామని చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్ ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. సమయం, వ్యయం తగ్గుతుంది: చౌహాన్ 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణ సమయం, వ్యయం తగ్గుతుందని తక్కువ మానవ వనరులతో పూర్తి చేయవచ్చన్నారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి సాగును మోదీ ప్రోత్సహిస్తున్నారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధాని లక్ష్యాలకు అనుగుణంగా ఏపీలో ప్రకృతి సాగు జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో జానకిరామ్ అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రమంత్రి చౌహాన్ సందర్శించారు. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న రైతును అభినందించారు. కాగా.. అంతకుముందు సీఎం చంద్రబాబును ఉండవలిల్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి కలిశారు. ఈ సందర్భంగా రెండు వేర్వేరు లేఖలను చంద్రబాబు అందించారు. రైతులను ఆదుకునేందుకు, పేదల ఇళ్ల నిర్మాణానికి అదనపు నిధులు ఇవ్వాలని ఆ లేఖల్లో సీఎం కోరారు. ఖరీఫ్–2026కి సంబంధించి పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. -
ఆవేశ పడి మెట్లు మొత్తం కడిగేశావ్.. మరి బొట్లు ఎవడు పెడతాడు
-
ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
-
టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..
-
ఎన్నికల కమిటీలు రద్దు.. పవన్ నిర్ణయం వెనుక పెద్ద స్కెచ్
-
డప్పు సేవ.. తప్పుదోవ!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పాలసీ వారికి డప్పు కొట్టించుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టించడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో సొంత కుటుంబ సభ్యులే వైరస్ సోకిన వారి దగ్గరకు వెళ్లలేని సమయంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడంతోపాటు నిరంతరం పేద ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించిన గ్రామ, వార్డు వలంటీర్ల సేవలు ఈ రాష్ట్రానికి అవసరమా.. లేక జరగని వాటిని జరిగినట్లు గొప్పలు చెబుతూ డప్పు కొట్టేందుకు ప్రభుత్వ పెద్దలకు మాత్రమే ఉపయోగపడే సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ సేవలు అవసరమా.. అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగానే వృధా ఖర్చు అంటూ తొలగించిన 2.66 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలు ఇప్పుడు గొంతెత్తి ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం తీరు దోపిడీ కన్నా దారుణంగా ఉందని దుయ్యబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాలసీ‘ ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొంత మంది అనుయాయులకు ఏటా కోట్ల రూపాయలు దోచి పెట్టడానికి తప్ప సామాన్య ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం లేదని తూర్పారబడుతున్నాయి.2019–24 మధ్య ఎంతటి వరదలొచ్చినా, ఇక్కట్లు వచ్చినా స్వల్ప ప్రాణ నష్టానికి కూడా తావు లేకుండా తాము సేవలు అందించామని చెబుతున్నారు. విజయవాడ బుడమేరు వరదల సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం తమకు రెట్టింపు వేతనం (రూ.10 వేలు) ఇచ్చి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ఆశ పెట్టి.. సేవలు వినియోగించుకుందని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిలువెత్తు మోసానికి నిదర్శనమిది దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు అండ్ కో వెళ్లగక్కిన అక్కసు అంతా ఇంతా కాదని వలంటీర్ల కుటుంబాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవస్థ ఆవిర్భావం నుంచి వారు విషం చిమ్ముతూనే ఉన్నారని, మధ్యలో పవన్‌కళ్యాణ్.. మరింత దారుణంగా చేసిన వ్యాఖ్యలు తమ గుండెలను తొలచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి.. ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారని మండిపడుతున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఎంపిక చేసిన వలంటీర్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ముద్రవేసి దుష్ప్రచారం చేస్తూ, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లాలు మాదిరి దోచి పెడుతోందని ఆరోపణలు చేయడాన్ని వలంటీర్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పే సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లకు ప్రభుత్వ పెద్దల, అధికార పార్టీ ఇమేజ్ను పెంచుకోవడానికి ప్రజల పన్నుల డబ్బును చెల్లించడం కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. 2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రజలకు గడప వద్దనే సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కొత్త సమాచారమైనా గంటల వ్యవధిలోనే ఆయా కుటుంబాలకు అందే పరిస్థితి ఉండగా.. వాస్తవాలతో పాటు అసత్యాలు కూడా ఎక్కువ ప్రచారంలో ఉండే సోషల్ మీడియా పోస్టులతో ప్రజలకు నిజమైన, కచ్చితమైన సమాచారం చేరే అవకాశం ఎంతవరకు ఉంటుందని నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు వలంటీర్ల వేతనాలు రెట్టింపు చేస్తాం.. ఉన్నత చదువులు చదువుకున్న వలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నెలకు రూ.50 వేల ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తాం.. అంటూ మాయ మాటలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని గెలిచాక తమను నట్టేట ముంచారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది నిలువెత్తు మోసానికి నిదర్శనమని ఎత్తి చూపుతున్నారు. నాడు–నేడు బాబు, పవన్ మాటలు » జగన్మోహన్రెడ్డి ఎంత స్వార్థపరుడో వలంటీర్లు అర్థం చేసుకోవాలి. అందుకే తెలుగుదేశం, ఎన్డీయే.. మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ. 5 వేలు కాదు.. రూ.10 వేలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. – 2024 ఏప్రిల్ 9న ఉగాది రోజున (అసెంబ్లీ ఎన్నికల ముందు) చంద్రబాబు వలంటీర్లకు ఇచ్చిన హామీ. » వలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. మీకు నేను ఓ అన్నగా చెబుతున్నా.. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను. – ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక.. » 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వలంటీర్లకు గౌరవ వేతనం ఆగిపోయింది. అనంతరం ఎలాంటి ప్రకటన లేకుండానే వారిని విధుల నుంచి తప్పించారు. నెలల తరబడి వలంటీర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించినా.. కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన లేకుండా వలంటీరు వ్యవస్థకు మంగళం పాడేసింది. » ఇప్పుడు వలంటీర్లు అసలు అఫీషియల్‌గా లేరు. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా.. ఎక్కడా, జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయొచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయింది. » మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘం ప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ -
కూటమికి బిగ్ షాక్.. బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు డబ్బులు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే చెప్పి.. తప్పులను చెప్పకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వడం ఒక రకంగా లంచం ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులను రెండింటినీ చెప్పే వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని సూచించారు. మంచిని మాత్రమే ప్రచారం చేసి.. చెడును ప్రజలకు చెప్పకపోతే చివరికి ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుందని బొలిశెట్టి అన్నారు. ప్రభుత్వ పనితీరుపై సోషల్ మీడియా వేదికల్లో వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.కొండల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు..విశాఖలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని కాపాడాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఉందని బొలిశెట్టి అన్నారు. కొండలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా కొండలను తవ్వడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఇటీవల కూడా విశాఖలో పర్యావరణ అంశాలపై బొలిశెట్టి సత్యనారాయణ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో జనసేనలో పర్యావరణ విభాగం బాధ్యతల్లో ఉండగా.. 2026 మార్చిలో పార్టీ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు జనసేన ప్రకటించింది.ఎమ్మెల్యే వంశీపై విమర్శలు..విశాఖకు చెందిన ఎమ్మెల్యే వంశీపై కూడా బొలిశెట్టి విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వంశీకి జనసేన సిద్ధాంతాలు ఇంకా వంటపట్టలేదని ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఇంకా వ్యాపారవేత్తగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్యావరణాన్ని కాపాడే వారికి ఓట్లు వేయాలని ప్రజలకు బొలిశెట్టి పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: కొత్త సెక్షన్లతో కేసులు.. సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన -
పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!
-
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని పొగిడేది అందుకే..!
-
పవన్‌ను దించేసి.. ఎమ్మెల్యేను ఎక్కించారు!
ప్రొద్దుటూరు(వైఎస్ఆర్ జిల్లా ): అధికారంలో ఎవరుంటే వారి కాళ్ల కింద తివాచీ పరచడం, సీట్లలో ఎవరు కూర్చుంటే వారి ఫొటోలకు దండలేయడం కొందరు అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కూడా ఇప్పుడు ఇదే ‘రాజకీయ భక్తి’ మార్గంలో నడుస్తూ బ్యూరోక్రసీ చరిత్రలోనే నిలిచిపోయే సరికొత్త వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. కమిషనర్ ఛాంబర్లో రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటో ఉండేది. అయితే స్థానిక కూటమి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిపై ఉన్న అమితమైన ‘ప్రేమ’ కొద్దీ, పవన్ ఫొటోను గుట్టుచప్పుడు కాకుండా పక్కనబెట్టి.. అదే స్థానంలో ఎమ్మెల్యే ఫొటోను తగిలించేశారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌ను, నిబంధనలను బూజు పట్టిన కాగితాల్లా పక్కన పారేసి, స్థానిక బాస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కమిషనర్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. నెటిజన్ల షాక్.. కమిషనర్ యూ–టర్న్ డ్రామా అయితే, ఈ ‘ఫొటో మార్పిడి’ వ్యవహారాన్ని గమనించిన కొందరు నెటిజన్లు శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో కమిషనర్ అత్యుత్సాహంపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం ఫొటో తీసేసి ఎమ్మెల్యే ఫొటో పెట్టడం ఏ చట్టంలో ఉందంటూ నెటిజన్లు ప్రశ్నించేసరికి కమిషనర్‌కు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన.. పక్కన పారేసిన పవన్ కళ్యాణ్ ఫొటోను చకచకా తెచ్చి మళ్లీ పాత స్థానంలోనే తగిలించారు. అంతటితో ఆగకుండా, ఆ ఫొటోకు భక్తిశ్రద్ధలతో సెల్యూట్ చేస్తూ.. ‘సెల్యూట్ బాస్.. మనది విడదీయరాని బంధం, గుండెల్లో గూడు కట్టుకున్న అనుబంధం. అందుకో నా సెల్యూట్ బాస్.. మా పవన్ బాస్’ అంటూ తన అధికారిక సోషల్ మీడియా గ్రూపుల్లో కవిత్వాలు, పోస్టులు గుప్పించారు. రాజకీయాలు చేయాలనుకుంటే రాజీనామా చెయ్: ప్రజా సంఘాల ఆగ్రహం మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉండి ఒక రాజకీయ నాయకుడిలా పవన్ కళ్యాణ్‌కు ఈ స్థాయి భజన చేస్తూ ఎలా పోస్టులు పెడతారంటూ దీనిపై ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ, జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు గోసా మనోహర్, దళిత సంఘం నాయకుడు ఎమ్మన్యుయేల్ కమిషనర్ వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. కూటమి నేతలపై అంతగా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి, నేరుగా ఆ పార్టీల్లో చేరి జెండాలు మోసుకోవాలని ఘాటుగా విమర్శించారు. మరో తప్పు.. అంబేద్కర్‌తో పోలికా?! ప్రజా సంఘాల నుంచి విమర్శలు మరింత ముదరడంతో కమిషనర్ కంగారులో మరో తప్పిదానికి తెరలేపారు. ఈ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి.. తాను గతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరిస్తున్న ఒక పాత ఫొటోను తీసుకొచ్చి మళ్లీ అదే గ్రూపులో పోస్ట్ చేశారు. ఈ చర్యతో ప్రజా సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దేశానికి రాజ్యాంగం రాసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను, ఒక రాజకీయ పార్టీ నాయకుడైన పవన్‌కళ్యాణ్‌ను ఒకే తాటిపై తెచ్చి పోలుస్తారా?ఎంతటి అజ్ఞానం అంటూ వారు తప్పుబ ట్టారు. కుర్చీ కాపాడుకోవడానికి ప్రొటోకాల్‌ను ఖూ నీ చేసి,దొరికిపోయాక కవర్ చేసుకోవడానికి అంబేద్కర్ ను వాడుకుంటున్న కమిషనర్ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ సాగుతోంది. ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి భారీ షాక్ -
సీట్లు ఎవరో వేసే బిచ్చం కాదు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
మీ ఆధిపత్య పోరు ఏంటి?
పిఠాపురం: ఎక్కడా లేనివిధంగా తాను పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే.. మీరు ఆధిపత్యపోరుకు దిగుతున్నారేమంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ జనసేన కేడర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని ఎలా సెట్ చేయాలో తనకు తెలుసంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మూడునెలల్లో పిఠాపురంలో తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జీవనగర్‌లో శ్మశానవాటిక కోసం పవన్‌ను కలిసేందుకు వెళ్లిన ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నలుపు రంగు డ్రెస్గానీ, చీరగానీ ధరించి పవన్‌కళ్యాణ్ సభకు వచ్చినవారిని పోలీసులు అనుమతించలేదు. కొందరు మహిళలు ధరించిన నలుపు రంగు చున్నీలను తీసేయించి సభలోకి అనుమతించారు. చున్నీలను తొలగించమనడం తమను అవమానించడమేనని మహిళలు ఆవేదనతో చెప్పారు. ఇదీ చదవండి: కర్నూలు మహిళా కూలీకి దొరికిన వజ్రం! -
పవన్ కాన్వాయ్ ని అడ్డుకుని రెచ్చిపోయిన మహిళ..
-
పిఠాపురంలో హైటెన్షన్ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు
-
ఇంత అవమానమా?
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం జరిపిన నియోజకవర్గ పర్యటనలో స్థానిక నాయకులకు, కార్యకర్తలకు చోటు దక్కలేదు. దీంతో, వారందరూ అసంతృప్తితో వెనుదిరిగారు. చాలా కాలం తరువాత ఆయన పిఠాపురం రావడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఎదురు చూశారు. కానీ, పవన్ పర్యటనలో ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులకు, ఎన్నికల తరువాత పార్టీలో చేరిన వారికే పెద్ద పీట వేయడంతో స్థానిక నాయకులకు భంగపాటు తప్పలేదు. చెప్పిందొకటి.. చేసిందొకటి.. తొలుత ప్రకటించిన ఆయన పర్యటన షెడ్యూల్లో చివరి నిమిషంలో మార్పులు జరిగాయి. పిఠాపురం మండలం ఫకృద్దీన్‌పాలెం మైసమ్మ చెరువు, పట్టణంలోని పీఠికాపుర వనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం, ఆర్అండ్బీ అతిథి గృహానికి వెళ్లారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కొత్తపల్లి మండలం కొండెవరం, నాగులపల్లిలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను పవన్ కల్యాణ్ ప్రారంభించాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు వారం రోజులుగా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఆ కార్యక్రమాలు జరగలేదు. జనసేన కొత్తపల్లి మండల నాయకుల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. పడిగాపులు పడినా దర్శనాల్లేవ్ పవన్‌కు వినతిపత్రాలు అందించేందుకు పలువురు వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు ఆయన బస చేసిన ఆర్అండ్బీ అతిథి గృహం బయట గంటల తరబడి పడిగాపులు పడ్డారు. అయినప్పటికీ, పవన్ కల్యాణ్ దర్శనాలు మాత్రం వారికి లభించలేదు. పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతానికి చెందిన అంధురాలు మఠం జ్యోతి ఎఫ్‌కే పాలెంలో పవన్‌ను కలిసి, ఫించన్ ఇప్పించాలని కోరేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెను పవన్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకుని పక్కకు లాగేశారు. దీనిపై జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. పిఠాపురం బ్రాహ్మణ కాలనీ వద్ద తమ సమస్యలు వినాలంటూ పట్టుబట్టినా వినకుండా పవన్ వెళ్లిపోవడంతో స్థానిక మహిళలు అసంతప్తి వ్యక్తం చేశారు. వారికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నచ్చజెప్పి ఫోన్ నంబర్ ఇచ్చి సముదాయించారు. పీఠికాపుర వనం ప్రారంభత్సవం వద్ద స్థానిక జనసేన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ కోసం పని చేసిన తమను పట్టించుకోవడం లేదంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ మంగళవారం కొత్తపల్లి మండలంలో పర్యటిస్తారని అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం గొల్లప్రోలు మండంలో కూడా ఆయన పర్యటించాల్సి ఉంది. కానీ అన్ని శిలాఫలకాలనూ కొత్తపల్లిలోని సభా వేదిక వద్దనే ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, పవన్ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ దూరంగా ఉన్నారు. -
దారుణం.. అంధురాలిని పట్టించుకోకుండా వెళ్లిపోయిన పవన్
-
పెన్షన్ కోసం పవన్ కాన్వాయ్ వెంబడి పరుగెత్తిన అంధురాలు
సాక్షి,కాకినాడ: జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన కష్టాలు చెప్పుకుని, నిలిచిపోయిన పెన్షన్ ఇప్పించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నించిన ఓ అంధురాలికి తీవ్ర నిరాశ ఎదురైంది. పవన్ కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఆ తండ్రీ కూతుళ్ల వేదన అందరినీ కలచివేసింది.పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువుకు చెందిన మఠం జ్యోతి అనే అంధురాలికి కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో ఆమె వికలాంగ పింఛన్ నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించాలని కోరుతూ వస్తోంది. ఆమె జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని, పలువురు ముఖ్య నేతలను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.ఈ క్రమంలోనే పవన్‌కు తన గోడువెళ్లబోసుకోవాలనే ఆశతో.. జ్యోతి తన తండ్రి వెంకటరమణను వెంటబెట్టుకుని ఎఫ్‌కే పాలెం వద్దకు చేరుకున్నారు. పవన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో తన తండ్రి సాయంతో ఆ అంధురాలు వాహనం వెంబడి పరుగెత్తింది. అయితే పవన్ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి, ఆ అంధురాలికి పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు.ఇదీ చదవండి : ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?: సజ్జల -
పాపం.. కింద నుంచి పైదాకా మెట్లు కడిగారు..! ఇప్పుడు సనాతని పరిస్థితి....?
-
ఇలాగైతే ఎదిగేదెలా?
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో జనసేన తీసుకునే సీట్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఆ పారీ్టలో సెగలు పుట్టిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు కచ్చితంగా మూడో వంతు సీట్లు లేదా అంతకంటే ఎక్కువగా పొత్తుల్లో దక్కుతాయని ఆ పార్టీ శ్రేణులు ఆశ పెట్టుకున్నాయి. అయితే ‘మనం తీసుకునే సీట్లు ప్రతి ఒక్కటీ గెలిచే సీట్లే తీసుకుంటాం. తొందరపడి, ఒత్తిళ్లు వచ్చాయని సంఖ్య పెంచేసుకొని.. 60 ఇవ్వండి, 70 ఇవ్వండి 120లో మేం 120 పోటీ చేస్తామనే ఆలోచన మీరెవరూ (జనసేన నాయకులు, కార్యకర్తలు) పెట్టుకోమాకండి. ఇది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ. కూటమిలో బాధ్యతయుతంగా ఉందాం’ అంటూ నాదెండ్ల చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు పూర్తిగా డీలా పడిపోయారు. దీంతో సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు. ఇది ఒక పద్దతి ప్రకారం జనసేన బలాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడి, పొత్తులో పార్టీ తక్కువ సీట్లు తీసుకోవడానికి ముందుగానే పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ మానసికంగా సిద్దం చేసే బ్రెయిన్ వాష్ కార్యక్రమం అని దుయ్యబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం జనసేన బలాన్ని ఇలానే తక్కువ చేసి మాట్లాడి, పొత్తులో తక్కువ సీట్లు తీసుకోవడాన్ని సమర్థించుకున్నారంటూ తూర్పారపడుతున్నారు. మంత్రి నాదెండ్ల వ్యాఖ్యల ప్రకారం స్థానిక ఎన్నికల్లోనూ కేవలం వంద శాతం గెలిచే సీట్లే అంటే మొత్తం సీట్లలో పది శాతానికే పార్టీని పరిమితం చేయబోతున్నారా అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పొత్తుల్లో.. చిన్న పారీ్టలకు ఉండే బలంతోనే పెద్ద పారీ్టలు సైతం గెలిచే పరిస్థితి ఉంటుందని, అలాంటప్పుడు చిన్న పారీ్టలకు బలం లేని కొన్ని చోట్ల అయినా పెద్ద పార్టీల బలం కలిపి గెలిపించడం కూటమిలో సమ న్యాయం అవుతుందని చెబుతున్నారు. 12 ఏళ్లు అవుతున్నా అవే మాటలా! ‘జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్లు దాటింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇప్పుడైనా పార్టీ బలపడే దిశగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని ఆశించాం. అయినా ఇంకా బలం లేదంటూ మాట్లాడుతున్నారు. ఇలాగైతే ఎలా?’ అని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘సీట్లు ఎక్కువ అడగొద్దు. సంస్థాగతంగా మనం ఇంకా బలంగా లేం.. నిదానంగా ఎదుగుదాం.. గెలిచే సీట్లే తీసుకుందాం..’ అంటే జనసేన శ్రేణుల పని కేవలం జెండాలు మోయడం, సభలకు జనాన్ని తీసుకురావడమేనా అని ప్రశి్నస్తున్నారు. పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత కూడా సంస్థాగతంగా బలంగా లేకపోతే.. ఇన్నేళ్లు పార్టీ నిర్మాణం చేయకుండా ఏం చేశారని అధినేత పవన్ కళ్యాణ్‌ను తప్పుపట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కనీసం మూడో వంతు సీట్లు అయినా తీసుకోకుంటే పార్టీ భవిష్యత్ అంధకారమే అని తెగేసి చెబుతున్నారు. పోటీ చేస్తేనే కదా.. అసలు బలమెంతో తెలిసేది.. సోషల్ మీడియాల్లో కొంత మంది జనసేన అభిమానులు నాదెండ్ల మనోహర్‌ను టీడీపీ కోవర్ట్ అంటూ నేరుగా టార్గెట్ చేయడం గమనార్హం. పొత్తులో మిత్రపక్షంగా ఉన్న పారీ్టలనే రాజకీయంగా అథఃపాతాళానికి నెట్టేలా చేయడం చంద్రబాబు నైజమని.. ఇప్పుడు కూడ సొంత పార్టీ వాళ్లతోనే జనసేనను ఎదగకుండా చేస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ ఎదుగుదల అయినా, ఆయా ప్రాంతాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే ఉంటుందని చెబుతున్నారు. పోటీ చేస్తేనే కదా.. అసలు బలమెంతో తెలిసేదని ప్రశి్నస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడుతూ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ పదవులు మొదలు నగర కార్పొరేషన్ పదవుల వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం మంత్రి నారా లోకేశ్.. టీడీపీ నేతల సమావేశంలో స్థానిక ఎన్నికల్లో జనసేనకు 15 శాతం టికెట్లేనని స్పష్టం చేయడం.. జనసేన మంత్రి నాదెండ్ల ప్రస్తుతం ఆ దిశగానే శ్రేణులను ఒప్పించే ప్రయత్నం చేస్తుండటం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్
-
కొండపైకి నడిచి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: సనాతన ధర్మ పరిరక్షకులమని గొప్పలు చెప్పుకునే కూటమి పార్టీల నేతలు, కనీసం హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఆదిదేవుడు వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పలుచోట్ల నిమజ్జనానికి నీళ్లు లేక విగ్రహాలను ఎండిన కాలువలు, వాగుల్లో అలానే వదిలిపెడుతున్న హృదయ విదారక దృశ్యాలు చూస్తే ప్రతి హిందువు హృదయం కలుక్కుమంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల హిందుత్వం ఇప్పుడు ఎక్కడికి పోయిందని, కనీసం నిమజ్జనానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. మరోవైపు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత నిస్సిగ్గుగా మాట్లాడిన పచ్చి అబద్ధాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాలతో నడుస్తున్న సిట్ నివేదిక ద్వారా తేలిపోయాయని స్పష్టం చేశారు.ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారికి వత్తాసు పలికిన ఎల్లో మీడియా తమ ముఖాలను ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. చేసిన మహా పాపానికి వెంకటేశ్వరస్వామి వారికి, భక్తులకు కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలని, లేనిపక్షంలో ఆ ఏడుకొండలవాడి శాస్తి తప్పదని వెల్లంపల్లి తీవ్రంగా హెచ్చరించారు.వినాయక చవితిపైనా కూటమి నిర్లక్ష్యంవినాయక చవితి అనేది పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తులు మండపాలు వేసి పూజలు చేసుకుంటే, కనీస ఏర్పాట్లు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది. వెన్నుపోటు పాలనలో ఆదిదేవుడైన గణనాథుడికి కూడా తీరని అపచారం జరుగుతోంది.ఎండిన కాలువల్లో గణనాథులు..అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం వద్ద హెచ్ఎల్సీ కాలువలో నీరు లేక, ఎల్లనూరు ప్రాంతంలో చిత్రావతి పరిసరాల్లో నీటి కొరత వల్ల పూజలు అందుకున్న విగ్రహాలను మట్టిలో, ఎండిన కాలువల్లో వదిలేయాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసు. అటువంటప్పుడు నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న కుంటలు, కాలువలు ఎందుకు తవ్వించలేదు?. నిమజ్జనానికి నీళ్లు వదలాలనే కనీస జ్ఞానం చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి లేదా?.ఇళ్లల్లో పూజలు.. వీడియోలకే పరిమితమైన నేతలుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని, నాలుగు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వదిలేస్తే గొప్ప హిందూ భక్తులు అయిపోతారా? ఊర్లలో సామాన్య ప్రజలు వినాయక చవితిని ఎలా జరుపుకుంటున్నారు, నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయనే సోయి ఈ పాలకులకు ఏమాత్రం లేదు. ఉచిత కరెంటు ఇస్తున్నామంటూ పందిళ్లపై వందల కొద్దీ ఆంక్షలు పెట్టి భక్తులను తీవ్రంగా వేధించారు.వైజాగ్‌లో పోలీసుల వేధింపులు..విశాఖపట్నంలో భక్తులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మండపాలు వేసుకుంటే, పోలీసులు వెళ్లి బెదిరించి మండపాలు తీసేయమంటున్నారు. ఒకపక్క సకల శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో నీతులు చెబుతుంటే, గ్రౌండ్లో మాత్రం అన్నదానాలు, పూజలు చేసుకోకుండా ట్రాఫిక్ పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమిలో ఉన్న బీజేపీ నేతలను సూటిగా అడుగుతున్నాను.. జై శ్రీరామ్, జై గణేష్ అనే మీరు, మీ ప్రభుత్వంలో గణనాథుడికి జరుగుతున్న ఈ ఘోర అవమానంపై ఎందుకు నోరు మెదపడం లేదు?.సిట్ నివేదికతో బట్టబయలైన లడ్డూ అసత్యాలుకలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అత్యంత దిగజారి విష ప్రచారం చేశారు. లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె, బాత్రూములు కడిగే కెమికల్స్ కలిపారంటూ సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అయోధ్య రామాలయానికి పంపిన లక్ష లడ్డూలపై కూడా విషం చిమ్మి దేశవ్యాప్తంగా భక్తులను క్షోభకు గురిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో పనిచేస్తున్న సిట్ ఇచ్చిన నివేదికలో ఎక్కడా జంతువుల కొవ్వు గానీ, కల్తీ గానీ జరిగినట్లు తేలలేదు.పవన్ కళ్యాణ్ దీక్షల డ్రామాలు.. ఎల్లో మీడియా విషంసనాతన ధర్మం అంటూ 11 రోజులు దీక్షలు చేసి, దుస్తులు మార్చి, గుడి మెట్లు కడిగి మీడియా ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? రాజకీయ స్వార్థం కోసం, వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నీచానికి ఒడిగడతారా? తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన ఏబీఎన్, టీవీ5 లాంటి ఎల్లో మీడియా ఇప్పుడు ఎక్కడ దాక్కుంటుంది?కొండపైకి నడిచి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే..ల్యాబ్‌కు పంపిన ఆ నెయ్యి ట్యాంకర్లు, శాంపిల్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అయినవన్న విషయం స్పష్టమైందని వెల్లంపల్లి తెలిపారు. ఈ నేపథ్యంలో చేసిన ఘోర అపచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, ఎల్లో మీడియా చెంపలు వేసుకోవడంతో పాటు.. తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లి, స్వామివారి పాదాల చెంత సాష్టాంగపడి భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని.. దేవుడే తగిన శాస్తి చేస్తాడని హెచ్చరించారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు -
కార్యకర్తల దగ్గర పులి.. మీడియా దగ్గర పిల్లి.. నీ గురుంచి మీ అన్న పవన్ ఏమంటున్నాడో తెలుకో...
-
సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ
-
చారిత్రక క్షేత్రానికి ముప్పు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా కొడవలి బౌద్ధ క్షేత్రంపై చారిత్రక వైభవం కలిగిన కొండలను కూటమి నేతృత్వంలోని మట్టి మాఫియా భారీ యంత్రాలతో కొల్లగొడుతోంది. కొండ ఆనవాళ్లు కోల్పోయేలా రాత్రి, పగలు తవ్వి తరలిస్తున్నారు. వేలాది లారీల్లో మట్టి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతి సంపదతో పాటు స్థానికుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన ఈ కొండ ప్రసుత్తం యంత్రాల కింద నలిగిపోతోంది.చారిత్రక నేపథ్యం ఇదీ.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో సర్వే నంబర్ 133/1లో ఉన్న కొడవలి బౌద్ధ క్షేత్రం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి అత్యంత ప్రాచీన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. దీనిని భారత పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా పరిరక్షిస్తోంది. బౌద్ధ స్తూపం నిరి్మత కట్టడమైన ధనకొండ, దానికి ఆనుకుని ఉన్న తురుక్కుల కొండలు నేమాలదిబ్బగా పేరు గాంచాయి. వీటిని వేర్వేరు పేర్లతో పిలుస్తున్నా.. ఆ సముదాయమంతా ప్రాచీన చారిత్రక కొడవలి బౌద్ధ క్షేత్రంలో అంతర్భాగమే. సర్వే నంబర్ 133/1లో సుమారు 372 ఎకరాల్లో చారిత్రక బౌద్ధ క్షేత్ర కట్టడాలు విస్తరించి ఉన్నట్లు కొడవలి బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి వెల్లడిస్తోంది. కొండ చుట్టూ తవ్వకాలువిశేష ప్రాధాన్యత కలిగిన తురుక్కుల కొండపై కూటమి మట్టి మాఫియా కన్ను పడింది. కొండ చుట్టూ తవ్వకాలు చేపడుతోంది. రోజూ వందల లారీలు, టిప్పర్లలో మట్టి అక్రమంగా తరలించి, సొమ్ము చేసుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. ఈ అక్రమ తంతు కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో అడ్డుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు కొండ వెనుక భాగంలో సుమారు వంద అడుగుల మేర తవ్వకాలు జరిపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. కొండ చుట్టూ తవ్వేసి మట్టి తరలిస్తే.. కొండపైన ఉన్న బౌద్ధ స్తూపాలు కిందకు కుంగిపోయే ప్రమాదం ఉంది. కూటమి నేతల చర్యలతో బౌద్ధ మత చారిత్రక వైభవం సైతం మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉంది.ఏఎస్ఐ నిబంధనలకు తూట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిబంధనల మేరకు బౌద్ధ క్షేత్రం పరిసర ప్రాంతాల్లో 300 మీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదు. ఈ నిబంధనలకు కూటమి నేతలు తూట్లు పొడుస్తున్నారు. 300 మీటర్ల పరిధిలోనే తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ నేతల ప్రమేయంతో ఆగిన వైనం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ సర్వే నంబర్ 133లో సామర్లకోటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి మైనింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేయగా.. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ విషయమై కాకినాడ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో అనుమతులను తాత్కాలికంగా వాయిదా వేశారు.పవన్ ఇలాకాలో జరుగుతున్నా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చారిత్రక ఆధారాలను ధ్వంసం చేసే ప్రక్రియకు నాంది పలుకుతున్నా ఎందుకు ప్రశి్నంచడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను స్థానికులు ప్రశి్నస్తున్నారు. బౌద్ధ ప్రదేశాల్లో మైనింగ్ జరుగుతుంటే, ఎందుకు మిన్నకుండిపోయారన్న ఆరోపణలు లేకపోలేదు. -
థాంక్స్ కేరళ.. బై బై ఆంధ్ర..! పవన్ పై జడ శ్రవణ్ కామెడీ అదుర్స్
-
మీ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి నీళ్లే తాగిస్తారా? బాబు, పవన్ పై రెచ్చిపోయిన మహిళలు
-
పిఠాపురంలో అక్రమాలు నీకు కనిపించట్లేదా పవన్..?
-
జనసేన వాళ్ళని టీడీపీ నేతలు తొక్కుతున్నారని పవన్ కళ్యాణ్ కు తెలిసినా సరే..
-
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రామచంద్రపురం జనసేన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘‘జనసేన గెలిచిన చోట టీడీపీ వాళ్లను గౌరవించినా.. టీడీపీ గెలిచిన చోట జనసేన కార్యకర్తలను తొక్కుతున్నారు. ఈ విషయం మన నాయకుడు పవన్ కళ్యాణ్‌కు కూడా తెలుసు’’ అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు.బొలిశెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాస్తవాన్నే నేను చెప్తా.. ఎవరికీ భయపడనంటూ బొలిశెట్టి తేల్చి చెప్పారు. బొలిశెట్టి కామెంట్స్‌పై టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. -
పవన్ కు అంటుతున్న డీఎస్సీ బురద ?
-
కూటమి పాలనలో ‘ధరల’ పిడుగు.. ఇదేనా చంద్రబాబు, పవన్‌ల సంపద సృష్టి?
శాసనసభ ఎన్నికలకు ముందు నిత్యావసర సరుకుల ధరలపై కూటమి నేతలు చేసిన ప్రచారం ఏమిటి?ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అసాధారణ రీతిలో ప్రస్తుతం ధరలు పెరుగుతుంటే ఏ సాకులు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు ఎల్లో మీడియా బాండ్ బాజా వాయిస్తోంది. ధరల నియంత్రణకు ఏమి చేస్తున్నది మాత్రం తెలియడం లేదు.ధరాఘాతానికి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలోనే ధరలు ఎలా పెరిగాయో గమనించండి. సన్నబియ్యం ధర 2024 ఏప్రిల్ లో కిలో 40 నుంచి 45 రూపాయలు ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో ఇదే బియ్యం ధర 70 నుంచి 80 రూపాయలవరకు ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వంట నూనెలు అప్పట్లో 90 నుంచి 106 రూపాయల వరకు ఉంటే, ఇప్పుడు 170 నుంచి 195 రూపాయల వరకు ఉంది. అంటే ఏకంగా అరవై నుంచి తొంభై రూపాయల వరకు పెరగడం అసాధారణమని చెప్పాలి. పంచదార ధర కిలోకి పాతిక నుంచి 30 రూపాయల వరకు పెరిగింది. ఉల్లి ధర సుమారు 40 రూపాయలు, ఎండు మిర్చి ధర సుమారు 150 నుంచి 200 రూపాయలకు పైగా పెరగడం ఆందోళన కలిగించే అంశమే. వినియోగదారులపై ఒకరకంగా ధరల పిడుగుపడిన చందమే అనిపిస్తుంది. కందిపప్పు, చింతపండు వంటి సరుకుల ధరలు కూడా బాగా పెరిగాయి.ఇక ఇసుకను ఉచితం అన్నప్పటికీ, ఇళ్ల నిర్మాణం చేసుకునేవారు లారీకి 20 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. మద్యం ధరలు పెరగనే పెరగవు అన్నట్లుగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మద్యం ధరలు సైతం పెరుగుతున్న తీరుపై మద్యం ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల బాదుడు కూడా గణనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ చార్జీలు కూడా 15 శాతం వరకు పెరిగినట్లు చెబుతున్నారు.పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా వీటి ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వానికి అదనంగా వాట్ రూపేణా ఆదాయం సమకూరుతోంది.ఆయా వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయాలు కూడా అధికం అవుతాయి. అయినా ఏపీలో అప్పులు మాత్రం నానాటికి పెరుగుతున్నాయే తప్ప, అదుపులో ఉండడం లేదు. ఈ ఇరవై ఆరు నెలల్లోనే ఏపీలో అన్ని రకాల అప్పులు కలిసి 3.86 లక్షల కోట్లకు చేరాయి.ఇది చంద్రబాబు సృష్టించిన సంపద అని అంతా వ్యంగ్యంగా అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ అప్పులకు సంబంధించి అసలుతో పాటు వడ్డీలు చెల్లించవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది. అమరావతి పేరుతో ఇప్పటికే ఏభైవేల కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. అప్పులన్నిటిని ఏమి చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేసి ఉంటే అందరికి తెలిసేది. కానీ అప్పుల వినియోగంపై ఎవరూ ప్రభుత్వ పక్షాన వివరణ ఇవ్వడం లేదు.ఇంత అప్పు చేసినా ఆయా చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జల జీవన్ కాంట్రాక్టర్లు ధర్నా చేసినా ఫలితం దక్కినట్లు లేదు. ఏలూరులో ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ల వాచ్మన్లు ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నది వారి ఆవేదనగా ఉంది. జూనియర్ డాక్టర్ లు తమ స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్ని చూస్తుంటే ఆంధ్ర సమాజం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోందా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో అవినీతి మాత్రం దూసుకుపోతోందని సెంటర్ ఫర్ లిబర్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ సైతం కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణల వల్ల ఎన్డీఏ పనులు ప్రజలలోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాల గురించి రాయాలంటే చాంతాడంత లిస్టు అవుతుంది.ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌లు ఏమని ప్రచారం చేశారో గుర్తు చేసుకోండి.పెట్రోల్,డీజిల్ పై వ్యాట్ అధికంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని తగ్గిస్తామని, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు తగ్గిపోతాయని ప్రచారం చేశారు. కర్నాటకలోని కొన్ని బంకుల వద్దకు వెళ్లి పోటోలు దిగి, అప్పటి జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడు అయితే ధరల రెక్కలు విరిచివేస్తామని ఊదరగొట్టారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. సీన్ కట్ చేస్తే, కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ ఒక్క వస్తువు ధర తగ్గలేదు సరికదా.. పెక్కింటి ధరలు అమాంతంగా దాదాపు రెట్టింపు అయ్యాయి.ఇదే టైంలో రైతులకు న్యాయం జరిగిందా అంటే అది లేదు. పంటలు చేతికి వచ్చినప్పుడు ధరలు పడిపోయి వారంతా తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. రైతుల చేతుల నుంచి పంట వ్యాపారుల వద్దకు చేరాక మాత్రం రేట్లు పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రభుత్వ వైఫల్యం కారణమన్న భావన ఉంది. ఇలాంటి సమయాలలో విజిలెన్స్ అధికారులు తగు చర్యలు తీసుకుని ధరలను నియంత్రిస్తారు. కాని ఇప్పుడు అది ఎంతవరకు జరుగుతోంది తెలియదు. చంద్రబాబు, లోకేశ్‌లు తమ వాగ్దానం ప్రకారం వ్యాట్ ను తగ్గించి ఉండవచ్చు. అది వారి చేతిలో పని. ఎన్నికల హామీ కూడా ఉన్నందున వారు ఆ పని చేసి, సరుకుల ధరలు తగ్గించడానికి ప్రయత్నించి ఉంటే కాస్త పేరు వచ్చేది. కానీ వారు ఆ పని చేయడం లేదు. అంటే ఇక్కడ కూడా ప్రజలను ఢోకా చేసినట్లే కదా అన్న విమర్శను విపక్షం చేస్తోంది.అయితే ఎల్లో మీడియా ఈ ధరల సమస్యను పక్కదారి పట్టించడానికి తంటాలు పడుతోంది. ఇదంతా కరువు వల్ల, యుద్దం వల్ల అని ప్రచారం ఆరంభించాయి. లేకుంటే వ్యాపారుల తీరుతో కష్టాలు వస్తున్నాయని టిడిపి మీడియా అంటోంది. వారిని కంట్రోల్ చేయవలసిన ప్రభుత్వం వైఫల్యం చెందినట్లే కదా అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని సలహా ఇవ్వలేకపోయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా, అప్పట్లోనే ఉక్రెయిన్- రష్యా యుద్దం ఆరంభమైనా, ఏ మాత్రం కనికరం లేకుండా ఎల్లో మీడియా ప్రభుత్వంపై పలు వ్యతిరేక కథనాలు రాసి ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేసేవి. చంద్రబాబు, లోకేష్ తదితరులు అచ్చంగా అదే పనిలో ఉండేవారు. అప్పటికన్నా పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గానే ఉన్నా ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని అనుకుంటే ధరల బారిన పడి ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి తను పడుతున్న కష్టం తెలియదా!కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లోకేశ్.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం ఏపీలోనే చూస్తున్నామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ అన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాలు బయటపడినా.. ఎదురు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారాయన. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీలో అక్రమాలు చేసి టీడీపీ నేతలు దొరికి పోయారు. సాక్ష్యాలు బయటపడినా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే వెళ్తారు. అక్రమాలు బయట పడినా లోకేష్ పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఒకప్పుడు వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తే సీబీఐతో విచారణ జరిపించుకోమని వైఎస్ఆర్ సవాల్ చేశారు. మరి లోకేష్ పై ఆధారాలతో బయటపడినా ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?. చంద్రబాబు వెంటనే లోకేష్‌తో రాజీనామా చేయించాలి అని రాజీవ్ అన్నారు.. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఉవ్వటం ఏపీలోనే చూస్తున్నాం. మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపై కూడా సీబీఐ విచారణకు మేం సిద్ధమంటున్నా కూడా వాళ్ల దగ్గరి నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఉద్యోగం ఇచ్చే ముందు సర్టిఫికేట్ల విచారణ చేయాలి. కానీ ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్మేసుకుని ఇప్పుడు సర్టిఫికేట్ల విచారణ చేస్తామంటారా?. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. వారిపై చర్యలు తీసుకుబే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఫేక్ వాళ్లు బయటకు వచ్చి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో బయట పెడతారోనని భయం.. .. పైగా ప్రశ్నించిన మీడియాపై కేసులు పెడతున్నారు. నారా లోకేష్ సవాల్‌పై చర్చించటానికి మా మాజీ మంత్రులు సిద్ధమే. అది చూసి ఆయన భయంతో పారిపోయారు. సవాల్ చేసిన నారా లోకేష్ మహిళలను అడ్డం పెట్టి మాట్లాడించటం ఎందుకు?. ఇది సిగ్గుచేటు అని కొండా రాజీవ్ అన్నారు.ఇదీ చదవండి: జనసేనకు షాకిచ్చిన టీడీపీ -
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
కూటమిలోని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా రగులుతున్న వివాదం పోనుపోను మరింత ముదురుతోంది. ముఖ్యంగా డీఎస్సీ వ్యవహారంపై ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం పోస్టులు.. ఒకనొక దశలో పెద్దల మీద మీమ్స్, ట్రోల్స్‌తో విరుచుకుపడే స్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో జనసేనను ఉద్దేశిస్తూ టీడీపీ డబుల్ మేసేజ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న కార్యకర్తలకు.. ఇరు పార్టీల అధిష్టానాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయనేది జరుగుతున్న ప్రచారం. అయితే ఈ విషయంలో జనసేనదే మొత్తం తప్పు అనే లైన్లో టీడీపీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దానిని కాస్త నిశీతంగా పరిశీలిస్తే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వైఫల్యాల్ని.. జనసేనకు ఆపాదిస్తూ ఐటీడీపీ తన సపోర్టింగ్ పేజీలతో కొన్ని పోస్టులు చేయించింది. దీనిపై జనసేన భగ్గుమంది. ‘మీ బురదలోకి మమ్మల్నెందుకు లాగుతారు?’ అంటూ కౌంటర్ పోస్టులతో నిలదీసింది. అంతటితో ఆగకుండా.. చంద్రబాబు, నారా లోకేశ్‌ను టార్గెట్ చేసుకుని మీమ్స్ ప్రచారం చేసింది. అయితే అప్పటికే.. ఓ సినిమా కోసం సీనియర్ ఎన్టీఆర్ అమెచ్యూరిష్ డైలాగ్పై ఉద్దేశపూర్వక ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం ఆ సినీ ఫ్యామిలీపై ఎన్టీఆర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన ఐటీడీపీ.. తన కౌంటర్లను మరింత పదును పెట్టింది. ఏకంగా పవన్ కల్యాణ్ సినీ, పొలిటికల్ కెరీర్ ఫెయిల్యూర్స్‌ను ప్రస్తావిస్తూ వరుస పోస్టులు చేసింది. అదే సమయంలో.. టీడీపీలోనే ఇంకో వర్గం నుంచి సీనియర్ నటుడు, పవన్ సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి పోస్టులు వచ్చాయి. అయితే టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన కార్యకర్తలు మీమ్స్, ట్రోల్స్ చేయడం, ఇప్పుడు రాజకీయంగా ఇరకాటంలో పడేసిన డీఎస్సీ అంశంపైనా వరుసగా పోస్టులు పెట్టడంపై టీడీపీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో కూటమి పెద్దలు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు, దూషణలకు దిగొద్దని సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఒకరిపై ఒకరు కామెంట్లు చేయొద్దని.. తద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ సందేశం ఇచ్చింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా.. జనసేన కార్యకర్తలు చేస్తున్న కొన్ని పోస్టులతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని టీడీపీ పేర్కొంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబంపై జనసేన కార్యకర్తలు చేసిన అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యల విషయాన్ని ఆ పార్టీతో మాట్లాడినట్లు తెలిపింది. ఇలాంటి అమెచ్యూరీష్ వ్యాఖ్యలు, పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది. ‘మన మధ్య మనమే సోషల్ మీడియాలో పోస్టులతో పోరాటం చేసుకోవడం సరికాదు’ అని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలు చేసుకోకుండా కూటమి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించింది.అదే సమయంలో టీడీపీ పార్టీకి, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని పార్టీ పేర్కొనడం గమనార్హం. ఇది జనసేనకు ఇండైరెక్ట్ వార్నింగేనన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే పదవులు, ప్రాధాన్యత విషయంలో జనసేన కేడర్ క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో.. కూటమిగా కలిసి పనిచేయాలంటూ ఒకవైపు బుజ్జగిస్తూనే.. టీడీపీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్న సంకేతాన్ని మరోవైపు బహిరంగంగానే ఇవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.దీంతో కూటమిలో అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ–జనసేన కార్యకర్తల మధ్య పోస్టుల యుద్ధం కొనసాగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మేయర్ సీటు.. రచ్చ రాజేయడం ఖాయం! -
జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్
-
హూ ఈజ్ మోదీ.. పవన్?
సాక్షి, విశాఖపట్నం: ‘హూ ఈజ్ మోదీ? ఆయన నాకంటే సీనియరా? నాకంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రి అయ్యారా? ‘ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్‌కు.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం, ప్రధాని మోదీ ఎందుకు కనిపించడం లేదు? ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. ఆయనకంటూ ఒక విధానం, ఒక స్టాండ్ లేదు.’ ఇవి కూటమిగా ఏర్పడకముందు చంద్రబాబు మొదటి నాలుక పలికిన పలుకులు. కట్ చేస్తే.. కూటమిగా ఏర్పడిన తర్వాత.. ‘నరేంద్ర మోదీ 21వ శతాబ్దపు నవభారత దార్శనికుడు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం నాకెంతో గర్వకారణం.’ ‘పవన్ కల్యాణ్ నిఖార్సైన నాయకుడు, నిజాయితీపరుడు. ఆయనకు పదవుల మీద, ప్యాకేజీల మీద వ్యామోహం లేదు’. ఇదీ.. చంద్రబాబు రెండో నాలుక సూక్తులు. అందితే జుట్టు.. అందకపోతే వెన్నుపోటు.. అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో ఎవరితోనైనా జట్టులు కట్టే బాబు.. ఎన్నికలు అయ్యాక మాత్రం.. ఏరు దాటాక.. అన్న చందంగా వ్యవహరించడం పరిపాటిగా మారిందని మరోసారి బుద్ధిని బయటపెట్టారు. ఎన్నికలకు ముందు మోదీ దేవుడు.. పవన్ తమ్ముడంటూ అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు వారిని పక్కన పెట్టేయడం హాట్ టాపిక్‌గా మారింది. మోదీ, పవన్ బొమ్మలు మాయం! రాష్ట్రంలో ఇంటింటికీ పంచుతున్న ‘కూటమి ప్రభుత్వం.. సంక్షేమ విజయాలు’ కరపత్రాల్లో ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలను నిర్దాక్షిణ్యంగా మాయం చేశారు. సినిమా హిట్టయ్యే దాకా హీరోలు కావాలి.. కలెక్షన్లు వచ్చాక పోస్టర్‌పై తన బొమ్మ మాత్రమే ఉండాలి అన్నట్లుగా బాబు చేస్తున్న ఈ సింగిల్ క్రెడిట్ సోలో పెర్ఫార్మెన్స్.. నిన్నటి దాకా ‘మా మోదీ, మా పవన్’ అన్న నోటితోనే, నేడు కరపత్రాల సాక్షిగా ‘హూ ఈజ్ మోదీ.. హూ ఈజ్ పవన్’ పార్ట్–2 డ్రామాకు తెరతీసినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కింగ్ మేకర్లు కరివేపాకయ్యారా? కూటమి అంటే ఎన్నికల ముందు ఓట్లు వేయించుకోవడానికి మాత్రమేననీ.. తీరా విజయాల క్రెడిట్ తీసుకునే సమయానికి అంతా తన సోలో పెర్ఫార్మెన్సే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తరాంధ్ర వీధుల్లో తిరుగుతున్న ఆ కరపత్రం పేరుకే ‘కూటమి’ విజయాలు. కానీ అందులో ప్రధాని మోదీ కానీ.. పవన్ ఫొటో కానీ కనిపించడం లేదు. కేవలం తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు మాత్రమే ముద్రించుకోవడం గమనార్హం. సొమ్ము ఢిల్లీది.. సోకు బాబోరిది! రాష్ట్రంలో ఏ చిన్న సంక్షేమ పథకం అమలు చేయాలన్నా.. కేంద్రం ఇచ్చే నిధులు, రుణాలు విదిలిస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఢిల్లీ నుంచి వస్తున్న వేల కోట్ల రూపాయలతోనే రాష్ట్రంలో హడావిడి డ్రామా నడుస్తోంది. కానీ ప్రచారానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ ఫోజులు కొడుతూ డప్పు కొట్టుకుంటోంది. మోదీ పంపిన నిధులతో జరిగిన పనులన్నింటినీ తన క్రెడిట్లో వేసుకుంటూ, కరపత్రాల్లో మోదీ ఫొటోకు మాత్రం తెలివిగా కత్తెర వేసేశారు. ఈ ‘పచ్చ’ పైత్యాన్ని చూసి అటు కమలనాథులు, ఇటు జనసైనికులు అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు 2018 నాటి ఫ్లాష్‌బ్యాక్ గుర్తుకొస్తోందని మండిపడుతున్నారు. అధికార మదంతో అప్పుడే అహంకారం తలకెక్కితే, ఈ కరపత్రాల మంటలు రేపు టీడీపీ పునాదులకే ఎసరు పెడతాయంటూ బీజేపీ రాష్ట్ర ధారి్మక సెల్ ప్రతినిధి విజయ శంకర్ ఫణీంద్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: నరసన్నపేటలో పోటీ చేస్తా.. నీ సంగతి చూస్తా.. -
మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా
-
పవన్ ఇలాకాలో స్త్రీలకు అవమానం
పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో వరలక్ష్మీ వ్రత పూజల టోకెన్ల కోసం వచ్చిన మహిళలకు తీరని అవమానం జరిగింది. టోకెన్లు ఇవ్వకపోగా, వారిని క్యూలో నుంచి బయటకు లాగేసి, అక్కడి నుంచి వెళ్లకపోతే ఇళ్ల నుంచి లాక్కొచ్చి కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరించడం, చీరల కోసం వచ్చారంటూ జనసేన నేతలు అవహేళన చేయడంతో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. చీరలు ఎవరడిగారు..? పాదగయ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు టోకెన్ల కోసం వస్తే ఇలా అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. ఇదేనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు ఇచ్చే గౌరవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడ్డారు. ప్రతి ఏటా పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. పిఠాపురంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలు వచ్చి ఇక్కడ వ్రతాలు చేసుకుంటారు. అయితే ఈసారి వ్రతాలతో పాటు మహిళలకు ఇవ్వడానికి వేల చీరలు సిద్ధం చేశామంటూ జనసేన నేతలు ప్రచారం చేశారు. ఎప్పటిలానే మహిళలు వ్రతాల టోకెన్ల కోసం గురువారం తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడ్డారు. అయితే, చీరల కోసం టోకెన్లన్నీ జనసేన నేతలే తీసుకెళ్లిపోవడంతో వ్రతాలకు వచ్చిన మహిళలకు ఒక్కరికి కూడా టోకెన్ అందలేదు. మధ్యాహ్నం వరకు వేచి చూసిన మహిళలు ఆలయ అధికారులను నిలదీయగా.. టోకెన్లు లేవు పొండంటూ కసురుకున్నారు. ఆ వెంటనే పోలీసులు వచ్చి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహిళా పోలీసులు కాకుండా పురుష పోలీసులే స్త్రీలను క్యూలో నుంచి బయటకు లాగేయడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మర్యాదగా వెళ్లిపోకపోతే ఫొటోలు తీసి.. ఇళ్లకు వచ్చి మరీ తీసుకెళ్లి జైలులో పెడతాం..’ అంటూ పోలీసులు బెదిరించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేమేమన్నా దొంగలమా.. జైలులో పెట్టడానికి? ఇదేనా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మహిళలకు ఇచ్చే గౌరవం?’ అంటూ మహిళలు మండిపడ్డారు.అవహేళన చేసిన జనసేన నేతలు ఇంతలో కొందరు జనసేన నేతలు వచ్చి.. వారంతా చీరల కోసం వచ్చారంటూ అవహేళనగా మాట్లాడటంతో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. పుణ్య క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో వ్రతం చేసుకుందామని వచ్చామని, చీరల కోసం కాదంటూ కన్నీరు పెట్టుకున్నారు. చీరలు వద్దు.. వ్రతానికి టోకెన్లు ఇవ్వాలని ఆలయ అధికారులను కోరారు. ఈసారి అంతా జనసేన నేతలే నిర్వహిస్తున్నారని, తమకు ఎటువంటి సంబంధం లేదని ఆలయ అధికారులు చెప్పడంతో మహిళలు మండిపడ్డారు. మీకు సంబంధం లేకపోతే గుడిలో ఎలా వ్రతాలు నిర్వహిస్తారంటూ వారిని నిలదీశారు. అయినా అధికారులు స్పందించకపోవడంపై భక్తులు మండిపడ్డారు. -
కమిషనర్ రవివర్మను సస్పెండ్ చేయాలి
సాక్షి, కోనసీమ జిల్లా: బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి హోదాలో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించిన ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ పి.రవివర్మను సస్పెండ్ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో రాజకీయ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో రవివర్మ ఓజీ గెటప్‌లో పాల్గొని కేక్ కటింగ్ వేడుకల్లో పాల్గొనడం సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమన్నారు.ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజా సేవ చేయాల్సిన అధికారి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా డ్రెస్‌కోడ్ చేసుకుని ప్రత్యక్షంగా పాల్గొనడం అత్యంత శోచనీయమన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన మున్సిపల్ కమిషనర్‘ఓజీ’ గెటప్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మ pic.twitter.com/yTFW0VFmqV— Telugu Feed (@Telugufeedsite) September 2, 2026చదవండి: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్ -
ఇదేం అభిమానం... పవన్...?
-
జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి
-
పవన్‌పై అభిమానం వారి పాలిట శాపం
కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా వేర్వేరు ఘటనల్లో మృతి చెందిన ఇద్దరు జన సైనికులు వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన అడపా మల్లేష్ బాబి (27) ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సాయంత్రం ముమ్మిడివరం నుంచి నిర్వహిస్తున్న మోటారు సైకిల్ ర్యాలీలో పాల్గొని మహిపాల చెరువు నుంచి సీహెచ్ గున్నేపల్లిలోని మిగిలిన జన సైనికులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. త్రీవంగా గాయపడిన బాబిని అమలాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమలాపురం నియోజకవర్గం బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. కోనసీమలో జరిగిన రెండు ఘటనలూ బాధిత కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అభిమాన హీరో కోసం ఒకరిని చూసి ఒకరు చేస్తున్న వేడుకలు కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. చదవండి: డామిట్.. సభ అడ్డం తిరిగింది..! -
‘ఓజీ 2’ అప్డేట్.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన డైరెక్టర్!
పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు ‘ఓజీ’ సీక్వెల్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు సుజీత్. ఈ మేరకు బుధవారం ‘ఓజీ యూనివర్స్’ పేరిట ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో ‘ఓజీ’కి సీక్వెల్‌గా తెరకెక్కించే చిత్రం గురించి పవన్ కల్యాణ్‌తో సుజీత్, సంగీత దర్శకుడు తమన్ చేస్తున్న చర్చలు ఆస్తకి రేపుతున్నాయి. ‘యాన్ ఇండియన్ ఆరిజిన్.. సౌత్ఈస్ట్ ఎమోషన్.. వెస్ట్రన్ ప్రెజెంటేషన్..’ అనే మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. From the #OGUniverseTo the #OG…ALL LOVE for everything so far…And everything that begins from here :) 🧿🧿♥️♥️Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk— Sujeeth (@Sujeethsign) September 2, 2026 -
ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్
-
పవన్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం..
సాక్షి, కోనసీమ జిల్లా: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అల్లవరం మండలం ఓడలరేవులో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాల మేరకు.. బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (22) ఓడలరేవులోని బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అనంతపురంలోని కియా కంపెనీలో శిక్షణ పొందుతున్న ప్రేమ్ కుమార్.. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సెలవుపై స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీ ఎదురుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ప్రేమ్ కుమార్ షాక్‌కు గురయ్యాడు.ఈ సందర్బంగా అతడితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం. కరెంట్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, అతడి మృతదేహాన్ని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. కాగా, పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా జరిగిన ఈ ఘటన అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇదీ చదవండి: పవన్ ఫ్లెక్సీపై జనసేన, టీడీపీ నేతల మధ్య కొట్లాట -
బాబు,పవన్ లను ప్రశ్నిస్తే తప్పా..? గొంతు నొక్కే కుట్ర
-
పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా
-
‘పవన్ ఫ్లెక్సీని తొలగించండి’.. టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం
సాక్షి,దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జనసేన స్థానిక నాయకులు దర్శిలో ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీల ఏర్పాటును స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే వాటిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారులను రంగంలోకి దింపి ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. దీనిని గమనించిన జనసేన నాయకులు, కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందితో పాటు టీడీపీ నేతల యత్నాలను అడ్డుకున్నారు. -
లోకేష్ వ్యాఖ్యలు.. జనసేన ఆత్మగౌరవానికే పరీక్ష?
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు చికాకుగా మారేలా ఉంది. జనసేన క్యాడర్ లో చాలామంది ఈ స్థానిక పదవులపై ఆశలుపెంచుకోవడమే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎం పదవిలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ సంగతి ఎలా ఉన్నా,తన వరకు పవర్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారన్నది పలువురి భావనగా ఉంది. ఆయన తరచుగా మంత్రివర్గ సమావేశాలకు వెళ్లకపోయినా అడిగేవారు లేరు. కీలకమైన అంశాలలో పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించకపోయినా లోలోపల మదనపడేవారే తప్ప ఆయనను అడిగే ధైర్యం చేసేవారు లేరు. పవన్ కు భుజం శస్త్ర చికిత్స ,అనారోగ్య సమస్య కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినా కొన్ని కార్యక్రమాలకు వెళ్లడం, మరికొన్నిటికి వెళ్లకపోవడం జరుగుతోంది.ఇటీవల కేరళకు వెళ్లారు. దీనిపై అంతా సానుభూతితోనే ఉన్నారు. కాని రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు పార్టీలో అంత సంతృప్తికరంగా లేవన్నది నిష్టుర సత్యంగా కొందరి వ్యాఖ్యల బట్టి అర్దం అవుతుంది. ఇవన్ని ఎలా ఉన్నా కూటమి ప్రభుత్వం ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం 15 ఏళ్లు ఉండాలని స్వయంగా పవన్ కళ్యాణే పలుమార్లు ప్రకటించడంతో జనసేన క్యాడర్ లో నిస్తేజం ఏర్పడింది. తాము పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని అనుకుంటే, ఆయనేమో దాని గురించి ఆలోచించడం మానేశారన్నది వారి బాధ. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా అది దక్కలేదు. కాని చివరికి అటవీశాఖలో గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంతవరకైనా అన్నదమ్ములకు న్యాయం జరిగినట్లయిందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుంటారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించిన సంగతి వేరే కోణం. పార్టీలో ఆయా ముఖ్యమైన పదవులలో సామాజిక న్యాయం జరగడం లేదన్న విమర్శ ఉంది. పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు కారు రాష్ డ్రైవింగ్ కారణంగా ఒక యువతి మరణిస్తే తగురీతిలో పార్టీ స్పందించి ఉండాల్సిందని,అలా చేయకపోవడం వల్ల జాతీయ మీడియాలో కూడా విమర్శలకు గురి కావల్సి వచ్చిందన్న భావన ఉంది. చంద్రబాబు, మంత్రి లోకేష్ లు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ను పొగడడం మినహా జనసేన పార్టీవారికి పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదన్నది కొంతమంది జనసేన నేతల అభిప్రాయం. ఈ పరిణామాలను అంతా గమనిస్తున్నారు. కాకపోతే అధికారంలో ఉన్న నేపద్యంలో ఎవరికివారు పైకి మాట్లాడడానికి కాస్త వెనుకాడుతుంటారు. ఈ పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తమకు ఏ మేరకు అవకాశాలు వస్తాయన్నది జనసేన కార్యకర్తలలో ఉన్న ప్రశ్న. లోకేష్ ఎప్పుడైతే జనసేనకు 15 శాతం సీట్లే కేటాయిస్తామని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. లోపల ఉడుకుతున్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శాసనసభ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరని, అందువల్ల 15 శాతం కేటాయింపు సమ్మతం కాదన్నట్లు మాట్లాడారు.కాని ఆ తర్వాత కాస్త తగ్గారేమో అన్న అభిప్రాయం పార్టీలో ఏర్పడింది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి మాట్లాడక తప్పలేదు. నిజానికి ఆయనకు ఈ అంశంపై ఎంత శ్రద్ద ఉందో పార్టీ క్యాడర్ కు తెలియడం లేదు. నిర్దిష్టంగా స్థానిక ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు,లోకల్ నేతలకు మంచి ప్రాధాన్యం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వలేదు. ఒక కమిటీని నియమించారు. వారేమి చేస్తారో తెలియదు. లోకేష్ ప్రకటనకు పవన్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారన్నది జనసేనలో ఉన్న ఒక అభిప్రాయంగా భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలు,సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు కోరాలన్న ఆలోచనను ఆయన చేస్తున్నారట. ఈ ఎన్నికలలో జనసేన ప్రభావశీలంగా ,మెరుగైన స్థాయిలో నిలబడుతుందని ఆయన చెప్పారు. అయితే కచ్చితంగా ఎంత శాతం సీట్లు దక్కుతాయన్నది తేల్చలేదు. లోకేష్ అంత స్పష్టంగా ఒక లెక్క చెప్పినప్పుడు అది కుదరదని చెప్పకపోతే పార్టీవారికి అది లోకువ కాదా అన్నది కొందరు నేతల భావన. కాగా పార్టీ బాధ్యత అంతా నాదెండ్ల మనోహర్ కే అప్పగించినట్లుగా కనిపిస్తుందని, ఆయనే ఆయా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల కోసం 30 రోజుల ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించేది చెప్పకుండా ,మూడుపార్టీలు కలిసి పనిచేయాలని ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ ఏ మేరకు సీట్లు ఇస్తుందో తెలియక,ఆయా చోట్ల జనసేన ఆశలు పెంచుకుంటోంది. మచిలీపట్నంలో ఇంతవరకు టీడీపీతో ఒక అవగాహన రానప్పటికీ జనసేనలోని రెండువర్గాలు దీనిపై ఘర్షణ పడ్డాయి.మరోవైపు గుంటూరు మేయర్ సీటును జనసేనకే కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ గుంటూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.గుంటూరులో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పదవులన్నీ టీడీపీవారికే వచ్చాయని, అందువల్ల మేయర్ పదవికి పోటీచేసే అవకాశాన్ని జనసేనకు ఇవ్వాలని ఆయన కోరారు. పలు ఇతర జిల్లాలలో కూడా జనసేన నేతలు ఇలాంటి డిమాండ్లే పెడుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది నేతలు ఏ ఏ జిల్లాలలో ఎంత శాతం సీట్ల కేటాయింపు కోరాలో పార్టీకి సూచిస్తున్నారు.దాని ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీతో సమానంగాను, ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లావరకు 40 శాతం సీట్లు,తొమ్మిది జడ్పి చైర్ పర్సన్, ఐదు మేయర్ పదవులకు పోటీ చేయాలని వీరు కోరుతున్నారు. ఒవరాల్ గా చూసినప్పడు సగటున మూడో వంతు సీట్లకు పట్టుబట్టాలన్నది జనసేన నేతల డిమాండ్ గా ఉందని అంటున్నారు. తాను నియమించిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తాము కోరదగిన సీట్ల వివరాలను టీడీపీ నాయకత్వానికి అందచేయవచ్చని భావిస్తున్నారు.ఆ తర్వాత సంప్రదింపులలో ఎన్నిటికి ఒప్పందం కుదురుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. శాసనసభ ఎన్నికలలో కనీసం 50 సీట్లకుపట్టుబట్టి ఉంటే,ఈ రోజు జనసేనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అనుకుంటున్నారు. అయినా ఆనాడు పవన్ మాటను కాదనలేక సర్దుకుపోయామని కొందరి వ్యాఖ్యగా ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో లోకేష్ మాటే చెల్లితే జనసేన పరిస్థితి మరింత దిగజారుతుందన్న భయం పార్టీవర్గాలలో ఉంది.ఇప్పటికే అనేక చోట్ల టీడీపీ నేతల నుంచి అవమానాలను భరించవలసి వస్తోందన్నది పలువురు నేతల బాధగా ఉంది.ఈ విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారని వార్తలు వచ్చాయి. దీనిపై పార్టీ కార్యకర్తలలో ఉన్న అసహనాన్ని కూడా తెలియచేశారు. పవన్ ఈ విషయాలు తెలుసునని అన్నారట. అయినా ఆయన నుంచి వారికి కచ్చితమైన హామీ లభించినట్లు చెప్పలేకపోతున్నారు. ఒకరకంగా ఈ స్థానిక ఎన్నికలు జనసేన ఆత్మగౌరవానికి ఒక పరీక్ష అని ఆ పార్టీవారే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రాజకీయపార్టీగా జనసేన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతుందా?. ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకుంటుందా? లేక టీడీపీ వెనుక నిలబడే పార్టీగానే మిగిలిపోతుందా అన్నది స్థానిక ఎన్నికలలో కొంతవరకు తేలవచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..! -
'పదవుల కోసం కాదు'.. పవన్ మాటలపై సెటైర్లు!
-
5 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే.. మీరు వాళ్ళని ఏం చేసారో తెలుసా
-
ఎక్కడికి పోయావ్ అయ్యా పవన్ కళ్యాణ్.. నిన్ను ఎమ్మెల్యే చేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి..
-
వలస నేతలకు సీట్లిస్తే ఓటమి ఖాయం
సాక్షి, అమరావతి : అసెంబ్లీ సీట్ల మాదిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో జనసేనకు కేటాయించే సీట్లను అప్పటికప్పుడు పార్టీలో చేరే నేతలకు ఇస్తే ఊరుకోమని జనసేన నేతలు స్పష్టం చేశారు. కూటమి పార్టీల నుంచి నామినేషన్లకు ముందు జనసేనలో చేరే నేతలకు సైతం సీట్లు ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కాదు.. కూడదని సీట్లు ఇస్తే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు సహకరించే పరిస్థితి ఉండదని, ఓడిస్తారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శుక్రవారం మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నేతల సమావేశం నిర్వహించారు.మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, వివిధ నామినేటెడ్ పదవులు పొందిన నేతలు, అసెంబ్లీ.. స్థానిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడో వంతు సీట్లు కేటాయించేలా ఒత్తిడి తేవాలన్నారు. 10–12 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికే ఈ సీట్లు ఇవ్వాలన్నారు. జనసేనకు అధికారం దక్కిన తరుణంలో పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. ‘స్థానిక సంస్థల్లో ప్రతి నాయకుడు లోతుగా అధ్యయనం చేయాలి. మనకు కచ్చితమైన గెలుపు అవకాశం ఉండే చోట జనసేన పోటీ చేస్తుంది. రిజర్వేషన్లు, స్థానిక బలాబలాలు అన్నీ బేరీజు వేసుకొని, నాయకత్వాన్ని పెంచే దిశగా జనసేన అడుగులు వేస్తుంది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ యువజన విభాగాన్ని ఆవిష్కరిస్తాం. 30 రోజుల స్థానిక సంస్థల ప్రణాళికను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధం చేశారు’ అని తెలిపారు. అనంతరం ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో పార్టీ నియమించిన 14 మంది సభ్యుల కమిటీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘రాష్ట్ర స్థాయిలో కూటమి సమన్వయ కమిటీలో చర్చలు నడుస్తున్నాయి. జిల్లా, నియోజక వర్గాలవారీగా సమన్వయ కమిటీలు ఉంటాయి. ముందుగా నగర పాలక, పుర పాలక సంస్థల ఎన్నికల మీద దృష్టి పెట్టాలి. డివిజన్లు, వార్డుల్లో మన బలాబలాలు గుర్తించాలి’ అంటూ నాదెంద్ల ఆ కమిటీకి సూచించారు. -
చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా..
-
'అజ్ఞాతవాసి' ఫ్లాప్.. నా పిల్లలకు అదే చెప్పా: త్రివిక్రమ్
డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు చెప్పగానే అతడు, జల్సా, జులాయి, నువ్వే నువ్వే, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో లాంటి అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఈయన ఫిల్మోగ్రఫీలోనే 'అజ్ఞాతవాసి' లాంటి డిజాస్టర్ కూడా ఉంది. 2018 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం.. అభిమానులు, ప్రేక్షకులకు పీడకలని మిగిల్చింది. ఈ సినిమా ఫెయిల్యూర్ టైంలో తనకు తన భార్య, పిల్లల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పి త్రివిక్రమ్ ఆశ్చర్యపరిచాడు. ఫెయిల్యూర్ని దాచిపెట్టడం మనసులో మరింత బరువుని పెంచుతుందనే జీవిత సత్యాన్ని చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతోనూ సమంత హెవీ వర్కౌట్స్.. ఇలా చేయొచ్చా?)'ఫెయిల్యూర్ని దాచిపెట్టడమే ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. నేను ఇల్లు కడుతున్న టైంలోనే 'అజ్ఞాతవాసి' సినిమా తీశాను. ఇది పోవడంతో రెమ్యునరేషన్ మొత్తం 24 గంటల్లో వెనక్కిచ్చేయాల్సి వచ్చింది. నిర్మాత తనకు మిగిలిన లాభం వెనక్కిచ్చేశాడు. పవన్ కల్యాణ్ కొంత రెమ్యునరేషన్ వెనక్కిచ్చారు. మొత్తం అందరికీ సెటిల్ చేసేశాం. 48 గంటల్లో అంతా సెటిలైపోయింది. నా ఇంట్లో భార్య, పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్లకు ఇదంతా చెప్పడం ముఖ్యం అనుకున్నాను. నేనో సినిమా తీశాను అది ఆడలేదు. కాబట్టి మనం కడదామనుకుంటున్న ఇల్లు ఆపేద్దామనుకుంటున్నాను. మీకేమైనా సమస్యనా? రేపొద్దునా తేడా ఏమైనా వస్తే దాన్ని అమ్మేస్తానని అనగానే.. ఇది ఉంది కదా ఇది కూడా ఇల్లే కదా అని అన్నారు. దీంతో అది సమస్య కాదని అనిపించింది''తర్వాత భోజనం చేసి సంతోషంగా ఓ సినిమా చూసి పడుకున్నాను. సినిమా పోయిన విషయాన్ని దాచి యజమానిగా ఇప్పుడా బరువుని మోయాలి. ఇదెవరికీ చెప్పకూడదు. భార్య, పిల్లలకు తెలియకూడదు. తెలియకూడదని మనం అనుకోవడం తప్ప ప్రపంచానికి అంతా తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్లకు ఎందుకు తెలియకుండా ఉంటుంది. ముందు వాళ్లకే తెలుస్తుంది. కాకపోతే గౌరవంతో వాళ్లు మనకు చెప్పరు. చెప్పేయడం వల్ల మనకు ముందు తేలిగ్గా ఉంటుంది. ఇదే పెద్ద సమస్య అనే ఫీలింగ్ వాళ్లకు అనిపించదు. లేదంటే వాళ్లు కూడా వీడెందుకు మొహం అలా పెట్టుకుని లోపల అలా కూర్చున్నాడు బయటకు రావట్లేదు ఏంటిది అని వాళ్లు కూడా వాళ్లింట్లోనే వేరే వాళ్ల ఇంట్లో ఉన్నట్లు చూస్తారు. సినిమా మనం తీసి టార్చర్ వాళ్లకు పెట్టినట్లు ఉంటుంది' అని డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా)Director #Trivikram on failures 🫡🔥Failure is not the end… it’s a lesson that makes you stronger and better. ❤️🔥 pic.twitter.com/OaANJkDoQr— Milagro Movies (@MilagroMovies) August 25, 2026 -
డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
సాక్షి, అమరావతి: గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు మరోసారి మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక నివాసం (జనసేన పార్టీ కార్యాలయం) ఎదుట మంగళవారం ధర్నా చేశారు. జలజీవన్ మిషన్ పనులు బిల్లులు వెంటనే చెల్లించాలి.. పవన్ కళ్యాణ్ స్పందించాలి అంటూ నినాదాలు చేస్తూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆందోళన చేపట్టారు. మెడలో ప్లకార్డుల తగిలించుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లింపు చేయని కారణంగా తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు వాపోయారు. తమకు బిల్లులు చెల్లించడానికి రూ. 620 కోట్లు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా, జూన్ నెల నుంచి ఇప్పటివరకు కేవలం రూ.170 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లకు సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించగా, చెల్లింపులపై స్పష్టత లేకుండా ఇళ్లకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. బిల్లులు ఇప్పటికే ఆన్లైన్లో అప్లోడ్ అయి ఉన్నాయని, కేవలం బటన్ నొక్కితే మా ఖాతాల్లో డబ్బులు పడిపోతాయని దీనిపై పవన్‌కళ్యాణ్ సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది. అనంతరం ఉపముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చర్చలు జరిపారు. చివరకు సెప్టెంబరు 20వ తేదీలోగా మూడు విడతల్లో బిల్లులు చెల్లింపునకు ఉన్నతాధికారులు సుముఖత తెలియజేసినట్టు చెప్పడంతో కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు. -
ఆరోజు అలా చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఉష శ్రీ చరణ్ మాస్ వార్నింగ్
-
పవన్‌కు ఇవేవీ కనిపించడం లేదా?: భూమన
సాక్షి, తిరుపతి: పురాతన ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. సనాతనిగా తనను తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇవేవీ కనిపించడం లేదా? అని నిలదీశారు. మంగళవారం ఈ వ్యవహారం భూమన కరుణాకర్ స్పందించారు. కడప–చెన్నై రహదారి వెంట ఉన్న అనేక ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేణిగుంట–రైల్వే కోడూరు మార్గంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించడంపై తీవ్రంగా మండిపడ్డారు.అంజనేయపురం గ్రామానికి ఆ ఆలయం వల్లే ఆ పేరు వచ్చిందని భూమన పేర్కొన్నారు. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య తిరుమలకు అడవి మార్గంలో వెళ్తూ ఇక్కడి స్వయంభూ ఆంజనేయస్వామిని పూజించిన చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో 1871లోనే అంజనేయపురంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.‘తెల్లోడు కాపాడితే.. నల్లోడు కూల్చేస్తున్నాడు’బ్రిటిష్ పాలకులు ఆలయాలను సంరక్షిస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు వాటిని కూల్చేందుకు సిద్ధమవుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. తిరుపతి–చెన్నై మార్గంలోని నగరి సమీపంలోని కీలపట్టు సర్కిల్లో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఇప్పటికే కూల్చివేశారని చెప్పారు. 1993లో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఆలయాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారని ఆరోపించారు.‘పవన్‌కు కనిపించడం లేదా?’సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆలయాల ధ్వంసం కనిపించడం లేదా? అని భూమన ప్రశ్నించారు. ‘‘అన్న ఆలయాన్ని ప్రారంభిస్తే.. తమ్ముడు అధికారంలో ఉండగా అదే ఆలయాన్ని కూల్చివేశారు. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ?’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్న భూమన.. ఆలయాల పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రఘురామరాజుపై కేసు ఏదీ? -
వచ్చాడయ్యో స్వామి అంటూ మోత మోగించారుగా.. ఏకిపారేసిన జడ శ్రవణ్
-
సినిమాల్లో సోది డైలాగులు చెప్పి ఒకడు... పాదయాత్ర అంటూ ఇంకొకడు.. సంచలన కామెంట్స్
-
జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల
ఖమ్మంమామిళ్లగూడెం: వరంగల్– ఖమ్మం–నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును అధిష్టానం ఖరారు చేసిందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి రామ్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం మిరియాల రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంపై అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. -
సుగాలి ప్రీతీ శవంతో రాజకీయం చేసి డిప్యూటీ సీఎం అయిన నువ్వు... రిటైర్డ్ DSP సంచలన కామెంట్స్
-
తగ్గితే నెగ్గుకురాలేం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడోవంతు(33 శాతానికి) తక్కువ కాకుండా సీట్లు డిమాండ్ చేయాలని అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆ పార్టీ శ్రేణులు ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో అత్యధిక సీట్లు డిమాండ్ చేయాలని సూచిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలూ అధినేత వద్ద ప్రతిపాదనలు పెట్టారని సమాచారం. ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో టీడీపీకి సమానం సీట్ల కోసం పట్టుబట్టాలని, లేకుంటే సంస్థాగతంగా బలోపేతం కావడం కష్టమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా మధ్య ప్రాంతం వరకు పార్టీ బలంగా ఉన్న చోట్ల ఎట్టిపరిస్థితుల్లోనూ 40శాతానికి తక్కువ కాకుండా సీట్లు తీసుకోవాలని అధినేతకు తెలియజేసినట్టు సమాచారం. మొత్తం 28 జిల్లా పరిషత్‌లకు గాను కనీసం తొమ్మిది.. 17 కార్పొరేషన్ మేయర్లకు కనీసం ఐదు జనసేన కోరాలని పార్టీ నేతల మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. తొమ్మిది జెడ్పీల్లో ఉత్తరాంధ్ర – కృష్ణా జిల్లా మధ్య ఆరు జెడ్పీలతోపాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర కార్పొరేషన్లలో ఏదో ఒకటి జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కోరుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిగిన సమయంలో కోరినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో టీడీపీపై ఎలా ఒత్తిడి తీసుకురావాలన్న అంశంపై పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేలను అడిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి మొదలు కార్పొరేషన్ మేయర్ వరకు ప్రతి స్థానానికి జనసేన నుంచి పోటీకి అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయాలని, ఆ జాబితాలను టీడీపీ ముందుంచి సీట్లు కోరదామన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై రానున్న వారం, పది రోజుల్లోనే మరో విడత ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్‌కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారని చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కూటమి పార్టీల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సర్దుబాటుపైనా చర్చలు జరిగాయని, అప్పట్లో పవన్ జనసేనకు మూడో వంతు సీట్లు ఇవ్వాలని కోరారని పలువురు జనసేన నేతలు చెబుతున్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గత 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములా వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ఆనాటి సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం కేవలం సార్వత్రిక ఎన్నికల వరకే పరిమితమని పవన్ కల్యాణ్ వివరించారు.స్థానిక ఎన్నికలకు మాత్రం ప్రాంతాల వారీగా వ్యూహాలుంటాయి. ఎక్కడ బలం ఉంటే అక్కడ నుంచి పోటీ చేస్తాం. జనసేన ఎమ్మెల్యేలు లేనిచోట కూటమి ధర్మానికి భిన్నంగా పార్టీ శ్రేణులకు అన్యాయం జరుగుతుందన్న పవన్.. జనసేన శ్రేణుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తాం. స్థానిక ఎన్నికల సంసిద్ధతకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు
-
పవన్ ‘గ్రీన్’ సిగ్నల్.. అన్నకు క్యాబినెట్ హోదా!
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కీలక పదవి దక్కింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.నాగబాబు నియామకంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై ఏడాదిన్నర కూడా పూర్తి కాలేదు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్న పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోనే ఆయన సోదరుడికి కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘అన్నకు తన సొంత శాఖలోనే కీలక పదవి’’ అంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.గ్రీన్ మిషన్‌కు కమిటీ చైర్మన్పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలు, రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపు వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయనకు క్యాబినెట్ హోదా ఉండటంతో ప్రభుత్వ పరంగా ప్రత్యేక ప్రాధాన్యత లభించనుంది.బొత్స కామెంట్నాగబాబుకి కేబినెట్ హోదా పదవి దక్కడంపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ఎలాగూ మంత్రి పదవి ఇవ్వరు. అందుకే పవన్ కల్యాణ్ ఇలా ఇప్పించుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.రాజకీయంగా ఆసక్తి..జనసేనలో మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును బతిమాలి.. అలిగి.. తన అన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పించుకున్నారు పవన్ కల్యాణ్. ఇప్పుడు మరో కీలక పదవి కట్టబెట్టారు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నేతల కుటుంబ సభ్యులకు పదవులు దక్కడం ఎప్పుడూ రాజకీయ చర్చకు దారితీస్తుంటుంది. తాజాగా నాగబాబు నియామకం కూడా అలాంటి చర్చకే తెరలేపింది. -
పాపం శిలాఫలకంపై పేరు తీసేశారని పవన్ ఫీల్ అవుతున్నాడు..
-
మీకు మీరే.. మాకు మేమే.. తెగిన కూటమి బంధం
-
కూటమిలో కుంపటి.. మరో కొత్త తలనొప్పి!
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అద్వాన్నంగా పనిచేస్తున్నది ఆ పార్టీల నేతలే బహిర్గతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం సాగుతున్నది కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. టీడీపీకి ఒకప్పుడు గట్టి మద్దతుదారులుగా ఉన్న కొంతమంది మేధావులు ప్రభుత్వ తీరుపై పెదవి విరవడమే కాకుండా, ప్రభుత్వం ఐసీయులో ఉందని కామెంట్ చేస్తున్నారు.ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఆరోపణల పర్వం, విజయవాడలో టీడీపీకే చెందిన డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులుతో బలవంతపు రాజీనామా చేయించడం తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా సహాకార పాల ఉత్పత్తుల సంఘం విజయ డెయిరీ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లకు నచ్చలేదేమో తెలియదు. క్యాబినెట్ సమావేశం జరుగుతుండగానే ఇద్దరు మంత్రులు హుటాహుటీన డెయిరీ ఆఫీస్‌కు వెళ్లి ఆంజనేయులు రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు పంపకపోతే వారు ఎందుకు వస్తారన్నది టీడీపీ వర్గాలలో ఉన్న టాక్.ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రంగంలో దిగి డెయిరీ కార్యాలయానికి వెళ్లి ఆంజనేయులును బెదిరించారట. రాజీనామాకు ఆయన సుముఖంగా లేరు. అయినా మంత్రుల హూంకరింపులతో ఆంజనేయులు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆంజనేయులు కూడా టీడీపీకి చెందినవారే అయినా ఎందుకు ఇంతగా కక్ష కట్టారన్న చర్చ జరుగుతోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈయనపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన అలిగారట. దాంతో ఆయనను బుజ్జగించడానికి గాను ఆంజనేయులుతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావించిందట.అయితే చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల కంపెనీకి లాభం చేకూర్చడానికే చలసానితో రాజీనామా చేయించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది వేరే విషయం. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యానికి మంత్రులు చెప్పారట. అంతేకాక ఈ క్రమంలో ఆంజనేయులుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మద్దతుదారులుగా పేరొందిన కొందరు యూట్యూబ్ చానళ్లలో ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన పార్ధసారధి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బెడ్‌పై ఉన్న ఆంజనేయులుతో రాజీనామా పత్రాన్ని తీసుకుని ఫోటో దిగడంపై వారు మండిపడ్డారు. పార్ధసారధి తన లాయల్టీని రుజువు చేసుకోవడానికి ఇంతగా తాపత్రయ పడ్డారని వీరు అంటున్నారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీకి వ్యతిరేకంగా అన్ని ఆరోపణలు చేసినా, మరికొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని టీడీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఘట్టం గుర్తుకు వస్తుంది. 1995లో పార్టీని చంద్రబాబు కైవసం చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి ఎన్టీఆర్ నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారని చెబుతారు. సరిగ్గా అదే రీతిలో టీడీపీ నాయకత్వం ఇప్పుడు వ్యవహరించిందన్నమాట. కాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రభుత్వంలో సాగుతున్న అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికి పలుమార్లు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన కొందరు సాగిస్తున్న గంజాయి, ఇసుక మాఫియాలపై ఓపెన్‌గానే మాట్లాడారు.తాజాగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాలలో దామచర్లకు వాటాలు ఉన్నాయని, రేషన్ బియ్యం మాఫియా నుంచి నెలకు 25 లక్షలు వసూలు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ అడ్డాగానే దందాలు సాగిస్తున్నారని కూడా బాలినేని అన్నారు. దీనికి ప్రతిగా దామచర్ల కూడా బాలినేనిపై పలు ఆరోపణలు చేశారు. బాలినేని పార్టీ మారకపోతే, బాలినేని ఆయన కుమారుడు ఈపాటికి జైలులో ఉండేవారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలు చూస్తే ఏమి అర్దం అవుతుంది. ప్రభుత్వంలోను, అలాగే అధికార కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు అడ్డూ, ఆపు లేకుండా పోయిందనే కదా! కాని వీరిద్దరు సమన్వయం పాటించాలని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఒంగోలులోని తమ పార్టీ నేతలకు సందేశం పంపించారట. అంతే తప్ప ఇరువురు చేసుకున్న ఆరోపణలపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా లేదన్నమాట.అవినీతిని కాపాడటమంటే ఇది కదా అన్నది ప్రజల భావన. దీనిని కప్పిపుచ్చుకోవడానికి మూడు పార్టీల సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారు. మనలో మనం విమర్శలు చేసుకోవదని సలహా ఇచ్చాయి. అంతే తప్ప అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించలేదు. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూటమి మిత్రపక్షాలలో విభేదాలు సృష్టించడానికి వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని పిచ్చి ఆరోపణ చేశారు.ఈ మధ్య ఒక సినిమాకు సంబంధించి టీడీపీ, జనసేనల అభిమానులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారట. కొందరైతే దూషణలకు దిగారట. వాటిని వైఎస్సార్సీపీ అంటకట్టి తప్పించుకోవాలని చూస్తే ఎవరు నమ్ముతారు! కాగా రాష్ట్రంలో జరుగుతున్న అద్వాన్న పాలనను, అవినీతిని ప్రశ్నించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీపై కొత్త ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గోవింద నామాన్ని పేరడిగా వాడుతున్నారన్నది ఆయన అభ్యంతరమట. నిజంగానే ఆయన చిత్తశుద్దితో అభిప్రాయపడితే తగు సూచన చేయడం తప్పుకాదు. కాని సినిమాలలో ఎన్ని రకాల పేరడిలు హిందూ మత విశ్వాసాలపై జరిగాయో ఆయనకు తెలియదా! గోవిందా పేరుతో సినిమానే వచ్చింది. గతంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో గోవింద అంటూ ఒక బాబాపై పాటకట్టారే. ఇలా ఎన్నో సన్నివేశాలు సినిమాలలో ఉన్నాయి. వాటి గురించి ఏమంటారో తెలియదు.మంత్రి లోకేష్ కూడా గతంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా గోవిందా.. అంటూ నినాదాలు చేసిన వీడియోలు కూడా చక్కర్లు తిరుగుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాటను కూడా చూపుతున్నారు. అందుకే ఏదైనా విమర్శ చేయాలనుకుంటే ముందూ, వెనక ఆలోచించాలని అంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తిరుమల స్వామివారి ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీపై బురద వేసే క్రమంలో ఈ ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న విమర్శలు వచ్చాయి. తదుపరి సీబీఐ దర్యాప్తులో అలాంటి జంతు కొవ్వు కల్తీ ఏది జరగలేదని తేలింది. మరి దానిపై వీరు స్పందించలేదు. ఇప్పుడు మాత్రం మళ్లీ సనాతన ధర్మం పేరుతో ప్రజలను ఏమార్చడానికి వచ్చినట్లుగా ఉంది.ఒంగోలులో తన పార్టీ నేత చేసిన ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు. పైగా రెండు పార్టీలు కాంప్రమైజ్ ఫార్ములా వర్కవుట్ చేయడం ఏమిటి? ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉంది. చలసాని ఆంజనేయులు నుంచి ఆస్పత్రిలోనే రాజీనామా పత్రాన్ని మంత్రి పార్ధసారధి తీసుకుంటున్న పోటో టాగ్ చేస్తూ ఐసీయూలో పార్టీ, ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ వారిని నిత్యం దూషించే చంద్రబాబు నాయుడు.. ఏబీతో పాటు మరికొందరు టీడీపీ వీర మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చే ధైర్యం చేయగలరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆ ఇద్దరి బంధం తెగిందా..?
-
డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపితే కారు కిందనో.. పైకో ఎక్కి వెళ్ళలేదేమి పవన్ కళ్యాణ్
-
పవన్ కు ప్రాధాన్యత తగ్గిందా? కూటమి పార్టీల్లో కొత్త రగడ
-
బాబు కార్యక్రమానికి పవన్ డుమ్మా.. అసలేం జరిగింది?
-
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
సాక్షి, అమరావతి: అమరావతి కార్యక్రమాలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న కీలక కార్యక్రమానికి పవన్ కావాలనే దూరంగా ఉన్నారంటూ అధికార, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.గురువారం అమరావతిలో స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏనుగుల కార్యక్రమం ఉందంటూ ఉదయమే ఆయన విశాఖకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదీ షెడ్యూల్లో హడావిడిగా చేర్చుకుని మరీ.. ప్రభుత్వ వర్గాలకు సరైన సమాధానం ఇవ్వకుండానే!.నారాయణ రాయబారం విఫలం!పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడానికి అమరావతి పనుల్ని చూసుకుంటున్న మంత్రి నారాయణను చంద్రబాబు రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే నిన్న పవన్‌తో నారాయణ భేటీ అయినట్లు సమాచారం. ఎలాగైనా అమరావతి కార్యక్రమానికి రావాలని ఆయన కోరినప్పటికీ.. చివరకు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్న చర్చ సాగుతోంది. విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.చంద్రబాబుపై తగ్గిన పవన్ స్పందనలుగత కొంతకాలంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వ వ్యవహారాలపై పవన్ కల్యాణ్ స్పందనలు తగ్గడం కూడా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన పవన్.. ఈ మధ్యకాలంలో అలాంటి స్టేట్మెంట్లకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పాలనాపరమైన అంశాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బాబును పొగడాల్సి వస్తుందనే అమరావతి వంటి కీలక కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారా? అని చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యేల క్వార్టర్ల అంశమే కారణమా?పవన్ కల్యాణ్ అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉండటానికి ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలే కారణమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నిర్మాణ వ్యయాల పెంపు, అంచనాల మార్పులపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఖర్చుల విషయంలో మరింత పారదర్శకత అవసరమని పవన్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై పవన్ గతంలోనూ అధికార యంత్రాంగానికి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉన్నారా? అనే దానిపై జనసేన స్పందించాల్సి ఉంది.వరుస గైర్హాజరులతో పెరుగుతున్న చర్చఇటీవల జరిగిన కొన్ని కీలక సమావేశాలకు కూడా పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే పలు కేబినెట్ సమావేశాలకు(మూడు సార్లు) ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఈమధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరైన భోగాపురం ఎయిర్‌పోర్టు కార్యక్రమానికి మాత్రం పవన్ హాజరయ్యారు. ఆ వేదికపై కూడా చంద్రబాబు కంటే ప్రధాని మోదీనే ప్రసన్నం చేసుకునేందుకు పవన్ ఎక్కువ తాపత్రయపడ్డారన్న రాజకీయ వ్యాఖ్యలు వినిపించాయి.నాదెండ్ల ప్రకటనతో మరింత ఆసక్తిమరోవైపు పవన్ గైర్హాజరుపై టీడీపీ–జనసేన కూటమి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి విభేదాలను ప్రస్తావించకపోయినా.. ఈ పరిణామాలపై మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి కార్యక్రమానికి పవన్ దూరంగా ఉండగా.. జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో అమరావతిపై ఒక మొక్కుబడి ప్రకటన ఇప్పించడం కూడా చర్చకు దారితీసింది.అసలు పవన్ దూరం వెనుక కారణం ఏమిటి? నిజంగానే కూటమిలోని కొన్ని అంశాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. -
ఆ రోజు సుగాలి ప్రీతీ.. ఈ రోజు డాక్టర్ ప్రియాంక.. పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయావ్...
-
నీకు గోవింద నామస్మరణ చేసే హక్కు లేదు.. పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన కారుమూరి
-
సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్ కళ్యాణ్ పార్టీలోకి..
-
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్‌నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్‌లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్‌లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్‌లో 2047 విజన్‌తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్‌లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది..! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రియాంక తండ్రి ఫైర్
-
నా బిడ్డ గురించి సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం
-
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్‌పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్‌కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. -
DSC స్కామ్ పై అదిరిపోయే స్కిట్.. లోకేష్, పవన్ ఫోటోతో మాస్ ర్యాగింగ్
-
చంద్రబాబు నిర్ణయాలు నచ్చక కాబినెట్ కు పవన్ డుమ్మా!?
-
అనిత వెస్ట్ అని పవన్ కల్యాణే... వెళ్తూ.. వెళ్తూ అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
మరోసారి కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరు
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు.గతంలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతుండటం కూటమి సర్కార్‌లో అసలేం జరుగుతోంది?. అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలకు తావిస్తోంది. వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
రుషికొండ కోసం గగ్గోలు పెట్టావ్.. సింహాచలం కొండను గుండు చేస్తుంటే... పవన్ ని ఏకిపారేసిన బొలిశెట్టి
-
ఓజీ-2కు బ్రేక్.. సుజీత్ ప్లాన్ మారింది
దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పవన్ కల్యాణ్‌తో తెరకెక్కనున్న ఓజీ-2 కంటే ముందుగా నాని హీరోగా రూపొందనున్న 'బ్లడీ రోమియో' చిత్రాన్నే సుజీత్ ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.ఓజీ-2 ప్రకటన వెలువడిన తర్వాత నాని-సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్ వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా సుజీత్ కూడా ఓజీ-2 ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడం, లొకేషన్ల పరిశీలన చేపట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే తాజా పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. నాని ప్రస్తుతం చేస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో, తదుపరి ప్రాజెక్ట్‌గా 'బ్లడీ రోమియో'ను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం నాని తన కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.అక్టోబర్ నుంచి 'బ్లడీ రోమియో' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను ఢిల్లీలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం లండన్‌లో కీలకమైన, భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత దర్శకుడు సుజీత్ పూర్తిస్థాయిలో ఓజీ-2 పనులపై దృష్టి సారించనున్నాడు. -
ఆ ముగ్గురిది ఓవరాక్షన్ అంటారేంటి.. అది ఆర్ట్.. ఆర్టిస్టులను అవమానిస్తారా ?
-
మోదీ ముందు యాక్టింగ్ అదుర్స్ కానీ.. జనాలు పిచ్చోళ్ళు కాదు బ్రో
-
బాబు, పవన్ తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
-
అల భోగాపురంలో ఇలా భజన పరులు చిడతలు.. వెంకట్ రెడ్డి సెటైర్లు
-
పవన్, బాబు మోడీ భజన.. ఒకపక్క చిడతల అప్పారావు.. ఇంకోపక్క చిడతల పాపారావు
-
రాజకీయ డ్రామా కోసం 40 కోట్లు
-
మోదీ తల్లిని, భార్యను బాబు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ నీకు భాద అనిపించలేదా?
-
పోటాపోటీగా పొర్లు దండాలు..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్ మోదీ.. అయామ్ ఫాదరాఫ్ లోకేశ్.. నౌ టెల్ మీ.. హూ ఈజ్ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది. లోకేశ్ చిడతల భజన చంద్రబాబు, పవన్ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు. పవన్‌కు కన్నీళ్లు వచ్చేశాయి సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్ పండించారు. మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్ కల్యాణ్ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు.యువత దుమ్మెత్తిపోస్తుంటే... దేశవ్యాప్తంగా జెన్‌జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్ర«దాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్‌ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్‌ను సీఎం చేయడంకుదరని పని. దీంతో అటు తృణమూల్ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర భారత్.. బులెట్ ట్రైన్, డిజిటల్ పేమెంట్స్.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్‌ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు.సీఎం పవన్ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలని అభిలషించారు. పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్ అని కేంద్రమంత్రి అనగానే జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్‌ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి.రాష్ట్రమంత్రులకు నో మైక్ విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్ అందలేదు. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్‌వే’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రన్‌వేగా, యువత భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, సెమీకండక్టర్ పరిశ్రమలకు శనివారం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు, శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి, శ్రీకూర్మనాథ స్వామి, పైడితల్లి అమ్మవారిని స్మరించారు. భోగాపురం వేదిక నుంచి సుమారు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ రోజు ప్రారంభమైన విమానయానం, రహదారులు, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, పోర్టులు, రైల్వేలు, కనెక్టివిటీ తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రధాని పేర్కొన్నారు. సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన నేలపైనే కొత్త విమానాశ్రయం ఏర్పాటు కావడం గొప్ప విశేషమన్నారు. ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దేశంలో పౌర విమానయాన రంగం గత 12 ఏళ్లలో విశేషంగా అభివృద్ధి చెందిందని ప్రధాని వివరించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందన్నారు. ఉడాన్ పథకంతో సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఉడాన్ రెండో దశకు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కాశీలో ప్రారంభించిన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఇప్పుడు అమృత్‌సర్‌కు విస్తరించి, అక్కడి నుంచి 25కుపైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించిందని తెలిపారు.బ్లూ ఎకానమీకి ప్రోత్సాహం దేశంలో బ్లూ ఎకానమీ బలోపేతానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందని చెబుతూ విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు తీర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల ఆధునికీకరణతో పాటు, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే సహా రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయని, రైల్వే రంగంలో సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. రైల్వే నెట్వర్క్ పూర్తిగా విద్యుదీకరణ కావడంతో పాటు, 70కుపైగా స్టేషన్లు ఆధునికీకరణ జరుగుతోందని వివరించారు.» పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానంతో సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థ ఏర్పడుతుందని, దీనివల్ల పరిశ్రమలు, రైతులు, వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఈ ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు సెమీకండక్టర్ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడం ఈ దిశగా కీలక ముందడుగని చెప్పారు.» సాఫ్ట్వేర్ రంగంతో పాటు తయారీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంతో భవిష్యత్ సాంకేతిక ఉద్యోగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.» కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నక్కపల్లిలో భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని, దీనివల్ల దేశంలో ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని తెలిపారు. » ఈ సందర్భంగా 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, యువతులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించడం గర్వకారణమని కొనియాడారు. భారత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది అద్భుత నిదర్శనమని పేర్కొన్నారు.ఇక ఉత్తరాంధ్ర వైపు వలసలు : చంద్రబాబుఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రాంతంలో రివర్స్ మైగ్రేషన్‌కు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ఒకటిగా నిలబెడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, వీటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని వెల్లడించారు. రూ.2,784 కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజ్‌కు అనుమతులు, నిధులు లభించాయని చెప్పారు. ఆగస్టు 14న గోదావరి జలాలు అనకాపల్లికి చేరనున్నాయని, అలాగే వంశధార–గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా చేపడతామని వెల్లడించారు. పర్యాటకం, ఔషధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల అభివృద్ధితో ఉత్తరాంధ్ర దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నాయకుడిని చూడలేదని చంద్రబాబు కొనియాడారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని, అలాగే 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. » విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణికుల సౌకర్యాలు, చెక్–ఇన్ హాల్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్, భవిష్యత్ ఏవియేషన్ హబ్, ఏరోసిటీ అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ప్రధానికి వివరించారు.థింసా నృత్యంతో స్వాగతంఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వం, ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రతిబింబించే ప్రదర్శనలను ప్రధాని సందర్శించారు. సంప్రదాయ థింసా నృత్యాలను తిలకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పొందూరు ఖాదీ శాలువాతో సత్కారం చేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను బహూకరించారు.ప్రధానిని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయి.. పవన్ కల్యాణ్‘భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొందరు ఇష్టానుసారం తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. కన్నీళ్లు వచ్చాయి. బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది’అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో రూ.17,900 కోట్ల అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మోదీ. ఆయన వెనుక మనం ఉండాలన్నారు.ఏపీకి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర : లోకేశ్ కొందరు ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన మోదీ వికసిత్ భారత్, మన సీబీఎన్ విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకెళ్లే రోజు అని అన్నారు.అభివృద్ధికిది సింహద్వారం.. రామ్మోహన్నాయుడు ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని » ఎయిర్‌పోర్టు ప్రారంభంతో పాటు ప్రధాని మోదీ రాష్ట్రంలోని పలు రోడ్లు, పారిశ్రామిక సంస్థలను రిమోట్‌తో ప్రారంభించారు. » విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. » కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. » అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలు ప్రారంభం» కర్నూలు–ఐవీరెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన.» ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లైన్ల బైపాస్ రోడ్లు ప్రారంభించారు. -
ఉబ్బలమడుగులో కొత్త వృక్షజాతి
తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని ఉబ్బలమడుగు పర్యాటక ప్రాంతంలో అరుదైన కొత్త వృక్షజాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ అని పేరు పెట్టారు. దీన్ని అటవీశాఖ అధికారులు బుధవారం పవన్ కళ్యాణ్‌కు చూపించారు. కాంబాకం అటవీ ప్రాంతంలో ఈ మొక్క సహజంగా పెరుగుతుండటంతో ఆ ప్రాంతం పేరునే జాతి పేరుగా ఖరారు చేశారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి పి.వి.చలపతిరావు బృందం నిర్వహించిన పరిశోధనల్లో ఈ కొత్త జాతి వెలుగులోకి వచ్చింది. సుగంధ పరిమళం వెదజల్లే ఆకులు, ప్రత్యేక నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలు ఈ మొక్క ప్రత్యేకతలు. క్రోటన్ అరోమాటికస్ జాతికి ఇది దగ్గరి బంధువు అయినా పూర్తిగా భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అత్యంత పరిమిత ప్రాంతంలోనే లభిస్తుండటం, ఆవాసాలకు ముప్పు ఉండటంతో ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల జీవవైవిధ్య సంపదను మరోసారి చాటిందని, దీని పరిరక్షణకు మరింత కృషి అవసరమని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ కు పేరు పెట్టావ్.. ఇప్పుడు దీనికి నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావ్
-
జనసేన పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను పవన్ కల్యాణ్ రద్దు చేశారు. పార్టీ నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్ ఆదేశించారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు మీడియాలో జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ జనసేన పేర్కొంది. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని పేర్కొన్న పవన్ కల్యాణ్.. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. -
గొప్పల కోసం అప్పులు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న కూటమి
-
నెటిజన్ల ఫైర్.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని చంద్రబాబు, లోకేశ్
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయాలపాలయ్యారు. తన భుజానికి గాయం తగలడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దాంతో వైద్యులు ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఈ విషయం ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కానీ ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లీడర్ ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వెంటనే ట్వీట్లు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ గాయాలపై మాత్రం మౌనం వహించడంతో వారికి మానవత్వం లేదా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై చూపిన ప్రేమాభిమానాల్లో కనీసం పదో వంతు కూడా అత్యంత దగ్గరి బంధువైన ఎన్టీఆర్‌పై చూపలేదని చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z
-
కూటమిలో చిచ్చు.. మాకే ఆహ్వానం లేదా!?
సాక్షిప్రతినిధి, విజయనగరం: మన ఊరిలో మీటింగ్ పెట్టి మనకు ఆహ్వానం లేకపోవడమా..? వంటలన్నీ మనతో చేయించి మనకు పళ్లెం వేయకపోవడమా? మనతో ఫంక్షన్ కుర్చలు సర్దించి మనను చివరకు గుమ్మం బయట నిలబెడితే ఎలా ఉంటుంది? అచ్చం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిస్థితిలానే ఉంది. బయటకు చెప్పలేక.. ఎవరికీ చెప్పుకోలేక.. క్యాడర్ ముందు బిల్డప్ కొట్టుకోలేక.. అబ్బబ్బ ఈ కష్టాలు.. అవమానాలు పగవాడిక్కూడా రావద్దు సుమీ..! అన్న వ్యాఖ్యలు నెల్లిమర్ల నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు వస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు పాల్గొంటున్నట్టు ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎమ్మార్ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది. అందులో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎయిర్‌ఫోర్ట్ ప్రారంభానికి ముందు ప్రధాని పర్యటన ఏర్పాట్లు అంటూ రోజూ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లడం.. ఏర్పాట్లు.. పర్యవేక్షణ అంటూ హడావుడి చేయడం తప్ప ఆఖరుకు జీఎంఆర్ వారు వేసిన ఆహ్వాన పత్రంలో కూడా ఎమ్మెల్యే పేరు లేకపోవడం పార్టీ క్యాడర్‌ను ఆవేదనకు గురిచేస్తోంది. ఎయిర్‌పోర్టు రానీయండి.. వేలల్లో ఉద్యోగాలు..ఇక మీ జీవితాలు మారిపోతాయి.. ఇంటికో ఉద్యోగం.. రెండు చేతుల్లో డబ్బులు గలగలా అంటూ చెప్పుకొచ్చిన ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రంలో పేరు లేకపోవడం చూసి.. ఆమె స్థాయి ఇంతేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, దీనివెనుక స్థానిక టీడీపీ నేతల కుతంత్రం ఉందన్న వ్యాఖ్యలు జనసేన క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు లేని ప్రాధాన్యం లోకేశ్‌కు ఎలా ? ఎంతపెద్ద నాయకుడు వచ్చినా స్థానిక నాయకత్వానికి అయితే ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు వేదిక మీద సీట్లు ఉంటాయి. కానీ ప్రధాని కార్యక్రమానికి మాత్రం స్థానిక ఎమ్మెల్యే మాధవికి ప్రత్యేక ఆహ్వానం లేకపోవడం ఆమెను జీఎమ్మార్ లైట్ తీసుకున్నట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ ప్రాంతానికి, ఆ ప్రాజెక్టుకు సాంకేతికంగా ఎలాంటి అనుబంధం లేని లోకేశ్, పవన్ కల్యాణ్ వంటివారికి ఎలా ప్రాధాన్యం ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. -
పవన్ కు బిగ్ షాక్.. Gen-Z తిరుగుబాటు.. జనసేనపై సోషల్ మీడియాలో వార్
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. బాబు,పవన్ పై CPI నారాయణ ఫైర్
-
కాక్రోచ్ దెబ్బకు బీజేపీ డౌన్! ఉద్యమంపై పవన్ కామెంట్స్ రగడ
-
చంద్రబాబుకు బిగ్ ఝలక్ ఇచ్చిన పవన్
-
సీఎం చంద్రబాబుకి ఝలక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఝలక్ ఇచ్చారు. కేబినెట్ సమావేశం సమయంలో పవన్ కళ్యాణ్ వేరే సమీక్ష నిర్వహించారు. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌కి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. మంగళగిరిలోనే ఉన్నా కేబినెట్‌కు హాజరు కాలేదు. అదే సమయంలో అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు కేబినెట్ని పవన్ కళ్యాణ్ లెక్కచేయరు. గత కేబినెట్ సమావేశానికి హాజరుకాని పవన్ కళ్యాణ్.. గతంలో సీఎం చంద్రబాబు సమీక్షలకు కూడా వెళ్లలేదు.దీంతో సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం వైనంపై అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతోంది -
బాబూ.. లక్ష్మీ కటాక్షమా.. ఓట్ల రాజకీయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేవిగా ఉంటున్నాయా? లేక అంతా ఆమోదించేవిగా ఉంటున్నాయా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన కొన్ని ప్రకటనలను గమనించండి. అమరావతికి లక్ష్మీ కటాక్షం-హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాం.. అమరావతి అంటే విజయవాడ గుంటూరు, మంగళగిరి కలిసి ఉండేదే.. ఈ వ్యాఖ్యలను విశ్లేషించుకుంటే ఏమి అర్దం అవుతుంది?ఇంతకాలం అమరావతిని దేవతల రాజధాని అని ఆయన ప్రచారం చేశారు. దీనిపై వస్తున్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకున్నారేమో తెలియదు కాని ప్రజల రాజధాని అని కూడా అంటున్నారు. అంతవరకు సంతోషమే.దేశంలో మరే రాష్ట్రంలో తమది దేవతల రాజధాని అని ఏ ముఖ్యమంత్రి చెప్పి ఉండరు. ప్రజలను సెంటిమెంట్‌తో ఆకట్టుకోవడం కోసం ఆయన ఇలా చేస్తున్నారన్నది తెలుస్తూనే ఉంది. గత ఏడెనిమిదేళ్లుగా ఆయన ఈ మాట చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారట. ఇలా అనడంలోని ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు. భారత్.. రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ దేశంగా ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాలి. చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉంటే ఒకరకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తుంటారన్న భావన రాజకీయ వర్గాలలో ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మతపరమైన రాజకీయాలు చేయడానికి రకరకాల యత్నాలు చేశారు. చంద్రబాబు 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే ప్రయత్నం సాగిస్తున్నారు.తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపించి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టేందుకు కృషి చేశారు. తీరా అలాంటిదేమీ జరగలేదని తేలడంతో ఆయన సెల్ఫ్‌గోల్ వేసుకున్నట్లయింది. అయినప్పటికీ ఈ మధ్య మీమతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ స్పీచ్‌లు ఇస్తూ ప్రజలను అటువైపు మళ్లించడానికి తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ఆయన ఇలా మతపర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలుతోంది.ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ మతాల ఆధారంగా కాకుండా ప్రభుత్వాల పనితీరు, విధానాల ఆధారంగానే ఓట్లు వేస్తూ వచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన అంశాలకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అందులోనూ మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ధోరణి మరింత హెచ్చింది. బీజేపీ మెప్పు కోసం చంద్రబాబు కూడా హిందూయిజాన్ని ప్రధాన అంశంగా మలచుకుని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అమరావతి రాజధానిలో జగన్నాధ రధయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా స్వామివారి ఆశిస్సులను కోరుకోవడం, ప్రజలకు మేలు కలగాలని ప్రార్ధించడం సహజంగానే జరుగుతుంది. కాని హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మించడం ఏమిటో తెలియదు. ఈ మాటలు విన్న ఇతర మతాలవారికి అది ఎలాంటి భావన కల్గిస్తుందన్నది ఆయన ఆలోచించుకోవాలి!గతంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని పిలవరా అని అన్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీకి దూరంగా ఉన్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు అన్ని కులాలను, మతాలను తన వెంట తీసుకువెళ్లేలా వ్యవహరించాలి. దేశం కాని, రాష్ట్రం కాని మతపరమైనవిగా లేవన్న సంగతి గుర్తించాలి. స్థల మహత్యంతో అమరావతిని ఎవరూ కదలించలేరని అంటూ రాజకీయ లక్ష్యంగా ప్రసంగం చేసినట్లు అనిపిస్తుంది. ఆధ్యాత్మికత తోడుంటేనే ప్రశాంతత వస్తుందని ఆయనే చెబుతారు. కాని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆయనే రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు.అమరావతికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషపడతారు. లక్ష్మీ కటాక్షం రాష్ట్రం అంతటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు కాని, అమరావతికే కోరడం ఏమిటో తెలియదు. ఇప్పటికైతే అమరావతి ద్వారా ప్రభుత్వానికి లక్ష్మీ కటాక్షం ఎంత జరిగిందో అంటే.. ఎంత ఆదాయం వచ్చిందో తెలియదు కాని, అప్పు మాత్రం 47వేల కోట్లకు చేరింది. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి లక్షకోట్లు ప్రస్తుతం ఖర్చు చేయవలసి ఉందని అంటారు. నిజంగానే లక్ష్మీకటాక్షం జరిగి, ప్రజల మీద భారం లేకుండా అమరావతి సొంతంగా సంపాదించుకుంటే చంద్రబాబు చెప్పింది నిజమేనని నమ్ముతారు. అలాకాకుండా వేల కోట్ల అప్పులు తెస్తూ దానినే లక్ష్మీ కటాక్షం అని అనుకోవాలంటే కష్టం అవుతుంది.అంతేకాదు... అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ రెండేళ్లలో కలిగిన లక్ష్మీ కటాక్షం పెద్దగా ఏమి లేదని బాధపడుతుంటారు. వారికి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చి ఉంటే కొంత కటాక్షం కలిగేదేమో. పైగా బలవంతపు భూ సేకరణ ద్వారా రైతుల వద్ద ఉన్న లక్ష్మీని కూడా ప్రభుత్వం లాక్కుంటోందన్న బాధ పలువురిలో ఉంది. కొందరు మహిళలను సైతం ప్రభుత్వం ఈ విషయంలో వేధించిన తీరు చూసి లక్ష్మీదేవి కూడా బాధపడి ఉండాలి. ప్రభుత్వం స్టార్ హోటళ్లకు ఎకరా ఎనిమిది కోట్లకు భూమి ఇస్తామని ప్రతిపాదించిందట. అదే టైమ్ లో భూముల సొంతదారులైన రైతులకు మాత్రం కోటి, రెండు కోట్లు కూడా ఇవ్వడం లేదని ఉండవల్లి రైతులు వాపోతున్నారు.చివరిగా మరో మాట.. మాజీ సీఎం జగన్ మావిగన్ అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను ఒక కారిడార్‌గా తీసుకుని రాజధాని అభివృద్ది చేయాలని సలహా ఇస్తే దానిని చంద్రబాబు ఎద్దేవ చేశారు. కాని తాజాగా చేసిన ఒక ప్రసంగంలో అమరావతి అంటే విజయవాడ, మంగళగిరి, గుంటూరు కలిసి ఉన్నాయని అంటున్నారు. అవి ఇందులో భాగం అయితే రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు వంటివి మళ్లీ ఎందుకు నిర్మించాలి? వాటికోసం వేల ఎకరాల భూములు తీసుకుని రైతులను ఎందుకు బాధించాలి అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. మొత్తం తెచ్చిన అప్పు అంతా అమరావతి 29 గ్రామాలలోనే ఎందుకు వ్యయం చేస్తున్నారన్నదానికి సమాధానం చెప్పరు. అయితే జగన్ మావిగన్ ప్రతిపాదనను కాదనలేని స్థితికి చంద్రబాబు చేరుకున్నారని అనుకోవాలి. మతం మత్తు మందు వంటిదని కారల్ మార్క్స్ అంటారు. దానిని ఎంతవరకు అంగీకరిస్తారో తెలియదు కాని, మతం పేరుతో రాజకీయ లబ్ది పొందడానికి మాత్రం చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దేవుడు కొండపైనే TDP అరాచకాలు.. మహిళలకు ఏం జరిగిన వాలిపోతానన్న పవన్ ఎక్కడ..?
-
గుంటూరు మహిళపై దాడి.. అనిత, పవన్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు
-
నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్
-
దేవాదాయ శాఖ నిధుల్లో గోల్ మాల్..? రోజు రోజుకు పెరుగుతున్న కూటమి అక్రమాలు
-
వేటలో ఉన్నావా పవన్? ఈ దుర్మార్గ ప్రభత్వానికి నువ్వు మద్దతా!
-
ప్రశ్నిస్తే జైలు.. పొగిడితే జేజేలా?
సోషల్ మీడియాలో పెడధోరణులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేస్తుందట. ప్రభుత్వం మీద వచ్చే నెగిటివ్ వార్తలపై నిఘా పెడతారట. అసభ్య పోస్గింగులను అరికట్టే నెపంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అడుగులు వేస్తోందా అన్న సందేహాన్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.అసభ్య పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాటిని కచ్చితంగా కంట్రోల్ చేయవలసిందే. కాని ఇప్పటికే అందుకు తగిన వ్యవస్థ ఏపీలో ఉంది. అయినా అది సరిపోవడం లేదని ప్రభుత్వం ఎందుకు అంటోంది? పోలీసు వ్యవస్థ సమర్థంగా ఆ దిశలో పనిచేయడం లేదని భావిస్తున్నారా? అసభ్య పోస్టింగ్‌లను ఎలాగైనా ఆపవచ్చు. అసలు సమస్య ఏమిటంటే కూటమి సర్కార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రతిబింబిస్తుండడం కావచ్చు. దానిని కంట్రోల్ చేస్తే వచ్చే ఎన్నికలలో నెగ్గగలమన్న ఆశ ఉండవచ్చు. నిజానికి సోషల్ మీడియాతోనే గెలుపు ఓటములు నిర్ణయం కావు. ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేసే తీరు మొదలైనవి ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే అసత్య ప్రచారాల వల్ల నష్టం జరగదా అంటే కాదని అనలేం. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వైఎస్సార్సీపీకు చెందినవారు కాని, వారి సోషల్ మీడియా కాని అబద్దాలు చెప్పే అవకాశం తక్కువ. నిజాలు చెబుతుంటేనే పోలీసు వ్యవస్థను ఉపయోగించి వైఎస్సార్సీపీవారిపై ఎన్ని కేసులు పెడుతున్నది కనబడుతున్న తరుణంలో కోరికోరి ఎవరు సమస్య తెచ్చుకుంటారు? సోషల్ మీడియా పోస్టులలో పచ్చి బూతులు పెట్టిన కొందరిని టీడీపీ ఎంకరేజ్ చేస్తున్నదన్న ఆరోపణ ఉంది.జగన్ ప్రభుత్వ సమయంలో అలాంటివారిపై ఏవైనా చర్య తీసుకోబోతే ఇంకేముంది ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు, వాక్ స్వాతంత్రం, మీడియా స్వాతంత్రం పూర్తిగా పోయాయి అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారితో పాటు ఎల్లో మీడియా వారు ఎన్ని ఆరోపణలు చేసేవారు? బహుశా వారు ఆ సంగతులు మర్చిపోయి ఉండవచ్చు. అరాచక పోస్టులు పెట్టిన ఒక వ్యక్తితో మహానాడులో ప్రసంగమే ఇప్పించారే! అది ఏపాటి మర్యాద అవుతుంది? వైఎస్ జగన్ కుటుంబంపైన, వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలపైన, ఆ పార్టీ మహిళా నాయకులపై ఎంత దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ మద్దతుదారులు కొందరు ఎలా చేశారో అందరికి తెలుసు. వారిలో కొందరికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. మరికొందరు అంతకన్నా పెద్ద పదవులలోనే ఉన్నారు కదా! బహుశా తమ అనుభవం రీత్యా, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచివేయడమే మార్గంగా భావించినట్లు ఉన్నారు.మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాపైనే ఎక్కువగా చర్చ జరిపే పరిస్థితి వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు సాధారణంగానే అభ్యంతరకరంగా ఉండే సోషల్ మీడియాపై కేసులు పెడుతుంటారు. కాని వారి బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చాక మారిపోయింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్‌గా ఉండే ప్రభుత్వ లోటుపాట్లపైన, వైఫల్యాపైన ప్రశ్నిస్తారో వారందరిపై ఏదో రూపేణా కేసులు పెట్టడమే పోలీసుల విధిగా మారిపోయినట్లుంది. అందుకే ఏకంగా సుమారు 1500 కేసులు సోషల్ మీడియాపై పెట్టారు. ఆ కేసులో 1300 మందిని అరెస్టు చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని సీపీఎం కార్యదర్శి వి. శ్రీనివాసరావు వంటివారు గొంతెత్తి చెబుతున్నారు.రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహ కేసు పెట్టి కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. టీడీపీ మద్దతుదారుగా భావించే మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా రావణ్‌పై ఆ చట్టాన్ని ప్రయోగించడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. వీరెవ్వరిని తప్పుపట్టని చంద్రబాబు ఈ కేసును వైఎస్సార్సీపీకి రుద్దాలని ప్రయత్నించడమే ప్రభుత్వ బలహీనతగా తీసుకోవాలి.ఒకప్పుడు కులమతాలను రెచ్చగొడుతూ టివీలో నిత్యం మాట్లాడే ఒక నాయకుడిమీద ఆనాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెడితే దానిపై ఆ రోజుల్లో తెలుగుదేశం ఇంతెత్తున ఎగిరిపడింది. ఈ రోజుల్లో కూడా రాజద్రోహం ఏమిటి అని ప్రశ్నించింది. కాని తాను అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై దాడి చేయడమే కాదు.. ఒక చిన్న యూట్యూబర్‌పై రాజద్రోహం కేసు పెట్టి కూటమి సర్కార్ తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సంతృప్తిపరచడానికా? లేక సోషల్ మీడియాను భయపెట్టడానికా అన్నది వేరే సంగతి.నిజానికి చంద్రబాబు ప్రభుత్వం దేనిమీద టాస్క్ ఫోర్స్‌లు వేయాలి? టీడీపీ, జనసేనలు కలిసి ఇచ్చిన ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశాం. ఇంకెన్ని చేయాలి? వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎలాంటి పద్దతి అనుసరించాలి? అన్నవాటి మీద కదా! పెన్షన్ నాలుగువేలు చేయడం, మరికొన్నిటిని అరకొరగా అమలు చేయడం మినహా ఎన్నికల మానిఫెస్టోని తుంగలో తొక్కినట్లుగా వ్యవహరిస్తూ, సోషల్ మీడియాతో ఏదో ప్రమాదం ముంచుకువస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని అరికట్టాలట. ఇది తప్పు కాదు. కాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎన్ని అబద్దాలు ప్రచారం చేశారో జనానికి తెలియదా?కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీసర్వే చేస్తుంటే, జగన్ ప్రజల భూములు కాజేస్తున్నారని చేసిన ప్రచారాన్ని ఏమంటారు?ఇప్పుడు అదే రీసర్వే తమ ఘనత అని ఎలా చెప్పుకుంటున్నారు? 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, అందుకు వలంటీర్లు బాద్యులని చెప్పిన సంగతి నిజమా? అబద్దమా? కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అంటూ చంద్రబాబు అచ్చంగా వాటి గురించి పలుమార్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే సీనియర్ నేతలలో ఒకరైన చంద్రబాబు వీటిగురించి పదే, పదే మాట్లాడడం సరైనదేనా. తనకు ఫలానా కులం వారైనా ఓట్లు వేయరా అని అడిగిన వ్యక్తిని పక్కనబెట్టుకున్నదెవరు?ఒక సభలో మాట్లాడుతూ గతంలో శ్రీరాముడి తల తొలగించారని ఆరోపించడం సరైనదేనా? ఆ కేసులో పట్టుబడిన వ్యక్తి టీడీపీ మద్దతుదారు అని అప్పట్లో పోలీసులు వెల్లడించారే. ఆ వ్యక్తికి కూటమి అధికారంలోకి వచ్చాక ఐదు లక్షలు ఇచ్చారని వార్తలు వచ్చాయే! ఆదోనిలో శివాలయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించుకున్నాడని చంద్రబాబు చెప్పారు. దీనిపై చర్య తీసుకోవలసింది ఎవరు? పైగా అతను జనసేనకు చెందినవాడని వెల్లడైంది కదా! పదే, పదే ఇలాంటి విషయాలను ప్రస్తావించడం సమాజానికి మంచిదా? ఇవన్ని ఎందుకు! ఇతర మతాలను దూషిస్తున్న ఒక వ్యక్తి జోలికి ఎందుకు ప్రభుత్వం వెళ్లడం లేదు? ముఖ్యమంత్రి, లేదా కీలకమైన పదవులలో ఉండి మీ మతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ మాట్లాడడం ద్వారా టీడీపీ నేతలు సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలిచారు?తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి మతానికి అపచారం చేశారా? మంచి చేశారా? మతం గురించి ఇంతగా బాధపడుతున్నవారు అయోధ్య రామాలయంలో డోనేషన్ల స్కామ్ గురించి ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు. అది మతానికి జరిగిన నష్టం కాదా? కొద్ది రోజుల క్రితం ఒక సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను చెప్పిన విషయంపై సభలో ఉన్న మహిళలు చప్పట్లు కొట్టరా అని బాధపడ్డారు.. ఉచిత బస్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయం కల్పించామని ఆయన తన ప్రసంగంలో చెబుతుంటే ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో ఆయన అసంతృప్తి చెంది తాను మంచి పనిచేస్తే చప్పట్లు కొట్టరా అని అడిగారు. నిజంగా ఫ్రీబస్ స్కీమ్‌పై ఇచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు అమలు చేస్తున్నదేమిటి?తిరుపతి, అన్నవరం ఏ క్షేత్రానికి అయినా, రాష్ట్రంలో ఏమూల నుంచి ఏ మూలకైనా ఏ బస్ అయినా ఎక్కి వెళ్లవచ్చని కూటమి పార్టీలు ప్రచారం చేశాయా? లేదా? ఇప్పుడు అదేమాదిరి అమలు చేస్తున్నారా? లేక పలు షరతులు పెట్టారా? ఆడబిడ్డ నిధి, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీల మాటేమిటి? వలంటీర్లకు ఏమి చెప్పారు. ఆ తర్వాత ఎలా ఎగవేశారు? ఇలాంటివన్ని ప్రజలకు గుర్తున్నాయి కనుకే సభకు వచ్చినవారు చప్పట్లు కొట్టడం లేదేమో అన్న సంగతి చంద్రబాబు, ఇతర కూటమి నేతలు గుర్తిస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజనరీ కాదు...పక్కా విధ్వంసకారుడు
-
నూర్ ఫాతిమా ఆగ్రహం.. కొంచమైనా బుద్ధుందా?
-
చేయని తప్పుకు గుడి మెట్లు కడిగావ్.. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావ్ నీ మొహం?
-
మహిళల భద్రతపైనా అదే హైడ్రామా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మహిళల జోలికి వస్తే అదే చివరి రోజవుతుందని చెప్పే సీఎం చంద్రబాబు, మహిళల జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని పెద్ద పెద్ద మాటలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మహిళల జోలికి వస్తే ఎంతటివారినైనా ఊరుకోమని చెప్పే హోంమంత్రి అనిత, మహిళా ఎమ్మెల్యేగా ఉన్న గళ్లా మాధవి... గుంటూరు నగరంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి, నీళ్ల కుళాయి విషయంలో తనకు రూ.10 వేల కప్పం కట్టలేదనే అక్కసుతో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసి తీవ్రంగా కొడుతూ హింసించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో వెలుగులోకి రావడంతోనే... తొలుత విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, మహిళను వివస్త్రను చేసి కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం, ‘సాక్షి’ బయటపెట్టడంతో రాజకీయ డ్రామాకు తెర తీశారు. ఓపక్క 15న ఘటన జరిగితే, 16వ తేదీన బాధితులు తనను కలిశారని చెబుతున్న వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి.. ఇంత అమానుష ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోలేదు. 17వ తేదీ రాత్రి వరకు ఎందుకు తాత్సారం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజీ ప్రయత్నాలు చేసిన టీడీపీ నేతలు అవి ఫలించకపోవడం, వీడియోలు బయటకు రావడంతో ఇక చేసేదిలేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ తేదీన సంఘటన జరిగితే, 18వ తేదీ వరకు హోంమంత్రి గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ఈ విషయంపై స్పందించకపోవడం చూస్తుంటే వీరికి మహిళల భద్రత పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇదేదో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు. జిల్లా కేంద్రమైన గుంటూరు నడిబొడ్డున ఇంత దారుణం జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? కనీసం హోంమంత్రికి సమాచారం లేదా? ఉన్నా టీడీపీ నేతలు చేసిన దారుణంపై స్పందించేందుకు మనసు రాలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏం చేసినా మనవారైతే ఓకే.. చిన్న చిన్న సంఘటనలకే నిందితులను రోడ్లపై తిప్పడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం వంటివి చేసే పోలీసు యంత్రాంగం.. రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టిన ఘటనకు పాల్పడిన నిందితుల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను అంత దారుణంగా హింసించిన నిందితులను కనీసం ప్రెస్మీట్లో కూడా చూపించకుండా, దొంగచాటుగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం చూస్తుంటే పక్షపాత వైఖరి తేలుతోంది. ఎంతటి నేరం చేసినా వారు అధికార పారీ్టకి చెందిన వారైతే చాలు పోలీసులు సైతం ప్రత్యేక ప్రేమ చూపుతున్నారనేది స్పష్టమవుతోంది.ఇంత ఆలస్యమా? సంఘటన జరిగి మూడు రోజులు దాటిన తర్వాత మహిళల పట్ల అపార ప్రేమ ఉన్నట్లు, వారి భద్రత విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నట్లు నటించడంలో అధికార పార్టీ నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి నుంచి సీఎం చంద్రబాబు వరకు మూడు రోజులపాటు నిద్ర నటించి, వీడియోలు బయటకు రాగానే ఉలిక్కిపడి నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. తామేదో ఈ సంఘటనపై సీరియస్‌గా ఉన్నట్లు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. ఇందులో భాగంగా ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కూడా అరెస్టు చేయని పోలీసులు... వీడియోలు బయటకు రాగానే ఏకంగా ఏకంగా జిల్లా ఎస్పీ శనివారం రాత్రి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో కలసి బాధితురాలి ఇంటికి వచ్చ మరీ విచారణ చేయడం గమనార్హం. వీడియోలు బయటకు వచ్చేంత వరకు కనీసం దారుణ ఘటనకు కారకుడైన టీడీపీ నేత, ఆయన బంధువులను అరెస్టు చేయకపోవడం చూస్తుంటే ఈ అమానవీయ ఘటనపై ఏ స్థాయిలో స్పందించారో అర్థమవుతోంది. చివరకు సీఐను వీఆర్‌కు పంపి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వస్తున్నాయి. -
ఇక వెనక్కి తగ్గం.. కచ్చితంగా పోటీ చేస్తాం: నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి భవిష్యత్ సమీకరణాలపై మరోసారి చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ఐక్యతను కొనసాగించడమే లక్ష్యంగా నేతలు తరచూ సమన్వయ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త చర్చకు దారితీశాయి.“అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం నాలుగు అడుగులు వెనక్కి వేశాం.. స్థానిక ఎన్నికల్లో అదే ఫార్ములా ఉండదు. పార్టీ బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తాం” అంటూ మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన భవిష్యత్ వ్యూహామా? అనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలోని జనసేన నేతలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. నాయకత్వం బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాలుగు అడుగులు వెనక్కి వేశామని.. అదే విధానాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని భావిస్తే పొరపాటని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత పెంచుకునేలా ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగిస్తూ ముందుకు సాగాలని సూచించారు.అసెంబ్లీ ఫార్ములా.. స్థానిక ఎన్నికల్లో వద్దు!అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పే ప్రధాన లక్ష్యంగా జనసేన సీట్ల విషయంలో భారీ రాజీకి వెళ్లింది. తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలం పెంచుకునేందుకు కీలక అవకాశమని జనసేన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని జనసేన చూస్తోంది. అందుకే బలమైన ప్రాంతాల్లో పోటీకి సిద్ధం కావాలనే సంకేతాలను నేతలు ఇస్తున్నారు.పవన్ వ్యూహానికి భిన్నమా?మరోవైపు.. చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ముందుకు సాగాలని.. రాబోయే ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలో విభేదాలకు తావు లేకుండా, సమన్వయంతో ముందుకు సాగాలనే వైఖరిని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కూటమిలో కొత్త చర్చకు కారణమయ్యాయి. ఇది కూటమి నుంచి దూరమయ్యే సంకేతమా? లేదంటే పార్టీ విస్తరణలో భాగమైన వ్యూహాత్మక అడుగులా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.జనసేనలో పెరుగుతున్న ఆశలుఅసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన కేడర్‌లో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం రావడంతో పాటు, పార్టీకి కేటాయించిన పదవులు, బాధ్యతలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో స్థానిక స్థాయిలో కూడా తమకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. తమ పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందనే భావన జనసేనలో కనిపిస్తోంది.టీడీపీ ఆధిపత్యంపై కేడర్‌లో అసంతృప్తి?కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆధిపత్యంపై జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే చర్చ సాగుతోంది. తమ పార్టీకి తగిన గుర్తింపు, అవకాశాలు దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కేడర్‌ను నొప్పిస్తూ.. కూటమి ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు.వివాదమా.. వ్యూహమా?నాదెండ్ల వ్యాఖ్యలను కూటమిలో విభేదాలుగా చూడాలా? లేక స్థానిక ఎన్నికల్లో పార్టీ బలం పెంచుకునే సహజ రాజకీయ వ్యూహంగా చూడాలా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా నాదెండ్ల వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలకం కానుంది.


