చంద్రబాబు, పవన్‌ భేటీ | Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan hold talks | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌ భేటీ

Oct 7 2026 4:16 AM | Updated on Oct 7 2026 4:16 AM

Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan hold talks

స్థానిక ఎన్నికలు, పొత్తుపై చర్చ 

34 శాతం బీసీ రిజర్వేషన్లపైనా మంతనాలు

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఏ ప్రాతిపదికన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను పంచుకోవాలో చర్చించినట్లు సమాచారం. విశాఖ, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్లలో ఎవరు పోటీ చేయాలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

తిరుపతి అసెంబ్లీ జనసేన చేతిలో ఉండడంతో ఆ కార్పొరేషన్‌ను కూడా అదే పార్టీకి కేటాయించాలా లేక వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అనే విషయంపై మంతనాలు జరిపినట్లు సమాచారం. తాము కోరుకుంటున్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీల జాబితాను చంద్రబాబుకు పవన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రెండు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో విభేదాలు పెరుగుతుండడం, స్థానిక ఎన్నికల్లో అవి ఇంకా ముదిరి గొడవలు జరిగే ఆస్కారం ఉండడంతో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపైనా సమాలోచనలు చేసినట్టు తెలిసింది. 

రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కొంత ఇబ్బంది నెలకొన్నట్లు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ దూకుడుగా వెళ్లడంతో కూటమి వ్యూహం బయటపడిపోయిందని, దాన్ని సరిదిద్దుకునేందుకు గట్టిగా మాట్లాడాల్సిన అవస­రం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement