పిఠాపురం: ఎక్కడా లేనివిధంగా తాను పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే.. మీరు ఆధిపత్యపోరుకు దిగుతున్నారేమంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ జనసేన కేడర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని ఎలా సెట్ చేయాలో తనకు తెలుసంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మూడునెలల్లో పిఠాపురంలో తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
జీవనగర్లో శ్మశానవాటిక కోసం పవన్‌ను కలిసేందుకు వెళ్లిన ఎంఆర్‌పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంఆర్‌పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నలుపు రంగు డ్రెస్‌గానీ, చీరగానీ ధరించి పవన్‌కళ్యాణ్ సభకు వచ్చినవారిని పోలీసులు అనుమతించలేదు. కొందరు మహిళలు ధరించిన నలుపు రంగు చున్నీలను తీసేయించి సభలోకి అనుమతించారు. చున్నీలను తొలగించమనడం తమను అవమానించడమేనని మహిళలు ఆవేదనతో చెప్పారు.
ఇదీ చదవండి: యానాంలో రికార్డు ధర పలికిన పులస చేప


