వైఎ‍స్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Will Meet Governor Abdul Nazeer Today | Sakshi
Sakshi News home page

వైఎ‍స్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

Sep 23 2026 10:58 AM | Updated on Sep 23 2026 11:23 AM

YS Jagan Will Meet Governor Abdul Nazeer Today

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజకీయ కక్షసాధింపు పతాక స్థాయికి చేరిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ప్రభుత్వాన్ని, డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తున్నారని విమర్శించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది లేకుండా చేసుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపించింది. ప్లాన్‌ ప్రకారం రౌడీషీట్లు తెరుస్తున్నారని మండిపడింది.

కాగా, డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ శాప్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన వారిపై రౌడీషీట్లు తెరిచారని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, దేవినేని అవినాష్‌ సహా పలువురిపై రౌడీషీట్లు తెరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ అరాచకాలు, డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను వైఎస్‌ జగన్‌ కోరనున్నారు.

ఇదీ చదవండి: డీఎస్సీ బాగోతం భయానికే అక్రమ అరెస్ట్‌లు: పొన్నవోలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement