పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి రామ్ ప్రకటన
ఖమ్మంమామిళ్లగూడెం: వరంగల్– ఖమ్మం–నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును అధిష్టానం ఖరారు చేసిందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి రామ్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం మిరియాల రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్ మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంపై అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.


