కాంగ్రెస్‌ మహిళా నేతపై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తి అరెస్టు | Mahila Congress Leader Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మహిళా నేతపై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తి అరెస్టు

Aug 24 2026 10:05 AM | Updated on Aug 24 2026 10:11 AM

Mahila Congress Leader Incident In Hyderabad

సాక్షి, హైదరాబాద్: చెందిన కాంగ్రెస్‌ మహిళా నేతను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో మార్ఫింగ్ వీడియోలతో అనుచిత పోస్టులు చేసిన నిందితుడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడకు చెందిన ఓ స్టాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి (30) ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ ఖాతా సృష్టించాడు. గతేడాది అక్టోబర్‌లో ‘పూరా లోకల్‌’ పేరుతో ఉన్న ఆ ఖాతా ద్వారా నగరానికి చెందిన ఓ మహిళా నాయకురాలి వీడియోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని అరెస్టు చేశారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement