ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో జనసైనికులు రోడ్లపైకి వచ్చి మద్దతుగా నిలిచారని, అందుకే స్థానిక ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ‘చంద్రబాబు అరెస్టు సమయంలో మేమేం చేయలేదా?’ అని తెలుగు తమ్ముళ్లు పవన్‌ను నిలదీస్తున్నారు.
చంద్రబాబు అరెస్టయిన సమయంలో తాము కూడా నిరసనలు తెలిపామని, అసలు ఆయన్ని అరెస్ట్ చేసే సమయంలోనే అల్లర్లు సృష్టించి అడ్డుకునే ప్రయత్నాలు సైతం చేశామని.. అందుకే అప్పటి ప్రభుత్వం భారీ భద్రత మధ్య తరలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆఖరికి.. పొరుగు రాష్ట్రంలోనూ నిరసనలు నిర్వహించిన సంగతి పవన్‌కి గుర్తు లేదేమోనని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. తాము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమని, అధినేత విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అదే సమయంలో పవన్ చంద్రబాబు కోసం ఆనాడు అర్ధరాత్రి రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేయలేదని.. ఆనాడు మంగళగిరి ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలోనే అది జరిగిందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ పాత జనసేన ట్వీట్లను తెరపైకి తెచ్చారు.
మా వల్లే 21 స్థానాలు..!
గత ఎన్నికల్లో జనసేన సాధించిన విజయాలపైనా టీడీపీ మాములు సెటైర్లు వేయడం లేదు. కూటమి విజయంలో తమ పార్టీ కేడర్ చేసిన కృషే ఎక్కువని, అసలు 21 సీట్లు కూడా ఇవ్వడం ఎక్కువేనని.. తమ జోక్యం లేకుండా అన్ని సీట్లు గెలిచేది కాదని కొన్ని పేజీలు, కొందరు టీడీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేసి(తాము లేకపోవడం వల్లే) ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని గుర్తు చేస్తున్నారు.
@Telugu360 @PawanKalyan @JanaSenaParty ఏం త్యాగం చేసారు రా?? ప్రశాంత్ కిషోర్ పొత్తు వద్దు ఒంటరిగా పోటీ చేయండి అంటే... అరెస్ట్ చేసినప్పుడు నువ్వు వచ్చి రోడ్ మీద పోడుకున్నావు అని పొత్తుకి సరే అన్నారు.. అంతకు మించి పదవులు ఇచ్చారు. @JaiTDP లేకపోతే mla కే దిక్కు లేదు ఎప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా @PawanKalyan https://t.co/6iusmGJuiN
— SreenuTalks (@Sreenutalks9) October 11, 2026
స్థానిక ఎన్నికల వేళ లొల్లి తప్పదా?
రాష్ట్రస్థాయి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు చిచ్చు పెట్టొచ్చనే ఊహాగానాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్, పీవీఎన్ మాధవ్‌లు పదే పదే భేటీ అవుతుండడం.. ఒక ఒప్పందానికి రాలేకపోతున్నారనే వాదనను మరింత బలపరుస్తోంది.
దీనికి తోడు బలం ఉన్న చోట్ల ఒంటరిగా పోటీ చేసి తీరతామని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఇప్పుడు అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే తరహా కామెంట్లు చేయడం.. ఈ క్రమంలో తామే ఎక్కువ త్యాగాలు చేసినట్లు మాట్లాడడం.. తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం సహించడం లేదు. స్థానిక ఎన్నికల హడావుడి పెరిగే కొద్దీ కూటమిలో సీట్ల లెక్కలతో పాటు ఈ రాజకీయ మాటల యుద్ధం కూడా వేడెక్కే అవకాశముంది. ఈ తరుణంలో.. జనసేనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న పవన్ డిమాండ్‌ను, ఇప్పుడు టీడీపీ కేడర్ జనసేనపై చేస్తున్న ట్రోలింగ్‌ను చంద్రబాబు సీరియస్‌గా తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Tweets delete chey ra pichi na kodka @JanaSenaParty 🤦 https://t.co/pVGlLAMrsq
— Balaa (@BalaaOnX) October 11, 2026
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలి


