విజయ్‌కు కొత్త టెన్షన్!
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో, విజయ్ మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు చేరనున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు సమాచారం.కాగా, తమిళనాడు ప్రభుత్వానికి అటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్నాడీఎంకే రెబల్స్‌కు మంత్రి పదవులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరికను సీపీఎం వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్‌కు అల్టిమేటం విధించినట్టు సమాచారం. దీంతో, సీఎం విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్ నివాళులు అర్పించం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందికాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.డిఫెన్స్‌లో టీవీకే.. ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలిసి తెలిసి బొంకిన బాబు!
అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా నేర్పరి. ఆచరణ సాధ్యం కాని విషయాలను కూడా సులువుగా ప్రచారంలో పెట్టేయగలరు. అధిక సంతానం విషయమే తీసుకోండి. డైవర్షన్ కోసం చేస్తున్నారా? లేక ప్రజలను మభ్యపెట్టేందుకా? అన్నది తెలియదు కానీ తన ప్రతిష్టను సైతం పట్టించుకకుండా ఆయన ముగ్గురు పిలల్ని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు అని ఒక ట్యాగ్‌లైన్ పెట్టేసుకున్నారు. ఇదేం పిచ్చిగోల అని మనకు అనిపించవచ్చు కానీ ఆయన లక్ష్యం వేరు. బాబుగారు గొప్ప సిద్ధాంతకర్త, విజన్ ఉన్న వాడు అని జనాలు అనుకోవాలన్నది ఆయన ఫీలింగ్ కావచ్చు. అయితే.. ఈ సారి చంద్రబాబు వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆక్షేపణ వ్యక్తమవుతోంది. అంతమంది పిల్లల్ని కనడానికి ఆడవారేమైనా యంత్రాలా?అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇస్తానని చెబుతున్న మొత్తం డైపర్లకు కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా పేరు ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా పుట్టిన పిల్లల ఆహారం, మందులు, చదువు, పెంపకం ఖర్చులు కూడా ప్రభుత్వం చూసుకుంటుందా అని ప్రశ్నించారు. ప్రజలకు కావల్సింది జీవన భధ్రత తప్ప పతాక శీర్షికల్లోకి ఎక్కే స్కీములు కావని ఎద్దేవ చేశారు. సినీనటి పూనమ్ కౌర్ కొంచెం భిన్నంగా స్పందిస్తూ.. ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృస్టిలో పెట్టుకుని ముందు లోకేశ్ ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆశిద్దాం అని వ్యాఖ్యానించారు. మాజీ పోలీస్ ఉన్నతాధికారి కిరణ్ బేడీ మహిళలు తమ అత్యంత ఉత్పాదక జీవిత కాలాన్ని ముగ్గురు, నలుగురు పిల్లలను కనడం, పెంచడానికే వినియోగించాలన్న భావన సరైనదేనా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబుది ఫ్యూడల్ భావజాలంగా ఆమె అభిప్రాయపడ్డార అన్నమాట. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు చెబుతున్న రూ.ముప్పైవేలు బారసాల ఖర్చులకైనా వస్తాయా? అని అడిగారు. మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పేర్నినాని, అంబటి రాంబాబు తదితరులు చంద్రబాబు తన కుటుంబంలో దీనిని ఆచరించి చూపించాలని సూచించారు. ఈ విమర్శల మాటెలా ఉన్నా... చంద్రబాబుకు ఇవన్నీ తెలియని అమాయకుడేమీ కాదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా ప్రజల దృష్టి.. విపక్షాల చర్చ ఇతర సమస్యలవైపు వెళ్లకుండా ఉంటుందన్నది ఆయన అంచనా. సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా సంతానోత్పత్తి గురించి ఆలోచించాలన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన వాగ్దానం ఏమిటో ప్రజలకు గుర్తుకు రాకూడదన్నమాట. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులను తగ్గించి చమురు ధరలు పెరగకుండా చూస్తామని గొప్పలకు పోయారు. అది సాధ్యం కాదని వారికి ఆనాడే తెలుసు. అయినా తన కుమారుడు లోకేశ్‌తో కలిసి జనాన్ని నమ్మించే యత్నం చేశారు. తాను సంపద సృష్టిస్తానని ప్రతి సభలోను జనం చెవులు దద్దరిల్లేలా ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక సంపద సృష్టించే మార్గాలు ఉంటే తనకు చెవిలో చెప్పాలని జనాన్ని కోరారు. గల్లా పెట్టె ఖాళీగా ఉందని చేతులెత్తేశారు. తాజాగా అసలు సంపద సృష్టి మీ చేతిలోనే ఉందని, అది పిల్లలను కనడమేనని చెప్పి ప్రజలందరిని అమాయక గొర్రెలుగా మార్చారన్నమాట. నిజానికి సంపద సృష్టి తన చేతిలో లేదని ఆయనకు ఎన్నికల ముందు కూడా బాగా తెలుసు. అయినా ఎన్నికలలో జనాన్ని మభ్య పెట్టడానికి అలాంటి డైలాగులు చెప్పాలి. సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో విపరీత ప్రచారం చేయాలి.తద్వారా చంద్రబాబు ఏదో చేసేస్తారన్న భావన కలిగించాలి. ఒట్లు దండుకోవాలి.ఇదే లక్ష్యంగా ఆయన పనిచేస్తుంటారు. ఇలా ఒకటి కాదు.. 2014 ఎన్నికలలో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని తెగ చెప్పారు.అదెలా సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రశ్నించినా, చంద్రబాబు కు ఆ మాజిక్ తెలుసునని టీడీపీ వారు వాదించేవారు. వాస్తవానికి చంద్రబాబుకూ తెలుసు తాను చేస్తున్నది తప్పుడు వాగ్దానం అని. బ్యాంకులలో ఉన్న బంగారు నగలను కూడా విడిపించి ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారంటేనే అది మోసపూరితమైన హామీ అన్న సంగతి ఎంతో విజన్ ఉందని చెప్పుకునే ఆయనకు తెలియదా! రైతుల ఆశను ఆయన క్యాష్ చేసుకున్నార అన్నమాట..ఓట్లు వేశారు. ఆ తర్వాత మరీ ఇంత ఆశపోతులుగా ఉంటారా అని వారినే ఎద్దేవ చేశారు. సూపర్ సిక్స్ లో ఉన్న హామీలు ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద రూ.1500 చొప్పున ప్రతి మహిళకు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. అయినా వారిని బురిడి కొట్టించాలంటే ఇదొక్కటే మార్గం అనుకున్నారు. చెప్పేశారు. అధికారం వచ్చాక దాని ఊసే ఎత్తలేదు.మంత్రి అచ్చెన్నాయుడు దానిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని జనానికి చెప్పారు. పేదరికం లేకుండా చేసేస్తాననంటూ ప్రగల్బాలు పోయారు. తదుపరి ధనికులు పేదలను దత్తత తీసుకుంటే సరి అని కొత్త సూత్రం చెప్పేసి చేతులు దులుపుకున్నారు.నిరుద్యోగ భృతి మూడువేలు చొప్పున ఇస్తామని చెప్పారు. గత టరమ్ లో కూడా ఆయన చెప్పినా చేయలేదు. అయినా మళ్లీ అదే వాగ్దానం చేశారు.అధికారంలోకి వచ్చాక 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ కాకి లెక్కలు చెప్పి సరిపెట్టుకోమంటున్నారు.ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అది చాంతాడంత జాబితా అవుతుంది. పిల్లలను కనండని ఎందుకు చెబుతున్నారు. జనాభా తగ్గుతోందన్న కారణంగా ఆయన అంటున్నారని అనుకుంటే పొరపాటే.కేవలం ఇదొక భావజాలంగా మార్చి జనాన్ని ఏమార్చాలి. దక్షిణాదికి నిధులలోనే కాక,లోక్ సభ సీట్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని ఈ రాష్ట్రాలలో వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఈ విషయంలో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడేమో ప్రధాని మోడీని ప్రశ్నించే ధైర్యం ఆయనకులేదు.అందువల్ల దానికి బదులు పిల్లలను కనండి అని సలహా ఇచ్చి ఏపీ జనాన్ని అటువైపు మళ్లిస్తే సరిపోతుందని అనుకున్నారనుకోవాలి. ఆర్ఎస్ఎస్ వారి మెప్పుదల కూడా వస్తుందని భావించి ఉండవచ్చు.అయితే విశ్వహిందూపరిషత్ నాయకుడు ఒకరు మాత్రం ఈ స్కీమ్ కేవలం హిందువులకే అమలు చేయాలని మెలిక పెట్టారు. అది వేరే సంగతి. ఈ మొత్తం ఏపీసోడ్ లో ఇబ్బంది పడుతున్నది ఎవరయ్యా అంటే అది ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ అన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ముందుగా ఆయనను పిల్లలను కనమనండి అని మహిళా నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.ఇది లోకేష్ కు ఎంబరాస్ మెంట్ గానే ఉంటుంది. బహుశా దానివల్లనేమో ఇంతవరకు ఈ సంతానోత్సత్తి అంశంలో తండ్రి ప్రతిపాదనపై లోకేష్ స్పందించలేదు.ప్రచారం ఆరంభించలేదు.ఇంకో మాట చెప్పాలి. ముందుగా మొదటి ఇద్దరు పిల్లలకు ఎందుకు ప్రోత్సహాం ఇస్తానని అనడం లేదు?దాంతోనే ఈయన ఏదో ప్రచారం కోసం అంటున్నారులే అన్నభావన కలగదా!పిల్లలు కనడం అన్నది వ్యక్తిగత విషయం.వారి ఆర్ధిక స్తోమతను బట్టి ,వారి ఇతర సమస్యలను బట్టి ఉంటుంది. చంద్రబాబు కనమంటే కనడం,వద్దంటే కనకపోవడం ఉండదు.ఆ సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు.ఒకవేళ చంద్రబాబు చెప్పారు కదా అని ఎవరైనా అమాయకంగా ఎక్కువ మంది పిల్లలను కనడం ఆరంభిస్తే వచ్చే సమస్యలను వివరిస్తూ ఒక పిల్లల డాక్టర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.చంద్రబాబు మాటలను పట్టించుకోవద్దని ఆమె సూచించారు. చంద్రబాబు దృష్టిలో ఏపీ ప్రజలు మరీ అమాయక గొర్రెలుగా కనిపిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ది ఉంటే మూడో బిడ్డను కంటే నెలకు ముప్పైవేలు ఇస్తామని చెప్పగలరా?లేదా 30 లక్షల డిపాజిట్ చేస్తామని గ్యారంటీ ఇవ్వగలరా?పెళ్లి చేసుకుంటే లక్షరూపాయల కానుక ఇస్తామని చెప్పిన పెద్దలు ఎంతమేర దానిని ఆచరించారు?ప్రస్తుతానికి చంద్రబాబు చెబుతున్నవి ఉబుసుపోక కబుర్లుగానే అంతా పరిగణిస్తున్నారు.కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా అప్రతిష్ట తెచ్చుకోవడం అవసరమా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అనూహ్య ప్రశ్న సంధించి వార్తల్లో నిలిచిన నార్వే మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ (Helle Lyng Svendsen) చేదు అనుభవం ఎదురైంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ మెటా షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించారు.ఆన్లైన్లో వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు నిలిపివేయబడ్డాయని హెలె లింగ్ ట్వీట్ చేశారు. తన ఖాతా నిలిపివేయబడటానికి ముందు రోజంతా తన ఇన్‌స్టాను యాక్సెస్ చేయలేకపోయానని లింగ్ తెలిపారు. "పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యమే ఇది, కానీ ఇలాంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు," అని ఆమె తన సస్పెన్షన్ నోటీసు స్క్రీన్‌షాట్ షేర్ చేశారు.Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026 ; మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్స్ ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వినియోగ దారులకు, తన ఇన్‌స్టా, ఫేస్బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్ అయ్యాయని మరో పోస్ట్‌లో లింగ్ తెలియజేశారు. తాను వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నా, కానీ ఇప్పుడు అది లేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ తన ఖాతాలు తిరిగి యాక్టివ్ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన పోస్ట్‌కు ఆమె మెటాను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు.ఇదీ చదవండి: ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్‌పాట్ కాగా ప్రధాని మోదీ పత్రికా సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె ఫాలోవర్లు కూడా పెరిగారు. దీనిపై బీజేపీ శ్రేణులు లింగ్పై విరుచుకుపడగా, నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
సాక్షి, హైదరాబాద్: బండి సాయి భగీరథ్ పక్కా పథకం ప్రకారమే పోలీసులకు చిక్కాడని కేసు దర్యాప్తులో పాల్గొన్న కీలక పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో ఆధారాలు దొరకకుండా చేయాల్సిన పనులన్నీ పరారీలో ఉండగానే పూర్తి చేసిన తర్వాతే పోలీసుల అదుపులోకి వచ్చాడని చెప్పారు. ఈనెల 16న భగీరథ్‌ను అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఠాణాలో రెండున్నర గంటలపాటు కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ నిందితుడిని సుదీర్ఘంగా విచారించా రు. అయితే విచారణ సమయంలో భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్‌ఫోన్ మాత్రమే అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్లో సిమ్ లేదని, ఎక్కడుందని విచారణాధికారి నిందితుడిని ప్రశ్ని ంచగా.. సిమ్ కార్డ్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు తెలిసింది. విచారణాధికారులు న్యా యనిపుణులతో చర్చించిన అనంతరం పోక్సో కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేశాడని గుర్తించి, భగీరథ్‌పై కొత్తగా ‘ఆధారాలు మాయం’సెక్షన్‌ను జోడించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో భగీరథ్‌పై బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 238ను జోడించారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్‌ను దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని నార్సింగిలోని సర్వీస్ అపార్ట్మెంట్, మెయిన్‌బాద్ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాలలో సీన్ రీకన్‌స్ట్రక్షన్స్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.
అసెంబ్లీలో ఆవరణలో ఆంధ్రకేసరి విగ్రహం ఏర్పాటు చేయించాలి
'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీ
నా భర్త నుంచి నాకు విముక్తి కల్పించండి..!
‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’?
అష్ట కష్టాలే.. ఆమె చుట్టాలైనా
రిలేషన్లో వన్ టైం చీటింగ్ తప్పేం కాదు: రకుల్
లంచంపై ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి!
ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
పవన్ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల దందా..?
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
మమతకు సీఎం సువేందు ఝలక్
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
అసెంబ్లీలో ఆవరణలో ఆంధ్రకేసరి విగ్రహం ఏర్పాటు చేయించాలి
'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీ
నా భర్త నుంచి నాకు విముక్తి కల్పించండి..!
‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’?
అష్ట కష్టాలే.. ఆమె చుట్టాలైనా
రిలేషన్లో వన్ టైం చీటింగ్ తప్పేం కాదు: రకుల్
లంచంపై ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి!
ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
పవన్ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల దందా..?
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
మమతకు సీఎం సువేందు ఝలక్
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
ఫొటోలు
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల సందడి
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే నేడు (మే 20). ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాలుస్తూ హీరో పుట్టినరోజును పండగలా సెలబ్రేట్ చేశారు. ఇక తనకోసం వచ్చిన అభిమానులను ఎన్టీఆర్ నవ్వుతూ పలకరించాడు. వారిని పలకరిస్తూ అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ఇకపోతే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాదాపు 4 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలో తారక్ బరువు తగ్గి, గంభీరమైన లుక్‌తో కనిపించాడు. ప్రశాంత్ నీల్ టేకింగ్, తారక్ డైలాగ్స్.. గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. రవి బస్రూర్ సంగీతం సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చింది. డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. #DRAGON. The Dragon meet #jrntr #ntrneel #dragon pic.twitter.com/XIYI5U1PzX— Teja M (@TejaM112720) May 19, 2026చదవండి: డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్
జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?
తెలుగు హీరోల్లో జూ.ఎన్టీఆర్ కాస్త స్పెషల్. చిన్నప్పుడే నటుడు అయిపోయాడు. ఓ వయసొచ్చేసరికి సూపర్ హిట్స్ కొట్టి అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో ఫ్లాప్స్ పడ్డాయి కానీ మళ్లీ పుంజుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇంతకీ తారక్ ఎంత ఆస్తి సంపాదించాడు? గ్యారేజీలో కార్ల కలెక్షన్స్ ఏంటి?జూ.ఎన్టీఆర్.. సినీ, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చాడు. అలా ఇప్పటివరకు రూ.500-600 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ప్రొపర్టీస్ రూపంలోనే ఎక్కువగా ఉన్నట్టు టాక్. ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్‌లోని ఇంటి విలువ రూ.25 కోట్లు ఉంటుందని, అలానే హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉందని తెలుస్తోంది.సినిమాలు చేసినప్పటికి కుటుంబానికి కూడా ఎన్టీఆర్ అదే స్థాయిలో సమయం కేటాయిస్తుంటాడు. ఇద్దరు కొడుకులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. వీటన్నింటితో పాటు కార్లు, వాచీలంటే కూడా తారక్‌కి పిచ్చి ఇష్టం.తారక్ దగ్గర ప్రస్తుతం అరడజనుకు పైగానే కార్లు ఉన్నాయి! వాటిలో అత్యంత ఖరీదైన పోర్స్ కేమన్ ఎస్ ఒకటి. దీని ఉత్పత్తిని సదరు కంపెనీ ఎప్పుడో ఆపేసింది. చాన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ దీన్ని కొనుగోలు చేశాడు. అప్పట్లో రూ.3 కోట్లు పెట్టి దీన్ని కొన్నాడు. అంటే ఇప్పటి రేటులో డబుల్ ధర ఉండొచ్చు. దీని తర్వాత చూసుకుంటే కొన్నేళ్ల క్రితం రూ.3.5 కోట్లు విలువైన లాంబోర్గిని ఉరుస్ క్యాప్సుల్ గ్రాఫైట్ కారు కొన్నాడు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు.ఈ రెండింటితో పాటు రూ.4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ మేబాచ్ ఎస్ క్లాస్, రూ.2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ.1.70 కోట్ల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫ్యామిలీ అంతా కలిసి తిరిగేందుకు రూ.1.53 కోట్ల విలువైన టయోటా వెల్ ఫైర్ కారు.. ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్నాయి. వీటలో చాలా వాటికి 9999 లేదా 9 సంఖ్య కలిసొచ్చేలా నంబర్ ప్లేట్స్ ఉంటాయి. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ పాటించిన '9' సెంటిమెంట్‌నే తారక్ ఫాలో అవుతూ వస్తున్నాడు. కార్లే కాదు ఖరీదైన వాచీలు కూడా తారక్ దగ్గరున్నాయి. రూ.7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే చేతి గడియారం, రూ.2.5 కోట్ల విలువైన నటిలస్ వాచీలు తారక్ సొంతం.తారక్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత చేసిన వాటిలో 'దేవర' హిట్ కాగా గతేడాది రిలీజైన 'వార్ 2' ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీని గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
అదే తన లక్ష్యం అంటున్న డ్యూడ్ హీరోయిన్
మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తోంది హీరోయిన్ మమితా బైజు. మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రంతో అందరి దృష్టిని తనవైపు ఆకర్షించింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో ట్రెండింగ్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఇటీవల డ్యూడ్ మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె విజయ్‌తో కలిసి నటించిన జననాయకన్ (తెలుగులో జన నాయకుడు) చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదే నా లక్ష్యంఅలాగే సూర్యకు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే అశోక్ సెల్వన్‌కు జంటగా నటించిన ఇరండు విధానం చిత్రం కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత మమితా బైజు క్రేజ్ వేరేగా ఉంటుందని భావించవచ్చు. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా అభిమానుల గుండెల్లో నిలిచిపోయే చిత్రాలను చేయాలన్నదే నా లక్ష్యం. అలా ఒక ప్రేమైక కుటుంబాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఏదో ఒక రోజున నా జరిగిన కాలం గుర్తుకు వస్తే ఆనందం కలగాలి. అందుకోసమే నా ఈ ప్రయాణం' అని మమిత పేర్కొంది.
స్పెషల్ ఎట్రాక్షన్
కమర్షియల్ సినిమాలో హీరో ఉంటారు. ఫైట్స్, పాటలు ఉంటాయి. అయినా అదనపు ఆకర్షణ కావాలి. ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేక గీతం థియేటర్స్‌లో ప్లే అవ్వాలి. అందుకే కొందరు హీరోలు స్టోరీలో స్పెషల్ సాంగ్ చేసే స్కోప్ ఉంటే, సై అంటున్నారు. ఆ పాటలు చేయడానికి హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచే స్టెప్పులు వేస్తున్నారు. మరి... ఏ సినిమాలో ఏ నటి స్పెషల్‌గా కనిపించనున్నారో ఓసారి లుక్ వేయండి.జైలర్‌తో స్టెప్పుల్ మంచి కమర్షియల్ మోడ్‌లో కనిపిస్తున్నారు రజనీకాంత్. ఈ సీనియర్ హీరో నటించిన గత రెండు చిత్రాలు ‘జైలర్, కూలీ’ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా ఆడియన్స్‌ను అలరించాయి. అలాగే ఈ రెండు చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా..’ పాటలో తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేస్తే, ‘కూలీ’ చిత్రంలోని ‘మోనికా..’ పాటలో పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్‌ను ఇరగదీశారు. కాగా రజనీకాంత్ పూర్తి చేసిన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్‌ను బాలీవుడ్ నటి నోరా ఫతేహీ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది.‘జైలర్’ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్‌గా రానున్న ‘జైలర్ 2’ మూవీకి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారని తెలిసింది.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్ 2’ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుధ్ స్వరకర్త. అన్నట్లు... నోరా ఫతేహీ గురించి మన తెలుగు ఆడియన్స్‌కు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే..‘బాహుబలి: ది బిగినింగ్’లో ‘మనోహరి’, ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’ ఇలా పలు స్పెషల్ సాంగ్స్‌లో నోరా నర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది.స్పెషల్ ఎంట్రీ టాలీవుడ్‌కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి మౌనీ రాయ్. చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ చిత్రంలో మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. దాదాపు వందమంది డ్యాన్సర్స్‌తో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటలో చిరంజీవి, మౌనీ రాయ్ డ్యాన్స్ చేశారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లుగా ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్లు నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ ‘విశ్వంభర’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.మాస్ డ్యాన్స్ రామ్‌చరణ్ టైటిల్ రోల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో హీరో రామ్ చరణ్‌తో కలిసి శ్రుతీహాసన్ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశారు. ఈ స్పెషల్ సాంగ్‌కు కుస్తీతో కూడిన ఓ కాన్సెప్ట్ కూడా ఉందట. అంతేకాదు... ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కాలు కదిపారని సమాచారం. ఇదే నిజమైతే ఒకే ఫ్రేమ్‌లో చరణ్, జాన్వీ శ్రుతీహాసన్లను చూడటం మాస్ ఆడియన్స్‌కు థియేటర్స్‌లో విజిల్ వర్తీ మూమెంట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1970–1980 మధ్య కాలంలో సాగుతుంది. ఇందులో క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా రామ్‌చరణ్ నటించారు. అంటే... ఈ చిత్రంలో రామ్‌చరణ్ క్రికెట్, కుస్తీ ఆడతారు. మరొక గేమ్ కూడా ఉంది. ఈ గేమ్‌పై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్వేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. మరోవైపు మహేశ్‌బాబు ‘ఆగడు’, అర్జున్ కపూర్ ‘తేవర్’ చిత్రాల్లో శ్రుతీహాసన్ స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.ఆలియా ఆటా పాటా! ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలో ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటకు స్కోప్ ఉంది.ఈ పాటలో నటిస్తారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ పాటలో ఆలియా భట్ కనిపిస్తారనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇదే నిజమైతే, ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్, ఆలియా భట్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.ది ప్యారడైజ్‌లో తమన్నా! స్పెషల్ సాంగ్స్‌కు ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు హీరోయిన్ తమన్నా. అంతేకాదు... ఈ బ్యూటీ ఫలానా సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమా హిట్టవుతుందనే టాక్ కూడా ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ‘కావాలయ్యా..’, కావొచ్చు, హిందీ చిత్రం ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ కావొచ్చు, మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘డాంగ్ డాంగ్..’ పాట కావొచ్చు... తమన్నా స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమాకు అది తప్పుకుండా ప్లస్ అవుతుంది. తాజాగా ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ యువకుడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కు స్కోప్ ఉందట. దీంతో ఈ సాంగ్‌కు తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఆ దిశగా సంప్రదింపులు మొదలయ్యాయని సమాచారం. అయితే ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్న అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ చిత్రంలో మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ తేదీకి విడుదల కుదరకపోవడంతో, ఈ ఏడాది ఆగస్టు 21కి వాయిదా వేశారు. అయితే ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా విడుదల కాకపోవచ్చని, అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ సాగడం లేదని, రీ షూట్స్ చేయాల్సి వస్తోందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, అనుకున్న ప్రకారమే ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోందని, ఆగస్టు 21న ఈ సినిమా విడుదల అవుతుందని టీమ్ మరోసారి స్పష్టత ఇచ్చింది.నేను రెడీ టాలీవుడ్‌కు వచ్చేందుకు నేను రెడీ అన్నారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. హిందీలో ‘హౌస్‌ఫుల్ 3, హౌస్‌ఫుల్ 5, 5 వెడ్డింగ్స్’ వంటి చిత్రాల్లో నటించారు నర్గీస్. అలానే సల్మాన్ ఖాన్ ‘కిక్’లో ‘యార్ నా మిలే’, తమిళ హీరో ప్రశాంత్ ‘సాగసం’లో స్పెషల్ సాంగ్స్ చేశారు నర్గీస్. ఇప్పుడు తెలుగు సినిమాకు వచ్చారు. హవీష్, కావ్యాథాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నేను రెడీ’.ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు నర్గీస్. టాలీవుడ్లో నర్గీస్ చేసిన తొలి సినిమా ఇదే. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ పతాకంపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించిన ఈ చిత్రం జూన్ రెండో వారంలో విడుదల కానుంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ ‘నేను రెడీ’ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ‘నేను రెడీ’ సినిమా విడుదల కాకముందే, తెలుగులో ఇంకో సినిమాలో మరో స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారట నర్గీస్. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నర్గీస్ ఫక్రీ డ్యాన్స్ చేశారని తెలిసింది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావొచ్చు.బ్లాక్ గోల్డ్‌లో సీరత్ ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో అరుదుగా ప్రత్యేక పాటలు చూస్తుంటాం. హీరోయిన్ సంయుక్త నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది బ్లాక్‌గోల్డ్’. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాను కేఎమ్‌సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు సంయుక్త. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ చిత్రంలో హీరోయిన్ సీరత్ కపూర్ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ పాటను రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఈ సంగతి ఇలా ఉంచితే.. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీకమల్, తన్వీ లీడ్ రోల్స్‌లో నటించిన ‘ఉషా పరిణయం’ (2024) చిత్రంలో సీరత్ కపూర్ ప్రత్యేక పాటలో మెరిశారు. ఇక శర్వానంద్ ‘రన్ రాజా రన్’లో హీరోయిన్గా నటించిన సీరత్ కపూర్ నాగార్జున ‘రాజుగారి గది 2’, అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’, రవితేజ ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో కీ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరు తారలు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది.
క్రీడలు
‘ప్రపంచకప్‌కు మేం సిద్ధం’
ముంబై: టి20 ప్రపంచ కప్ కోసం నిర్వహించిన సన్నాహక శిబిరం చాలా బాగా సాగిందని, టోర్నీ కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. ఉదాసీనతకు తావు లేకుండా శ్రమించి టైటిల్ సాధించడమే తమ లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించింది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది. దీనికి సంబంధించి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో జట్టుకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్‌ను నిర్వహించారు. ‘మా సన్నాహక శిబిరం అన్ని రకాలుగా చాలా బాగా సాగిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేను. ఎందుకంటే మేం వరల్డ్ కప్‌కు వెళుతున్నామనే విషయం మరచిపోవద్దు. అమ్మాయిలు పూర్తి స్థాయిలో ఫిట్‌గా, ఉత్సాహంగా ఉన్నారు. వారంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. శిబిరంలో అందరూ చాలా కష్టపడ్డారు’ అని స్మృతి చెప్పింది. ఈ నెల 22న ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న మహిళల బృందం వరల్డ్ కప్‌కు ముందు ఇంగ్లండ్‌తోనే మూడు టి20 మ్యాచ్ సిరీస్ ఆడుతుంది. ‘మేం వరల్డ్ కప్ కోసమే సిద్ధమైనా దానికి ముందు సిరీస్ కూడా చాలా కీలకం. మా కఠోర శ్రమ ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నాం. ట్రోఫీని గెలిచి భారత్ గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నాం’ అని స్మతి పేర్కొంది.
డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
బెంగళూరు: ఐపీఎల్‌తో తక్షణమే పేరు ప్రఖ్యాతలు వచ్చినా... సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుతం కాలంలో ఐపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు భారీగా డబ్బు, పేరు వస్తోందని... అయితే అక్కడితో ఆగిపోకుండా మరింత కష్టపడితేనే ఆటలో గొప్ప స్థాయికి చేరగలరని కోహ్లి వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆర్సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ... ‘అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం. పట్టుదలను డబ్బుతో ముడిపెట్టలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ రూపంలో 20 బంతుల్లో 40–50 పరుగులు చేస్తే చాలు ఎనలేని పేరు, డబ్బు వస్తున్నాయి. అది సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ 10–15 ఏళ్లు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలి. అది టి20 క్రికెట్ ఆడినంత సులువు కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభిమానుల ఆదరణ, ఆట నుంచి గౌరవం పొందగలం. అలా అని టి20 క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఇటీవలి కాలంలో చూస్తే... గొప్ప గొప్ప పవర్ హిట్టర్లు పుట్టుకొస్తున్నారు. వారు బంతిని బాదుతున్న విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవలీలగా సిక్స్‌లు కొడుతున్నారు. ఐపీఎల్ ఆరంభంలో మాదిరిగా ప్రతిసారి భారీ స్కోర్ల పిచ్‌లు ఎదురుకావు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌పై రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పుడు 175–180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి వస్తుంది. అలాంటి స్థితిని తట్టుకున్న బ్యాటర్ దీర్ఘకాలం నిలబడగలుగుతాడు. పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో అత్యుత్తమ ఆట తీరు కనబర్చడం ముఖ్యం. నా వరకైతే ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని... పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలి అంటే బలమైన పునాది అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు మీ దగ్గర ఎక్కువ మార్గాలు ఉండాలి. అప్పుడే కష్టమైన పిచ్‌పై కూడా పరుగులు రాబట్టగలం. అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది’ అని వివరించాడు.
కొత్త కుర్రాళ్లకు పిలుపు
గువాహటి: సొంతగడ్డపై వచ్చే నెలలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత జట్లను ప్రకటించింది. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న నలుగురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో తొలిసారి అవకాశం దక్కగా... ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోతున్న రిషభ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే ఇప్పటి వరకు టెస్టు జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడు ఇప్పుడిక కేవలం ప్లేయర్‌గానే కొనసాగనున్నాడు. పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు బదలాయించారు. టెస్టు, వన్డే జట్లకు శుబ్‌మన్ గిల్ నాయకత్వం వహించనుండగా... సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇవ్వగా... అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయలేదు. రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్‌కు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జూన్ 6 నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య న్యూ చండీగఢ్‌లో ఏకైక టెస్టు జరగనుంది. ఆ తర్వాత జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే, 17న లక్నోలో రెండో వన్డే, 20న చెన్నైలో మూడో వన్డే జరగనున్నాయి. ‘అఫ్గాన్‌తో సిరీస్‌ల అనంతరం ఇంగ్లండ్ పర్యటన వరకు బుమ్రా జట్టుతో చేరుతాడు’ అని అగార్కర్ పేర్కొన్నాడు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు, వన్డే జట్లలో చోటు నిలబెట్టుకున్నాడు. భారత టెస్టు జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్ జురేల్. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే , కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్. ప్రిన్స్ యాదవ్: తాజా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ జట్టు పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం తన వేగం, కచ్చితత్వంతో సెలెక్టర్ల మెప్పు పొందాడు. గతేడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 24 ఏళ్ల ప్రిన్స్... ఈ సీజన్లో నిలకడ కనబర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఢిల్లీ బౌలర్‌కు పెద్దగా అనుభవం లేకపోయినా... లిస్ట్ ‘ఎ’, ఐపీఎల్ ప్రదర్శనతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన ప్రిన్స్ వన్డే సిరీస్‌లో రాణిస్తే... ఈ ఏడాది చివర్లో జరిగే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడి పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. మానవ్ సుతార్: రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. చాన్నాళ్లుగా దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 29 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు పడగొట్టిన ఈ ఎడంచేతి వాటం స్పిన్నర్... బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగలడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుతార్‌ను ఏకైక టెస్టు కోసం ఎంపిక చేశారు. జడేజా, అక్షర్ జట్టులో లేకపోవడంతో సుతార్‌కు అవకాశం దక్కింది. కుల్దీప్, సుందర్‌లు తుది జట్టులో ఉండటం ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా టీమ్‌లో చోటు కోసం హర్ష్ దూబే తో సుతార్ పోటీపడనున్నాడు. గుర్నూర్ బ్రార్: చాన్నాళ్లుగా భారత జట్టులో నెట్ బౌలర్‌గా కొనసాగుతున్న 25 ఏళ్ల గుర్నూర్ బ్రార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌కు బ్రార్‌పై అపార నమ్మకం ఉండగా... అతడికి పంజాబ్‌కే చెందిన భారత సారథి గిల్ మద్దతు దండిగా ఉంది. ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న అతడు రెండేళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదనపు బౌన్స్ రాబట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న ఆరున్నర అడుగుల గుర్నూర్ దక్షిణాఫ్రికా వంటి పేస్ పిచ్‌లపై ప్రభావం చూపగలడని సెలెక్షన్ కమిటీ నమ్ముతోంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 18 మ్యాచ్‌లు ఆడిన బ్రార్ 27.30 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. హర్ష్ దూబే : సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న 23 ఏళ్ల హర్ష్ దూబే కు మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 2024–25 రంజీ సీజన్లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టడంతో పాటు 476 పరుగులు చేసిన దూబే... తాజా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23.26 సగటుతో 133 వికెట్లు తీసిన హర్ష్... 1026 పరుగులు సైతం చేశాడు. అతడి ఖాతాలో 9 అర్ధశతకాలు ఉన్నాయి.
మెయిన్ 'డ్రా'కు సాత్విక్ - రాధిక జోడీ
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కణపురం సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ (భారత్) ద్వయం మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జాతీయ చాంపియన్స్ సాత్విక్ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్) జోడీ 21–15, 21–17తో దాతు అనీఫ్ ఇసాక్–క్లారిస్సా సాన్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో అలెగ్జాండర్ డున్–జూలీ మెక్‌పర్సన్ (స్కాట్లాండ్) జంటతో సాత్విక్–రాధిక ద్వయం తలపడుతుంది. మరోవైపు మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అష్మిత చాలిహా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించగా... ఆకర్షి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించింది. అష్మిత 21–23, 21–16, 21–16తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఆకర్షి 21–15, 20–22, 7–21తో పార్క్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ 21–19, 21–15తో ఏడో సీడ్ క్రిస్టో పొపోవ్–టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో శిఖా గౌతమ్–అశ్విని భట్ (భారత్) జంట 15–21, 21–17, 17–21తో జాకీ డెంట్–క్రిస్టల్ లాయ్ (కెనడా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బిజినెస్
ఇక యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ భవిష్య నిధిని (పీఎఫ్) వేగంగా ఉపసహరించుకునేందుకు వీలుగా యూపీఐ పేమెంట్ గేట్‌వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని పరీక్షించడం పూర్తయిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మెరుగైన సేవల దిశగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈపీఎఫ్‌వో సభ్యులు యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా ఉపసంహరించుకునే మొత్తం, వారి బ్యాంక్ ఖాతాలకు వెంటనే జమ అవుతుందని చెప్పారు. ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన యూపీఐ పిన్ను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనల మేరకు భవిష్యనిధిలో కొంత మేర బ్యాలన్స్‌ను తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుంది.అది పోను మిగిలిన మొత్తాన్ని యూపీఐ సాయంతో వేగంగా ఉపసంహరించుకునే దిశగా ఈపీఎఫ్‌వో అడుగులు వేస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నూతన సదుపాయంతో ఏడు కోట్ల మంది ఈపీఎఫ్‌వో సభ్యులకు నిధుల ఉపసంహరణ సులభతరం కానుంది. ప్రస్తుత విధానంలో సభ్యులు ఉపసంహరణ కోసం క్లెయిమ్ దాఖలు చేసి, నిర్ణీత సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోంది.ఆటో–సెటిల్మెంట్ విధానంలో మానవ ప్రమేయం లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో క్లెయిమ్‌ల పరిష్కారానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈపీఎఫ్‌వో వాట్సాప్ సేవలను నెలలో ప్రారంభించనున్నట్టు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సభ్యులు ఈపీఎఫ్‌వో వాట్సాప్ నంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపించడం ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉంది? చివరి ఐదు లావాదేవీలు తదితర సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు. పెండింగ్ కేసులకు పరిష్కారం నిధి ఆప్కే నికత్ కార్యక్రమం ద్వారా కన్జ్యూమర్ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉండిపోయిన కేసులను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో 2025 ఏప్రిల్ 1 నాటికి 31,036 కేసులు ఉండగా, 2026 ఏప్రిల్ 1 నాటికి 27,639కు తగ్గినట్టు చెప్పారు.
క్రెడిట్ కార్డుల హవా
ముంబై: దేశంలో ఒకవైపు క్రెడిట్ కార్డు లావాదేవీలు దేశంలో శరవేగంగా పెరుగుతుంటే.. మరోవైపు డెబిట్ కార్డు లావాదేవీలు అదే స్థాయిలో తగ్గిపోతున్నాయి. 2021లో 216 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 2025 నాటికి 570 కోట్లకు పెరిగాయి. సుమారు 2.6 రెట్లు వృద్ధి నమోదైంది. 2021లో రూ. 8.9 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ 2025 నాటికి రూ. 23.2 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఐదేళ్ల కాలంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో 27 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైంది. నివేదికలోని అంశాలు.. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల సంఖ్య 2021లో 408.7 కోట్లుగా ఉంటే, 2025 నాటికి 133.6 కోట్లకు పడిపోయాయి. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 7.4 లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్‌కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.డిజిటల్ చెల్లింపుల విస్తరణ ⇒ 2016తో పోలిస్తే 2025 నాటికి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సంఖ్య 33 రెట్లు పెరగ్గా, వాటి విలువ దాదాపు మూడు రెట్లు అధికమైంది. ⇒ ముఖ్యంగా గత ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు సంఖ్యా పరంగా నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. ⇒ 2025 జూన్‌లో 6,782 లక్షలుగా ఉన్న క్యూఆర్ కోడ్లు, డిసెంబర్ 2025 నాటికి 7,313 లక్షలకు పెరిగాయి. ⇒ డిజిటల్ చెల్లింపులను స్వీకరించే ఛానళ్లను పరిశీలిస్తే.. గతేడాది జూన్–డిసెంబర్ మధ్య యూపీఐ క్యూఆర్ కోడ్లు, క్రెడిట్ కార్డులు, వ్యాలెట్లలో ఎక్కువ వృద్ధి కనిపించగా, పీవోఎస్ టెరి్మనళన్లు, ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల వినియోగం తగ్గింది.⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్‌కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.
భారత్‌లో రూ. 5,700 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో 2030 నాటికి భారత్‌లో రూ. 5,700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయ నుంది. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయా రీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ మొత్తా న్ని వెచ్చించనున్నట్లు సంస్థ ఇండియా, సౌత్ ఏషి యా సీఈవో జాగృత్ కొటేచా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని కాన్సెంట్రేట్స్ ప్లాంటులో, అస్సాం..తమిళనాడులోని స్నాక్స్ ప్లాంట్లపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఇటీవలే స్థలాన్ని కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆదాయాలు, వినియోగం స్థిరంగా పెరుగుతున్న భారత్ తమకు టాప్ 13 మార్కెట్లలో ఒకటని ఆయ న చెప్పారు.గతేడాది (2025)లో రూ. 9,789 కోట్ల ఆదాయంపై రూ. 905 కోట్ల లాభం ఆర్జించినట్లు జాగృత్ తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా పటిష్టంగా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందినట్లు వివరించారు. ఫుడ్ సెగ్మెంట్లో 11 శాతం వృద్ధి సాధించినట్లు పెప్సీకో ఇండియా, సౌత్ ఏషియా సీఎఫ్‌వో సవిత బాలచంద్రన్ తెలిపారు. వాతావరణం కారణంగా శీతల పానీయాల విభాగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, పోటీ కూడా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ రెండు విభాగాలు మెరుగ్గా రాణించినట్లు పేర్కొన్నారు.
రూపాయి మరో కొత్త కనిష్టం..
ముంబై: భగ్గుమంటున్న క్రూడాయిల్ రేట్లు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, డాలరు బలపడుతుండటం లాంటి ప్రతికూల పరిణామాలతో రూపాయి మారకం విలువ వేగంగా కరిగిపోతోంది. మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 50 పైసలు క్షీణించి సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టం 96.70కి పతనమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 96.20తో పోలిస్తే మరింత తక్కువగా 96.38 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ .. ఇంట్రాడేలో 96.27కి పెరిగింది. కానీ అది నిలబెట్టుకోలేక చివరికి 50 పైసలు క్షీణతతో ముగిసింది. దీనితో గత ఎనిమిది సెషన్లలో 2.64 శాతం (రూ. 2.48) మేర పతనమైనట్లయింది. తద్వారా ఆసియాలోనే అత్యధికంగా పతనమైన కరెన్సీగా నిల్చింది. డాలరు బలపడటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్‌లు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంలాంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అయితే, పసిడి, వెండిపై దిగుమతులపై ఆంక్షలు, ఆర్బీఐ జోక్యంతో కనిష్ట స్థాయిల్లో రూపాయికి కొంత మద్దతు లభించవచ్చని పేర్కొన్నారు. స్పాట్ మార్కెట్లో 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు.
ఫ్యామిలీ
సమతుల్య పోషణతోనే సేంద్రియ దిగుబడులు
సేంద్రియ కూరగాయల సాగులో ఒకటికి నాలుగు రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడినప్పుడు మాత్రమే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని, తద్వారా అత్యుత్తమ దిగుబడులు సాధించగలమని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, పరివృద్ధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాలీహౌస్లో రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ 2025–26 శీతాకాల పంటలో ఉత్తమ ఫలితాలు సాధించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ. రాజారెడ్డి పర్యవేక్షణలో హార్టికల్చర్ అసిస్టెంట్ ్రపొఫెసర్లు డా. సీహెచ్ షణ్ముఖి, డా. టి. శిరీష నిర్వహిస్తున్న ఈ మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ కిసాన్ సంఘ్‌కు చెందిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.కాలీఫ్లవర్ ఎకరానికి 8 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై కాలీఫ్లవర్‌ను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 9 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడుతూ పాలీహౌస్లో కాలీఫ్లవర్ సాగు చేస్తే 5.8 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, కోళ్ల ఎరువుతో పాటు 3 రకాల జీవన ఎరువులు వాడితే అత్యధికంగా హెక్టారుకు 8 టన్నులకుపైగా సేంద్రియ కాలీఫ్లవర్ దిగుబడి వచ్చింది. హెక్టారుకు 7.5 టన్నుల కోళ్ల ఎరువుతో పాటు వామ్ 5 కిలోలు, అజోస్పిరిల్లం 2 కిలోలు, పీఎస్బీ 5 కిలోలు వాడినప్పుడు అత్యధికంగా ఒక్కో కాలీఫ్లవర్ బరువు 825 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 8టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. అయితే, జీవన ఎరువులతో పాటు వర్మీ కంపోస్టు లేదా జీవామృతం లేదా లిగ్నైట్ కలిపి వాడినప్పుడు.. కోళ్ల ఎరువుతో పాటు జీవన ఎరువులు వాడినప్పటికన్నా తక్కువ దిగుబడి రావటం విశేషం.రెడ్ క్యాబేజీ ఎకరానికి 9 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై రెడ్ క్యాబేజీ పంటను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 6 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. పాలీహౌస్లో హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడితే హెక్టారుకు 5 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి వచ్చింది. అయితే, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువుతో పాటు మరో 4 రకాల సేంద్రియ ఎరువులు వాడితే హెక్టారుకు అత్యధికంగా 9 టన్నులకుపైగా సేంద్రియ రెడ్ క్యాబేజీల దిగుబడి వచ్చింది. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువు, వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడారు. ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 962 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 9 టన్నులకు పైగా దిగుబడి రావటం విశేషం. అయితే, పశువుల ఎరువు అసలు వాడకుండా.. హెక్టారుకు వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడినప్పుడు ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 935 గ్రాములకు మాత్రమే పెరిగింది.సమతుల్య పోషణే కీలకంసేంద్రియ సాగులో పంటలకు అవసరమైన అన్ని పోషకాలనూ సమతుల్యంగా తగు పాళ్లలో అందించగలిగినప్పుడే రసాయన సేద్యంతో సమానంగా దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని మల్లారెడ్డి యూనివర్సిటీలో తాజా పరిశోధనలు తేల్చాయి. పాలీహౌస్ ప్రయోగాత్మక సాగులో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడులు మాకు సంతృప్తి కలిగించాయి. అన్ని యూనివర్సిటీలూ ఈ దిశగా పరిశోధనలు చేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారం లభిస్తుంది. – ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులుసేంద్రియ పరిశోధనలు కొనసాగిస్తాంపూర్తిగా సేంద్రియ కూరగాయల సాగులో మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టు తొలి ఏడాది ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు ఈ ప్రయోగాలు కొనసాగిస్తాం. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, దిగుబడుల స్థిరీకరణ చేసి పూర్తి ఫలితాలు ఆ తర్వాత ప్రకటిస్తాం. – డాక్టర్ ఎ. రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటీనిర్వహణ: పంతంగి రాంబాబు
కష్టాలే... గెలుపు పాఠాలై!
‘కష్టపడేవారిని అదృష్టం ఇష్టపడుతుంది’ అనేది సామెత. చైనాకు చెందిన జౌక్విన్ ఫేయ్ని ‘అదృష్టవంతురాలు’ అంటారు చాలామంది. అయితే ఆమె కష్టమే ఆమెను అదృష్టవంతురాలిని చేసింది. చదువు మధ్యలో మానేసి పొట్టకూటి కోసం వాచ్ లెన్స్ కంపెనీలో పనిచేసిన జౌక్విన్ ఫేయ్ నేడు ప్రపంచ ప్రసిద్ధ ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ యజమానురాలు...అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్న మహిళ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు... జౌక్విన్ ఫేయ్.అదిగో... అవకాశంగ్రామీణ హునాన్ ప్రావిన్స్‌లో జౌక్విన్ ఒక ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలిగా పనిచేసేది. స్మార్ట్ఫోన్ల విశ్వరూపాన్ని ప్రపంచం చూడని రోజుల్లోనే గ్లాస్ ్రపొడక్షన్లో నైపుణ్యం సాధిస్తుండేది. పదహారేళ్ల వయసులో చదువుకు దూరమైన జౌ పని వెదుక్కుంటూ షెన్జెన్కు వెళ్లింది. ఎంతోమంది వలస కార్మికులలాగే సుదీర్ఘమైన షిఫ్టులు, ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేసింది. 1993లో వాచ్గ్లాస్పై స్క్రీన్ ప్రింటింగ్‌కు సంబంధించి చిన్న వర్క్‌షాప్‌ను ప్రారంభించింది.తొలిరోజుల్లో వర్క్‌షాప్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ఆ రోజుల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గుర్తించని ఒక అవకాశాన్ని జౌ గుర్తించింది. ‘ఎలక్ట్రానిక్స్ పలుచగా, తేలికగా, అధునాతనంగా మారేకొద్దీ గాజు తయారీకి విలువ అంతకంతకూ పెరుగుతుంది’ అనేది ఆమె గుర్తించిన విషయం. ఈ ముందుచూపు జౌను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆమె చిన్న సంస్థ ‘లెన్స్ టెక్నాలజీ’ అనే అతి పెద్ద కంపెనీగా మారింది. ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే అధునాతన కవర్గ్లాస్, టచ్–స్క్రీన్ భాగాలను సరఫరా చేసే కీలకసంస్థగా అవతరించింది. స్మార్ట్‌ఫోన్, ఏఐ హార్డ్‌వేర్, స్మార్ట్ వెహికిల్స్, కాక్‌పిట్ వ్యవస్థలు, రోబోటిక్స్ పార్ట్స్ నుండి ఏరోస్పేస్ సంబంధిత తయారీ రంగం వరకు విస్తరించింది.స్పీడ్ స్పీడ్‌గా...టిమ్ కుక్, ఎలాన్ మస్క్‌లాంటి దిగ్గజాల మధ్య జౌ కూర్చోవడం అనేది ఆమెకు సంబంధించిన విశేషమే కాదు, అనేక పరిశ్రమలలో పెరుగుతున్న లెన్స్ టెక్నాలజీకి ప్రతీకాత్మక చిత్రం. ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీకి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల నుండి అధిక ఆదాయం వస్తున్నప్పటికీ, ఏఐ గ్లాసెస్, ఇంటెలిజెంట్ వెహికిల్స్, ఫ్లెక్సిబుల్ గ్లాస్ టెక్నాలజీ, ఏరో స్సేస్ ఉత్పత్తుల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలోకి వేగంగా విస్తరించింది.‘చైనా మాన్యుఫాక్టరింగ్’ అంటే చాలా తక్కువ ఖర్చు అనే అభి్రపాయం ఉంది. ‘లెన్స్ టెక్నాలజీ’ లాంటి సంస్థలు ఇప్పుడు ఆ అభి్రపాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే... విజయ రహస్యంనా కష్టాలు చిన్న వయసులోనే మొదలయ్యాయి. ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నాన్న కంటిచూపు కోల్పోయాడు. అయిదేళ్ల వయసులో అమ్మ చని΄ోయింది. ‘తర్వాతి భోజనం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని ఎలా సంపాదించుకోవాలి?’ అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. పదహారేళ్ల వయసులో ఒక వాచ్ లెన్స్ ఫ్యాక్టరీలో అసెంబ్లీ వర్కర్‌గా చేరాను. రాత్రిపూట అకౌంటింగ్ క్లాస్‌లకు హాజరయ్యేదాన్ని. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కనేదాన్ని. వ్యాపారవేత్తగా నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అయినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేసి ఉంటే ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ ఉండేది కాదు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు చాలామందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా పట్టుదలతో ముందుకు సాగడమే అసలు సిసలు విజయం.– జౌక్విన్ ఫేయ్
ఫైర్‌పై బోర్ కొట్టకుండా!
సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్ఫేమ్’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాక΄ోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్వాల్వ్ అవ్వాలి. పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.ఏ విషయమైనా బోర్ కొట్టకుండా మన సంభాషణ పిల్లలతో సరదాగా ఉండాలి. పెద్దలకు కూడా ఇది ఎక్సర్సైజ్ పాఠమే అవుతుంది. ఉదాహరణకు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’... సినిమాటిక్‌గా ఓ డైలాగ్ చేప్పండి. వెంటనే పిల్లల అటెన్షన్ మీ వైపు తిరుగుతుంది. అమ్మో ‘నిప్పు’ అని భయపెట్టకూడదు. ఆశ్చర్యం, జాగ్రత్త, విజ్ఞానం.. కలిపి ‘నిప్పు’ గురించి తెలుసుకునేలా ఉండాలి.వెలుగు దీపాలు→ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో అందంగా అలంకరించిన కేక్ పైన క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగు ఎలా ఉంటుందో అడగండి. డ్రాయింగ్‌లో చూపమనండి.→ కిచెన్‌లో వంట వండటానికి ఏం వాడతారో అడగండి → దీపం వెలగడానికి ఏం అవసరం, లైటర్ ఎలా వెలుగుతుంది? → ఇంధనపు వేడి వల్ల ఏయే వాహనాలు, ఇంజన్లు నడుస్తాయో గెస్ చేయమనండి → అడవిలో మంటలు వస్తే, షార్ట్ సర్క్యూట్ జరిగితే, అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు ఏయే చోట్ల జరుగుతాయి... వాటినే చిత్రాల్లో చూపమనండి → కొవ్వొత్తి వెలుగుకి గాలి లేక΄ోతే ఏమవుతుంది, వేడికి కొవ్వొత్తి ఎందుకు కరిగి΄ోతుంది, మంట ఎందుకు రెపరెపలాడుతుంది?... మన రోజువారీ పనుల్లో ‘నిప్పు’ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చెప్పమనండి.సేఫ్టీ హీరో రోల్అగ్ని ప్రమాద సమయంలో 101కు కాల్ చేసే వ్యక్తి, ఇంట్లో గ్యాస్ వాడకంలో పొదుపు, వంట చేసేటప్పుడు జాగ్రత్త పడే వాళ్లు, కాలిన గాయాలకు నివారణ ఉపాయాలు సూచించే వ్యక్తి ... వీటిలో ఏవి చేసినా ‘హీరో’నే. ఏయే వస్తువులు నిప్పును పుట్టిస్తాయి. పిల్లలు అగ్గిపెట్టె, వంటగ్యాస్.. మొదలైన ‘నిప్పు’ కు కారణమయ్యే వస్తువులకు దూరంగా ఎందుకు ఉండాలి.. చూపమనాలి.నిప్పు కథలు→ ఆదిమ మనిషి నిప్పు కనుగొన్న విధానం → హనుమంతుడు లంక దహనం కథ → చలి పెట్టినప్పుడు వేడికోసం మంట ఎలా ఉపయోగపడుతుంది → సూర్యుడు వేడిని ఎలా పుట్టిస్తున్నాడు. వేసవిలోనే ఎందుకు అంతగా మండుతుంటాడు → నిప్పుకు ఎన్ని పేర్లు ఉన్నాయి. ఏయే భాషల్లో ఎలాంటి పేర్లు ఉన్నాయి.. ‘నిప్పు’ గురించి చేసే ఈ ప్రయోగం పిల్లలను ఆలోచింపజేస్తుంది. కొత్త విధానాల రూపకల్పన జరుగుతుంది. ఎన్నో విషయాలు ‘నిప్పు’ అనే టాపిక్ ద్వారా తెలియజేయవచ్చు. పిల్లల వయసు, వారు అర్ధం చేసుకుంటున్న విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ప్రోత్సహిస్తే పిల్లలు కూడా ‘నిప్పు’రవ్వల్లా మెరుస్తారు.నిర్వహణ: నిర్మలారెడ్డి
ఫోరెన్సిక్ వైద్యంలో 'మరణపూర్వ గాయాలు' అంటే? ఎలా గుర్తిస్తారంటే..
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణించడానికి ముందు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయలయ్యాయని ఫోరెన్సిక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మరణపూర్వ గాయాలు అంటే ఏంటీ?, ఫోరెన్సిక్ వైద్యులు వాటిని ఎలా గుర్తిస్తారు వంటి వాటి గురించి తెలుసుకుందామా.!.ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఇవి అత్యంత కీలకమైన ఆధారాలు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోస్ట్‌మార్టం నిర్వహించడానికి తరలిస్తారు పోలీసులు. అక్కడ ఫోరెన్సిక నిపుణులు ఆ వ్యక్తి ఎలా మరణించాడో నిర్థారించే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నిపుణులు పోస్ట్‌మార్టం నివేదికలో మరణానికి ముందు గాయాలు, మరణానంతర గాయాలు అని పేర్కొంటూ ఇస్తారు. ఇవి కేసుని చేధించడానికి ఎంత కీలకం అంటే..ఆయా వ్యక్తుల మరణానికి కారణమైన నేరస్తులను వెలకితీయడానికి ప్రధాన ఆధారాలు. 'మరణపూర్వ గాయాలు' అంటే ..ఫోరెన్సిక్ వైద్యంలో, "మరణపూర్వ" అంటే మరణానికి ముందు జరిగే గాయలని అర్థం. జీవించి ఉండగానే అయ్యిన గాయాలని అర్థం. అవికోతలు లేదా రాపిడి గాయాలువాపుఎముకలు విరగడంఅంతర్గత రక్తస్రావంబలహీనమైన దెబ్బలుఆత్మరక్షణ గాయాలు తదితరాలు.వైద్యులు చెప్పేదేమిటంటే, ఈ పదం గాయాలు ఎలా జరిగాయో దానంతట అదే వెల్లడించనప్పటికీ, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తుంద.ఎలా గుర్తిస్తారంటే?మరణానంతర పరీక్ష సమయంలో, ఫోరెన్సిక్ నిపుణులు మరణానికి ముందు శరీరం గాయానికి ప్రతిస్పందించిందని చూపే ఆధారాలను సేకరిస్తారు. కణజాలంలోకి రక్తస్రావం, వాపు లేదా ఉబ్బరం, రంగు మార్పులతో కూడిన కమిలిన గాయాలు, రక్తం గడ్డకట్టడం, రక్త ప్రసరణ చురుకుగా ఉందని సూచించే కణజాల ప్రతిచర్యలు వంటివి ముఖ్యమైన సంకేతాలు. గుండె ఇంకా రక్తాన్ని పంపింగ్ చేస్తూ, శరీరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు సాధ్యమవుతాయి. ఇవి చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నివేదిక. దర్యాప్తు అధికారులు ఈ గాయాలు మరణానికి ఏవిధంగా దోహదపడ్డాయి, ఆ టైంలో ఏదైన పెనుగులాట జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగాయ, స్వయంగా జరిగినవా వంటివి నిర్థారిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కేలుసలలో లేదా ఏదైన కుట్రపన్ని ఉద్దేశ్యపూర్వకంగా చంపేసిన ఘటనల్లోనే ఇలాంటి బహుణ మరణ పూర్వగాయాలకు ఆస్కారం ఉంటుంది. అదీగాక పోలీసులు వైద్య నివేదికలు లేకుండా ఒక నిర్ధారణకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. మరణానంతర గాయాలు అంటే..మరణం తర్వాత కలిగే గాయాలను మరణానంతర గాయాలు అంటారు. ఇవి సాధారణంగా అవే జీవసంబంధమైన ప్రతిచర్యలను చూపించవు.మరణానికి పూర్వం-మరణానంతర గాయాల మధ్య వ్యత్యాసం..మరణానికి ముందు గాయాలుమరణానికి ముందు సంభవిస్తాయిరక్తస్రావం, వాపును చూపుతాయిగాయం జరిగినప్పుడు శరీరం సజీవంగా ఉందని సూచిస్తాయిమరణానంతర గాయాలుమరణం తర్వాత సంభవిస్తాయిసాధారణంగా వాపు లేదా కణజాల ప్రతిచర్య ఉండదుమృతదేహాన్ని తరలించే సమయంలో, పర్యావరణానికి గురైనప్పుడు లేదా శరీరాన్ని తాకినప్పుడు జరగవచ్చు. ఇక్కడ కేసుని చేధించడంలో ఫోరెన్సిక్ నివేదిక అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అధికారులు ఒక నిర్ధారణకు రావడానికి ముందు పోలీసుల ఇన్విస్టిగేషన్, సాక్షుల వాంగ్మూలాలు, టాక్సికాలజీ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వైద్య చరిత్ర వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.(చదవండి: సింగింగ్'తో జీర్ణక్రియ మెరుగుపడుతుందా? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు)
అంతర్జాతీయం
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ కూలిపోవడంలో యుఎస్ఏ పాత్ర..?
వాషింగ్టన్, డీసీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని ప్రభుత్వం కూలిపోవడంపై అమెరికా మీడియా సంస్థ 'డ్రాప్ సైట్ న్యూస్' సంచలన కథనం ప్రచురించింది. అయిన ప్రభుత్వం కూలిపోవడానికి కేవలం ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కేవలం అవిశ్వాస తీర్మానం వల్ల కోల్పోలేదని దాని వెనక అమెరికా, పాకిస్థాన్ సైన్యం కుట్ర ఉందని కథనం ప్రచురించింది.డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు.యాధృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థవైఖరి ప్రదర్శించారు. అనంతరం 2022 మార్చి 7న, వాషింగ్టన్‌లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్‌తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.ఇమ్రాన్ తొలగింపు అనంతర పరిణామాలుఏప్రిల్ 2022, ఇమ్రాన్‌ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు.అనంతరం కొద్ది నెలలకు నవంబర్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్‌తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.దీంతో 2025లో మునీర్ అధికారం మరింత పెరిగింది: నివేదిక ప్రకారం, రాజ్యాంగ మార్పుల అనంతరం అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ మరియు రక్షణ దళాల అధిపతిగా నియమించారు. దీంతో సైన్యం, రక్షణ మౌలిక సదుపాయాలు, పాకిస్తాన్ అణు కమాండ్‌పై ఆయన పట్టు మరింత బలపడింది.పతాక స్థాయికి అమెరికా-పాక్ సంబంధాలుఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి.పాకిస్థాన్‌లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్‌లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్‌కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్‌లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. ముందే చెప్పిన ఇమ్రాన్తన ప్రభుత్వం పడిపోయినప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా విదేశీ కుట్ర జరిగిందని ఆరోపించారు. 2022 మార్చిలో జరిగిన ఒక ర్యాలీలో, తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని పేర్కొంటూ ఆయన ఒక కాగితాన్ని ఊపారు. ఈ కేసు ఆ తర్వాత సైఫర్ కేసుగా ప్రసిద్ధి చెందింది.
ఇరాన్ వార్.. నయా ట్రెండ్
ప్రపంచ యుద్ధాల రూపురేఖలు మారిపోతున్నాయ్. క్షిపణులు, అణు బాంబులు, డ్రోన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు సరిహద్దులు, వనరులు, ఆఖరికి డిజిటల్ నెట్‌వర్క్‌లు కూడా ఆయుధాలయ్యాయి. అదెలా సాధ్యమో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తనకంటే బలమైన సైన్యం ఉన్న అమెరికాను విసిగెత్తిస్తూ ‘వార్ ట్రెండ్’ను సెట్ చేసింది.ఇరాన్ తన సరికొత్త వ్యూహం అమలుకు.. హర్ముజ్ జలసంధిని వేదికగా చేసుకుంది. దీని ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరుగుతుందని తెలిసిందే కదా. అందుకే జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించుకుని.. టోల్‌ప్లాజా ఏర్పాటుతో వసూళ్లు చేపట్టాలని భావించింది. తద్వారా.. వచ్చిన సొమ్ముతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్‌ను పునరుద్ధరించుకోవడం, దేశ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుంటామని ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోగలిగింది. అదే సమయంలో.. సముద్ర గర్భం కేబుళ్లపై దృష్టిసారించి భయపెట్టింది కూడా. ఇప్పుడు కేబుళ్ల విషయంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు కాంప్రమైజ్ కావాలని.. ఎంతో కొంత తమకు చెల్లించాలని(పన్ను, ఫీజు, ఫైన్.. ఏదో ఒక రూపేణా).. అలాగే వాటి నిర్వహణ(రిపేర్లు వగైరా) బాధ్యతలు కూడా తమ ఆధ్వర్యంలోనే సాగాలని కండిషన్లు పెడుతోంది. లేకుంటే కత్తిరింపులు తప్పవన్నట్లు బెదిరిస్తోంది. అలా.. తన భౌగోళిక స్థానాన్నే ఇరాన్ ఆయుధంగా మలుచుకుంది.టిట్ ఫర్ టాట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విషయంలో ఏం చేయాలనుకున్నాడో.. ఇరాన్ ఆ పనే కౌంటర్‌గా చేసి చూపించింది. అదే ఆర్థికంగా దెబ్బ తీయడం. ఇరాన్‌ను ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రంప్.. హర్ముజ్ బ్లాకేడ్, నిధుల ఫ్రీజ్‌లను చూపించి ఇరాన్ మెడలు వంచాలనుకున్నాడు. అయితే ఆ నష్టం ధాటికి ఇరాన్ తలొగ్గలేదు. సరికదా.. యుద్ధాన్ని సరికొత్త మలుపులు తిప్పింది.యుద్ధం ప్రారంభంలో.. చౌకగా తయారైన షాహెడ్ డ్రోన్లు ఉపయోగించి అమెరికా రక్షణ వ్యవస్థలను ఆగమాగం చేసింది. తద్వారా అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకోవడంతో తన వ్యూహాన్ని మొదలుపెట్టింది. హర్ముజ్ అనేది కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు ఉండడం, పైగా తమ తీరానికి దగ్గరగా ఇరాన్‌కు ఎంతో కలిసొచ్చింది. రోజుకు 100–150 నౌకలు వెళ్లే హర్ముజ్‌లో మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్స్‌తో నియంత్రించింది. ఫలితంగా ఒక్క నౌక కూడా నీట మునగకుండానే ఇన్సూరెన్స్ ప్రీమియంలు 300% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. యూరప్ దేశాలు అదనంగా 28 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా క్షిపణుల యుద్ధం కాస్తా ఆర్థిక యుద్ధం అయ్యింది.భవిష్యత్తులో.. ఇరాన్ తన యుద్ధాన్ని క్షిపణుల నుంచి మరో దారికి మలిచింది. ఎనర్జీ + డేటా.. ఇవి రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశాలే. అలా రెండు కీలక ప్రవాహాలను ఒకేసారి నియంత్రించే శక్తి తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపై యుద్ధం కేవలం బాంబులు, గన్స్‌తో కాదు.. వివిధ వనరుల రూపంలోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ చూపించిన ఈ యుద్ధ వ్యూహాన్ని ఉత్తర కొరియా, చైనా అధ్యయనం చేస్తున్నాయి. రష్యా కూడా ఈ ఉద్రిక్తతను నిశీతంగా పరిశీలిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచానికి కొత్త హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.కొత్తదేం కాదా?ఇరాన్ అనుసరించిన ఈ వ్యూహం కొత్తేదేం కాదట. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు.థెర్మోపిలే యుద్ధం (480 BC): స్పార్టా రాజు లియోనిడాస్ కొద్దిమంది సైనికులతో పర్షియన్ సైన్యాన్ని ఒక పర్వత మార్గంలో నిలువరించగలిగాడు. సంఖ్యలో తక్కువైనా, భౌగోళిక స్థానం (చోక్పాయింట్)ను ఉపయోగించి శత్రువుల అధిక బలాన్ని నిర్వీర్యం చేశాడు. ఇది “స్థానం” అనే ఆయుధం ఎంత శక్తివంతమో చూపించింది.రోమన్ సామ్రాజ్యం – కార్తేజ్: ప్యూనిక్ యుద్ధాల అనంతరం రోమన్లు కార్తేజ్ పొలాలను ఉప్పు చల్లి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇది భౌగోళిక వనరులను ధ్వంసం చేసి శత్రువును బలహీనపరిచే వ్యూహం.నెపోలియన్ (19వ శతాబ్దం): బ్రిటన్‌తో వాణిజ్యాన్ని నిషేధించి యూరప్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాడు. ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చిన ఉదాహరణ.బలహీన దేశం కూడా తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మార్చుకుని శక్తివంతమైన దేశాలను నిలువరించగలదు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ పాఠాన్నే ఇరాన్ వల్లేసింది. అమెరికా అణు బాంబులను ఆపడానికి యుద్ధం మొదలుపెడితే.. కానీ ఇరాన్ తన భూభాగాన్ని ఆయుధంగా మార్చి మరింత శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఇస్లాంపూర్- కృష్ణానగర్‌గా .. పాకిస్థాన్‌లో పేర్ల మార్పు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని చారిత్రక కట్టడాలకు, వారసత్వ సంపదలకు విభజనకు ముందు ఉన్న పేర్లను తిరిగి నామకరణం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకాలం ఇస్లామిక్ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు, ప్రదేశాలకు పేర్లు ఉండగా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వాటికి పాత పేర్లు రానున్నాయి.పాకిస్థాన్ మతతత్వ విధానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశానికి చెందిన ప్రతి చిన్న విషయంలో మతతత్వ విధానాలనే ఆ దేశం ఫాలో అవుతుంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కటి చారిత్రక ప్రదేశాలకు ఇస్లామిక్ భావజాలలతో సంబంధం ఉన్న పేర్లనే పెట్టింది. కాగా ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకోనున్నట్లు ప్రకటించింది. మార్పు జరిగే ప్రాంతాల పేర్లుకృష్ణ నగర్ - ఇస్లాంపురాగాసంత్నగర్ - సున్నత్ నగర్ధరంపురా - ముస్తఫాబాద్గాబ్రాండ్రెత్ రోడ్- నిష్తర్ రోడ్గాటెంపుల్ స్ట్రీట్ - హమీద్ నిజామీ రోడ్‌గా లక్ష్మీ చౌక్- మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్గాజైన్ మందిర్ రోడ్- బాబ్రీ మసీద్ చౌక్‌గా రామ్ గలిని -రెహమాన్ గలికుంహర్పురా- ఘజియాబాద్ గా మార్చారు.అదే విధంగా క్వీన్స్ రోడ్ - ఫాతిమా జిన్నా రోడ్.జైల్ రోడ్- అల్లామా ఇక్బాల్ రోడ్, డేవిస్ రోడ్ పేరును సర్ అగా ఖాన్ రోడ్‌గా, లారెన్స్ రోడ్ పేరును బాగ్-ఇ-జిన్నా రోడ్‌గా, మరియు ఎంప్రెస్ రోడ్ పేరును షహ్రా-ఇ-అబ్దుల్ హమీద్ బిన్ బదీస్గా మార్చారు.కాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆదేశాలనుగునంగానే చారిత్రక ప్రదేశాలకు దేశ విభజనకు ముందు ఉన్న పేర్లను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన పంజాబ్ క్యాబినెట్ సమావేశంలో చారిత్రక ప్రదేశాలకు వాటి పూర్వ పేర్లే ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.అదే విధంగా ప్రస్తుతం గ్రేటర్ ఇక్బాల్ పార్క్‌గా పిలవబడుతున్న మింటో పార్క్‌లోని మూడు క్రికెట్ మైదానాలను, ఒక సాంప్రదాయ అఖారాను (కుస్తీ రంగం) పునరుద్ధరించాలని కూడా ప్రధాని ప్రతిపాదించారని అక్కడి అధికారులు తెలిపారు.
ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్
Iran War అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్ల (సుమారు 50 మిలియన్ యూరోలు, రూ. 480 కోట్ల ) బహుమతి (బౌంటీ) ప్రకటించే దిశగా ఇరాన్ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని 'ఇరాన్ వైర్', 'ది టెలిగ్రాఫ్ యూకే' నివేదికల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇరాన్ పార్లమెంట్‌కు చెందిన 'నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిటీ' చైర్మన్ ఇబ్రహీం అజీజీ ఈ బిల్లును సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి "కౌంటర్-యాక్షన్ బై ది మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్" అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. .ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇతనితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. ప్రస్తుత సుప్రీం లీడర్ తీవ్ర గాయాలు పాలుకావడానికి కూడా ఈ దాడులే కారణమని అంచనా. ఈ దాడులకు ప్రతీకారంగా ట్రంప్, నెతన్యాహులను హతమార్చడానికి రివార్డులను ప్రతిపాదించే ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. ఖమేనీ హత్యలో పాత్ర ఉన్నందుకు గాను ట్రంప్, నెతన్యాహు, మరియు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "ప్రతీకార చర్య" తీసుకోవాలని అజీజీ పేర్కొన్నట్లు ఇరాన్ వైర్ తెలిపింది. జాతీయ భద్రతా కమిషన్ లోని మరొక సభ్యుడు మహమూద్ నబవియాన్ కూడా, ట్రంప్, నెతన్యాహులను "నరకానికి పంపే" ఎవరికైనా బహుమతులు ఇచ్చే బిల్లుపై తమ పార్లమెంట్ త్వరలోనే ఓటు వేస్తుందని ప్రకటించారు. మసాఫ్ (Masaf) మీడియా : 'కిల్ ట్రంప్' ప్రచారం ,సైబర్ గ్రూప్ ప్రకటనఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'మాసఫ్' కొన్ని రోజుల క్రితమే ఒక ప్రకటన చేస్తూ, ఇస్లామిక్ ప్రభుత్వం "కిల్ ట్రంప్" అనే ప్రచారం కోసం 50 మిలియన్ల డాలర్ల ఆర్థిక వనరులను సమకూర్చుకుందని పేర్కొంది.హండాలా (Handala) హ్యాకింగ్ గ్రూప్: అంతకుముందు, ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్ఫేర్ గ్రూప్ "హండాలా" కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా న్యాయ శాఖ తమ గ్రూప్ సభ్యుల సమాచారం కోసం 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించినందుకు ప్రతిస్పందనగా... "అణచివేత, అవినీతికి ప్రధాన సూత్రధారులు" అయిన ట్రంప్ మరియు నెతన్యాహులను అంతమొందించడానికి తాము ఈ వనరులను కేటాయించామని హండాలా క్లెయిమ్ చేసింది. ఈ ఇద్దరు దేశాధినేతలపై "ప్రత్యక్ష చర్య" తీసుకునే ఏ వ్యక్తికైనా లేదా సమూహానికైనా ఈ డబ్బు చెల్లిస్తామని ఆ హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ బౌంటీ (రివార్డు) చట్టం, గతంలో వారు చేసిన మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల కంటే చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.గతంలో ఇరాన్ కేవలం మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల ద్వారా మాత్రమే ఇలాంటి హెచ్చరికలు చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో చట్టబద్ధంగా బౌంటీ బిల్లును తీసుకురావాలని చూడటం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని తీవ్ర ముప్పులోకి నెడుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్అమెరికా హెచ్చరిక: గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. తనను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని "భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాం" (Wipe them off the face of the Earth) అని తీవ్రంగా హెచ్చరించారు.శాంతి చర్చల్లో సందిగ్ధత: ఇరాన్ తాజాగా అమెరికాకు ఒక కొత్త శాంతి ప్రతిపాదనను పంపినప్పటికీ, అది పాత ప్రతిపాదనల కంటే పెద్దగా మెరుగ్గా ఏమీ లేదని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని మరియు ఇరాన్ సానుకూలంగా స్పందించాల్సిన ఒత్తిడి వారిపైనే ఉందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?
జాతీయం
మీ అర్హతలకు ప్రభుత్వ పథకాలు.. కొత్త వెబ్సైట్ వచ్చేసింది!
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వందలాది సంక్షేమ పథకాల గురించి సరైన సమాచారం లేక ఎంతోమంది అర్హులు ప్రయోజనాలను కోల్పోతున్నారు. ఏ పథకానికి ఎవరు అర్హులు, ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలో తెలియక సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన డిజిటల్ పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ‘మైస్కీమ్’ (myScheme) వెబ్సైట్. మీ వయస్సు, వృత్తి, ఆదాయం తదితర ప్రాథమిక వివరాలను నమోదు చేయడం ద్వారా, కేవలం కొద్ది నిమిషాల్లోనే మీకు సరిపోయే ప్రభుత్వ పథకాల జాబితాను ఈ పోర్టల్ మీ కళ్లముందు ఉంచుతుంది.విప్లవాత్మక ‘మైస్కీమ్’ పోర్టల్కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వేలాది పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన అధికారిక ప్లాట్‌ఫారమ్ ‘మైస్కీమ్’ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల నుండి రైతుల సబ్సిడీలు, మహిళా ఉపాధి పథకాలు, వృద్ధాప్య పింఛన్లు, వ్యాపార రుణాల వరకు అన్ని వివరాలు ఇందులో లభిస్తాయి. వేర్వేరు మంత్రిత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించే శ్రమ లేకుండా, ఒకే చోట మీ ప్రొఫైల్‌కు సరిపోయే స్కీమ్‌లను చెక్ చేసుకోవచ్చు. అలాగే సదరు పథకాలకు సంబంధించిన అర్హత నియమాలు, అవసరమైన పత్రాలు, లబ్ధి పొందే పూర్తి విధానాన్ని ఇది స్పష్టంగా వివరిస్తుంది.అర్హతలను తెలుసుకునే మార్గంఈ పోర్టల్ ద్వారా మీకు తగిన పథకాలను కనుగొనడం అత్యంత సులభం. మొదటగా ‘myScheme’ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, హోమ్‌పేజీలో ఉన్న ‘Find Schemes For You’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ వయస్సు, లింగం, రాష్ట్రం, వృత్తి, సామాజిక వర్గం, ఆదాయ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్‌ను మరింత విశ్లేషించడానికి సిస్టమ్ అడిగే మరికొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీరు ఏ ఏ పథకాలకు అర్హులో ఆ జాబితా స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.దరఖాస్తు విధానం- ప్రయోజనాలుఅర్హత గల పథకాన్ని ఎంచుకున్న తర్వాత, దానిపై క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అక్కడ సదరు పథకం అందించే ప్రయోజనాలు, కావలసిన డాక్యుమెంట్లు, తరచుగా అడిగే ప్రశ్నల విభాగం ఉంటుంది. ‘Application Process’పై క్లిక్ చేస్తే దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన అధికారిక లింక్, దశలవారీ మార్గదర్శకాలు లభిస్తాయి. ఈ విధానం వల్ల సమయం, శ్రమ ఆదా కావడమే కాకుండా, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సామాన్యులు సకాలంలో పొందేందుకు వీలు కలుగుతుంది.ఇది కూడా చదవండి: 260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?
పోలీసుల అలసత్వమే ప్రాణం తీసిందా?
యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్‌కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్‌జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.పోలీసుల అలసత్వమేనా?ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్‌స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.ఫేమస్ అవుతున్న టైంలో.. పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్‌కి దగ్గరగా ఉండే స్టైల్‌తో పాటు పాప్ కల్చర్‌కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్‌గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.పంజాబ్‌లోనే ఎందుకిలా?ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్ఫీల్డ్ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..పంజాబ్‌లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్‌లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్‌స్టర్ కల్చర్‌తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
ఆ బస్సుల్లో మాత్రమే లేడీస్‌కు ఫ్రీ జర్నీ
తిరువనంతపురం: కేరళలోని మహిళా ప్రయాణికులకు యూడీఎఫ్ ప్రభుత్వం సరికొత్త కానుకను అందించబోతోంది. @ఇందిరా గ్యారెంటీ* పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎటువంటి ఆదాయ పరిమితులు కానీ, ప్రత్యేక కార్డులు కానీ లేకుండానే మహిళలు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ పథకం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) పరిధిలోని అన్ని బస్సులకు వర్తించదు. కేవలం ఎంపిక చేసిన సర్వీసులలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుంది.పరిమితులు లేవు.. కార్డులు అవసరం లేదురాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాధారణ (ఆర్డినరీ) కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ఈ ఉచిత పథకం వర్తిస్తుంది. కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మహిళా లబ్ధిదారుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు లేదా పాస్‌లను ప్రవేశపెట్టగా, కేరళలో ఎలాంటి ప్రత్యేక కార్డులు లేకుండానే ఉచిత ప్రయాణాన్ని అనుమతించనున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమలువుతున్న నమూనానే కేరళ కూడా అనుసరిస్తోంది. అయితే, ఫాస్ట్ ప్యాసింజర్, సూపర్-క్లాస్ వంటి లగ్జరీ బస్సులలో ఈ సదుపాయం ఉండదు.ఏయే బస్సులకు వర్తిస్తుందంటే?ప్రస్తుతం కేరళలో సుమారు 4,700 కేఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా, అందులో దాదాపు 3,000 ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ఈ 3,000 సాధారణ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇందులో ఉండే సుమారు 300 సిటీ ఫాస్ట్ బస్సులు, 1,400 సూపర్-క్లాస్ బస్సులు, మరో 300 ఫాస్ట్ ప్యాసింజర్ సర్వీసులకు ఈ పథకం నుండి మినహాయింపు ఇచ్చారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా హై-కేటగిరీ డీజిల్ బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం ఆర్థికంగా సాధ్యం కాదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఆర్టీసీపై భారీగా ఆర్థిక భారంఈ సరికొత్త ఉచిత ప్రయాణ పథకం వల్ల కేరళ ఆర్టీసీపై నెలకు సుమారు రూ.90 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కేఎస్ఆర్టీసీ జీతాల కోసం నెలకు రూ.50 కోట్లు, పెన్షన్ల కోసం రూ.80 కోట్లు అందిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల మరో రూ.3 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ ఉచిత పథకం కూడా తోడైతే, ప్రభుత్వ ముందస్తు సహాయం నెలకు దాదాపు రూ.220 కోట్లకు పెరగనుంది. అయినప్పటికీ, మహిళలతో పాటు వచ్చే పురుషుల వల్ల టికెట్ ఆదాయం కొంతవరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: 260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?
260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?
న్యూఢిల్లీ: దాదాపు 260 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బొయింగ్ 787 ఘోర విమాన ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నది. ఈ దారుణ ఉదంతంపై భారత విమానయాన అధికారులు సరికొత్త కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రీమ్‌లైనర్ విమానాల్లోని ‘ఫ్యూయల్-కంట్రోల్ స్విచ్‌లు’ (ఇంధన నియంత్రణ స్విచ్‌లు) అకస్మాత్తుగా ఆగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో భారత సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ) ఉన్నతాధికారులు అమెరికాలోని సీటెల్ నగరంలోని బొయింగ్ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వెళ్లి, ఈ స్విచ్‌ల పనితీరుపై జరగబోయే ప్రయోగాలను పర్యవేక్షించనున్నారు.లండన్-బెంగళూరు ఫ్లైట్‌లో బయటపడ్డ లోపంఇటీవల లండన్ నుండి బెంగళూరు వస్తున్న మరో ఎయిర్ ఇండియా బొయింగ్ 787 విమానంలో పైలట్లు ఇంధన స్విచ్‌లలో ఒక విచిత్రమైన సాంకేతిక సమస్యను గుర్తించారు. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో స్వల్ప ఒత్తిడి పడినా ఈ స్విచ్‌లు స్థిరంగా ఉండకుండా ఊడిపోవడాన్ని పైలట్లు గమనించారు. మూడుసార్లు ప్రయత్నించిన తర్వాతే అవి సరిగ్గా పనిచేశాయి. ఈ ఘటన విమాన ప్రమాద దర్యాప్తుకు అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంధన స్విచ్‌లు ఒకేసారి ‘కటాఫ్’ పొజిషన్‌కు మారిపోయి, ఇంజిన్‌కు ఇంధనం అందకుండా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సీటెల్ బొయింగ్ ల్యాబ్‌లో క్లిష్టమైన పరీక్షలుఆటోమేటిక్గా లేదా అనుకోకుండా మారడానికి వీల్లేని ఈ సురక్షితమైన లాకింగ్ స్విచ్‌లు, ఏదైనా నిర్దిష్ట కోణంలో బాహ్య ఒత్తిడి పడటం వల్ల దానంతట అవే కట్-ఆఫ్ అయ్యే అవకాశం ఉందా? అనే కోణంలో ఇప్పుడు అధికారులు పరిశోధించనున్నారు. లండన్ ఫ్లైట్ నుండి తొలగించిన స్విచ్ మోడ్యూల్‌ను ప్రస్తుతం అమెరికా బొయింగ్ ల్యాబ్‌లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పరీక్షించనున్నారు. అయితే, ప్రాథమిక తనిఖీల్లో ఈ సిస్టమ్ బాగానే ఉందని బొయింగ్ పేర్కొన్నప్పటికీ, ప్రమాద తీవ్రత దృష్ట్యా డీజీసీఏ అధికారులు స్వయంగా అక్కడ ఉండి ప్రయోగాలను వీక్షించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించారు.పైలట్ల సంఘాల ఆందోళన – అంతర్జాతీయ నిఘామరోవైపు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) గతంలో ఈ ప్రమాదానికి ఎలాంటి యాంత్రిక లోపం కారణం కాదని, పైలట్లే మాన్యువల్‌గా ఇంధనాన్ని నిలిపివేసి ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే ఈ వాదనను భారత పైలట్ల సంఘాలు, మరణించిన కెప్టెన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి విచారణ ముగియకముందే పైలట్లపై నిందలు వేయడం సరికాదని, స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత విమానయాన రంగ భద్రత దృష్ట్యా, డీజీసీఏ ఈ దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇది కూడా చదవండి: ‘బందా’లో నిప్పుల కొలిమి: కర్ఫ్యూను తలపిస్తున్న వీధులు!
ఎన్ఆర్ఐ
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
క్రైమ్
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
సాక్షి, హైదరాబాద్: బండి సాయి భగీరథ్ పక్కా పథకం ప్రకారమే పోలీసులకు చిక్కాడని కేసు దర్యాప్తులో పాల్గొన్న కీలక పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో ఆధారాలు దొరకకుండా చేయాల్సిన పనులన్నీ పరారీలో ఉండగానే పూర్తి చేసిన తర్వాతే పోలీసుల అదుపులోకి వచ్చాడని చెప్పారు. ఈనెల 16న భగీరథ్‌ను అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఠాణాలో రెండున్నర గంటలపాటు కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ నిందితుడిని సుదీర్ఘంగా విచారించా రు. అయితే విచారణ సమయంలో భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్‌ఫోన్ మాత్రమే అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్లో సిమ్ లేదని, ఎక్కడుందని విచారణాధికారి నిందితుడిని ప్రశ్ని ంచగా.. సిమ్ కార్డ్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు తెలిసింది. విచారణాధికారులు న్యా యనిపుణులతో చర్చించిన అనంతరం పోక్సో కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేశాడని గుర్తించి, భగీరథ్‌పై కొత్తగా ‘ఆధారాలు మాయం’సెక్షన్‌ను జోడించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో భగీరథ్‌పై బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 238ను జోడించారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్‌ను దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని నార్సింగిలోని సర్వీస్ అపార్ట్మెంట్, మెయిన్‌బాద్ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాలలో సీన్ రీకన్‌స్ట్రక్షన్స్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.
అమీర్‌పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
హైదరాబాద్: గర్ల్స్ హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్‌ను శివపార్వతి, ఆమె కుమారుడు వీరారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్రూమ్లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
లక్ష్మీకుమార్ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం!
మల్లాపూర్/నాంపల్లి: హైదరాబాద్ జలమండలిలో ఓ భారీ అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) రెడ్‌హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్ (58) నివాసం సహా బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన 8 ప్రదేశాల్లో ఏసీబీ డీఎస్పీ మజీత్ అలీఖాన్ ఆధ్వర్యంలో 16 గంటలపాటు సోదాలు జరిగా యి. హైదరాబాద్ మల్లాపూర్‌లోని వెంకటరమణ కాలనీలో ఉన్న అనంత లక్ష్మీకుమార్ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి లభ్యమైంది. అలాగే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఇళ్లు, మారుతీ కారు, బజాజ్ మోటార్ బైక్ సహా మొత్తం రూ. 5.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీకుమార్ భార్య రాధమ్మ పేరిట మూడు బ్యాంకు లాకర్లలో భద్రపర్చిన ఆభరణాలు, ఇళ్ల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు తెరిపించి స్వా«దీనం చేసుకున్నారు. రెడ్‌హిల్స్‌లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. ఆయా ఆస్తుల మార్కెట్ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అనంత లక్ష్మీకుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన్ను బంజారాహిల్స్‌లోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాధు చేయాలని సూచించారు. ఫిర్యాధుల వివరాలు పూర్తింగా గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, నోట్ల కట్టలను లెక్కించేందుకు తీసుకొచ్చిన కౌంటింగ్ మెషీన్లు కాసేపు మొరాయించాయి. సోదాల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన మల్లాపూర్...: మల్లాపూర్ వెంకరమణ కాలనీలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు టీవీల్లో చూసి ఉలిక్కిపడిన స్థానికులు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అనంత లక్ష్మీకుమార్ నివాసం వద్ద గుమిగూడారు. గత నెలలో చిన్న కుమార్తె వివాహాన్ని ఆయన ఆరంఘర్ సమీపంలో అంగరంగ వైభవంగా చేశారని చర్చించుకున్నారు.
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్‌పురా కిషన్‌బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్‌కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీడియోలు
జాన్వీని చూసి రామ్ చరణ్ షాక్ అయ్యాడట.. ఎందుకంటే?
జూపూడి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన
ట్రంప్ పై ఊహించని దాడి
రెచ్చిపోయిన ఏపీ పోలీస్ గూండాలు.. బెడ్ రూమ్ లోకి వచ్చి మరీ..
సురేష్ రైనాని హగ్ చేసుకుని ధోని ఎమోషనల్.. కన్నీటి వీడ్కోలు..
మెలోనికి 'మెలోడీ' చాక్లెట్స్ .. మోదీ సెల్ఫీ వీడియో వైరల్
మేము భూములు ఇవ్వం.. మా ఊరికి రావొద్దు చంద్రబాబుకు ఉండవల్లి రైతుల హెచ్చరిక
గ్రాము బంగారంపైన 10 వేలు లాభం.. వాళ్లందరిపై కాసుల వర్షం..!
మంత్రి సత్యకుమార్ కు వ్యతిరేకంగా ధర్మవరంలో టీడీపీ,బీజేపీ నేతల ఆందోళన
సరిహద్దుల్లో ఉన్న వాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు


