టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత తృణముల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ దేబాలినా బిస్వాస్ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆమె రాజీనామా లేఖ వెలుగులోకి రావడంతో టీఎంసీకి భారీ షాక్ తగిలింది. అయితే, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.టీఎంసీ నియంత్రణలో ఉన్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ), అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా దేబాలినా బిస్వాస్ మాట్లాడుతూ..‘నేను నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాలా రాయ్‌కి లేఖ పంపాను. కౌన్సిలర్‌గా కొనసాగుతూ, నా ప్రాంత ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పదవిలో చాలా కాలంగా ఉన్నాను, కానీ ఇప్పుడు తప్పుకుంటున్నాను. నేను ఇది పూర్తిగా పార్టీ సంబంధిత కారణాల వల్ల చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, అభిషేక్ బెనర్జీ నివాసం.. అక్రమ నిర్మాణంగా జరిగిందంటూ కేఎంసీ (KMC) నోటీసులు జారీ చేసిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చారని బిస్వాస్ ఆరోపించారు. ఈ క్రమంలో..‘నిన్న నోటీసు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. అకస్మాత్తుగా, అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ‘లేదు, ఇది సరికాదు’ అని నాకు అనిపించింది. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని ఒకరిని బలవంతం చేయడం లేదా వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయమని ఒత్తిడి చేయడం పార్టీకి తగదని నేను భావిస్తున్నాను. విషయాన్ని కప్పిపుచ్చడం సరైన పద్ధతి కాదు. మనం అడగాలి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు?. కొన్ని విషయాలు నా పరిధిలోకి రావు’ అని వ్యాఖ్యానించారు.అభిషేక్ బెనర్జీ కంపెనీ, కుటుంబానికి సంబంధించి కేఎంసీ నోటీసులు అందుకున్న 17 చిరునామాలలో, 14 చిరునామాలు బిస్వాస్ అధ్యక్షత వహించిన బరో 9 పరిధిలోకి వస్తాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. పార్టీ అగ్ర నాయకత్వంలోని ఒక వర్గం ఆదేశాల మేరకు బిస్వాస్ రాజీనామా చేశారని టీఎంసీ నాయకుల్లో ఒక వర్గం ఆరోపిస్తోంది. కాగా, తన రాజీనామా ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదని బిస్వాస్ తెలిపారు. మరోవైపు.. నగరంలో అభిషేక్ బెనర్జీకి అనేక అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
చెన్నై: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో మిత్రపక్షం కాంగ్రెస్ కూడా చేరబోతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారం తెలిపారు. వారిద్దరూ ఈ నెల 21న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు. ఈ క్రమంలో తమ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని అన్నారు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లోకి తమ పార్టీ అడుగుపెడుతోందని స్పష్టంచేశారు. మరోవైపు విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సైతం మంత్రియోగం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై లోక్‌భవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1967లో అధికారం కోల్పోయింది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ పలు కూటముల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చేరే అవకాశం రాలేదు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంపై వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రజాహిత పరిపాలన లక్ష్యాలను వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నిరాశే.. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే, 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు. 1952 నుంచి 1967 వరకు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. సి. రాజగోపాలాచారి, కె. కామరాజ్, ఎం. భక్తవత్సలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే, 1967లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. ప్రత్యేకంగా 2006-11 మధ్య డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికార భాగస్వామ్యం కోరినా ఫలితం లేకపోయింది.
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
నా వయసు 32 సంవత్సరాలు. నాకు పెళ్లై 10 సంవత్సరాలు అయ్యింది. పెళ్లైన మొదటి నుంచే నా భర్తకు నా మీద అనుమానం ఉండేది. రెండు సంవత్సరాలుగా ఎక్కువైంది. ఆయన రాత్రంతా పడుకోకుండా మెలకువగానే ఉంటారు. నేను బయటికి వెళ్లి వచ్చినా, బాత్రూమ్కి వెళ్లి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా గొడవ చేస్తారు.పెద్దలు సంపాదించిన ఆస్తి ఉండటం వల్ల ఆయనకు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం పూటంతా ఇంట్లోనే ఉంటారు. రాత్రి పూట మాత్రం పడుకోకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. అలాగే మా బంధువులు, నా అన్నదమ్ములు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా అనుమానిస్తారు. ఎవరితోనూ మాట్లాడనివ్వరు. కొన్నిసార్లు ఇంటికి తాళం వేసుకుని కూడా వెళ్తారు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లడం కూడా చాలా కష్టంగా మారింది. మా అత్తమామలు కూడా ‘సర్దుకుపోమ్మా’ అని మాత్రమే అంటున్నారు. కానీ నా వల్ల ఇక కావడంలేదు. కేవలం కౌన్సిలింగ్ ద్వారా ఆయనను మార్చవచ్చా? ఎందుకంటే ఆయన మందులు వేసుకోవడానికి ఒప్పుకోరు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువచ్చి చికిత్స చేయించడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి.– స్వర్ణ, నల్గొండమీ భర్త ప్రవర్తన కేవలం మామూలు పొసెసివ్ నేచర్’ మాత్రమే కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్య అయ్యే అవకాశం ఉంది. ఆధారాలు లేకపోయినా భార్యపై అనుమానం ఉండడం, రాత్రుళ్లు మెలకువగా ఉండడం, హింసించడం, ఎవరితో మాట్లాడనివ్వకపోవడం, బయటకు వెళ్లనివ్వకుండా ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లడం వంటి లక్షణాలు‘అనుమానం జబ్బు’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అనే మానసిక సమస్యలో భాగంగా కనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు మెదడులో వచ్చే కొన్ని రసాయన మార్పులవల్ల రావచ్చు. అలాగే చిన్నతనంలో జరిగిన ట్రామా లేదా మనుషులపై నమ్మకం కోల్పోయే అనుభవాల వల్ల కూడా ఈవిధమైన సమస్యలు పెరగవచ్చు. ఇది కేవలం కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే తగ్గిపోయే సమస్యకాదు. కొన్నిసార్లు ఇలాంటి అనుమానాలు తీవ్రమై హింస, కొట్టడం, లేదా ప్రాణహాని వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు చికిత్స అవసరం. ‘హాస్పిటల్‌కి వెళ్దాం’ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు. అందుకే మొదట ‘స్ట్రెస్ ఎక్కువగాఉంది’ ‘నిద్ర సరిగ్గా రావట్లేదు కాబట్టి ఒకసారి డాక్టర్‌కు చూపించుకుందాం’ అనే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించండి. హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత డాక్టర్లు మాట్లాడి అవసరమైన మందులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. మందులు కొంతకాలం క్రమంగా వాడితే, తర్వాత కౌన్సిలింగ్‌కు కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మందులు లేదా కౌన్సిలింగ్‌కు పూర్తిగా నిరాకరిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తే, అవసరమైతే కుటుంబ సభ్యుల సహాయంతో బలవంతంగానైనా హాస్పిటల్లో చేర్చి చికిత్స చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు నిరుత్సాహ పడకండి. మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ తరపువాళ్లు, అలాగే మీ అత్తగారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి. సరైన వైద్యంతో ఈ సమస్య నుంచి మీ భర్తను పూర్తిగా బయట పడేయవచ్చు. షేక్ స్పియర్ రాసిన ఒథెల్లో నాటకంలో కూడా క«థ ఇలాంటిదే. అందుకే ఈ సమస్యను ‘కాంజుగల్ పారనోయియా’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని అంటారు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
టెట్రా ప్యాక్‌ల్లో మద్యం.. మోసపూరితం
సాక్షి, న్యూఢిల్లీ: టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల వంటి ‘గుర్తించలేని ప్యాకేజింగ్’లో మద్యం విక్రయాలు సాగిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర ఇతర భాగస్వామ్య పక్షాలను ఆదేశించింది. కేంద్రంసహా అన్ని రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ‘డ్రంకెన్ డ్రైవింగ్ వ్యతిరేక కమ్యూనిటీ’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని, టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల మద్యం అమ్మకాలను నిషేధించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున అడ్వొకేట్ విపిన్ నాయర్ వాదనలు వినిపించారు. ఎక్సైజ్ విధానం కింద ‘సీసా’ అనే పదానికి నిర్వచనం అస్పష్టంగా ఉందని, దీనిపై కొంత ప్రామాణీకరణ జరగాలని చెప్పారు. ఆకుపచ్చ ఆపిల్ ఫోటోలు ఉన్న టెట్రా ప్యాక్‌ల్లో మద్యం ప్యాక్ చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం నిజంగా మోసపూరితమేనని ధర్మాసనం పేర్కొంది. టెట్రా ప్యాక్ చూసి వినియోగదారులు పొరబడుతున్నారని, పైన ఆపిల్ ఫోటో, లోపల వోడ్కా ఉంటోందని విపిన్ నాయర్ వెల్లడించారు. పౌరుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని తేల్చిచెప్పారు. ‘‘పొగాకు ప్యాకెట్లపై ఉన్నట్లుగా టెట్రా ప్యాక్‌లపై ఎలాంటి హెచ్చరిక గుర్తులు లేవు. ఇవి పండ్ల రసాల ప్యాకెట్ల మాదిరిగానే ఉంటాయి. లోపల మద్యం నింపుతున్నారు. మిరపకాయ, మామిడి వోడ్కాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పబ్లిక్ ప్రదేశాల్లో, వాహనాలు నడుపుతూ సులభంగా మద్యం తాగే అవకాశం కలుగుతోంది. మైనర్లు వీటికి త్వరగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రాల సరిహద్దులు దాటించి స్మగ్లింగ్ చేయడం కూడా సులభంగా మారుతోంది. ఈ తరహా విక్రయాలను నిషేధించేలా ఒక విధానాన్ని తీసుకురావాలి. ‘బాట్లింగ్’ అంటే కేవలం గాజు సీసాలు లేదా పారదర్శక కంటైనర్లు మాత్రమే అన్నట్లుగా ఏకీకృత నిర్వచనం ఇవ్వాలి. అంతేకాకుండా ప్లాస్టిక్ సాచెట్లు, పెట్ బాటిళ్లు, టెట్రా ప్యాక్‌ల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. వీటిని రీసైకిల్ చేయడం దాదాపు అసాధ్యం. ఆదాయం పెంచుకోవడానికే వాటిని ప్రోత్సహిస్తున్నారు. ప్రమాదకరమైన ప్యాకేజింగ్‌లో మద్యం అమ్మకాలను నిషేధించడం ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అత్యవసరం’’ అని అని విపిన్ నాయర్ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే: ధర్మాసనం పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పండ్ల రసాల ప్యాకెట్లను పోలి ఉండే టెట్రా ప్యాక్‌ల్లో విరివిగా మద్యం విక్రయించడం అత్యంత మోసపూరితమైన చర్య అని వ్యాఖ్యానించింది. ఇలాంటి విక్రయాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అభిప్రాయపడింది. గతంలో ఓ ట్రేడ్ మార్క్ వివాదానికి సంబంధించిన విచారణలోనూ టెట్రా ప్యాక్‌ల్లో మద్యం అమ్మకాలపై తాము అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
కాన్స్ చిత్రోత్సవాల్లో తాళ్ తిరవా టీజర్
ఢిల్లీ-ఎన్సీఆర్లో ‘చక్కా జామ్’
ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
టీమిండియా శ్రీలంక పర్యటన షెడ్యూల్ విడుదల
సినీ రంగంలోకి ఖుష్బూ చిన్న కూతురు
శామ్సంగ్ వేతన వివాదానికి తాత్కాలిక బ్రేక్
సరైనా సమాధానం కోసం ఎదురుచూస్తున్న: ట్రంప్
తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై లైంగిక దాడి
అత్తాపూర్ లో యువతి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
కాన్స్ చిత్రోత్సవాల్లో తాళ్ తిరవా టీజర్
ఢిల్లీ-ఎన్సీఆర్లో ‘చక్కా జామ్’
ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
టీమిండియా శ్రీలంక పర్యటన షెడ్యూల్ విడుదల
సినీ రంగంలోకి ఖుష్బూ చిన్న కూతురు
శామ్సంగ్ వేతన వివాదానికి తాత్కాలిక బ్రేక్
సరైనా సమాధానం కోసం ఎదురుచూస్తున్న: ట్రంప్
తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై లైంగిక దాడి
అత్తాపూర్ లో యువతి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
ఫొటోలు
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
సినిమా
ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్
అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చేసింది. నాలుగున్నర నిమిషాల వీడియోతో అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. 'డ్రాగన్' ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఒపియమ్ అనే మొక్క, దీని ద్వారా వచ్చే హెరాయిన్.. దీని చుట్టూ ఉండే మాఫియా బ్యాక్‌డ్రాప్ ఇందులో చూపించబోతున్నారు. అయితే ఇందులో ఏకంగా ఎనిమిది విలన్స్ కనిపించడం అందరికీ షాకిచ్చింది. అసలు వీళ్లెవరు? ఏ ఇండస్ట్రీకి చెందినవాళ్లు? ఏయే సినిమాలు చేశారు? వాళ్ల వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!)మొదటగా ఎన్టీఆర్ విషయానికొస్తే.. పేరుకే హీరో అయినప్పటికీ విలనీ టచ్ ఉన్న లూగెర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన హంతకుల ముఠాకు నాయకుడిగా నటించాడు.మొత్తం ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ బాస్ అయిన దాదా సర్కార్ పాత్రలో తెలుగు, తమిళ, హిందీలో గతంలో పలు సినిమాలు చేసిన అశుతోష్ రాణా నటించాడు. తెలుగులో ఈయన వెంకీ, బంగారం, బలుపు, తడాఖా, పటాస్ తదితర మూవీస్ చేశాడు. ముంబైకి చెందిన ఇతడు ఎక్కువగా హిందీ మూవీస్ చేశాడు.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో సెకండ్ ఇన్ కమాండ్ అయిన సుజోయ్ సర్కార్ పాత్రని అన్షుమాన్ పుష్కర్ అనే హిందీ నటుడు చేశాడు. ఇతడో సీరియల్ నటుడు. 2018 నుంచి హిందీ సీరియల్స్ చేస్తున్నాడు. 12th ఫెయిల్, మాలిక్ లాంటి మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో వాజిర్ అయిన బాబీ సర్కార్ పాత్రలో సిద్ధాంత్ గుప్తా కనిపించబోతున్నాడు. ఇతడు కూడా హిందీలో సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ పాత్ర కోసమే తొలుత మలయాళ హీరో టొవినో థామస్‌ని అడిగారని అంటున్నారు. బాబీ సర్కార్, లూగెర్.. అన్నదమ్ముల పాత్రలట.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో రావ్ అనే అకౌంటెంట్ పాత్రని తమిళ నటుడు గురు సోమసుందరం చేశాడు. ఇతడు గతంలో తెలుగులో చీకటిరాజ్యం, స్కార్క్ లైఫ్ చిత్రాల్లో నటించాడు. కానీ మలయాళ మూవీ 'మిన్నళ్ మురళి' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ద ట్రైనర్ పాత్రలో 'ధురంధర్'లో షిరానీ సాబ్‌గా నటించిన బిమల్ జీత్ ఒబెరాయ్ కనిపింతబోతున్నాడు. ఇతడికో పెద్ద సైన్యమే ఉండబోతుంది. ముంబైకి చెందిన ఇతడు గతంలో పీకే, టైగర్ 3 చిత్రాల్లోనూ కనిపించాడు గానీ 'ధురంధర్' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.రష్యన్ డిస్ట్రిబ్యూటర్ విక్టర్ మేన్స్కోవ్ పాత్రలో రష్యన్ నటుడు అలెగ్జాండర్ మిజేవ్, సోమాలియా నియంత జనరల్ దురాన్ పాత్రలో బ్రిటీష్ నటుడు బెన్డిక్ట్ పాల్ గారెట్, ఆఫ్రికా-యూరప్ డిస్ట్రిబ్యూటర్ బిలే క్సెర్సీ పాత్రలో దక్షిణాఫ్రికా నటుడు తుతేలో ప్రిన్స్ గ్రాట్బూమ్ కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చెప్పినవన్నీ విలన్ పాత్రలే.వీళ్లతో పాటు ఆఫ్గానిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహ్మాన్ పాత్రలో మలయాళ ప్రముఖ నటుడు బిజు మేనన్ కనిపించబోతున్నారు. ఈయన గతంలో తెలుగులో 'రణం', ఖతర్నాక్ మూవీస్‌లో నటించారు. ఓటీటీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈయన కాస్త సుపరిచితమే.అలానే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్(ఇండియా) రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించారు. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా చేశారు. రీసెంట్ టైంలో 'యానిమల్' మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిజు మేనన్, అనిల్ కపూర్‌వి 'డ్రాగన్'లో పాజిటివ్ పాత్రలనిపిస్తోంది.పైన చెప్పిన నటులతో పాటు ఈ మూవీలో తమిళ నటి ఖుష్బూ కూడా నటించింది. గ్లింప్స్‌లో విలన్స్ అందరి గురించి చెప్పే పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది గానీ ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు. వీళ్లతో పాటు రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, శత్రు తదితరులు ఇతర సహాయ పాత్రలు చేశారు.ప్రస్తుతం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అందులో విలన్స్‌ని మాత్రమే చూపించారు. గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ, అందులో విలన్స్ ఎవరెవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. మరి అందులో ఎంతమంది విలన్స్ ఉంటారో ఏంటో?(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)
ఎప్‌సెట్ టాపర్‌కు ‘మెగా’ సర్ప్రైజ్
తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషికి మెగాసార్ స్టార్ చిరంజీవి సర్ప్రైజ్ ఇచ్చారు. పరీక్షల ముందు ఆమెకు తండ్రి ఓ మాట ఇస్తే.. దాన్ని మెగాసార్ట్ నిజం చేశారు. అభిమాన హీరో ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి రుషితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాకవ్వడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. అసలు తండ్రి ఇచ్చిన మాటేంటి? చిరంజీవి చేసిన సర్ప్రైజ్ ఏంటి?చిరంజీవి కోసం ఫస్ట్ ర్యాంకుతెలంగాణ ఎప్‌సెట్‌కు సన్నద్దమవుతున్న సమయంలో ‘స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధిస్తే మెగాస్టార్‌తో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆమె కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఈ విషయం చిరంజీవికి తెలియడంతో, ఆ యంగ్ అచీవర్‌ను స్వయంగా తన ఇంటికి పిలిపించుకొని సన్మానించారు.ల్యాప్‌టాప్ బహుమతిబుధవారం ఉదయం రుషి ఫ్యామిలీని చిరంజీవి ఇంటికి పిలిపించుకున్నారు. తన నివాసానికి వచ్చిన రుషిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉన్నత చదువుల నిమిత్తం ప్రోత్సాహకంగా ఆమెకు ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కష్టపడి చదివి టాపర్‌గా నిలవడమే కాకుండా, తన అభిమాన హీరోను స్వయంగా కలుసుకుని సత్కారం అందుకోవడంతో రుషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కల నెరవేరినందుకు ఆమె చాలా సంతోషించింది. #TGEAPCET లో State Top Rank సాధించిన M. Rushi కలను నిజం చేసిన Megastar #Chiranjeevi 🤩❤️Her father had promised that she would get to meet Megastar #Chiranjeevi if she secured the State Top Rank in the prestigious TG EAPCET exam ✨Today, that promise was fulfilled as… pic.twitter.com/y97hKTjSDO— Team Megastar (@MegaStaroffl) May 20, 2026
ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. రెండు అందమైన రామచిలుకలు తారక్‌తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన బర్త్‌డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి అసాహి, యూహి అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. ఇవి జపనీస్ పేర్లు. అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్ దేశంపై తనకున్న ప్రేమతోనే పెంపుడు పక్షులకు జపనీస్ పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.తారక్ కెరీర్ మొదలైందిలా..దివంగత నటుడు ఎన్టీరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. స్టూడెంట్ నెం.1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్.. ఇలా అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. సినిమాచివరగా తెలుగులో దేవర: పార్ట్ 1తో హిట్ అందుకున్నాడు. హృతిక్ రోషన్ వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. అలాగే తారక్ చేతిలో దేవర 2 కూడా ఉంది.చదవండి: జైల్లోనే పెళ్లిరోజు.. దర్శన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఎన్టీఆర్ అడిగిన ప్రశ్న.. సమాధానానికి నాకు మూడేళ్లు పట్టింది
ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అభిమానులకు నచ్చేయగా సాధారణ ప్రేక్షకులకు మాత్రం సరైన యాక్షన్ ఏదో మిస్ అయిందే అని ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్ కూడా నడుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతుల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో బోలెడన్ని విశేషాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)'ఐదేళ్ల క్రితమే ఈ మూవీకి సంబంధించిన కోర్ ఐడియాని ఎన్టీఆర్‌కి చెప్పా. అయితే 'ఆ క్యారెక్టర్ చేసే విపరీతమైన పనుల వెనక పక్కా కారణం, బలమైన డ్రామా ఉందా?' అని నన్ను అడిగారు. దీంతో ఆ పాత్ర ప్రవర్తన, అది చేసే పనులు జస్టిఫై చేయడానికి.. దాని వెనకున్న బలమైన కారణాన్ని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడానికి నాకు, నా టీమ్‌కి మూడేళ్లు పట్టింది. ఇదంతా సిద్ధమైన తర్వాత.. నేను రెడీ అని తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇంతటి స్టార్డమ్ ఉన్న ఓ హీరో, ఇలాంటి పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం చాలా కఠిన నిర్ణయం. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకులకు ఆ విషయం అర్థమవుతుంది''ఇది చాలా డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు నేను రాసిన అన్ని పాత్రల కంటే అత్యంత క్రూరంగా ఉంటుంది. నా ట్రయాలజీ(కేజీఎఫ్, సలార్)లో.. ఈ జానర్లో 'డ్రాగన్' చివరి సినిమా. ఈ మూడు ఒకేలా కనిపించడానికి కలర్ కారణం. కానీ మూడు వేర్వేరు స్టోరీలు. దీని తర్వాత కలర్‌ఫుల్ మూవీస్ చేస్తా. మైథాలజీ ఆధారంగా ఓ కథ రాశాను. ప్రస్తుతం ఒప్పుకొన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాన్ని సినిమాగా తీస్తాను. 'డ్రాగన్' ద్వారా అతిపెద్ద దేశభక్తి సినిమాని అందించబోతున్నాను' అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.డ్రాగన్.. దేశభక్తి సినిమా అని ప్రశాంత్ నీల్ అనగానే ఎదురుగా ఉన్న యాంకర్ కూడా షాకయ్యారు. అసలు ఈ సమాధానం ఊహించలేదని చెప్పుకొచ్చారు. మరి డైరెక్టర్ చెప్పినట్లు ఎలాంటి దేశభక్తి చూపిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఆగాల్సిందే. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు అనిల్ కపూర్, బిజు మేనన్, ఖుష్బూ, రుక్మిణి వసంత్, అశుతోష్ రానా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)
క్రీడలు
దులీప్ ట్రోఫీతో షురూ
ముంబై: భారత దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి 2026–27 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు 23 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ టోర్నీతో సీజన్ మొదలవుతుంది. జోనల్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతాయి. ప్రస్తుత రంజీ చాంపియన్ జమ్ము కశ్మీర్, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య నిర్వహించే ఇరానీ కప్ మ్యాచ్ ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌లో జరుగుతుంది. అనంతరం ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ సుదీర్ఘ సీజన్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 11 నుంచి మార్చి 3 వరకు రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీని డిసెంబర్ 14 నుంచి జనవరి 8 వరకు...టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని నవంబర్ 14 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహిస్తారు. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి అండర్–15, అండర్–16, అండర్–19, అండర్–23, సీనియర్ కేటగిరీల్లో సీజన్ మొత్తం కలిపి బీసీసీఐ ఏకంగా 1788 అధికారిక మ్యాచ్‌లు నిర్వహించనుండటం విశేషం.
ఇస్మాయిల్ బేగ్ లేకుండా...
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రోయింగ్ జట్టు కోచింగ్ బృందంలో దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఇస్మాయిల్ బేగ్‌కు అవకాశం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బేగ్ ఏడు ఆసియా క్రీడల్లో భారత్‌కు కోచ్‌గా వ్యవహరించడంతో పాటు 23 ఏళ్ల పాటు భారత రోయింగ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. రోయింగ్ సమాఖ్య (ఆర్ఎఫ్ఐ) ప్రకటన తనను నిర్ఘాంతపర్చిందని, అధికారికంగా తాను ఇప్పటికీ భారత హెడ్ కోచ్‌నే అని బేగ్ అన్నారు. అయితే ఆర్ఎఫ్ఐ అధ్యక్షుడు ఎం.బాలాజీ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బేగ్ గొప్ప కోచ్‌గా ఎన్నో విజయాలు అందించడం వాస్తవమే అయినా... మార్పు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. 2024 నుంచి భారత రోయింగ్ జట్టు ఆ్రస్టేలియాకు చెందిన ఆంటోనీ ప్యాటర్సన్ శిక్షణలోనే సన్నద్ధమవుతోందని, గత ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ప్యాటర్సన్ కోచింగ్‌లో భారత్ 10 పతకాలు గెలిచిందని ఆయన గుర్తు చేశారు.
ముంబైపై ఘన విజయం.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగల్గింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.ముంబై ఇన్నింగ్స్‌లో టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(26), కార్భిన్ బాష్(32) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, కామోరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగి తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో మనీష్ పాండే(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రావ్మన్ పావెల్(40) రాణించాడు ముంబై బౌలర్లలో కార్భిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ తలా వికెట్ సాధించారు.కేకేఆర్ ఫ్లే ఆఫ్స్ చేరాలంటే?ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్(13) ఆరో స్దానంలో ఉంది. కేకేఆర్ తమ ఆఖరి మ్యాచ్‌లో మే 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజయం సాధిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. అంతేకాకుండా కేకేఆర్ భవితవ్యం రాజస్తాన్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంది. పంజాబ్, రాజస్తాన్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌లో ఓడిపోయి, ఢిల్లీపై కేకేఆర్ గెలిస్తే వారి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.చదవండి: పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర!
అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పంత్ డిమోషన్ వెనుక గిల్ కీలకపాత్ర పోషించాడంటూ ఒక అభిమాని సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తి రేపింది. పంత్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఒక అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకు పంత్ సోదరి సాక్షి లైక్ కొట్టింది. 'పంత్ వైస్ కెప్టెన్సీ పదవి ఊడిపోవడానికి తెర వెనుక కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పెద్ద రాజకీయమే నడిపాడు. తన పదవికి ఉన్న ముప్పును తొలగించుకోవడానికే వైస్ కెప్టెన్సీకి పంత్‌ను కాదని రాహుల్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది’ అంటూ పోస్టు పెట్టాడు. పంత్ భవిష్యత్తులో టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశం ఉండడంతోనే గిల్ ఇలా చేసి ఉండొచ్చని సదరు అభిమాని ఆరోపించాడు. అయితే ఇదంతా ఒక అభిమాని ఎలాంటి ఆధారాలు లేకుండా తన అభిప్రాయంగా పోస్టును పెట్టడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పంత్ సోదరి సాక్షి అభిమాని పెట్టిన పోస్టును లైక్ చేస్తూ ‘ఇది నిజమే అయి ఉండొచ్చు’ అని పేర్కొనడం ఆసక్తిని రేపింది. అయితే అభిమాని పెట్టిన పోస్టుకు లైక్ కొట్టింది నిజంగా పంత్ సోదరి సాక్షినా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పోస్టుపై సోషల్‌మీడియాలో అభిమానులు రెండు విధాలుగా స్పందించారు. కొందరు పంత్‌కు సపోర్ట్ చేస్తే, మరికొందరు గిల్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు. ఈ సంగతి పక్కనబెడితే యాక్సిడెంట్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పంత్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. 2025లో ఇంగ్లండ్ టూర్లో పంత్ సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో వన్డే, టీ20 జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే టెస్టుల్లో పంత్‌కు మంచి రికార్డు ఉండడంతో ఆఫ్గన్‌తో టెస్టుకు ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో ఉంటాడా లేడా అన్నది చూడాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ పంత్ పెద్దగా రాణించలేదు. 132 మ్యాచ్‌లాడి కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా పంత్ జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. వరుస ఓటములతో ఈ సీజన్లో లక్నో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.🚨 Rishabh Pant’s sister has liked an Instagram reel that says Shubman Gill has played politics with Rishabh Pant and removed him from the Vice Captaincy so that he don't have any competition in Test captaincy. 🚨Someone should tell her, that India lost 2-0 vs South Africa at… pic.twitter.com/DpNs4ACLKu— Ahmed Says (@AhmedGT_) May 20, 2026 View this post on Instagram A post shared by Pahul Walia (@cricketwithpahul)చదవండి: ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్‌న్యూస్!
న్యూస్ పాడ్‌కాస్ట్
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
బిజినెస్
మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలిస్తాం
సాక్షి, బిజినెస్ డెస్క్: యువ రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ రిటర్నులు వచ్చే బ్యాంకు డిపాజిట్ల కన్నా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. దీనితో బ్యాంకులకు వస్తున్న డిపాజిట్లపరమైన వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. ప్రజల పొదుపు విధానాలు మారుతున్న నేపథ్యంలో యువ కస్టమర్లను ఆకర్షించేందుకు, రుణాల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త రూటును ఎంచుకుంటున్నాయి. డిజిటల్ విధానంలో ఫండ్స్‌పై రుణాలివ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ గతేడాదే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాపార విభాగాన్ని మరింతగా విస్తరిస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇటీవల మార్చిలో దీన్ని ప్రవేశపెట్టింది. అటు కరూర్ వైశ్యా బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్ కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. నెలా, రెణ్నెల్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలా ఫండ్స్‌పై లోన్ విధానంలో అధిక వడ్డీ రేట్లు ఉండే వ్యక్తిగత రుణాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండా రుణగ్రహీతలు తమ దగ్గరున్న ఫండ్ యూనిట్లను తనఖాగా ఉంచి లోన్ తీసుకోవచ్చు. అదే సమయంలో తమ పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 35 ఏళ్ల లోపు వారి పొదుపులో సింహభాగం వాటా మ్యూచువల్ ఫండ్స్‌దే ఉంటోందని కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్థిక అత్యవసరాల కోసం ఇలా ఫండ్స్‌పై రుణాలు లభిస్తే, తక్కువ లాభాలకో లేదా నష్టాలకో యూనిట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి కస్టమర్లు ఈ విధానం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలనేవి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని, మార్కెట్ ఆధారిత ఫండ్స్‌కి ప్రాధాన్యం పెరిగే కొద్దీ వీటికి మరింత ఆదరణ లభించగలదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సంక్లిష్ట ప్రక్రియ .. ఫండ్స్‌పై రుణాలివ్వడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ. తనఖా ఉంచిన ఫండ్ యూనిట్లను పక్కన పెట్టేలా మార్క్ చేసేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలతో బ్యాంకులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు బ్యాంకులు డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. సాధారణంగా డిపాజిట్ల విలువలో 80–90% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఫండ్ యూనిట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కాబట్టి వాటి విలువ లో 50 శాతమే రుణం ఇచ్చే అవకాశం ఉంటోంది.రూ. 82 లక్షల కోట్లకు ఫండ్స్.. దేశీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) గత దశాబ్దకాలంగా అనేక రెట్లు పెరిగింది. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాల ప్రకారం 2016లో ఏప్రిల్ ఆఖరు నాటికి రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు నాటికి దాదాపు ఆరు రెట్లు ఎగిసి రూ. 82 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం కుటుంబాల వార్షిక పొదుపులో ఈక్విటీ, మ్యుచువల్ ఫండ్స్ వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతమే ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 15.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో బ్యాంకు డిపాజిట్ల వాటా 58 శాతం నుంచి 35 శాతానికి తగ్గింది.
మార్కెట్లో ‘మెలొడీ’ సందడి!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి పార్లే ‘మెలొడీ’ టాఫీలను బహూకరించడం బుధవారం సోషల్ మీడియాలో సందడికి దారితీసింది. భారత్ నుంచి టాఫీ ఎగుమతులు ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టాఫీలు తదితర కన్ఫెక్షనరీ ఉత్పత్తుల ఎగుమతులు గత 12 ఏళ్లలో ఏకంగా 166 శాతం ఎగిసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. 2013–14లో రూ. 49.68 కోట్లుగా ఉన్న ఎక్స్‌పోర్ట్స్ 2025–26 నాటికి రూ. 132 కోట్లకు చేరినట్లు తెలిపింది. పరిమాణంపరంగా 6,652 టన్నుల నుంచి 10 శాతం వృద్ధి చెంది 7,357 టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా తదితర 74 దేశాలకు ఎగుమతవుతున్నాయి. ‘భారత టాఫీల గాథ నిజంగానే వీనులవిందైనది. 2013–14 నుంచి ఏకంగా 166 శాతం ఎగిసింది’ అని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గో యల్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో టాఫీల ఎగుమతులు అంతగా లేని యూ రప్, గల్ఫ్ దేశాలకు కూడా పెరగడం భారత కన్ఫెక్షనరీల నాణ్యత, ప్యాకేజింగ్ ప్రమాణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని వా ణిజ్య శాఖ తెలిపింది. ‘చాలా చక్కని టాఫీ– మెలొ డీని బహూకరించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అంటూ మెలోనీ సోషల్ మీడియాలో వీడి యో పోస్ట్ చేశారు. ఇరువురు ప్రధానుల పేర్లు కలిసేలా మెలొడీ పదం ఉండటంతో మీమ్స్ వైరల్ అయ్యాయి. మెలొడీకి జోష్.. మెలొడీ చాక్లెట్లకు ఒక్కసారిగా ఎక్కడలేని పాపులారిటీ రావడంపై వాటిని తయారు చేసే పార్లే ప్రోడక్ట్స్ హర్షం వ్యక్తం చేసింది. ‘1983 నుంచి బంధాలను తీపి చేస్తున్నాం’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్ట్రాగాంలో మోదీ, మెలొనీ వీడియోని షేర్ చేసింది. ‘పార్లే మెలొడీని అంతర్జాతీయ వేదికపైకి చేర్చినందుకు ధన్యవాదాలు‘ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఒక చక్కని మార్గం’ అంటూ పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా పేర్కొన్నారు. ‘పార్లే’ షేర్ల కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు... మెలొడీ చాక్లెట్లను తయారు చేసేది పార్లే అనే కంపెనీ అని తెలియడంతో ఆ సంస్థ షేర్లను కొనడానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీనితో పార్లే ఇండస్ట్రీస్ అనే సంస్థ షేరు 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ రూ. 5.25ని తాకింది. 8.57 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఆ చాక్లెట్లను తయారు చేసేది పార్లే ప్రోడక్ట్స్ అనే కంపెనీ. అది స్టాక్ మార్కెట్లో కనీసం లిస్ట్ కూడా కాలేదు. కాకపోతే ‘ఆ పార్లే’..‘ఈ పార్లే’ ఒకటేనని ఇన్వెస్టర్లు పొరబడటమనేది పార్లే ఇండస్ట్రీస్‌కి బాగా కలిసి వచ్చింది.
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
భారతదేశం తన అవసరానికి మించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికి పరిష్కారం ప్రభుత్వ విధానాల్లో కంటే, ప్రజల లాకర్లలోనే ఉందని ఆనంద్ రాథి వెల్త్ జాయింట్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 2 నుండి 4 శాతం వరకు విక్రయించాలని ఆయన కోరారు. ఇది త్యాగం కాదు, దేశం కోసం చేసే ఒక రకమైన "ఆర్థిక దేశభక్తి" అని ఆయన అభివర్ణించారు.భారత్‌లో సమస్యగా బంగారం భారతీయ కుటుంబాల వద్ద సమిష్టిగా దాదాపు 4 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.4 కోట్ల కోట్లు) విలువైన బంగారం ఉంది. ఇందులో చాలా వరకు వాడకుండా లాకర్లలో ఖాళీగా పడి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం వరకు 35 బిలియన్ డార్లుగా ఉన్న భారతదేశ వార్షిక బంగారం దిగుమతులు, ఇప్పుడు ఏకంగా 75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడానికి, రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణమవుతోంది.పోయిన విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత మార్కెట్ నుండి రూ.1,68,000 కోట్లు (17–18 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ, మన దేశ బంగారం దిగుమతి బిల్లు దీని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.100 గ్రాముల విక్రయంతో వచ్చే మార్పుఈ ప్రతిపాదన ఎంత ఆచరణాత్మకమైనదో చెప్పడానికి అజీజ్ కొన్ని లెక్కలను వివరించారు. ఒక కుటుంబం తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 100 గ్రాములను (ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.15-16 లక్షలు) విక్రయిస్తే ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.. ఆనంద్ రాథి సంస్థ పరిధిలోని 13,800 కుటుంబాలు ఇలా చేస్తేనే దాదాపు రూ.2,500–3,000 కోట్ల బంగారం తిరిగి మార్కెట్లోకి వస్తుంది.ఇదే విధంగా దేశంలోని సంపన్న కుటుంబాలన్నీ చేస్తే, బంగారం దిగుమతులను సులభంగా 40 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు. ప్రజలు విక్రయించే బంగారం ఆభరణాలు, పారిశ్రామిక అవసరాల కోసం మార్కెట్లో పునర్వినియోగంలోకి వస్తుంది. తద్వారా కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.ఇది త్యాగం కాదు... లాభాల స్వీకరణ !బంగారం ధరలు ప్రస్తుతం చారిత్రక గరిష్టాల వద్ద ఉన్నాయి. ఈ సమయంలో కొంత బంగారాన్ని విక్రయించడం అనేది దేశానికి మేలు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా స్మార్ట్ పోర్ట్ ఫోలియో నిర్వహణ (లాభాలను ఖాతాలో వేసుకోవడం) అవుతుందని అజీజ్ పేర్కొన్నారు."ఈక్విటీ మార్కెట్లలో లాభాలు స్వీకరించినట్లే, బంగారంలోనూ భారీ ర్యాలీ వచ్చింది. కాబట్టి మీ బంగారంపై 3-4% లాభాలను దేశం కోసం బుక్ చేసుకోండి" అని ఆయన పిలుపునిచ్చారు.గడిచిన 10 ఏళ్ల కాలంలో బంగారం రూపాయి పరంగా కేవలం 8.5% వార్షిక రాబడిని మాత్రమే ఇచ్చింది. దీని కంటే 'సుకన్య సమృద్ధి యోజన' (8.25% వడ్డీ, పన్ను రహితం) వంటి ఇతర పొదుపు పథకాలు పన్నులన్నీ పోనూ మెరుగైన లేదా సమానమైన లాభాలను అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ప్రభుత్వానికీ విజ్ఞప్తిఈ ప్రచారంలో భాగంగా బంగారం విక్రయించిన రశీదులను సమర్పించాలని అజీజ్ ప్రజలను కోరుతున్నారు. దీని ద్వారా తగినంత మద్దతును కూడగట్టి, బంగారం విక్రయాలపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నుండి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ వేయాలని ఆయన భావిస్తున్నారు.
ఎయిర్టెల్ కొత్త 'ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్' 5జీ ప్లాన్లు
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త 'ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్' (Priority Postpaid) సేవలను అధికారికంగా ప్రకటించింది. అత్యాధునిక '5G స్లైసింగ్' (5G Slicing)సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా అత్యంత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు. భారతదేశంలో ఈ తరహా 5G స్లైసింగ్ సేవలను తీసుకొచ్చిన మొదటి సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది.ఈ సరికొత్త సేవలు ఎయిర్‌టెల్‌లోని అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపైనా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఈ ప్రయారిటీ ప్రయోజనాలు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్లాన్లలోకి మారాలనుకుంటే ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్టెల్ స్టోర్‌ను సందర్శించి సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.ధరల విషయానికి వస్తే.. సింగిల్ యూజర్ కోసం రూ.449 (ప్లస్ జీఎస్టీ) ప్లాన్ అందుబాటులో ఉండగా, ఫ్యామిలీ ప్లాన్లు రూ.699 నుంచి రూ.1749 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్ల ద్వారా అన్లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఫాస్ట్‌లేన్ టెక్నాలజీ, స్పామ్ ప్రొటెక్షన్ లభిస్తాయి. అంతేకాకుండా ప్లాన్లను బట్టి ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, యాపిల్ టీవీ+, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కూడా ఉచితంగా లభిస్తాయి.ఈ సేవలు 5G SA (Standalone) సపోర్ట్ చేసే అన్ని స్మార్ట్ఫోన్లలోనూ పనిచేస్తాయి. వినియోగదారులు తమ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ హై-స్పీడ్ కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. కస్టమర్లు తమ ఫోన్ అర్హతను మొబైల్ సెట్టింగ్స్‌లో లేదా ఎయిర్టెల్ యాప్‌లోకి లాగిన్ అయి సులభంగా చెక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
ఫ్యామిలీ
పిల్లలూ... చదవాలి లా
ఆ ఇంటి కుర్రాడు ఫోన్ లో వచ్చిన లింక్ నొక్కాడు. బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. మరో ఇంటి కుర్రాడు మార్ఫింగ్ ఫొటో పెట్టాడు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇంకో ఆకతాయి బైక్ రేస్ చేశాడు. కేసు నెత్తిన పడింది. ఇవన్నీ ‘తెలియక’ చేసినవే. కానీ చట్టం ‘తెలియదు’ అనే మాటను క్షమించదు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి లీగల్ పాఠాలు ఉండాలంటున్నారు రిటైర్డ్ ఐపిఎస్ వీరేందర్. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో ఆయన ఢిల్లీలో చేస్తున్న కృషి దేశం అందుకోవాల్సి ఉంది.‘ఇగ్నొరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ యాన్ ఎక్స్క్యూజ్’ అని చట్టంలో మొదటి పాఠం. ‘మా వాడు బుద్ధిమంతుడు సార్, తెలియక చేశాడు’ అని తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. తప్పులు... శిక్షలునేటి పిల్లల ప్రపంచం స్క్రీన్ అంత చిన్నది... లేదా స్క్రీన్ అంత పెద్దది. స్క్రీన్ మీద ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటున్నారు. సైబర్ నేరం చేస్తే జైలుకు వెళ్తారని తెలియదు. అమ్మాయి ఫోటో అనుమతి లేకుండా షేర్ చేస్తే పోక్సో అవుతుందని తెలియదు. బైక్‌పై ముగ్గురు వెళ్తే, హెల్మెట్ లేకపోతే, మైనర్ డ్రైవింగ్ చేస్తే తలిదండ్రులకు కూడా జైలు శిక్ష పడుతుందని తెలియదు. మనం కూడా మార్కులు, ర్యాంకులు, ఐఐటి.. నీట్ అంటూ పరుగెత్తిస్తాం. కానీ రోడ్డు మీద ఎలా నడవాలి, ఫోన్ లో ఏం చేయకూడదు, ఆపద వస్తే ఏ చట్టం కాపాడుతుంది అనే ‘బతుకు పాఠం’ చెప్పం. ఫలితం? చిన్న తప్పు చేసి జీవితాన్ని బజారున పడేసుకుంటున్నారు.బడిలో చట్టం నేర్పిస్తే?‘లీగల్ స్టడీస్’ అనే సబ్జెక్ట్ సి.బి.ఎస్.ఇ.లో 11, 12 క్లాసులకు ఆప్షనల్‌గా ఉంది. ఆర్.టి.ఐ ఎలా వేయాలి, కన్సూ్యమర్ హక్కులు ఏంటి, సైబర్ చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ అందులో ఉంటాయి. కానీ ఢిల్లీలో 1500 స్కూల్స్ ఉంటే కేవలం 29 స్కూల్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకు? ‘దీనివల్ల కెరీర్ ఏముంది’ అని స్కూల్స్ అనుకుంటాయి. ‘మార్కులు రావు’ అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇది మార్కుల పాఠం కాదు, మనిషిగా బతికే పాఠం. దీన్ని ఎవరు చె΄్పాలి? రిటైర్డ్ జడ్జిలు, లాయర్లు, పోలీస్ అధికారులు వారానికి ఒక పీరియడ్ తీసుకుంటే చాలు.కోర్టులో నల్లకోటు వేసుకునే లాయర్ బడిలో చాక్‌పీస్ పడితే చట్టం పిల్లల భాషలోకి దిగివస్తుంది. ‘కేసు’ అంటే భయం పోయి ‘క్లారిటీ’ వస్తుంది. సినిమాల్లో చూసే పోలీస్, లాయర్ కాకుండా నిజమైన చట్టం తెలుస్తుంది. నేర్చుకుంటే నేరం ఆగుతుంది. ఒక పిల్లవాడికి తన హక్కులు తెలిస్తే, ఎదుటివాడి హక్కులూ తెలుస్తాయి. ‘రోడ్డు నాదే’ అని బైక్ నడిపేవాడు ‘రూల్ అందరిదీ’ అని నమ్ముతాడు. చట్టం తెలిసిన పౌరుడు పోలీస్‌కు సాయం చేస్తాడు, భయపడడు. మోసం జరిగితే కన్సూ్యమర్ కోర్టుకు వెళ్తాడు. అమ్మాయిని ఏడిపిస్తే అది ‘ఈవ్ టీజింగ్’ కాదు, ‘క్రిమినల్ ఆఫెన్ ్స’ అని గట్టిగా చె΄్తాడు. సమాజం మారాలంటే శిక్ష ఎందుకు పడుతుందో తెలియాలి. అది బడి నుంచే తెలియాలి.అతని కృషిఢిల్లీ రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ వీరేందర్ పుంజ్ ఈ విషయంలో మొదటగా కళ్లు తెరిచారు. 2012 నిర్భయ కేసు సమయంలో ఆయన్ను ఒక ప్రశ్న వెంటాడింది. ‘నిందితుల్లో ఒకడు మైనర్. వాడికి చిన్నప్పుడే చట్టం పాఠం చెప్పుంటే ఈ దారుణం జరిగేదా?’... ఈ ప్రశ్నకు జవాబుగా రిటైర్ అయ్యాక స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నాడు. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో బడి బడికీ తిరుగుతున్నాడు. పిల్లలతో మాట్లాడుతున్నాడు. ‘మీ హక్కులు తెలుసా?’ అని అడుగుతున్నాడు. పిల్లలు ఆయనకు ఉత్తరాలు రాశారు. ‘మాకు లీగల్ స్టడీస్ కావాలి’ అని. ‘"WE WANT LEGAL STUDIES SUBJECT IN OUR SCHOOLS" ‘ అని ప్లకార్డులు పట్టుకున్నారు. చిన్నప్పుడు హిట్ అండ్ రన్ కేసులో తండ్రిని పోగొట్టుకున్న వీరేందర్‌కు న్యాయం జరగలేదు. ఆ గాయమే ఇవాళ వేల మంది పిల్లలకు చట్టం అనే కవచం ఇచ్చేలా చేస్తోంది. ఒక్క పిరియడ్ చాలుచట్టం పుస్తకంలో కాదు, బుర్రలో ఉండాలి. మామిడి పండు తియ్యగా ఉండాలంటే మొక్క సమయం నుంచి నీళ్లు పోయాలి. పౌరుడు బాధ్యతగా ఉండాలంటే బడిలోనే చట్టం నేర్పాలి. క్లాస్‌రూమ్‌లో ఒక్క పిరియడ్ చట్టం వింటే చాలు. జీవితం సేఫ్. రేపు మీ పిల్లల స్కూల్లో ‘లీగల్ స్టడీస్’ ఉందా అని అడగండి. లేకపోతే అడిగించండి. చట్టం తెలిసిన బిడ్డ ఇంటికి భరోసా, దేశానికి ధీమా. – కె.
హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..
మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట అడుగు భాగంలో ఉండే పొరల మీద అమరిపోయి ఉంటాయి.ఏవైనా కారణాల వల్ల ఈ ΄పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపల ఉండే భాగాలు... బలహీనంగా ఉన్న ఆ అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని (చర్మంలోనే) బయటకు వెళ్తాయి. ఇలా జరిగినప్పుడు పురుషుల్లోనైతే ఆ పేగులు... వృషణాల సంచిలోకి జారిపోవచ్చు. ఒకవేళ మహిళల్లోనైతే పొట్టలోని ఆ అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. పొట్టలోనివే కాదు... మరే భాగంలోనైనా... ఒక దేహభాగం మరో దేహభాగంలోకి చొచ్చుకు వెళ్లడాన్ని ‘హెర్నియా’ అంటారు. ఇందులో చాలా రకాలుంటాయి. ఈ హెర్నియాలోని రకాలు, అలా జరిగినప్పుడు చేయించాల్సిన చికిత్సల వంటి పలు అంశాలను తెలుసుకుందాం...పొత్తికడుపు పొరల్లో బాగా బలహీనంగా ఉన్నచోటి నుంచి పొత్తికడుపులోని కొన్ని భాగాలు దూసుకుపోయి చర్మం కిందికి చేరుకుంటాయి. బయటి నుంచి చూసినప్పుడు అక్కడి చర్మం భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంటుంది. సాధారణంగా పొత్తికడుపు ముందు భాగంలో చర్మం, కొవ్వు, కండరాలు వంటి పలుచోట్ల పొరలు ఉంటాయి. ఇవి పేగులతో పాటు కడుపులోని అంతర్గత భాగాలను తమ తమ స్థానాల్లో ఉండేలా చూస్తాయి. ఈ కండరాలు బలహీనంగా ఉన్న చోట్ల నుంచి కడుపులోని పేగులలో కొంత భాగం బయటకు వచ్చి చర్మం కింది నుంచి ఉబ్బు కనిపిస్తుంది. చేత్తో ముట్టుకున్నప్పుడు ఆ పేగుల భాగాలూ చేతి స్పర్శకు తెలుస్తుంటాయి. సహజంగా హెర్నియా వచ్చేందుకు అవకాశమున్న భాగాలు...కడుపులోని భాగాలు డయాఫ్రమ్ అనే భాగాన్ని దాటి ఛాతీ (లోయర్ ఛెస్ట్)లోకి. కడుపు కింది భాగాల నుంచి పొత్తికడుపు లేదా గజ్జల్లోని లోపలి భాగాల్లోకి. కడుపుకు మధ్యభాగం (మిడ్లైన్)లోకి. కడుపుపై శస్త్రచికిత్స జరిగినప్పుడు... బలహీనపడ్డ ఆ కోత భాగంలోకి.హెర్నియాల్లో రకాలివి... హెర్నియాల్లో అనేక రకాలుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి...ఇంగ్వైనల్ హెర్నియా : చాలా సాధారణంగా / ఎక్కువమందిలో కనిపించే హెర్నియా ఇది. మొత్తం హెర్నియాల్లో 75% ఇదే కనిపిస్తుంది. ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. రెండు వైపులా కూడా రావచ్చు. సాధారణంగా ఎక్కువ బరువు ఎత్తినప్పుడు కడుపులోని పేగులు... ఇంగ్వైనల్ కెనాల్ అనే ప్యాసేజ్ ద్వారా తొడల (అప్పర్ థైస్) భాగంలోకి వెళ్తాయి.ఫీమోరల్ హెర్నియా : ఇది కాస్తంత అరుదుగానే కనిపిస్తుంది. ఇంగ్వైనల్ కెనాల్ కింద ఉండే ఫీమోరల్ కెనాల్ ద్వారా కడుపులోని భాగాలు ముఖ్యంగా కొవ్వుపొరలు తొడల (అప్పర్ థైస్) దగ్గరికి చొచ్చుకురావడం వల్ల ఈ హెర్నియా కనిపిస్తుంది. సాధారణంగా ఫీమోరల్ హెర్నియా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్వైనల్ హెర్నియాతో పోలిస్తే ఈ ఫీమోరల్ హెర్నియా కాస్త చిన్నదిగా ఉంటుంది. హయటల్ హెర్నియా : ఇది చాలామందిలో చాలా సాధారణంగా కనిపించే హెర్నియా. మన ఛాతీలో ఊపిరితిత్తులుండే భాగాన్నీ, కడుపులోని పేగులుండే భాగాన్ని వేరు చేస్తూ... డయాఫ్రమ్ అనే పొర ఉంటుంది. ఈ డయాఫ్రమ్ నుంచే...ఆహారాన్ని కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహిక వెళ్తుంది. ఈ అన్నవాహిక కడుపులోకి వెళ్లే చోట డయాఫ్రమ్ దగ్గర బలహీనంగా ఉన్న సమయాల్లో కడుపులోని భాగాలు ఛాతీలోకి దూసుకువస్తాయి. ఈ కండిషన్‌నే హయటస్ / హయటల్ హెర్నియా అంటారు.కంజెనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా : హయటల్ హెర్నియాలోలాగే ఇక్కడ కూడా డయాఫ్రమ్ లోంచి ఛాతీలోకి పైకి వస్తాయి. అయితే ఇది పుట్టకతోనే (కంజెనైటల్గా) వచ్చే సమస్య. అంటే పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్నవాహిక కడుపులోకి వెళ్తే చోట డయాఫ్రమ్ పూర్తిగా ముసుకుపోయినట్టుగా అభివృద్ధి చెందకపోవడంతో కడుపులోని భాగాలు ఛాతీలోని ఊపిరితిత్తులున్న చోటికి వస్తాయి.ఇన్సిషనల్ హెర్నియా : సర్జరీ వంటివి చేస్తున్నప్పుడు... కడుపుపైన గాటు పెట్టిన చోట అక్కడి కణజాలం బలహీనం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ గాటు ఉన్న చోటి నుంచి కడుపులోని భాగాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లుగా చర్మం కింది నుంచి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. మునుపు శస్త్రచికిత్స గాయం లేదా మచ్చ ఉన్న ప్రాంతంలో... ఆ గాయం సరిగా మానకపోయినా లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ తరహా హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. సాధారణంగా సర్జరీ తర్వాత రెండేళ్లలోపు ఇది కనిపిస్తుంది.అంబిలికల్ హెర్నియా / పారా అంబిలికల్ హెర్నియా : బొడ్డు దగ్గర బలహీనంగా ఉన్న ప్రాంతంలోంచి కడుపులోని భాగాలు బయటకు రావడాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. ఇది సాధారణంగా పుట్టుకతోనే (కంజెనైటల్గా) కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో చిన్నారికి ఏడాది వయసు వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే అవకాశాలెక్కువ. ఇక పారాంబిలికల్ హెర్నియా పెద్దవారిలో వస్తుంది. ఇది నాభి పైభాగంలో కనిపిస్తుంది. ఇందులోకి పేగులు చొచ్చుకుపోయి అక్కడ ఇరుక్కుపోయే ముప్పు ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది. వెంట్రల్ హెర్నియా : కడుపు కింది భాగంలో ఉండే పొరల నుంచి అవయవాలు దూసుకు రాకుండా... కడుపు ముందుభాగంలోంచే కడుపులోని అవయవాలు ముందుకు వస్తుంటే దాన్ని ‘వెంట్రల్ హెర్నియా’ అని చెప్పవచ్చు. ఒకరకంగా చె΄్పాలంట అంబిలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర వచ్చే ‘ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా’ వంటి వాటిని ‘వెంట్రల్ హెర్నియా’గా చెప్పవచ్చు.హెర్నియా ఎవరెవరిలో వస్తుందంటే... హెర్నియా అన్నది పురుషుల్లోనూ, మహిళల్లోనూ... ఇలా ఇద్దరిలో వచ్చే కండిషన్. చాలామంది పురుషుల్లో వచ్చే హైడ్రోసిల్ కండిషన్‌ను హెర్నియాతో పోల్చుకుని... ఆ రెండో ఒకటే అని అపోహ పడుతుంటారు. కడుపు కిందిభాగంలోని పొర... వయసు పెరగడం వల్లగానీ లేదా అరుగుదల వల్లగానీ, దెబ్బతగలడం వల్లగానీ లేదా కొందరిలో సహజంగానే ΄పొట్ట అడుగుభాగంలోని కండరం బలహీనపడ్డ సమయంలో కడుపులోని భాగాలు అందులోంచి దూసుకుని కిందికి వెళ్లడాన్నే ‘హెర్నియా’ అంటారు. స్త్రీ, పురుషుల్లో హెర్నియా పలు రకాలుగా రావచ్చు. అయితే పురుషులకు ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. ఎందుకంటే పిండం శిశువుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వృషణాలు పొత్తికడుపులోంచి నుంచి స్క్రోటమ్‌లోకి దిగేందుకు ఒక చిన్న మార్గం ఉంటుంది. దాన్నే ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్ (బీజాలు) కూడా కడుపులోనే ఉంటాయి. మగబిడ్డ పుట్టగానే కడుపులోని ఆ టెస్టిస్ (బీజాలు) అదే మార్గం ద్వారా వృషణాల సంచిలోకి జారతాయి. మున్ముందు ఆ కెనాల్లోంచే పేగులు కూడా వృషణాల సంచిలోకి జారడం వల్ల ఇంగ్వైనల్ హెర్నియా వస్తుంది. ఇక పెద్ద వయసువారిలో ఏదైనా కారణం వల్లగానీ లేదా మలబద్దకం కారణంగా ముక్కినప్పుడు పొత్తికడుపుపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా హెర్నియా వస్తుంది. ఇదే కాకుండా పొత్తికడుపుపై ఇతరత్రా కారణాలతో ఒత్తిడి పడటం కూడా హెర్నియాకు దారితీయవచ్చు. ఇక చిన్నారుల్లో సైతం పుట్టుకతో వచ్చే హెర్నియాలూ ఉండనే ఉన్నాయి. కడుపు కండరాలపై ఒత్తిడి కారణంగా హెర్నియా రావడానికి కారణాలు... క్రానిక్ అలర్జీల వల్ల చాలాకాలం పాటు గట్టిగా దగ్గాల్సిరావడం. పురుషుల్లో చాలా ఎక్కువసేపు అదేపనిగా నిలబడే వృత్తులో ఉండటం. గర్భధారణ వల్లగానీ చాలా ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీలు రావడం వల్ల. ఎక్కువ బరువు ఉండటం (బీఎమ్ 30 కంటే ఎక్కువగా ఉండటం).బరువైన వస్తువులను అకస్మాత్తుగా ఎత్తడం లేదా ఎక్కువ ఫోర్స్‌తో తోయడం.మలవిసర్జన సమయంలో ముక్కుతూ చాలా ఎక్కువ ఒత్తిడితో విసర్జనకు ప్రయత్నించడం. పెల్విస్ భాగంలో అయిన సర్జరీల వల్ల. చిన్నారుల్లో కంజెనైటల్ హెర్నియాలకు కారణాలు... నెలల పూర్తిగా నిండకముందే పుట్టడం (ప్రీ–మెచ్యుర్ డెలివరీస్). కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అనే ఆరోగ్య సమస్య ఉండటం. కడుపులోని బీజాలు సంచిలోకి వెళ్లకపోవడం (అన్–డిసెండెడ్ టెస్టిస్). మూత్ర వ్యవస్థ / రీప్రొడక్టరీ సిస్టమ్‌లో ఏవైనా సమస్యలుండటం. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండేవారిలో... మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్ సమస్య ఉన్నవారిలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ.పెద్దవారిలో కనిపించే లక్షణాలుబరువైన వస్తువులు ఎత్తిన తర్వాత పొత్తికడుపు కింది భాగం (గ్రోయిన్)లో చిన్న ఉబ్బ / గడ్డలా కనిపించడం. మొదట్లో దాన్ని చేతితో లోపలికి నెట్టినప్పుడు కనిపించకుండా పోవడం తర్వాత మెల్లగా బయటకు రావడం దగ్గినప్పుడు లేదా గట్టిగా నవ్వినపుపడు ఉబ్బు బయటకు రావడం పడుకున్నప్పుడు ఉబ్బు / వాపు తగ్గిపోవడం. ఎందుకు చికిత్స అవసరమంటే...?సాధారణంగా హెర్నియా పెద్దగా నొప్పిని కలిగించదు. కానీ కొంతమందిలో నొప్పి లేదా బరువుగా అనిపించవచ్చు. కాలక్రమంలో ఉబ్బు / వాపు పెద్దదవుతుంది. పురుషుల్లో కొన్ని సందర్భాల్లో స్క్రోటమ్‌లోకి దిగిపోవచ్చు. ఇక పురుషుల్లోనూ, మహిళల్లోనూ కనిపించే హయటస్ హెర్నియాలో కడుపులోని యాసిడ్ పైకి తోసుకువచ్చే యాసిడ్ రిఫ్లక్స్ వంటి సందర్భాల్లో ఛాతీలో మంట, తీవ్రమైన అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కనిపించే కాంప్లికేషన్ల కారణంగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం తప్పనిసరి. ఇక పెద్దవారిలో వచ్చే హెర్నియాలు సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా చికిత్స చేయడం అవసరం. ఇందుకు కారణాలు... కొన్ని సందర్భాల్లో హెర్నియా ఎటూ కదలలేకుండా ‘బిగుసుకుపోవచ్చు’. ఇలా బిగుసుకుపోవడాన్ని ‘ఇన్కార్సెరేషన్’ అంటారు. ఇలాంటి ‘ఇన్కార్సెరేటెడ్ హెర్నియా’లో నొప్పితో పాటు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు హెర్నియా కండిషన్ పెద్దపేగును బాగా బిగదీసి నొక్కుకుపోయేలా చేసినప్పుడు బయటకు వెళ్లాల్సిన గ్యాస్, విసర్జన జరగాల్సిన పదార్థాలూ అక్కడే ఆగిపోవచ్చు. ఇక కొన్నిసార్లు పేగు భాగం ఇరుక్కుపోయి ‘స్ట్రాంగ్యులేషన్’ అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు బిగదీసుకుపోయిన చోటి నుంచి కింది భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల తీవ్రమైన నొప్పితో పాటు పేగు దెబ్బతిని అక్కడి కణజాలం నశించిపోయే ప్రమాదం ఉంది. దీన్నే నెక్రోసిస్ / గ్యాంగ్రీన్గా కూడా చెబుతారు. ఇంగ్వైనల్ హెర్నియాలకంటే ఫెమోరల్ హెర్నియాల్లో ఈ ముప్పు చాలా ఎక్కువ. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి అది రవాణ సదుపాయానికి కూడా దారితీయవచ్చు. అందుకే హెర్నియా కండిషన్‌ను శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. నిర్ధారణ బాధితుల్లోని ఉబ్బు భాగాన్ని భౌతికంగా పరీక్షించడం (ఫిజికల్ ఎగ్జామ్) ద్వారా హెర్నియాను చాలావరకు నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలు అవసరం పడవచ్చు. హెర్నియాను ఎలా సరిచేస్తారు?హెర్నియాను చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు సరిచేస్తారు. అయితే చిన్నపాటివీ (మైల్డ్), కొద్దిపాటి వాటికి వెంటనే శస్త్రచికిత్స అవసరం లేదు. ఇలాంటి వాటి విషయంలో డాక్టర్లు ‘వెయిట్ అండ్ వాచ్’ పద్ధతిని అనుసరిస్తారు. మరీ ప్రమాదకరం కాకుంటే తక్షణం శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా వేస్తే తప్పక శస్త్రచికిత్స అవసరం. ఇది మందులతో తగ్గే కండిషన్ కాదు. పాతకాలంలో ‘ట్రస్’ (సపోర్ట్) పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిని ఎవరూ అనుసరించడం లేదు. శస్త్రచికిత్సలో రకాలుఓపెన్ సర్జరీ / హెర్నియా రిపేర్ సర్జరీ : హెర్నియాను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అంతర్గత అవయవాల్లోకి చొచ్చుకుపోయిన అవయవాలను / పేగులను లోపలికి యథాస్థానంలోకి నెట్టి, పొరలు బలహీనంగా ఉన్న చోటి నుంచి అవయవాలు మళ్లీ లోనికి జారిపోకుండా అక్కడ ‘మెష్’ (వల వంటి భాగాని అమర్చుతారు. మామూలుగానైతే 3–4 అంగుళాల కోత పెట్టి హెర్నియాను సరిచేస్తారు. సాధారణంగా స్పైనల్ అనస్థీషియా ఇస్తారు.లాపరోస్కోపిక్ హెర్నియా రిపేర్ : చిన్న చిన్న గాట్ల ద్వారా అతి చిన్న కెమెరా (లాపరోస్కోప్) సహాయంతో శస్త్రచికిత్స చేస్తారు. మెష్‌ను పెట్టి స్లేప్లింగ్ చేస్తూ దాన్ని స్థిరంగా ఉండేలా చూస్తారు. ఆ మెష్ కారణంగా మళ్లీ అవయవాలు లోపలికి జారవు. ఇందులో కూడా సాధారణంగా జనరల్ అనస్థీషియాతో ఇస్తారు.లాపరోస్కోపిక్ సర్జరీతో ప్రయోజనాలుచిన్న గాటు తక్కువ నొప్పి త్వరగా కోలుకోవడం త్వరగా వృత్తులకు వెళ్లగలగడం (అటెండ్ కావడం)రొబోటిక్ సర్జరీ : ఇప్పుడు రొబోటిక్స్ సహాయంతో కూడా శస్త్రచికిత్స నిర్వహించడం సాధ్యమే. దీంతో మరింత ఖచ్చితమైన రీతిలో (ప్రెసిషన్‌తో) శస్త్రచికిత్స చేయడం వల్ల త్వరగా కోలుకోవడం, తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలన్నీ ఇందులోనూ ఉంటాయి.హెర్నియా నివారణ సాధ్యమేనా? హెర్నియాకు కారణమయ్యే కొన్ని అంశాలు మానవ నియంత్రణకు సాధ్యం కావు. అయితే కొన్ని సాధారణ అంశాలు పాటించడం ద్వారా హెర్నియాను చాలావరకు నివారించవచ్చు. అవి... బరువును అదుపులో ఉంచుకోవడం / అధిక బరువు తగ్గించడం ∙బరువైన వస్తువులను ఎత్తే సమయంలో జాగ్రత్తగా ఉండటం / అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం / బరువైన వస్తువులను తోసే విషయంలోనూ ఈ జాగ్రత్తలు అవసరంచాలాకాలం పాటు దగ్గుతూ / తుమ్ములు వస్తూ ఉండే క్రానిక్ పల్మునరీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటూ దగ్గు రాకుండా చూసుకోవడం మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవడం పురుషుల్లో ప్రొస్టేట్ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం.హెర్నియాలు వారసత్వంగా వస్తుంటాయా? కొంతవరకు అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే జన్యుపరంగానూ, వాళ్ల దేహం తాలూకు స్వభావం వల్ల కడుపు కింది భాగంలోని పొరలు బలహీనంగా ఉండటం జరగవచ్చు. ఇలాంటి కుటుంబాల్లో తర్వాతి తరాల్లోనూ హెర్నియా రావచ్చు. అంతమాత్రాన తర్వాతి తరాల్లో ఇది అందరికీ వస్తుందని కాదుగానీ... హెర్నియా వచ్చేందుకు అవకాశాలు కాస్తంత ఎక్కువ.చివరగా... ముందుగా చెప్పినట్టు మైల్డ్ కేసుల్లో డాక్టర్లు వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో హెర్నియాను గమనిస్తూ ఉన్నప్పటికీ... డాక్టర్లు సర్జరీ తప్పదని చెప్పినప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లడమే మంచిది. ఎందుకంటే హెర్నియా బిగదీసుకుపోయే ‘స్ట్రాంగ్యులేషన్’ కేసుల్లో అది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చు. అంతేకాదు... కొన్నిసార్లు ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలెక్కువ. అందుకే డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించడం అవసరం.డాక్టర్ ఎన్. భరత్‌కుమార్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిర్వహణ: యాసీన్(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!
సమ్మర్ అనగానే నీటి కొరత, అధిక వేడితో సతమతమవుతుంటాయి పట్టణాలు, మెట్రో నగరాలు. చెట్లను పెంచడం, పచ్చదనం కాపాడుకోవడం వంటివి మాటలకే పరిమితం చేసి..సమస్యకు చెక్‌పెట్టేలా స్వచ్ఛందంగా ముందుకు ఎవ్వరురారు. కానీ ఓ మారుమూల గ్రామంలో ఓ తాత చూస్తుండగానే తన గ్రామం కొండ కోనలు బీడుగా మారిపోయాయి. అక్కడి ప్రజలు నీటి కోసం పడిగాపులు పడేవారు. ఇవన్నీ చూసిన ఓ తాత రోజు కొండలను ఎక్కి మరి చేసిన చిన్న ప్రయత్నం ఆ ఊరి రూపురేఖల్ని మాత్రమే కాదు, అక్కడి ప్రజల కష్టాలకు స్వస్తి పలికేలా చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..ఆ వ్యక్తే ఇండేనిషియాకు చెందిన సదిమాన్. ఇండోనేషియా సెంట్రల్ జావా ప్రావిన్స్‌లో ఉన్న జెనెంగ్ గ్రామం కొన్నాళ్లు పొరిపరిస్థితులు, కాలానుగుణ నీటికొరతతో అల్లాడింది. ఏళ్ల తరబడి కలప నడికివేత, భూమిని చదును చేయడం, పదేపదే సంభవించిన అగ్ని ప్రమాదాలు వంటి వాటికారణంగా కొండ వాలులో అడవి విస్తీర్ణం తగ్గిపోయింది. దీనివల్ల నేలపొడిగా మారి బీడుగా అయిపోయింది. వేసవి కాలంలో స్థానిక ప్రజలు నీటి కొరతతో అల్లాడిపోతుండేవారు. అక్కడ నీటి బుగ్గలు అదృశ్యం కావడానికి అడవుల నరికివేతే కారణమని సదిమాన్ గట్టిగా విశ్వసించాడు. చెట్ల విస్తీర్ణాన్ని పునరుద్ధరించడం వల్ల భూమి నెమ్మదిగా నీటిని తిరిగి నిలుపుకునే పునరుజ్జీవించేస్తుందనేది ఆ తాత నమ్మకం. 1990 టైంలో ఆయన గెండోల్ పర్వతం చుట్టు పక్కల ప్రాంతాల్లో బీడు కొండల అంతటా మర్రి, అత్తి చెట్లను నాటడం ప్రారంభించాడు. ఈ పని చేయడం ఆ తాత వయసు రీత్యా శారీరకంగా చాలా శ్రమతో కూడిన పని. కానీ ఆయన దీన్ని ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించాడు. అతని కృషికి ఎలాంటి ఆర్థిక సహాయం గానీ, ప్రజా గుర్తింపు గానీ లభించకపోయినా..మొక్కలు నాటడం, పర్యవేక్షించడం అతని దినచర్యగా మారిపోయింది. పైగా అతడు చేస్తున్న పనికి గ్రామస్తుల నుంచి ఎగతాళి, విమర్శలు ఎదురయ్యేవి. అతడి ఆలోచన అస్సలు ఫలిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు. ఇలా మర్రి చెట్లను నాటడాన్ని మూఢనమ్మకాలతో ముడిపెట్టి మరి బాధించేవారు ఆ తాతని. అయినా డోంట్ కేర్ అంటూ ఆ తాత కష్టపడి కొండ ఎక్కి మరి శ్రద్ధగా పర్యవేక్షించేవాడు. అందుకోసం తన వద్ద మేకలను అమ్మి మరి మొక్కలు కొనుగోలు చేసి మరి నాటేవాడట. అతడి కృషి ఫలించి నెమ్మదిగా కొండలన్నీ పచ్చగా మారడం ప్రారంభించాయి. కొండలు క్రమంగా ఎక్కువ తేమను నిలుపుకోవడం ప్రారంభించాయి. నేల కోత తగ్గింది, వృక్ష సంపద కూడా పెరిగింది. తద్వారా భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడింది. దాంతో సహజ నీటి బుగ్గలు కనిపించడం ప్రారంభించాయి. అంతేగాదు అక్కడ వ్యవసాయానికి, సమీప గ్రామాలకు నీటి కొరత తగ్గింది. వేసవి కాలంలో సైతం స్వచ్ఛమైన నీరు లభించింది. ఒకప్పుడూ నిస్సారంగా ఉన్న వాలు ప్రాంతాలన్నీ దట్టమైన పచ్చటి అడవులుగా మారాయి.ఆ చెట్లే ఎందుకంటే..మర్రి, అత్తి చెట్టు నేలను స్థిరీకరించడానికి, భూగర్భ జలాలను నిల్వ చేయడానికి సహాయపడతాయి. ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలలో నీటి పరీవాహక ప్రాంతాల పునరుద్ధరణకు ఇవి అత్యంత ముఖ్యమైన జాతులని పర్యావరణ శాస్త్రవేత్తలు సదా చెబుతుంటారు కూడా.పెద్ద అత్తి చెట్లు ఏడాది పొడవునా పక్షులు, గబ్బిలాలు, ఇతర వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయం కల్పించడం ద్వారా జీవవైవిధ్యానికి తోడ్పడతాయి. అందువల్లే వీటినే ఎంచుకున్నాడు సదిమాన్ తాత. ఆ తర్వాత కొద్దికాలంలో వార్తపత్రికలు, మీడియా ద్వారా అతడి స్టోరీ వ్యాపించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాదు..ఇండోనేషియన్లు ఆ తాతను ఈ పచ్చదనానికి ప్రతీకగా గౌరవించడం ప్రారంభించారు. అంతేగాదు ఈ తాత డబ్బు లేదా ఫేమస్ అవ్వడంలో పెద్ద గొప్ప ఉండదని, ఇతరులు ఇబ్బంది పడకుండా చూడటమే గొప్ప అని, అదే మనం వాళ్లకిచ్చే విలువైన బహుమతని అంటున్నాడు సదిమాన్.(చదవండి: సినిమా ఎంత పనిచేసింది..! మంచి జాబ్ లైఫ్‌ని వదులుకుని చివరికి..)
ఆ మూవీ ప్రభావంతో ఉద్యోగానికి రిజైన్ చేసింది..! కట్‌చేస్తే..
సినిమాలోలా రియల్ లైఫ్ ఎప్పటికీ ఉండదు. మూడు గంటల సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ వాస్తవిక ప్రపంచంలో అందులోలా వర్కౌట్ అవడం అంత సులభం కాదు. అదే చాలామంది తెలుసుకోలేక..ఆ సినీ మాయలో పడి ఊహాలోకంలో తేలుతుంటారు. చివరికి హాయిగా ఉన్న లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకుంటుంటారు. అలాంటి సంఘటనే ఈ మహిళ లైఫ్‌లో చోటుచేసుకుంది. హర్ష్ అనే యూజర్ సోష్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఉద్యోగ ఇంటర్వ్యూలో ఓ మహిళను కలిసినట్లు చెబుతూ..ఆమె చేసిన పని గురించి వివరిస్తూ పోస్టు పెట్టడంతో ఒక్కసారిగా సినిమా ఎంత పనిచేసింది అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ మహిళ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సంపాదించి స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగంతో బిందాస్‌గా లైఫ్ సాగిపోయిందామెకు. సుమారు ఆరేళ్లు ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది. సరిగ్గా 2015లో తమాషా మూవీ చూడటంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ అనూహ్యమైన మలుపు తీసుకుంది. ఆ తమాషా మూవీని..ఆర్ట్‌కి ఉన్న పవర్, చిన్ననాటి అభిరుచులను ఎలా వదులుకుని కెరీర్‌పై ఫోకస్ పెడతాం వంటివి ఇతి వృత్తంగా తీసుకుని తీశారు. ఈ మహిళ ఆ మూవీని చూసి స్ఫూర్తి పొంది.. కార్పొరేట్ లైఫ్ అంటే టార్గెట్లు, పనిఒత్తిడి ఇదేనా జీవితం? అదే నచ్చిన అభిరుచిలో కొనసాగడంలో ఉన్న ఆనందమే వేరు అంటూ చేస్తున ఉద్యోగానికి రిజైన్ చేసింది. చక్కగా ఆర్ట్స్ డిప్లొమా కోర్సులో చేరి, ప్రదర్శనలు నిర్వహించడం, తన పేయింటింగ్స్ని అమ్మడం వంటి కెరీర్‌ని నిర్మించుకోవాలని కలలు కనింది. ఆ మహిళ తాను అనుకున్నట్లుగానే క్రియేటివిటీ రంగంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించినప్పటికీ.. ఆ క్రమంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు సవాలుగా మారాయి. అప్పటిదాక పొదుపు చేసిన డబ్బు అయిపోవడంతో ఆ అభిరుచి నుంచి తప్పుకోక తప్పలేదు. చివరికి రెండేళ్ల కెరీర్ విరామం తర్వాత మళ్లీ అనూహ్యంగా కార్పొరేట్ స్థిరత్వమే బెటర్ అంటూ జాబ్ సర్చింగ్ మొదలు పెట్టారామె. అలా ఓ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చి.. తనతో ఆ మహిళ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లు రాసుకొచ్చారు హర్ష్. అంతేగాదు హర్ష్ ఆమె నిర్ణయం వెనుకున్న భావోద్వేగ పరిస్థితిని ప్రస్తావిస్తూ అభిరుచి వెంట పరుగులు తీసి..కెరీర్‌ని రిస్క్‌లో పెట్టుకోకూడదని అన్నారు. మంచి విషయం ఏంటంటే తన కళా అభిరుచిని వదులుకున్నా అనే పశ్చాత్తాపం ఎప్పటికీ ఎదురవ్వద్దు కానీ ఇంకోరకంగా అది కాస్త చెడ్డ నిర్ణయం ఎలా అంటే..మళ్లీ 30 ఏళ్ల అనంతరం కార్పొరేట్ ఉద్యోగం సంపాదించటం ఈ రోజుల్లో అదెంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ పోస్ట్‌ని ముగించారు. నిజానికి ఈ కథలో నీతి అభిరుచి కోసం ఉద్యోగ జీవితాన్నే రిస్క్‌లో పెట్టడం కంటే..అందులో సాధకబాధలు బేరీజు వేసుకుంటూ..చేస్తున్న ఉద్యోగాన్ని సాగిస్తూనే ఆ కళాత్మక రంగంలో సాగాలి. మొదట పార్ట్‌టైంగా సాగించి..బాగుంది ధైర్యంగా పూర్తి స్థాయిలో దీనిలో దిగొచ్చు అన్న నమ్మకం వచ్చాక..దిగితే ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. అన్నింట్లకంటే ఆర్థిక భద్రత ముఖ్యం అనేది గ్రహించాలి.(చదవండి: కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..)
అంతర్జాతీయం
ఇరాన్‌తో యుద్దం.. అమెరికాకు భారీ షాక్!?
ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సైనిక చర్యలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, నిఘా డ్రోన్లతో సహా కనీసం 42 విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడమో లేదా దెబ్బతినడమో జరిగిందని 'కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్' తన తాజా నివేదికలో వెల్లడించింది.అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇతర భద్రతా కారణాల వల్ల ఈ నష్టం తీవత్ర ఇంకా పెరిగే అవకాశముందని సదరు నివేదిక పేర్కొంది. యూఎస్ సెంట్రల్ కమాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, అంతర్జాతీయ వార్త కథనాల ఆధారంగా ఈ దెబ్బతిన్న విమానాల జాబితాను సీఆర్ఎస్ సిద్దం చేసింది.ఇరాన్‌తో యుద్దంగా కారణంగా ద్వంసమైన వాటిలో 4 ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్నింగ్ II యుద్ధ విమానం, ఏ-10 థండర్‌బోల్ట్ గ్రౌండ్-అటాక్ విమానం ఉంది. వీటితోపాటు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే ఏడు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్విమానాలు, ఒక ఈ-3 సెంటినరీ అవాక్స్ నిఘా విమానం, రెండు ఎమ్‌సి-130జే కమాండో II, ప్రత్యేక కార్యాచరణ విమానాలు, ఒక హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II హెలికాప్టర్ ఉన్నాయి.అదేవిధంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్లు మొత్తం 24 దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఒక ఎమ్క్యూ-4సీ ట్రైటాన్ నిఘా డ్రోన్ కూడా ద్వంసమైంది.ఈ నివేదికపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. అత్యంత అధునాతనమైన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘనత తమ సైన్యానిదేనని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. కాగా ఇరాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల అంచనా వ్యయం ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 2,42,000 కోట్లు) పెరిగినట్లు పెంటగాన్ కంప్ట్రోలర్ జూల్స్ డబ్ల్యూ హర్స్ట్ III ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు దుర్మరణం!
కువైట్‌లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, మంటల కారణంగా ఐదుగురు వ్యక్తులు లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కువైట్ అధికారిక అగ్నిమాపక సంస్థ 'జనరల్ ఫైర్ ఫోర్స్' ధృవీకరించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కువైట్ వార్తా సంస్థ (KUNA) ఓ ప్రకటనలో పేర్కొంది.అయితే ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురు వ్యక్తుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో కువైట్‌లోని నివాస ప్రాంతాలలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.చదవండి: క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే?
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం 50-47 ఓట్లతో నెగ్గింది. దీంతో ఇరాన్‌తో యుద్ధం విషయంలో కాంగ్రెస్ ట్రంప్‌పై పై చేయి సాధించింది. అయితే ఇది చట్టంగా మారడానికి ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంది.ఇరాన్‌తో యుద్ధం ట్రంప్ పాలిట శాపంగా మారింది. ఈ తొందరపాటు నిర్ణయంతో ఇంటా, బయిటా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్‌పై దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తి అనేక దేశాలు ట్రంప్‌ను విమర్శిస్తుండగా.. మరోవైపు స్వంత దేశంలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.ఇరాన్‌పై యుద్ధం ఆపే ప్రతిపాదనను వర్జీనియా డెమెక్రట్స్ సెనేటర్ టిమ్ కెయిన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓటింగ్‌లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. మరో ముగ్గురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికన్ కాంగ్రెస్‌లో నెగ్గింది.అయితే ఇది కేవలం ప్రారంభదశ మాత్రమే ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే సెనేట్‌లో ఓటింగ్ జరగాలి అనంతరం రిపబ్లికన్ల అధిక్యం ఉన్న ప్రతినిధుల సభలోనూ నెగ్గాలి అయినప్పటికీ అధ్యక్షుడు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటో చేసి దీనిని ఆపవచ్చు. ఒకవేళ వీటోని ఆపాలని అమెరికా కాంగ్రెస్ అనుకుంటే సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ 2/3 వంతు మెజార్టీతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్‌పై యుద్ధాన్ని నియంత్రించేలా చట్టం చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంలా కనిపిస్తోంది.అమెరికా చట్టం ఏం చెబుతుంది.అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను ప్రారంభించగలరు. ఆ తర్వాత, ఆయన యుద్ధాన్ని ముగించడమో, కాంగ్రెస్ అనుమతి కోరడమో, లేదా దళాల సురక్షిత ఉపసంహరణను నిర్ధారించడానికి అదనంగా 30 రోజులు అభ్యర్థించడమో చేయాలి. అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ చట్టం ఇరాన్ యుద్ధానికి వర్తించదని పేర్కొన్నారు. ఏదైమైనా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికా కాంగ్రెస్‌లో నెగ్గడం ప్రతిపక్షాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి.
మూడున్నర ఏళ్లలో అనేక సార్లు భేటీ అయ్యాం: మోదీ, మెలోనీ
రోమ్: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారత్-ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుతున్నట్టు సంతోషంగా ప్రకటిస్తున్నానని చెప్పారు.‘‘గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మెలోనీని ఎన్నోసార్లు కలిసే అవకాశం నాకు వచ్చింది. ఇది భారత్-ఇటలీ మధ్య ఉన్న నిరంతర సహకార బంధాన్ని ప్రతిబింబిస్తోంది. భారత్-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 మా భాగస్వామ్యానికి ఆచరణాత్మక, విజన్ ఉన్న రూపాన్ని ఇస్తోంది. దీనిపై సమయపాలనతో ముందుకు సాగుతున్నాం. మా రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు వెళ్తోంది. భారత్‌లో ఉన్న 400కు పైగా ఇటాలియన్ కంపెనీలు భారత్ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి” అని ప్రధాని మోదీ తెలిపారు.సంయుక్త మీడియా సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మాట్లాడుతూ.. “ఈ రోజు రోమ్‌లో మా సత్సంబంధాలను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి మరింత బలపరుస్తున్నాం. ఇది రెండు దేశాల సంబంధాల్లో ఇప్పటివరకు చేరిన అత్యున్నత స్థాయి. ఇప్పుడు ఇటలీ-భారత్ గతంలో ఎప్పుడూ లేనంత దగ్గరయ్యాయని చెప్పొచ్చు. మా సంబంధాలు పూర్తి సామర్థ్యాన్ని చూపగల స్థాయికి చేరుకున్నాయి. గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మోదీతో నేను ఏడు సమావేశాలు నిర్వహించాను. ఆ సమయంలో ఒకరినొకరం, మా అభిప్రాయాలను లోతుగా తెలుసుకున్నాం. గౌరవం, పరస్పర నమ్మకంపై నిలిచిన నిజాయితీ స్నేహాన్ని కూడా నిర్మించుకున్నాం. ఇన్నేళ్ల పాలన తర్వాత కూడా ప్రజల్లో ప్రధాని మోదీకి ఉన్న ఆదరణ చూసి ఆయన దూరదృష్టి, ఆచరణాత్మకత, నాయకత్వాన్ని నేను వ్యక్తిగతంగా మెచ్చుకున్నాను. మా స్నేహం వేగంగా కలిసి పనిచేయడంలో ఎంతో సహాయపడింది” అన్నారు.
జాతీయం
ట్విషా శర్మ కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్ : మాజీ మిస్ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ప్రకారం ఆమెది హత్య కాదు, ఆత్మహత్యేనని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఇదే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మే 12న ట్విషా తన అత్తగారింటి టెర్రస్‌లో జిమ్ పరికరాన్ని ఉపయోగించి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా పోస్టుమార్టం ఫలితాలతో సరిపోలిందని కమిషనర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కోరితే రెండో పోస్టుమార్టం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు.అయితే ట్విషా తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు ఎదుర్కొన్నందువల్లే ఆమె ప్రాణం కోల్పోయిందని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ట్విషా శర్మ భర్త సమ్రత్ సింగ్ లాయర్ కాగా.. అత్త గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి. ప్రస్తుతం భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. అత్తగారు న్యాయవాద నేపథ్యం ఉన్నవారు కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ట్విషా తండ్రి ఆరోపించారు.కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేసు స్వతంత్రంగా, వేగంగా దర్యాప్తు జరుగుతోందని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ను కేవలం రెండు రోజుల్లోనే నమోదు చేశామని, నిందితుడు సమ్రత్‌ను పట్టుకోవడానికి బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. అరెస్టులో ఆలస్యం జరిగినా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు.ట్విషా శర్మ, సమ్రత్ సింగ్‌ల వివాహం 2024 డిసెంబర్లో జరిగింది. ఇద్దరి పరిచయం ఒక డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు ఈ విషాదానికి కారణమయ్యాయని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. ట్విషా శర్మ మరణించిన సమయంలో ఆమె భర్త సమ్రత్ సింగ్,పొరిగింటి వ్యక్తి, ఇంట్లో సహాయకుడు అనుమానస్పదంగా కనిపించారు. వీరు ముగ్గురూ ఆమెను మెట్లపై నుంచి కిందికి తీసుకువస్తూ,సీపీఆర్ చేసే ప్రయత్నాలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. ట్విషా శర్మ మే 12న ఉదయం 7:20కి ఒంటరిగా మెట్లపైకి ఎక్కి టెర్రస్‌కి వెళ్లినట్ సీసీటీవీలో కనిపించింది.దాదాపు గంట తర్వాత ఆ ముగ్గురు పైకి ట్విషా ఉన్న రూమ్‌లోకి వచ్చారు. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ (రిటైర్డ్ జడ్జ్) ఓ గదిలోకి వెళ్లి, కొద్దిసేపటికి బయటకు వచ్చి కిందికి వెళ్లినట్లు కూడా ఫుటేజ్‌లో కనిపించింది.ట్విషా భర్త ప్రస్తుతం పోలీసుల నుంచి పరారీలో ఉన్నాడు. ట్విషా తల్లిదండ్రులు ఈ ముగ్గురి చర్యలు అనుమానాస్పదమని, వరకట్న వేధింపుల కారణంగా హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అని, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా అదే నిర్ధారిస్తున్నాయని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ట్విషా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దర్యాప్తుకు సిఫారసు చేశారు.
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
కోల్‌కతా: అభిషేక్ బెనర్జీకి తనకు ఉమ్మడి ఆస్తులు కలిగి ఉన్నాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఎంసీ ఎంపీ సాయాని ఘోష్ స్పష్టం చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడిగా ఒక ఆస్తిని కలిగి ఉన్నామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. తన ఆస్తుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా వెల్లడించానన్నారు. ఈ రకమైన "ఫేక్ న్యూస్" (అసత్య ప్రచారాలు) వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.ఆమె మాట్లాడుతూ " అభిషేక్ బెనర్జీ & సాయాని ఘోష్ కలిసి కోల్‌కతా 700030 లోని '19 D సెవెన్ ట్యాంక్స్ రోడ్' అనే ఆస్తిని ఉమ్మడిగా కలిగి ఉన్నారు దానికి ఎలాంటి మొబైల్ నంబర్ సంప్రదింపుల కోసం లేదని కొన్ని ఫార్వార్డ్ మెసేజ్‌లను ఇప్పుడే చూశాను. వారు ఎవరో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు స్వలాభం కోసం పనిచేయకుండా నిజాయితీగా ఉంటూ ఒక సాధారణ నేపథ్యం నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన ఎంపీ సాయాని ఘోష్ మాత్రం అది కాదు" అన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, అందుకు నేను కృతజ్ఞతురాలిని అని ఎక్స్‌లో పేర్కొన్నారు.తాను ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా తన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇది వరకే బహిరంగంగా అందుబాటులో ఉంచానని తెలిపారు. తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించబడ్డాయి. రికార్డులను తనిఖీ చేయండి. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు మోపుతున్నవారు ఇకనైనా ఈ ప్రయత్నాలను ఆపాలన్నారు. తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదను ఈ అంశంలో తాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానిని సాయాని ఘోష్ హెచ్చరించారు. వివాదం ఏంటికాగా ప్రస్తుతం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఆస్తులను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలిస్తోంది. అతని బంధువులు వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన 17నుండి 21 ఆస్తులకు సంబంధించి ఆమోదించబడిన బిల్డింగ్ ప్లాన్లు, ఇతర పత్రాలను సమర్పించాలని ఇదివరకే KMC నోటీసులు జారీ చేసింది.నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు జరిగాయా అనేది పత్రాలను పరిశీలించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సాయాని ఘోష్ వివరణ ఇచ్చింది.
సంపద తరలిన మార్గానికి ఇదే దిక్సూచి
1498 మే 20. కేరళ తీరంలోని కాలికట్ (కోజికోడ్) సమీపంలో ఉన్న ‘కప్పకడవు’ అనే చిన్న గ్రామం చరిత్రపుటల్లోకి ఎక్కిన రోజు అది. వాస్కోడా గామా (Vasco da Gama ) అనే పోర్చుగీసు నావికుడు సముద్ర మార్గాన భారత్ చేరిన రోజు అది. అప్పటి నుంచి యూరప్ నుంచి భారత్‌కు సముద్రమార్గం కనిపెట్టిన వాడిగా వాస్కోడా గామా ప్రసిద్ధి చెందాడు.భారత దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం కోసం 1497 జూలై 8న పోర్చుగల్ రాజు మాన్యుయెల్ –1 ఆదేశంతో లిస్బన్ నుండి వాస్కోడా గామా బయలుదేరాడు. సుమారు 170 మంది సిబ్బందితో, సావో గాబ్రియేల్, సావో రాఫెల్, బెర్రియో వంటి నౌకలు ఈ ప్రయాణంలో పాల్గొన్నాయి. ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగలేదు. భయంకరమైన తుపానులు, ఆహార కొరత, స్కర్వీ వంటి వ్యాధులు నావికులను వేధించాయి. సముద్రంలో నెలల తరబడి గడపడం వల్ల సగానికి పైగా సిబ్బంది మరణించారు. నావికులు భయంతో వెనక్కి వెళ్దామని గొడవ చేసినా, గామా మొండితనంతో ముందుకు సాగాడు. తిరుగుబాటు చేసినవారిని ఇనుప గొలుసులతో బంధించి మరీ తన లక్ష్యం వైపు ప్రయాణించాడు. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మొంబాసా వంటి ప్రాంతాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు. అతడు భారత్‌కు చేరుకోవడంలో స్థానిక నావికుల సముద్రమార్గ అవగాహన కీలక పాత్ర పోషించింది. ఆఫ్రికాలోని మలిండిలో అతడికి ఒక గుజరాతీ నావికుడు (కాంజీ మలమ్), అరబ్ నావికుడు (ఇబ్న్ మాజిద్)ల సహాయం లభించింది. రుతుపవనాల గమనాన్ని గుర్తించడంలో ఈ నావికులకు ఉన్న అవగాహనే గామాను క్షేమంగా కాలికట్ తీరానికి చేర్చింది. కాలికట్ పాలకుడు జామొరిన్ (మాన విక్రమ) గామానుఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. అయితే పోర్చుగీసువారు కానుకలుగా సమర్పించిన బట్టలు, టోపీలు, పగడపు దండలు, చక్కెర, తేనె వంటి అల్పమైన వస్తువులను చూసి అతడు పెదవి విరిచాడు. నిజానికి జామొరిన్ ఆ కానుకలను చూసి జాలిపడి, గామా చేసిన కష్టభరితమైన ప్రయాణాన్ని గౌరవిస్తూ వ్యాపారానికి అనుమతి ఇచ్చాడు. మిరియాలు, ఇతర మసాలా దినుసులు, క్యాలికో వస్త్రాల వ్యాపారం చేసుకునే వీలు కల్పించాడు. గామా ఇక్కడి నుంచి తాను వచ్చిన మూడు నౌకలలో సుగంధ ద్రవ్యా లను, ఇతర విలువైన వస్తువులను తీసుకుని తిరిగి పోర్చుగల్ వెళ్లి అమ్మడంతో ఈ యాత్ర చేయడానికి అయిన ఖర్చుకు 60 రెట్ల లాభం సమకూరింది. అందుకే మరోసారి ఇండియా ప్రయాణ మయ్యాడు.వ్యాపారం మాత్రమే లక్ష్యం కాదు వాస్కోడా గామా రెండో ప్రయాణం (1502) అత్యంత క్రూరంగా సాగింది. అరేబియా సముద్రంపై పోర్చుగీసు ఆధి పత్యం సాధించడానికి గామా హింసను ఆశ్రయించాడు. సము ద్రంలో వెళ్తున్న అరబ్ నౌకలపై దాడులు చేయడం, ప్రయాణికు లను చంపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జామొరి న్ను తన సైనిక శక్తితో బలవంతంగా సంధికి ఒప్పించాడు. అంతు లేని సంపదతో తన స్వదేశం తిరిగి వెళ్లాడు.మొత్తానికి ఈ సముద్ర మార్గ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రను మలుపు తిప్పింది. పోర్చుగీసువారి విజయంతో డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్లు భారత్‌కు రావడం మొదలుపెట్టారు. వ్యాపారం కోసం వచ్చిన వీరు, క్రమంగా దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఆక్రమణలకు పాల్పడ్డారు. చివరిసారిగా 1524లో పోర్చుగీసు భారత వైస్రాయ్గా వచ్చిన వాస్కోడా గామా, కొచ్చిన్ లోనే అనా రోగ్యంతో మరణించాడు. అతడి భౌతిక కాయాన్ని తర్వాత పోర్చు గల్‌కు తరలించారు. వాస్కోడా గామా వేసిన సముద్రపు బాట 450 ఏళ్ల భారత బానిసత్వానికి దారితీసింది. అంతులేని సంపద ఈ మార్గంలోనే యూరప్‌కు ప్రవహించింది. దేశం పేదదిగా మిగిలిపోయింది. -ఎడిటోరియల్ టీమ్
మహిళ జలసమాధి ఘటనలో మరో విషాదం
యశవంతపుర: కర్ణాటకలో కొడగు జిల్లాలోని దుబారె ఏనుగుల సంరక్షణాకేంద్రంలో సోమవారం వృద్ధ ఏనుగును మరో ఏనుగు కావేరి నదీతీరంలో తోసేయడం, దాని కింద నలిగిపోయి తమిళనాడు పర్యాటకురాలు మృతిచెందిన ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. కిందపడిన ఏనుగు మార్తాండ తీవ్రమైన గాయాలతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. కంచన్ అనే ఏనుగు దాడి చేయడంతో మార్తాండ కడుపులోకి దంతాలు దిగబడిపోయాయి. చెవుల వెనుక, కాళ్ల మీద సైతం తీవ్రమైన గాయాలయ్యాయి. వెనువెంటనే సమీప ఏనుగుల సాయంతో మార్తాడను బుదర నుంచి పైకి లేపిదీశారు. తర్వాత పశువైద్యులు చికిత్స మొదలెట్టినా ఫలితంలేకుండా పోయిందని అటవీశాఖ పశు వైద్యాధికారి డాక్టర్ ముజీబ్ బృందం మంగళవారం ప్రకటించింది. సౌమ్య స్వభావిగా పేరుగాంచిన మార్తాండ మైసూరు దసరా జ్ఞాపకాలను గుర్తుచేసుకుని అటవీ సిబ్బంది, మావటీలు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ53 ఏళ్ల మార్తాండ బరువు 4,500 కేజీలు. మూడేళ్ల క్రితం హసన్ జిల్లాలోని ఆలూర్‌లో దీనిని అధికారులు బంధించి సంరక్షణాకేంద్రానికి తీసుకొచ్చి దీని ఆలనాపాలన చూస్తున్నారు. దీనిపై దాడిచేసిన 26 ఏళ్ల కంజన్ గజరాజును 2014లో అదేజిల్లాలోని ఏసలూర్లో బంధించి ఇక్కడికి పట్టుకొచ్చారు. మార్తాండపై దాడిచేసిన చంపడంతో ఇకపై దానిని మైసూర్ దసరా ఉత్సవాలకు పంపబోమని అధికారులు స్పష్టంచేశారు. ఇదీ చదవండి: సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యం
ఎన్ఆర్ఐ
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
క్రైమ్
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు.
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి
వరంగల్ లీగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు.
పోలీసుల అలసత్వమే ప్రాణం తీసిందా?
యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్‌కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్‌జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.పోలీసుల అలసత్వమేనా?ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్‌స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.ఫేమస్ అవుతున్న టైంలో.. పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్‌కి దగ్గరగా ఉండే స్టైల్‌తో పాటు పాప్ కల్చర్‌కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్‌గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.పంజాబ్‌లోనే ఎందుకిలా?ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్ఫీల్డ్ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..పంజాబ్‌లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్‌లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్‌స్టర్ కల్చర్‌తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
వీడియోలు
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్ మెన్ తొలగింపు
మార్కెట్లోకి కొత్త పార్టీ అల్లాడిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ
హ్యాపీ బర్త్ డే బావ.. బన్నీ ట్వీట్ వైరల్
ఏపీలో కొండెక్కిన ధరలు.. సామాన్యుడి బతుకు బరువెక్కే!
ప్రొఫెసర్ రామచంద్రయ్య సంచలనాత్మక ఇంటర్వ్యూ
జగన్ ఖాతాలోయి తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు
ఏపీలో గ్యాస్ కటకట సిలిండర్ కోసం కష్టాలు
GTతో CSKఢీ.. భారీ తేడాతో గెలిస్తేనే చెన్నైకి ఛాన్స్
చంద్రబాబు చేపల కూర తయారీపై కేకే రాజు చేసిన ఫన్నీ వ్యాఖ్యలు
H1B వీసా దారులకు గట్టి ఎదురుదెబ్బ..


