టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత తృణముల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ దేబాలినా బిస్వాస్ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆమె రాజీనామా లేఖ వెలుగులోకి రావడంతో టీఎంసీకి భారీ షాక్ తగిలింది. అయితే, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.టీఎంసీ నియంత్రణలో ఉన్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ), అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా దేబాలినా బిస్వాస్ మాట్లాడుతూ..‘నేను నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాలా రాయ్‌కి లేఖ పంపాను. కౌన్సిలర్‌గా కొనసాగుతూ, నా ప్రాంత ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పదవిలో చాలా కాలంగా ఉన్నాను, కానీ ఇప్పుడు తప్పుకుంటున్నాను. నేను ఇది పూర్తిగా పార్టీ సంబంధిత కారణాల వల్ల చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, అభిషేక్ బెనర్జీ నివాసం.. అక్రమ నిర్మాణంగా జరిగిందంటూ కేఎంసీ (KMC) నోటీసులు జారీ చేసిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చారని బిస్వాస్ ఆరోపించారు. ఈ క్రమంలో..‘నిన్న నోటీసు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. అకస్మాత్తుగా, అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ‘లేదు, ఇది సరికాదు’ అని నాకు అనిపించింది. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని ఒకరిని బలవంతం చేయడం లేదా వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయమని ఒత్తిడి చేయడం పార్టీకి తగదని నేను భావిస్తున్నాను. విషయాన్ని కప్పిపుచ్చడం సరైన పద్ధతి కాదు. మనం అడగాలి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు?. కొన్ని విషయాలు నా పరిధిలోకి రావు’ అని వ్యాఖ్యానించారు.అభిషేక్ బెనర్జీ కంపెనీ, కుటుంబానికి సంబంధించి కేఎంసీ నోటీసులు అందుకున్న 17 చిరునామాలలో, 14 చిరునామాలు బిస్వాస్ అధ్యక్షత వహించిన బరో 9 పరిధిలోకి వస్తాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. పార్టీ అగ్ర నాయకత్వంలోని ఒక వర్గం ఆదేశాల మేరకు బిస్వాస్ రాజీనామా చేశారని టీఎంసీ నాయకుల్లో ఒక వర్గం ఆరోపిస్తోంది. కాగా, తన రాజీనామా ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదని బిస్వాస్ తెలిపారు. మరోవైపు.. నగరంలో అభిషేక్ బెనర్జీకి అనేక అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
నాడు మనసులు కలిస్తే.. నేడు డేటా సరిపోలితే..
నేటి ఆధునిక ప్రపంచంలో ఇప్పుడున్న యువతరం(‘జెన్ జీ’) ప్రేమ, అనుబంధాల విషయంలో తమ ఆలోచనా విధానాన్ని విభిన్నంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు కేవలం మనసులు కలవడం, పరస్పర ఆకర్షణ ఆధారంగా ప్రేమ చిగురించేది. కానీ నేటి యువత మాత్రం ప్రేమలో పడటానికి ముందే గూగుల్, రెడిట్, జ్యోతిష్యం, అటాచ్మెంట్ థియరీలతో పాటు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)టూల్స్‌ను ఉపయోగించి, తగిన భాగస్వామి ఎవరనేది ముందే అంచనా వేస్తోంది. దీనినే ప్రస్తుతం ‘ప్రిడిక్టివ్ డేటింగ్’ అని పిలుస్తున్నారు.పరిశోధనగా మారిన ఆధునిక ప్రేమాయణండేటింగ్ అనేది ఎప్పుడూ ఒక అనిశ్చితితో కూడుకున్న విషయమే. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ అనిశ్చితిని తగ్గించుకునేందుకు యువత సాంకేతికతను ఆశ్రయిస్తోంది. కేవలం ఒకరినొకరు ఇష్టపడటమే కాకుండా, రెండవ డేటింగ్‌కు వెళ్లే ముందే గూగుల్‌లో వ్యక్తిత్వ లక్షణాలను శోధించడం, రెడిట్ థ్రెడ్లను పరిశీలించడం, సోషల్ మీడియాలో ‘రిలేషన్షిప్ సైకాలజీ’ రీల్స్ చూడటం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో, డేటింగ్ సంస్కృతి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, భావోద్వేగాల పరంగా సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో యువత ఇంటర్నెట్ సమాచారమే పరమావధిగా భావిస్తోంది.సమయం వృథా కాకూడదనే..ఈ సరికొత్త ట్రెండ్‌కు ప్రధాన కారణం నేటి తరం ఆలోచనల్లోని భావోద్వేగ జాగ్రత్తలే. ఫాస్ట్ మూవింగ్ డేటింగ్ యాప్స్, ఘోస్టింగ్ సంస్కృతి, ‘సిట్యుయేషన్షిప్స్’, మానసిక అలసట వంటి వాతావరణంలో పెరుగుతున్న యువత తమకు సరిపడని వ్యక్తి కోసం తమ సమయాన్ని వృథా చేయకూడదని బలంగా నిశ్చయించుకుంటున్నారు. ‘మనం మానసికంగా ఒకరికొకరు సరిపోతామా?’, ‘భవిష్యత్తులో ఈ బంధం నిలబడుతుందా?’ అనే ప్రశ్నలను సంబంధం ప్రారంభం కాకముందే విశ్లేషిస్తున్నారు. సమస్యలు వచ్చిన తర్వాత బాధపడటం కంటే, ముందే ఊహించి తప్పుకోవడం మంచిదనే ధోరణి పెరుగుతోంది.డేటింగ్లో చేరుతున్న సైకాలజీ పదాలుసోషల్ మీడియా ప్రభావం వల్ల సైకాలజీ (మానసిక శాస్త్రం)కి సంబంధించిన పదాలు నేడు సాధారణ సంభాషణల్లో భాగమైపోయాయి. ‘లవ్ బాంబింగ్’, ‘గ్యాస్‌లైటింగ్’, ‘ఎమోషనల్ అవైలబిలిటీ’, ‘యాంగ్జియస్ అటాచ్మెంట్’ వంటి కఠినమైన సాంకేతిక పదాలను యువత తమ రోజువారీ ప్రేమ విషయాల్లో ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ పాడ్కాస్ట్ల ద్వారా ఈ విషయాలు అందరికీ సులువుగా చేరుతున్నాయి. ఇది ఒక రకంగా హానికరమైన అలవాట్లను గుర్తించడానికి సహాయపడుతున్నప్పటికీ, బంధం సహజంగా బలపడక ముందే అవతలి వ్యక్తిని అతిగా విశ్లేషించే ప్రమాదానికి కూడా దారితీస్తోంది.జాతకాలు, అల్గారిథమ్‌ల ఆధారంగా..కేవలం సైకాలజీ మాత్రమే కాకుండా రాశిఫలాలు, జ్యోతిష్య అనుకూలత, పర్సనాలిటీ టెస్టులు (ఎంబీఐటీ), ఏఐ అందించే రిలేషన్షిప్ సలహాలను కూడా ఎక్కువగా నమ్ముతున్నారు. కొందరు యువతీ యువకులు బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే తమ జాతక చక్రాలను పరస్పరం పంచుకుంటున్నారు. డేటింగ్ యాప్స్ వల్ల మనుషులు కలవడం సులువైనా, నమ్మకాన్ని ఏర్పరచుకోవడం కష్టంగా మారిన నగరాల్లో ఈ ఆన్లైన్ క్విజ్లు, అల్గారిథమ్‌లు వారికి ఒక సులువైన భరోసాను ఇస్తున్నాయి.రిస్క్ తీసుకోడానికి ఇష్టపడని తరంగత తరాల వారితో పోలిస్తే, నేటి తరం సెలబ్రిటీల విడాకులు, సోషల్ మీడియాలోని రిలేషన్షిప్ వైఫల్యాలు, టాక్సిక్ బంధాల గురించిన చర్చలను నిరంతరం చూస్తూ పెరుగుతోంది. అందువల్ల వారు భావోద్వేగ పరంగా ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. బంధం ముదరక ముందే అవతలి వ్యక్తిలోని లోపాలను గుర్తించి జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల నేటి డేటింగ్ సంస్కృతి ఒకవైపు భావోద్వేగాలతోను, మరోవైపు వ్యూహాత్మక ఆలోచనలతోను ముడిపడి నడుస్తోంది.ప్రేమని ముందే ఊహించడం సాధ్యమేనా?ఇంటర్నెట్ చెక్‌లిస్ట్‌లు ఎంత సాయపడినప్పటికీ, సహజమైన మానవ సంబంధాలను, మనసుల కలయికను ఏ అల్గారిథమ్ పూర్తిగా అంచనా వేయలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షల్లో అన్ని అర్హతలు ఉన్న వ్యక్తితో కూడా నిజ జీవితంలో కెమిస్ట్రీ కుదరకపోవచ్చు. అతిగా విశ్లేషించడం వల్ల టెక్స్టింగ్ ప్యాటర్న్లపై అనవసరమైన ఆందోళన పెరగడం, చిన్న విషయాలకే బంధాన్ని తెంచుకోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మనసు గాయపడకూడదనే భయంతో, యువత సహజమైన ప్రేమానుభూతికి దూరమవుతున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’?
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
చెన్నై: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో మిత్రపక్షం కాంగ్రెస్ కూడా చేరబోతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారం తెలిపారు. వారిద్దరూ ఈ నెల 21న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు. ఈ క్రమంలో తమ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని అన్నారు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లోకి తమ పార్టీ అడుగుపెడుతోందని స్పష్టంచేశారు. మరోవైపు విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సైతం మంత్రియోగం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై లోక్‌భవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1967లో అధికారం కోల్పోయింది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ పలు కూటముల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చేరే అవకాశం రాలేదు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంపై వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రజాహిత పరిపాలన లక్ష్యాలను వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నిరాశే.. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే, 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు. 1952 నుంచి 1967 వరకు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. సి. రాజగోపాలాచారి, కె. కామరాజ్, ఎం. భక్తవత్సలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే, 1967లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. ప్రత్యేకంగా 2006-11 మధ్య డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికార భాగస్వామ్యం కోరినా ఫలితం లేకపోయింది.
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
నా వయసు 32 సంవత్సరాలు. నాకు పెళ్లై 10 సంవత్సరాలు అయ్యింది. పెళ్లైన మొదటి నుంచే నా భర్తకు నా మీద అనుమానం ఉండేది. రెండు సంవత్సరాలుగా ఎక్కువైంది. ఆయన రాత్రంతా పడుకోకుండా మెలకువగానే ఉంటారు. నేను బయటికి వెళ్లి వచ్చినా, బాత్రూమ్కి వెళ్లి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా గొడవ చేస్తారు.పెద్దలు సంపాదించిన ఆస్తి ఉండటం వల్ల ఆయనకు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం పూటంతా ఇంట్లోనే ఉంటారు. రాత్రి పూట మాత్రం పడుకోకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. అలాగే మా బంధువులు, నా అన్నదమ్ములు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా అనుమానిస్తారు. ఎవరితోనూ మాట్లాడనివ్వరు. కొన్నిసార్లు ఇంటికి తాళం వేసుకుని కూడా వెళ్తారు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లడం కూడా చాలా కష్టంగా మారింది. మా అత్తమామలు కూడా ‘సర్దుకుపోమ్మా’ అని మాత్రమే అంటున్నారు. కానీ నా వల్ల ఇక కావడంలేదు. కేవలం కౌన్సిలింగ్ ద్వారా ఆయనను మార్చవచ్చా? ఎందుకంటే ఆయన మందులు వేసుకోవడానికి ఒప్పుకోరు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువచ్చి చికిత్స చేయించడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి.– స్వర్ణ, నల్గొండమీ భర్త ప్రవర్తన కేవలం మామూలు పొసెసివ్ నేచర్’ మాత్రమే కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్య అయ్యే అవకాశం ఉంది. ఆధారాలు లేకపోయినా భార్యపై అనుమానం ఉండడం, రాత్రుళ్లు మెలకువగా ఉండడం, హింసించడం, ఎవరితో మాట్లాడనివ్వకపోవడం, బయటకు వెళ్లనివ్వకుండా ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లడం వంటి లక్షణాలు‘అనుమానం జబ్బు’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అనే మానసిక సమస్యలో భాగంగా కనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు మెదడులో వచ్చే కొన్ని రసాయన మార్పులవల్ల రావచ్చు. అలాగే చిన్నతనంలో జరిగిన ట్రామా లేదా మనుషులపై నమ్మకం కోల్పోయే అనుభవాల వల్ల కూడా ఈవిధమైన సమస్యలు పెరగవచ్చు. ఇది కేవలం కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే తగ్గిపోయే సమస్యకాదు. కొన్నిసార్లు ఇలాంటి అనుమానాలు తీవ్రమై హింస, కొట్టడం, లేదా ప్రాణహాని వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు చికిత్స అవసరం. ‘హాస్పిటల్‌కి వెళ్దాం’ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు. అందుకే మొదట ‘స్ట్రెస్ ఎక్కువగాఉంది’ ‘నిద్ర సరిగ్గా రావట్లేదు కాబట్టి ఒకసారి డాక్టర్‌కు చూపించుకుందాం’ అనే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించండి. హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత డాక్టర్లు మాట్లాడి అవసరమైన మందులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. మందులు కొంతకాలం క్రమంగా వాడితే, తర్వాత కౌన్సిలింగ్‌కు కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మందులు లేదా కౌన్సిలింగ్‌కు పూర్తిగా నిరాకరిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తే, అవసరమైతే కుటుంబ సభ్యుల సహాయంతో బలవంతంగానైనా హాస్పిటల్లో చేర్చి చికిత్స చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు నిరుత్సాహ పడకండి. మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ తరపువాళ్లు, అలాగే మీ అత్తగారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి. సరైన వైద్యంతో ఈ సమస్య నుంచి మీ భర్తను పూర్తిగా బయట పడేయవచ్చు. షేక్ స్పియర్ రాసిన ఒథెల్లో నాటకంలో కూడా క«థ ఇలాంటిదే. అందుకే ఈ సమస్యను ‘కాంజుగల్ పారనోయియా’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని అంటారు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
తెలంగాణ నేతలకు బంపరాఫర్.. కేంద్ర కేబినెట్లో చోటు?
తమిళనాట మళ్లీ గీతాలాపన వివాదం
ఆడలేక మద్దెల ఓడు చందంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు!
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
HYD: మదీనాలో భారీ అగ్ని ప్రమాదం
హ్యాట్రిక్ ధరలు.. బంగారం ఎందుకింతలా పెరుగుతోంది?
రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి..
శ్వాసకోశ వైఫల్యం: బతికే ఛాన్సే లేదన్నారు! కట్‌చేస్తే..
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
తెలంగాణ నేతలకు బంపరాఫర్.. కేంద్ర కేబినెట్లో చోటు?
తమిళనాట మళ్లీ గీతాలాపన వివాదం
ఆడలేక మద్దెల ఓడు చందంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు!
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
HYD: మదీనాలో భారీ అగ్ని ప్రమాదం
హ్యాట్రిక్ ధరలు.. బంగారం ఎందుకింతలా పెరుగుతోంది?
రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి..
శ్వాసకోశ వైఫల్యం: బతికే ఛాన్సే లేదన్నారు! కట్‌చేస్తే..
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
ఫొటోలు
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
సినిమా
మంచు మనోజ్‌కి మరో కీలక పాత్ర.. ఆ సీనియర్ హీరోతో ఢీ
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్‌గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్‌తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం.
'డ్రాగన్', 'పెద్ది'.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి?
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరోజు వ్యవధిలో రెండు అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'పెద్ది' ట్రైలర్ విషయానికొస్తే.. మాస్ మూమెంట్స్, పంచ్ డైలాగ్స్ లాంటి వాటికంటే స్టోరీ ఎలా ఉండబోతుందనేది ఫోకస్ చేసి చూపించారు. మెగా అభిమానులు సంతృప్తి చెందారు కానీ సగటు ఆడియెన్స్‌కి మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. యాక్టింగ్ పరంగా చరణ్‌ని వంకపెట్టడానికి లేదు గానీ మాస్ మూమెంట్స్ లాంటివి ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేశారు. అవి లేకపోవడంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందన్నట్లు టాక్ వినిపిస్తోంది. భోపాల్, హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్‌లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేయొచ్చంటున్నారు. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.'డ్రాగన్' విషయానికొస్తే ఇందులోనూ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ లాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. డ్రగ్ మాఫియా, అందులోని విలన్స్‌ని చూపించారు. ఎన్టీఆర్ కూడా అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. కానీ ట్రైలర్లో అందుకు సంబంధించిన యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ లాంటి వాటికి పెద్దగా చోటివ్వలేదు. మూవీ థియేటర్లలోకి రావడానికి మరో ఏడాది సమయముంది కాబట్టి ఇకపై రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌లో ఫైట్ సీన్స్ లాంటివి ఉండే అవకాశముంది.ఈ రెండింటిని పోల్చి చూడలేం గానీ రెండింటికి యునానిమస్ టాక్ అయితే రాలేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పలేదు. కొందరికి విపరీతంగా నచ్చేశాయి. మరికొందరికి మాత్రం ఓ మాదిరిగా మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే స్పందన వస్తోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు)
ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్
అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చేసింది. నాలుగున్నర నిమిషాల వీడియోతో అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. 'డ్రాగన్' ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఒపియమ్ అనే మొక్క, దీని ద్వారా వచ్చే హెరాయిన్.. దీని చుట్టూ ఉండే మాఫియా బ్యాక్‌డ్రాప్ ఇందులో చూపించబోతున్నారు. అయితే ఇందులో ఏకంగా ఎనిమిది విలన్స్ కనిపించడం అందరికీ షాకిచ్చింది. అసలు వీళ్లెవరు? ఏ ఇండస్ట్రీకి చెందినవాళ్లు? ఏయే సినిమాలు చేశారు? వాళ్ల వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!)మొదటగా ఎన్టీఆర్ విషయానికొస్తే.. పేరుకే హీరో అయినప్పటికీ విలనీ టచ్ ఉన్న లూగెర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన హంతకుల ముఠాకు నాయకుడిగా నటించాడు.మొత్తం ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ బాస్ అయిన దాదా సర్కార్ పాత్రలో తెలుగు, తమిళ, హిందీలో గతంలో పలు సినిమాలు చేసిన అశుతోష్ రాణా నటించాడు. తెలుగులో ఈయన వెంకీ, బంగారం, బలుపు, తడాఖా, పటాస్ తదితర మూవీస్ చేశాడు. ముంబైకి చెందిన ఇతడు ఎక్కువగా హిందీ మూవీస్ చేశాడు.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో సెకండ్ ఇన్ కమాండ్ అయిన సుజోయ్ సర్కార్ పాత్రని అన్షుమాన్ పుష్కర్ అనే హిందీ నటుడు చేశాడు. ఇతడో సీరియల్ నటుడు. 2018 నుంచి హిందీ సీరియల్స్ చేస్తున్నాడు. 12th ఫెయిల్, మాలిక్ లాంటి మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో వాజిర్ అయిన బాబీ సర్కార్ పాత్రలో సిద్ధాంత్ గుప్తా కనిపించబోతున్నాడు. ఇతడు కూడా హిందీలో సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ పాత్ర కోసమే తొలుత మలయాళ హీరో టొవినో థామస్‌ని అడిగారని అంటున్నారు. బాబీ సర్కార్, లూగెర్.. అన్నదమ్ముల పాత్రలట.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో రావ్ అనే అకౌంటెంట్ పాత్రని తమిళ నటుడు గురు సోమసుందరం చేశాడు. ఇతడు గతంలో తెలుగులో చీకటిరాజ్యం, స్కార్క్ లైఫ్ చిత్రాల్లో నటించాడు. కానీ మలయాళ మూవీ 'మిన్నళ్ మురళి' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ద ట్రైనర్ పాత్రలో 'ధురంధర్'లో షిరానీ సాబ్‌గా నటించిన బిమల్ జీత్ ఒబెరాయ్ కనిపింతబోతున్నాడు. ఇతడికో పెద్ద సైన్యమే ఉండబోతుంది. ముంబైకి చెందిన ఇతడు గతంలో పీకే, టైగర్ 3 చిత్రాల్లోనూ కనిపించాడు గానీ 'ధురంధర్' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.రష్యన్ డిస్ట్రిబ్యూటర్ విక్టర్ మేన్స్కోవ్ పాత్రలో రష్యన్ నటుడు అలెగ్జాండర్ మిజేవ్, సోమాలియా నియంత జనరల్ దురాన్ పాత్రలో బ్రిటీష్ నటుడు బెన్డిక్ట్ పాల్ గారెట్, ఆఫ్రికా-యూరప్ డిస్ట్రిబ్యూటర్ బిలే క్సెర్సీ పాత్రలో దక్షిణాఫ్రికా నటుడు తుతేలో ప్రిన్స్ గ్రాట్బూమ్ కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చెప్పినవన్నీ విలన్ పాత్రలే.వీళ్లతో పాటు ఆఫ్గానిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహ్మాన్ పాత్రలో మలయాళ ప్రముఖ నటుడు బిజు మేనన్ కనిపించబోతున్నారు. ఈయన గతంలో తెలుగులో 'రణం', ఖతర్నాక్ మూవీస్‌లో నటించారు. ఓటీటీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈయన కాస్త సుపరిచితమే.అలానే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్(ఇండియా) రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించారు. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా చేశారు. రీసెంట్ టైంలో 'యానిమల్' మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిజు మేనన్, అనిల్ కపూర్‌వి 'డ్రాగన్'లో పాజిటివ్ పాత్రలనిపిస్తోంది.పైన చెప్పిన నటులతో పాటు ఈ మూవీలో తమిళ నటి ఖుష్బూ కూడా నటించింది. గ్లింప్స్‌లో విలన్స్ అందరి గురించి చెప్పే పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది గానీ ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు. వీళ్లతో పాటు రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, శత్రు తదితరులు ఇతర సహాయ పాత్రలు చేశారు.ప్రస్తుతం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అందులో విలన్స్‌ని మాత్రమే చూపించారు. గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ, అందులో విలన్స్ ఎవరెవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. మరి అందులో ఎంతమంది విలన్స్ ఉంటారో ఏంటో?(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)
ఎప్‌సెట్ టాపర్‌కు ‘మెగా’ సర్ప్రైజ్
తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషికి మెగాసార్ స్టార్ చిరంజీవి సర్ప్రైజ్ ఇచ్చారు. పరీక్షల ముందు ఆమెకు తండ్రి ఓ మాట ఇస్తే.. దాన్ని మెగాసార్ట్ నిజం చేశారు. అభిమాన హీరో ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి రుషితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాకవ్వడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. అసలు తండ్రి ఇచ్చిన మాటేంటి? చిరంజీవి చేసిన సర్ప్రైజ్ ఏంటి?చిరంజీవి కోసం ఫస్ట్ ర్యాంకుతెలంగాణ ఎప్‌సెట్‌కు సన్నద్దమవుతున్న సమయంలో ‘స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధిస్తే మెగాస్టార్‌తో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆమె కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఈ విషయం చిరంజీవికి తెలియడంతో, ఆ యంగ్ అచీవర్‌ను స్వయంగా తన ఇంటికి పిలిపించుకొని సన్మానించారు.ల్యాప్‌టాప్ బహుమతిబుధవారం ఉదయం రుషి ఫ్యామిలీని చిరంజీవి ఇంటికి పిలిపించుకున్నారు. తన నివాసానికి వచ్చిన రుషిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉన్నత చదువుల నిమిత్తం ప్రోత్సాహకంగా ఆమెకు ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కష్టపడి చదివి టాపర్‌గా నిలవడమే కాకుండా, తన అభిమాన హీరోను స్వయంగా కలుసుకుని సత్కారం అందుకోవడంతో రుషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కల నెరవేరినందుకు ఆమె చాలా సంతోషించింది. #TGEAPCET లో State Top Rank సాధించిన M. Rushi కలను నిజం చేసిన Megastar #Chiranjeevi 🤩❤️Her father had promised that she would get to meet Megastar #Chiranjeevi if she secured the State Top Rank in the prestigious TG EAPCET exam ✨Today, that promise was fulfilled as… pic.twitter.com/y97hKTjSDO— Team Megastar (@MegaStaroffl) May 20, 2026
క్రీడలు
డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి భారత్
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు భారత్ ఐదో స్థానంలో ఉండగా తాజాగా పాకిస్తాన్‌పై 2–0తో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించడంతో ఆ జట్టు ముందంజ వేసింది. డబ్ల్యూటీసీ (2025–27)లో భాగంగా ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి 4 ఓడిన శుబ్‌మన్ గిల్ సేన మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్ ఖాతాలో మొత్తం 52 పాయింట్లు ఉండగా... పాయింట్ల శాతం (48.15) ప్రకారం ప్రస్తుతం ఆరో స్థానంలో నిలిచింది.గత ఏడాది దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో పరాజయం పాలవడం జట్టు ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపించింది. 2026లో ఇంకా ఒక్క టెస్టు కూడా ఆడని టీమిండియా... జూన్ 6 నుంచి అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో తలపడనుండగా ఈ టెస్టు డబ్ల్యూటీసీలో భాగంగా లేదు. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌లలో జరిగే పర్యటనలు భారత్‌కు కీలకం కానున్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా... దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది.
లక్ష్యసేన్, ప్రణయ్ నిష్క్రమణ
కౌలాలంపూర్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్‌లకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే వీరిద్దరు నిష్క్రమించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ లక్ష్య సేన్ 17–21, 11–21 స్కోరుతో ప్రపంచ 38వ ర్యాంకర్ ఉబేదుల్లా (ఇండోనేసియా) చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. 43 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. మరో పోరులో ప్రణయ్ 17–21, 22–20, 22–24 తేడాతో ఆరో సీడ్ కొడై నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. 80 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో రెండో గేమ్ గెలిచిన ప్రణయ్... చివరి గేమ్‌లో కూడా తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయింది. పురుషుల సింగిల్స్‌లోనే ప్రపంచ పదో ర్యాంకర్ అలెక్స్ లేనియర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో భారత ఆటగాడు కిరణ్ జార్జ్ 15–21, 1–6తో వెనుకబడి ఉన్న దశలో గాయంతో రిటైర్డ్‌గా తప్పుకున్నాడు. తెలంగాణ ఆటగాడు తరుణ్ మన్నేపల్లి కూడా 21–17, 14–21, 8–21తో వాంగ్ వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. అస్మిత, మాళవిక ముందంజ... మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ అస్మిత చాలిహా 21–16, 21–13తో తలిత రమదాని (ఇండోనేసియా)ని ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మాళవిక బన్సోద్ కూడా 21–17, 16–21, 21–9తో వోన్ లీ (జర్మనీ)పై, దేవిక సిహాగ్ 19–21, 21–18, 21–19తో పార్క్ యున్ (కొరియా)పై గెలుపొంది ముందంజ వేశారు. అయితే తాన్య హేమంత్ 19–21, 7–21తో హువాంగ్ చింగ్ పింగ్ (చైనీస్ తైపీ) చేతిలో, అన్మోల్ ఖర్బ్ 21–13, 16–21, 19–21తో ఎనిమిదో సీడ్ లైన్ హోమార్క్ (డెన్మార్క్) చేతిలో, ఇషారాణి బారువా 17–21, 21–14, 18–21తో ఐదోసీడ్ లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో, తాన్వి శర్మ 10–21, 19–21తో పికమన్ ఒపటినిపుట్ చేతిలో పరాజయంపాలై నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ జోడి 16–21, 21–14, 21–18తో అలెగ్జాండర్ డున్ –జూలీ మ్యాక్సన్ (స్కాట్లాండ్)ను ఓడించి ముందంజ వేయగా... గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట 15–21, 22–20, 10–21 స్కోరుతో అమ్రి స్యానవి–నీతా మార్వా (ఇండోనేసియా) చేతిలో పరాజయంపాలైంది.
దులీప్ ట్రోఫీతో షురూ
ముంబై: భారత దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి 2026–27 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు 23 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ టోర్నీతో సీజన్ మొదలవుతుంది. జోనల్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతాయి. ప్రస్తుత రంజీ చాంపియన్ జమ్ము కశ్మీర్, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య నిర్వహించే ఇరానీ కప్ మ్యాచ్ ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌లో జరుగుతుంది. అనంతరం ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ సుదీర్ఘ సీజన్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 11 నుంచి మార్చి 3 వరకు రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీని డిసెంబర్ 14 నుంచి జనవరి 8 వరకు...టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని నవంబర్ 14 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహిస్తారు. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి అండర్–15, అండర్–16, అండర్–19, అండర్–23, సీనియర్ కేటగిరీల్లో సీజన్ మొత్తం కలిపి బీసీసీఐ ఏకంగా 1788 అధికారిక మ్యాచ్‌లు నిర్వహించనుండటం విశేషం.
ఇస్మాయిల్ బేగ్ లేకుండా...
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రోయింగ్ జట్టు కోచింగ్ బృందంలో దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఇస్మాయిల్ బేగ్‌కు అవకాశం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బేగ్ ఏడు ఆసియా క్రీడల్లో భారత్‌కు కోచ్‌గా వ్యవహరించడంతో పాటు 23 ఏళ్ల పాటు భారత రోయింగ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. రోయింగ్ సమాఖ్య (ఆర్ఎఫ్ఐ) ప్రకటన తనను నిర్ఘాంతపర్చిందని, అధికారికంగా తాను ఇప్పటికీ భారత హెడ్ కోచ్‌నే అని బేగ్ అన్నారు. అయితే ఆర్ఎఫ్ఐ అధ్యక్షుడు ఎం.బాలాజీ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బేగ్ గొప్ప కోచ్‌గా ఎన్నో విజయాలు అందించడం వాస్తవమే అయినా... మార్పు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. 2024 నుంచి భారత రోయింగ్ జట్టు ఆ్రస్టేలియాకు చెందిన ఆంటోనీ ప్యాటర్సన్ శిక్షణలోనే సన్నద్ధమవుతోందని, గత ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ప్యాటర్సన్ కోచింగ్‌లో భారత్ 10 పతకాలు గెలిచిందని ఆయన గుర్తు చేశారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
బిజినెస్
భారత్ వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో 2026 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి (యూఎన్) స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గత అంచనా 6.6 శాతాన్ని 6.4 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా సంక్షోభం మరో షాక్‌గా ఈ నివేదిక అభివరి్ణంచింది. ఇది ప్రపంచ వృద్ధిని మందగింపజేయడంతోపాటు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను, అనిశ్చితులను పెంచినట్టు వివరించింది. ప్రస్తుత ప్రపంచ ప్రతికూల సవాళ్ల నుంచి భారత్‌కూ మినహాయింపు లేదని యూఎన్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ విభాగం సీనియర్ ఆర్థికవేత్త ఇంగో పిట్టర్లే వ్యాఖ్యానించారు. ‘‘భారత్ ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లపై ప్రభావం తదతర ఒత్తిళ్లు సైతం నెలకొన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల కఠినతరంతో మానిటరీ పాలసీ మరింత సంక్లిష్టంగా మారింది’’ అని పిట్టర్లే వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఎలా స్పందిస్తాయన్నదే కీలకమన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనా సైతం తగ్గింపు 2026 సంవత్సరానికి గాను ప్రపంచ స్థూల జీడీపీ వృద్ధి రేటు అంచనాను సైతం 2.5 శాతానికి యూఎన్ తగ్గించింది. జనవరిలో వేసిన అంచనా కంటే 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, కరోనా మహమ్మారికి ముందున్న సాధారణ వృద్ధి రేటు కంటే ఇది చాలా తక్కువని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బలంగానే ఆర్థిక మూలాలు.. భారత్ వృద్ధి 2025లో ఉన్న 7.5 శాతం నుంచి 2026లో 6.4 శాతం తగ్గడమన్నది ప్రధానంగా ఇంధన దిగుమతి వ్యయాలు పెరిగిపోవడం వల్లేనంటూ.. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దేశీయంగా వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు, సేవల రంగ ఎగుమతుల్లో చక్కని పనితీరు కారణంగా భారతదేశంలో నిర్మాణాత్మకంగా బలమైన వృద్ధి కనిపిస్తున్నట్టు పేర్కొంది. తిరిగి 2027 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకునే దేశాలకు వ్యయాలు పెరిగినప్పుడు ఎగుమతులు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చని యూఎన్ డైరెక్టర్ ఆఫ్ ఎకనమిక్ అనలైసిస్ శంతను ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగినప్పుడు వ్యాపార వ్యయాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లాగే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉందన్నారు. అయితే, ప్రస్తుతమున్న మిగులు నిల్వలు కరిగిపోయే లోపే ఈ షాక్‌లను ఎంత సమర్థవంతంగా అధిగమించగలదన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు.
మౌలిక రంగాల జోరు
న్యూఢిల్లీ: ఉక్కు, సిమెంటు, విద్యుదుత్పత్తి దన్నుతో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ ఉత్పాదకత ఏప్రిల్‌లో మరింత మెరుగ్గా వృద్ధి చెందింది. రెండు నెలల గరిష్ట స్థాయి 1.7 శాతానికి చేరింది. గతేడాది ఏప్రిల్‌లో మౌలిక రంగ వృద్ధి 1 శాతంగాను, ఈ ఏడాది మార్చిలో 1.2 శాతంగాను నమోదైంది. తాజా సమీక్షాకాలంలో బొగ్గు, ముడి చమురు, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల వృద్ధి మైనస్‌లోకి జారిపోయింది. ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి ఏప్రిల్‌లో వరుసగా 6.2 శాతం, 9.4 శాతం, 4.1 శాతంగా ఉంది. లో బేస్ ఎఫెక్ట్, ఎరువుల ఉత్పత్తి పెరగడం ద్వారా మే నెలలో మౌలిక రంగం వృద్ధి మరింత మెరుగ్గా 3 శాతం నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ డైరెక్టర్ మేఘా ఆరోరా తెలిపారు.
మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలిస్తాం
సాక్షి, బిజినెస్ డెస్క్: యువ రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ రిటర్నులు వచ్చే బ్యాంకు డిపాజిట్ల కన్నా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. దీనితో బ్యాంకులకు వస్తున్న డిపాజిట్లపరమైన వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. ప్రజల పొదుపు విధానాలు మారుతున్న నేపథ్యంలో యువ కస్టమర్లను ఆకర్షించేందుకు, రుణాల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త రూటును ఎంచుకుంటున్నాయి. డిజిటల్ విధానంలో ఫండ్స్‌పై రుణాలివ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ గతేడాదే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాపార విభాగాన్ని మరింతగా విస్తరిస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇటీవల మార్చిలో దీన్ని ప్రవేశపెట్టింది. అటు కరూర్ వైశ్యా బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్ కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. నెలా, రెణ్నెల్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలా ఫండ్స్‌పై లోన్ విధానంలో అధిక వడ్డీ రేట్లు ఉండే వ్యక్తిగత రుణాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండా రుణగ్రహీతలు తమ దగ్గరున్న ఫండ్ యూనిట్లను తనఖాగా ఉంచి లోన్ తీసుకోవచ్చు. అదే సమయంలో తమ పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 35 ఏళ్ల లోపు వారి పొదుపులో సింహభాగం వాటా మ్యూచువల్ ఫండ్స్‌దే ఉంటోందని కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్థిక అత్యవసరాల కోసం ఇలా ఫండ్స్‌పై రుణాలు లభిస్తే, తక్కువ లాభాలకో లేదా నష్టాలకో యూనిట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి కస్టమర్లు ఈ విధానం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలనేవి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని, మార్కెట్ ఆధారిత ఫండ్స్‌కి ప్రాధాన్యం పెరిగే కొద్దీ వీటికి మరింత ఆదరణ లభించగలదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సంక్లిష్ట ప్రక్రియ .. ఫండ్స్‌పై రుణాలివ్వడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ. తనఖా ఉంచిన ఫండ్ యూనిట్లను పక్కన పెట్టేలా మార్క్ చేసేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలతో బ్యాంకులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు బ్యాంకులు డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. సాధారణంగా డిపాజిట్ల విలువలో 80–90% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఫండ్ యూనిట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కాబట్టి వాటి విలువ లో 50 శాతమే రుణం ఇచ్చే అవకాశం ఉంటోంది.రూ. 82 లక్షల కోట్లకు ఫండ్స్.. దేశీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) గత దశాబ్దకాలంగా అనేక రెట్లు పెరిగింది. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాల ప్రకారం 2016లో ఏప్రిల్ ఆఖరు నాటికి రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు నాటికి దాదాపు ఆరు రెట్లు ఎగిసి రూ. 82 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం కుటుంబాల వార్షిక పొదుపులో ఈక్విటీ, మ్యుచువల్ ఫండ్స్ వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతమే ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 15.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో బ్యాంకు డిపాజిట్ల వాటా 58 శాతం నుంచి 35 శాతానికి తగ్గింది.
మార్కెట్లో ‘మెలొడీ’ సందడి!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి పార్లే ‘మెలొడీ’ టాఫీలను బహూకరించడం బుధవారం సోషల్ మీడియాలో సందడికి దారితీసింది. భారత్ నుంచి టాఫీ ఎగుమతులు ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టాఫీలు తదితర కన్ఫెక్షనరీ ఉత్పత్తుల ఎగుమతులు గత 12 ఏళ్లలో ఏకంగా 166 శాతం ఎగిసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. 2013–14లో రూ. 49.68 కోట్లుగా ఉన్న ఎక్స్‌పోర్ట్స్ 2025–26 నాటికి రూ. 132 కోట్లకు చేరినట్లు తెలిపింది. పరిమాణంపరంగా 6,652 టన్నుల నుంచి 10 శాతం వృద్ధి చెంది 7,357 టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా తదితర 74 దేశాలకు ఎగుమతవుతున్నాయి. ‘భారత టాఫీల గాథ నిజంగానే వీనులవిందైనది. 2013–14 నుంచి ఏకంగా 166 శాతం ఎగిసింది’ అని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గో యల్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో టాఫీల ఎగుమతులు అంతగా లేని యూ రప్, గల్ఫ్ దేశాలకు కూడా పెరగడం భారత కన్ఫెక్షనరీల నాణ్యత, ప్యాకేజింగ్ ప్రమాణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని వా ణిజ్య శాఖ తెలిపింది. ‘చాలా చక్కని టాఫీ– మెలొ డీని బహూకరించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అంటూ మెలోనీ సోషల్ మీడియాలో వీడి యో పోస్ట్ చేశారు. ఇరువురు ప్రధానుల పేర్లు కలిసేలా మెలొడీ పదం ఉండటంతో మీమ్స్ వైరల్ అయ్యాయి. మెలొడీకి జోష్.. మెలొడీ చాక్లెట్లకు ఒక్కసారిగా ఎక్కడలేని పాపులారిటీ రావడంపై వాటిని తయారు చేసే పార్లే ప్రోడక్ట్స్ హర్షం వ్యక్తం చేసింది. ‘1983 నుంచి బంధాలను తీపి చేస్తున్నాం’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్ట్రాగాంలో మోదీ, మెలొనీ వీడియోని షేర్ చేసింది. ‘పార్లే మెలొడీని అంతర్జాతీయ వేదికపైకి చేర్చినందుకు ధన్యవాదాలు‘ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఒక చక్కని మార్గం’ అంటూ పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా పేర్కొన్నారు. ‘పార్లే’ షేర్ల కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు... మెలొడీ చాక్లెట్లను తయారు చేసేది పార్లే అనే కంపెనీ అని తెలియడంతో ఆ సంస్థ షేర్లను కొనడానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీనితో పార్లే ఇండస్ట్రీస్ అనే సంస్థ షేరు 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ రూ. 5.25ని తాకింది. 8.57 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఆ చాక్లెట్లను తయారు చేసేది పార్లే ప్రోడక్ట్స్ అనే కంపెనీ. అది స్టాక్ మార్కెట్లో కనీసం లిస్ట్ కూడా కాలేదు. కాకపోతే ‘ఆ పార్లే’..‘ఈ పార్లే’ ఒకటేనని ఇన్వెస్టర్లు పొరబడటమనేది పార్లే ఇండస్ట్రీస్‌కి బాగా కలిసి వచ్చింది.
ఫ్యామిలీ
ఎడ్యుకేషన్‌పై ఐఏఎస్ అధికారి ఆసక్తికర పోస్ట్..!
మన విద్య విధానం విద్యాపరంగా గెలుపు సాధించడం ఎలా, కఠినతరమైన పరీక్షలను ఎదుర్కోవడం ఎలా తదితరాలనే నేర్పిస్తోంది. జీవితానికి అవసరమైనవి, అత్యంత కీలకమైన పాఠాలను నేర్పించడంలేదట. చదువు అన్ని జీవన నైపుణ్యాలను నేర్పింస్తుందని పొరబడుతున్నాం. అది నిజంగా భావోద్వేగ పరంగా స్ట్రాంగ్ ఉండటం దగ్గర నుంచి జీవితానికి అవసరమై కీలక పాఠాలనేవ ఏమి నేర్పించలేకపోతుందంటూ ఓ ఐఏఎస్ అధికారిణి పెట్టిన పోస్టు అందర్నీ ఆకర్షించడమే కాదు ఆలోచనాత్మకంగా ఉంది. ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం రాశారంటే..ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా..ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక కాలేజీలలో ఉన్నత చదువుని పొందా, ఐఏఎస్ వంటి మంచి గౌరవనీయమైన ఉద్యోగాన్ని దక్కించుకున్నానని అన్నారు. అయితే తాను పొందిన ఉన్నత విద్య పోటీపరీక్షలకు, వృత్తిపరమైన బాధ్యతలకు సిద్ధం చేయగలిగింది కానీ భావోద్వేగ పోరాటాలకు, ఒంటిరితనాన్ని ఎదుర్కోవడం వంటి సవాళ్లకు సిద్ధం చేయలేకపోయిందని రాశారు. నిజానికి మనమంతా విద్యార్థి దశలో గెలుపుని ఎలా అందుకోవాలో నేర్చుకోవడానికి ఏళ్ల తరబడి టైం స్పెండ్ చేస్తాం, కానీ సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఒక్క రోజు కూడా కేటాయించం అని పోస్టులో రాసుకొచ్చారామె. మనం కెమిస్ట్రీలో ఆవర్తన పట్టికను తెగ కంఠస్థం చేస్తాం, అయితే బాధను ఎలా అధిగమించాలో మాత్రం నేర్చుకోం. నిజానికి విద్యార్థులంతా విద్యా సంబంధితమైన అన్నింటిని నేర్చుకుంటారు, కానీ దుఃఖం, ఒత్తిడి లేదా వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పించదు లేదా ఏ గురువు నేర్పే ప్రయత్నం చేయరని అన్నారు. అంతేగాదు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులుగా అణిచేయడం లేదా నియంత్రించడమే నేర్పిస్తారని, అది కాస్త ఒత్తిడికి గురిచేస్తుందని ఆమె నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ప్రతి స్టూడెంట్‌కి వ్యాసాలు రాయడం ప్రోత్సహిస్తాం, కానీ అసౌకర్యాన్ని ఎలా వ్యక్తపరచాలో, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టతరమైన పరిస్థితుల్లో కాదు అనే మాట ఎలా చెప్పాలి వంటి అనేక విషయాలను నేర్పాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారామె. ప్రతి స్కూలు స్టూడెంట్ చెప్పే సమాధానాలకు బహుమతులు ఇస్తుంది, వారినే విజేతలుగా పేర్కొంటుంది. కానీ జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసిన వారే నిలదొక్కుకుంటారని ఆమె అంటున్నారు. అలాగే గణితం నేర్పిస్తాం గానీ ఆర్థిక ఒత్తిడిని ఎలా నిర్వహించాలో నేర్పదన్నారు. కేవలం డబ్బు సంపాదించడమే విద్య నేర్పిస్తుందే కానీ, దాన్ని నిర్వహించడం నేర్పదని పోస్టులో రాసుకొచ్చారామె. ఆమె పోస్టులకు పలువురు నెటిజన్లు మద్దతిస్తూ..విద్య కేవలం వృత్తి జీవితాన్నే నేర్పిస్తుందే తప్ప జీవితానికి కీలకమైన జీవన నైపుణ్యాలనే నేర్పించలేకపోతుందంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..)
ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..
ఒక్కోసారి లక్కు ఎలా ఉంటుందో చెప్పలేం. మనం అంతగా పట్టించుకోకపోయినా..ఎవరో అపరిచిత వ్యక్తలు ద్వారా అయినా అదృష్టం తన్నుకుంటూ వచ్చేస్తుంది. మనం మర్చిపోయినా..రేయి ఈ సొమ్ము నీదే రా అంటూ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలాంటి సంఘటనే యూఎస్‌లో చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన వ్యక్తి గతేడాది మే నెలలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ విషయాన్ని ఒక ఏడాది పాటు పూర్తిగా మర్చిపోయాడు. అయితే ఒక రోజు తరుచుగా వెళ్లే గ్యాస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. అక్కడ ఒక లాటరీ టికెట్ జాక్‌పాట్ గెలుచుకున్నా..ఎవరు క్లైయిమ్ చేసుకోలేదని, గడవు ముగియనుందంటూ ఓ ప్రకటన కనిపించింది అది ఈ వ్యక్తి కంట పడింది. దాని గురించి అక్కడి లాటరీ అధికారులను ఆరా తీయగా. అది పిక్ -6 లాటరీ టికెట్ అని రెగ్యులర్ కస్టమర్లు మాత్రమే దీన్ని ఎంచుకుంటారని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఆ విషయం ఈ వ్యక్తికి గుర్తొచ్చి వెంటనే ఇంట్లోని ప్రతి అణువు గాలించాడు. అప్పుడే పాత ఫ్యాంటు జేబులో నలిగిపోయిన లాటరీ టికెట్ అతడి కంటపడింది. జాక్‌పాట్ గెలుచుకున్న లాటరీ టికెట్ నెంబర్‌తో సరిపోల్చుకుంటే ఆ టికెట్ అదే అని తేలడంతో ఏకంగా రూ. 57 కోట్లు డబ్బు దక్కించుకున్నాడు. ఒక వేళ్ల తేలిగ్గా తీసుకుంటే అంత భారీ సోమ్ము త్రటిలో చేజారిపోయేది. ఇది మాములు లక్కు కాదు కదా..!. అదృష్టం ఉంటే అది ఎలాగైన మన తలుపు తడుతుందంటే ఇదే కదూ.!. చాలామంది విజేతలు ఇలానే తమ లాటరీ టికెట్ల గురించి మర్చిపోవడం వల్ల చాలామటుకు అలానే క్లైయిమ్ చేసుకోకుండా ఉండిపోతాయని చెబుతున్నారు అధికారులు.(చదవండి: బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!)
పిల్లలూ... చదవాలి లా
ఆ ఇంటి కుర్రాడు ఫోన్ లో వచ్చిన లింక్ నొక్కాడు. బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. మరో ఇంటి కుర్రాడు మార్ఫింగ్ ఫొటో పెట్టాడు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇంకో ఆకతాయి బైక్ రేస్ చేశాడు. కేసు నెత్తిన పడింది. ఇవన్నీ ‘తెలియక’ చేసినవే. కానీ చట్టం ‘తెలియదు’ అనే మాటను క్షమించదు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి లీగల్ పాఠాలు ఉండాలంటున్నారు రిటైర్డ్ ఐపిఎస్ వీరేందర్. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో ఆయన ఢిల్లీలో చేస్తున్న కృషి దేశం అందుకోవాల్సి ఉంది.‘ఇగ్నొరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ యాన్ ఎక్స్క్యూజ్’ అని చట్టంలో మొదటి పాఠం. ‘మా వాడు బుద్ధిమంతుడు సార్, తెలియక చేశాడు’ అని తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. తప్పులు... శిక్షలునేటి పిల్లల ప్రపంచం స్క్రీన్ అంత చిన్నది... లేదా స్క్రీన్ అంత పెద్దది. స్క్రీన్ మీద ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటున్నారు. సైబర్ నేరం చేస్తే జైలుకు వెళ్తారని తెలియదు. అమ్మాయి ఫోటో అనుమతి లేకుండా షేర్ చేస్తే పోక్సో అవుతుందని తెలియదు. బైక్‌పై ముగ్గురు వెళ్తే, హెల్మెట్ లేకపోతే, మైనర్ డ్రైవింగ్ చేస్తే తలిదండ్రులకు కూడా జైలు శిక్ష పడుతుందని తెలియదు. మనం కూడా మార్కులు, ర్యాంకులు, ఐఐటి.. నీట్ అంటూ పరుగెత్తిస్తాం. కానీ రోడ్డు మీద ఎలా నడవాలి, ఫోన్ లో ఏం చేయకూడదు, ఆపద వస్తే ఏ చట్టం కాపాడుతుంది అనే ‘బతుకు పాఠం’ చెప్పం. ఫలితం? చిన్న తప్పు చేసి జీవితాన్ని బజారున పడేసుకుంటున్నారు.బడిలో చట్టం నేర్పిస్తే?‘లీగల్ స్టడీస్’ అనే సబ్జెక్ట్ సి.బి.ఎస్.ఇ.లో 11, 12 క్లాసులకు ఆప్షనల్‌గా ఉంది. ఆర్.టి.ఐ ఎలా వేయాలి, కన్సూ్యమర్ హక్కులు ఏంటి, సైబర్ చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ అందులో ఉంటాయి. కానీ ఢిల్లీలో 1500 స్కూల్స్ ఉంటే కేవలం 29 స్కూల్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకు? ‘దీనివల్ల కెరీర్ ఏముంది’ అని స్కూల్స్ అనుకుంటాయి. ‘మార్కులు రావు’ అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇది మార్కుల పాఠం కాదు, మనిషిగా బతికే పాఠం. దీన్ని ఎవరు చె΄్పాలి? రిటైర్డ్ జడ్జిలు, లాయర్లు, పోలీస్ అధికారులు వారానికి ఒక పీరియడ్ తీసుకుంటే చాలు.కోర్టులో నల్లకోటు వేసుకునే లాయర్ బడిలో చాక్‌పీస్ పడితే చట్టం పిల్లల భాషలోకి దిగివస్తుంది. ‘కేసు’ అంటే భయం పోయి ‘క్లారిటీ’ వస్తుంది. సినిమాల్లో చూసే పోలీస్, లాయర్ కాకుండా నిజమైన చట్టం తెలుస్తుంది. నేర్చుకుంటే నేరం ఆగుతుంది. ఒక పిల్లవాడికి తన హక్కులు తెలిస్తే, ఎదుటివాడి హక్కులూ తెలుస్తాయి. ‘రోడ్డు నాదే’ అని బైక్ నడిపేవాడు ‘రూల్ అందరిదీ’ అని నమ్ముతాడు. చట్టం తెలిసిన పౌరుడు పోలీస్‌కు సాయం చేస్తాడు, భయపడడు. మోసం జరిగితే కన్సూ్యమర్ కోర్టుకు వెళ్తాడు. అమ్మాయిని ఏడిపిస్తే అది ‘ఈవ్ టీజింగ్’ కాదు, ‘క్రిమినల్ ఆఫెన్ ్స’ అని గట్టిగా చె΄్తాడు. సమాజం మారాలంటే శిక్ష ఎందుకు పడుతుందో తెలియాలి. అది బడి నుంచే తెలియాలి.అతని కృషిఢిల్లీ రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ వీరేందర్ పుంజ్ ఈ విషయంలో మొదటగా కళ్లు తెరిచారు. 2012 నిర్భయ కేసు సమయంలో ఆయన్ను ఒక ప్రశ్న వెంటాడింది. ‘నిందితుల్లో ఒకడు మైనర్. వాడికి చిన్నప్పుడే చట్టం పాఠం చెప్పుంటే ఈ దారుణం జరిగేదా?’... ఈ ప్రశ్నకు జవాబుగా రిటైర్ అయ్యాక స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నాడు. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో బడి బడికీ తిరుగుతున్నాడు. పిల్లలతో మాట్లాడుతున్నాడు. ‘మీ హక్కులు తెలుసా?’ అని అడుగుతున్నాడు. పిల్లలు ఆయనకు ఉత్తరాలు రాశారు. ‘మాకు లీగల్ స్టడీస్ కావాలి’ అని. ‘"WE WANT LEGAL STUDIES SUBJECT IN OUR SCHOOLS" ‘ అని ప్లకార్డులు పట్టుకున్నారు. చిన్నప్పుడు హిట్ అండ్ రన్ కేసులో తండ్రిని పోగొట్టుకున్న వీరేందర్‌కు న్యాయం జరగలేదు. ఆ గాయమే ఇవాళ వేల మంది పిల్లలకు చట్టం అనే కవచం ఇచ్చేలా చేస్తోంది. ఒక్క పిరియడ్ చాలుచట్టం పుస్తకంలో కాదు, బుర్రలో ఉండాలి. మామిడి పండు తియ్యగా ఉండాలంటే మొక్క సమయం నుంచి నీళ్లు పోయాలి. పౌరుడు బాధ్యతగా ఉండాలంటే బడిలోనే చట్టం నేర్పాలి. క్లాస్‌రూమ్‌లో ఒక్క పిరియడ్ చట్టం వింటే చాలు. జీవితం సేఫ్. రేపు మీ పిల్లల స్కూల్లో ‘లీగల్ స్టడీస్’ ఉందా అని అడగండి. లేకపోతే అడిగించండి. చట్టం తెలిసిన బిడ్డ ఇంటికి భరోసా, దేశానికి ధీమా. – కె.
హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..
మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట అడుగు భాగంలో ఉండే పొరల మీద అమరిపోయి ఉంటాయి.ఏవైనా కారణాల వల్ల ఈ ΄పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపల ఉండే భాగాలు... బలహీనంగా ఉన్న ఆ అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని (చర్మంలోనే) బయటకు వెళ్తాయి. ఇలా జరిగినప్పుడు పురుషుల్లోనైతే ఆ పేగులు... వృషణాల సంచిలోకి జారిపోవచ్చు. ఒకవేళ మహిళల్లోనైతే పొట్టలోని ఆ అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. పొట్టలోనివే కాదు... మరే భాగంలోనైనా... ఒక దేహభాగం మరో దేహభాగంలోకి చొచ్చుకు వెళ్లడాన్ని ‘హెర్నియా’ అంటారు. ఇందులో చాలా రకాలుంటాయి. ఈ హెర్నియాలోని రకాలు, అలా జరిగినప్పుడు చేయించాల్సిన చికిత్సల వంటి పలు అంశాలను తెలుసుకుందాం...పొత్తికడుపు పొరల్లో బాగా బలహీనంగా ఉన్నచోటి నుంచి పొత్తికడుపులోని కొన్ని భాగాలు దూసుకుపోయి చర్మం కిందికి చేరుకుంటాయి. బయటి నుంచి చూసినప్పుడు అక్కడి చర్మం భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంటుంది. సాధారణంగా పొత్తికడుపు ముందు భాగంలో చర్మం, కొవ్వు, కండరాలు వంటి పలుచోట్ల పొరలు ఉంటాయి. ఇవి పేగులతో పాటు కడుపులోని అంతర్గత భాగాలను తమ తమ స్థానాల్లో ఉండేలా చూస్తాయి. ఈ కండరాలు బలహీనంగా ఉన్న చోట్ల నుంచి కడుపులోని పేగులలో కొంత భాగం బయటకు వచ్చి చర్మం కింది నుంచి ఉబ్బు కనిపిస్తుంది. చేత్తో ముట్టుకున్నప్పుడు ఆ పేగుల భాగాలూ చేతి స్పర్శకు తెలుస్తుంటాయి. సహజంగా హెర్నియా వచ్చేందుకు అవకాశమున్న భాగాలు...కడుపులోని భాగాలు డయాఫ్రమ్ అనే భాగాన్ని దాటి ఛాతీ (లోయర్ ఛెస్ట్)లోకి. కడుపు కింది భాగాల నుంచి పొత్తికడుపు లేదా గజ్జల్లోని లోపలి భాగాల్లోకి. కడుపుకు మధ్యభాగం (మిడ్లైన్)లోకి. కడుపుపై శస్త్రచికిత్స జరిగినప్పుడు... బలహీనపడ్డ ఆ కోత భాగంలోకి.హెర్నియాల్లో రకాలివి... హెర్నియాల్లో అనేక రకాలుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి...ఇంగ్వైనల్ హెర్నియా : చాలా సాధారణంగా / ఎక్కువమందిలో కనిపించే హెర్నియా ఇది. మొత్తం హెర్నియాల్లో 75% ఇదే కనిపిస్తుంది. ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. రెండు వైపులా కూడా రావచ్చు. సాధారణంగా ఎక్కువ బరువు ఎత్తినప్పుడు కడుపులోని పేగులు... ఇంగ్వైనల్ కెనాల్ అనే ప్యాసేజ్ ద్వారా తొడల (అప్పర్ థైస్) భాగంలోకి వెళ్తాయి.ఫీమోరల్ హెర్నియా : ఇది కాస్తంత అరుదుగానే కనిపిస్తుంది. ఇంగ్వైనల్ కెనాల్ కింద ఉండే ఫీమోరల్ కెనాల్ ద్వారా కడుపులోని భాగాలు ముఖ్యంగా కొవ్వుపొరలు తొడల (అప్పర్ థైస్) దగ్గరికి చొచ్చుకురావడం వల్ల ఈ హెర్నియా కనిపిస్తుంది. సాధారణంగా ఫీమోరల్ హెర్నియా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్వైనల్ హెర్నియాతో పోలిస్తే ఈ ఫీమోరల్ హెర్నియా కాస్త చిన్నదిగా ఉంటుంది. హయటల్ హెర్నియా : ఇది చాలామందిలో చాలా సాధారణంగా కనిపించే హెర్నియా. మన ఛాతీలో ఊపిరితిత్తులుండే భాగాన్నీ, కడుపులోని పేగులుండే భాగాన్ని వేరు చేస్తూ... డయాఫ్రమ్ అనే పొర ఉంటుంది. ఈ డయాఫ్రమ్ నుంచే...ఆహారాన్ని కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహిక వెళ్తుంది. ఈ అన్నవాహిక కడుపులోకి వెళ్లే చోట డయాఫ్రమ్ దగ్గర బలహీనంగా ఉన్న సమయాల్లో కడుపులోని భాగాలు ఛాతీలోకి దూసుకువస్తాయి. ఈ కండిషన్‌నే హయటస్ / హయటల్ హెర్నియా అంటారు.కంజెనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా : హయటల్ హెర్నియాలోలాగే ఇక్కడ కూడా డయాఫ్రమ్ లోంచి ఛాతీలోకి పైకి వస్తాయి. అయితే ఇది పుట్టకతోనే (కంజెనైటల్గా) వచ్చే సమస్య. అంటే పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్నవాహిక కడుపులోకి వెళ్తే చోట డయాఫ్రమ్ పూర్తిగా ముసుకుపోయినట్టుగా అభివృద్ధి చెందకపోవడంతో కడుపులోని భాగాలు ఛాతీలోని ఊపిరితిత్తులున్న చోటికి వస్తాయి.ఇన్సిషనల్ హెర్నియా : సర్జరీ వంటివి చేస్తున్నప్పుడు... కడుపుపైన గాటు పెట్టిన చోట అక్కడి కణజాలం బలహీనం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ గాటు ఉన్న చోటి నుంచి కడుపులోని భాగాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లుగా చర్మం కింది నుంచి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. మునుపు శస్త్రచికిత్స గాయం లేదా మచ్చ ఉన్న ప్రాంతంలో... ఆ గాయం సరిగా మానకపోయినా లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ తరహా హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. సాధారణంగా సర్జరీ తర్వాత రెండేళ్లలోపు ఇది కనిపిస్తుంది.అంబిలికల్ హెర్నియా / పారా అంబిలికల్ హెర్నియా : బొడ్డు దగ్గర బలహీనంగా ఉన్న ప్రాంతంలోంచి కడుపులోని భాగాలు బయటకు రావడాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. ఇది సాధారణంగా పుట్టుకతోనే (కంజెనైటల్గా) కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో చిన్నారికి ఏడాది వయసు వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే అవకాశాలెక్కువ. ఇక పారాంబిలికల్ హెర్నియా పెద్దవారిలో వస్తుంది. ఇది నాభి పైభాగంలో కనిపిస్తుంది. ఇందులోకి పేగులు చొచ్చుకుపోయి అక్కడ ఇరుక్కుపోయే ముప్పు ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది. వెంట్రల్ హెర్నియా : కడుపు కింది భాగంలో ఉండే పొరల నుంచి అవయవాలు దూసుకు రాకుండా... కడుపు ముందుభాగంలోంచే కడుపులోని అవయవాలు ముందుకు వస్తుంటే దాన్ని ‘వెంట్రల్ హెర్నియా’ అని చెప్పవచ్చు. ఒకరకంగా చె΄్పాలంట అంబిలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర వచ్చే ‘ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా’ వంటి వాటిని ‘వెంట్రల్ హెర్నియా’గా చెప్పవచ్చు.హెర్నియా ఎవరెవరిలో వస్తుందంటే... హెర్నియా అన్నది పురుషుల్లోనూ, మహిళల్లోనూ... ఇలా ఇద్దరిలో వచ్చే కండిషన్. చాలామంది పురుషుల్లో వచ్చే హైడ్రోసిల్ కండిషన్‌ను హెర్నియాతో పోల్చుకుని... ఆ రెండో ఒకటే అని అపోహ పడుతుంటారు. కడుపు కిందిభాగంలోని పొర... వయసు పెరగడం వల్లగానీ లేదా అరుగుదల వల్లగానీ, దెబ్బతగలడం వల్లగానీ లేదా కొందరిలో సహజంగానే ΄పొట్ట అడుగుభాగంలోని కండరం బలహీనపడ్డ సమయంలో కడుపులోని భాగాలు అందులోంచి దూసుకుని కిందికి వెళ్లడాన్నే ‘హెర్నియా’ అంటారు. స్త్రీ, పురుషుల్లో హెర్నియా పలు రకాలుగా రావచ్చు. అయితే పురుషులకు ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. ఎందుకంటే పిండం శిశువుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వృషణాలు పొత్తికడుపులోంచి నుంచి స్క్రోటమ్‌లోకి దిగేందుకు ఒక చిన్న మార్గం ఉంటుంది. దాన్నే ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్ (బీజాలు) కూడా కడుపులోనే ఉంటాయి. మగబిడ్డ పుట్టగానే కడుపులోని ఆ టెస్టిస్ (బీజాలు) అదే మార్గం ద్వారా వృషణాల సంచిలోకి జారతాయి. మున్ముందు ఆ కెనాల్లోంచే పేగులు కూడా వృషణాల సంచిలోకి జారడం వల్ల ఇంగ్వైనల్ హెర్నియా వస్తుంది. ఇక పెద్ద వయసువారిలో ఏదైనా కారణం వల్లగానీ లేదా మలబద్దకం కారణంగా ముక్కినప్పుడు పొత్తికడుపుపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా హెర్నియా వస్తుంది. ఇదే కాకుండా పొత్తికడుపుపై ఇతరత్రా కారణాలతో ఒత్తిడి పడటం కూడా హెర్నియాకు దారితీయవచ్చు. ఇక చిన్నారుల్లో సైతం పుట్టుకతో వచ్చే హెర్నియాలూ ఉండనే ఉన్నాయి. కడుపు కండరాలపై ఒత్తిడి కారణంగా హెర్నియా రావడానికి కారణాలు... క్రానిక్ అలర్జీల వల్ల చాలాకాలం పాటు గట్టిగా దగ్గాల్సిరావడం. పురుషుల్లో చాలా ఎక్కువసేపు అదేపనిగా నిలబడే వృత్తులో ఉండటం. గర్భధారణ వల్లగానీ చాలా ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీలు రావడం వల్ల. ఎక్కువ బరువు ఉండటం (బీఎమ్ 30 కంటే ఎక్కువగా ఉండటం).బరువైన వస్తువులను అకస్మాత్తుగా ఎత్తడం లేదా ఎక్కువ ఫోర్స్‌తో తోయడం.మలవిసర్జన సమయంలో ముక్కుతూ చాలా ఎక్కువ ఒత్తిడితో విసర్జనకు ప్రయత్నించడం. పెల్విస్ భాగంలో అయిన సర్జరీల వల్ల. చిన్నారుల్లో కంజెనైటల్ హెర్నియాలకు కారణాలు... నెలల పూర్తిగా నిండకముందే పుట్టడం (ప్రీ–మెచ్యుర్ డెలివరీస్). కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అనే ఆరోగ్య సమస్య ఉండటం. కడుపులోని బీజాలు సంచిలోకి వెళ్లకపోవడం (అన్–డిసెండెడ్ టెస్టిస్). మూత్ర వ్యవస్థ / రీప్రొడక్టరీ సిస్టమ్‌లో ఏవైనా సమస్యలుండటం. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండేవారిలో... మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్ సమస్య ఉన్నవారిలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ.పెద్దవారిలో కనిపించే లక్షణాలుబరువైన వస్తువులు ఎత్తిన తర్వాత పొత్తికడుపు కింది భాగం (గ్రోయిన్)లో చిన్న ఉబ్బ / గడ్డలా కనిపించడం. మొదట్లో దాన్ని చేతితో లోపలికి నెట్టినప్పుడు కనిపించకుండా పోవడం తర్వాత మెల్లగా బయటకు రావడం దగ్గినప్పుడు లేదా గట్టిగా నవ్వినపుపడు ఉబ్బు బయటకు రావడం పడుకున్నప్పుడు ఉబ్బు / వాపు తగ్గిపోవడం. ఎందుకు చికిత్స అవసరమంటే...?సాధారణంగా హెర్నియా పెద్దగా నొప్పిని కలిగించదు. కానీ కొంతమందిలో నొప్పి లేదా బరువుగా అనిపించవచ్చు. కాలక్రమంలో ఉబ్బు / వాపు పెద్దదవుతుంది. పురుషుల్లో కొన్ని సందర్భాల్లో స్క్రోటమ్‌లోకి దిగిపోవచ్చు. ఇక పురుషుల్లోనూ, మహిళల్లోనూ కనిపించే హయటస్ హెర్నియాలో కడుపులోని యాసిడ్ పైకి తోసుకువచ్చే యాసిడ్ రిఫ్లక్స్ వంటి సందర్భాల్లో ఛాతీలో మంట, తీవ్రమైన అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కనిపించే కాంప్లికేషన్ల కారణంగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం తప్పనిసరి. ఇక పెద్దవారిలో వచ్చే హెర్నియాలు సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా చికిత్స చేయడం అవసరం. ఇందుకు కారణాలు... కొన్ని సందర్భాల్లో హెర్నియా ఎటూ కదలలేకుండా ‘బిగుసుకుపోవచ్చు’. ఇలా బిగుసుకుపోవడాన్ని ‘ఇన్కార్సెరేషన్’ అంటారు. ఇలాంటి ‘ఇన్కార్సెరేటెడ్ హెర్నియా’లో నొప్పితో పాటు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు హెర్నియా కండిషన్ పెద్దపేగును బాగా బిగదీసి నొక్కుకుపోయేలా చేసినప్పుడు బయటకు వెళ్లాల్సిన గ్యాస్, విసర్జన జరగాల్సిన పదార్థాలూ అక్కడే ఆగిపోవచ్చు. ఇక కొన్నిసార్లు పేగు భాగం ఇరుక్కుపోయి ‘స్ట్రాంగ్యులేషన్’ అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు బిగదీసుకుపోయిన చోటి నుంచి కింది భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల తీవ్రమైన నొప్పితో పాటు పేగు దెబ్బతిని అక్కడి కణజాలం నశించిపోయే ప్రమాదం ఉంది. దీన్నే నెక్రోసిస్ / గ్యాంగ్రీన్గా కూడా చెబుతారు. ఇంగ్వైనల్ హెర్నియాలకంటే ఫెమోరల్ హెర్నియాల్లో ఈ ముప్పు చాలా ఎక్కువ. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి అది రవాణ సదుపాయానికి కూడా దారితీయవచ్చు. అందుకే హెర్నియా కండిషన్‌ను శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. నిర్ధారణ బాధితుల్లోని ఉబ్బు భాగాన్ని భౌతికంగా పరీక్షించడం (ఫిజికల్ ఎగ్జామ్) ద్వారా హెర్నియాను చాలావరకు నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలు అవసరం పడవచ్చు. హెర్నియాను ఎలా సరిచేస్తారు?హెర్నియాను చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు సరిచేస్తారు. అయితే చిన్నపాటివీ (మైల్డ్), కొద్దిపాటి వాటికి వెంటనే శస్త్రచికిత్స అవసరం లేదు. ఇలాంటి వాటి విషయంలో డాక్టర్లు ‘వెయిట్ అండ్ వాచ్’ పద్ధతిని అనుసరిస్తారు. మరీ ప్రమాదకరం కాకుంటే తక్షణం శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా వేస్తే తప్పక శస్త్రచికిత్స అవసరం. ఇది మందులతో తగ్గే కండిషన్ కాదు. పాతకాలంలో ‘ట్రస్’ (సపోర్ట్) పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిని ఎవరూ అనుసరించడం లేదు. శస్త్రచికిత్సలో రకాలుఓపెన్ సర్జరీ / హెర్నియా రిపేర్ సర్జరీ : హెర్నియాను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అంతర్గత అవయవాల్లోకి చొచ్చుకుపోయిన అవయవాలను / పేగులను లోపలికి యథాస్థానంలోకి నెట్టి, పొరలు బలహీనంగా ఉన్న చోటి నుంచి అవయవాలు మళ్లీ లోనికి జారిపోకుండా అక్కడ ‘మెష్’ (వల వంటి భాగాని అమర్చుతారు. మామూలుగానైతే 3–4 అంగుళాల కోత పెట్టి హెర్నియాను సరిచేస్తారు. సాధారణంగా స్పైనల్ అనస్థీషియా ఇస్తారు.లాపరోస్కోపిక్ హెర్నియా రిపేర్ : చిన్న చిన్న గాట్ల ద్వారా అతి చిన్న కెమెరా (లాపరోస్కోప్) సహాయంతో శస్త్రచికిత్స చేస్తారు. మెష్‌ను పెట్టి స్లేప్లింగ్ చేస్తూ దాన్ని స్థిరంగా ఉండేలా చూస్తారు. ఆ మెష్ కారణంగా మళ్లీ అవయవాలు లోపలికి జారవు. ఇందులో కూడా సాధారణంగా జనరల్ అనస్థీషియాతో ఇస్తారు.లాపరోస్కోపిక్ సర్జరీతో ప్రయోజనాలుచిన్న గాటు తక్కువ నొప్పి త్వరగా కోలుకోవడం త్వరగా వృత్తులకు వెళ్లగలగడం (అటెండ్ కావడం)రొబోటిక్ సర్జరీ : ఇప్పుడు రొబోటిక్స్ సహాయంతో కూడా శస్త్రచికిత్స నిర్వహించడం సాధ్యమే. దీంతో మరింత ఖచ్చితమైన రీతిలో (ప్రెసిషన్‌తో) శస్త్రచికిత్స చేయడం వల్ల త్వరగా కోలుకోవడం, తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలన్నీ ఇందులోనూ ఉంటాయి.హెర్నియా నివారణ సాధ్యమేనా? హెర్నియాకు కారణమయ్యే కొన్ని అంశాలు మానవ నియంత్రణకు సాధ్యం కావు. అయితే కొన్ని సాధారణ అంశాలు పాటించడం ద్వారా హెర్నియాను చాలావరకు నివారించవచ్చు. అవి... బరువును అదుపులో ఉంచుకోవడం / అధిక బరువు తగ్గించడం ∙బరువైన వస్తువులను ఎత్తే సమయంలో జాగ్రత్తగా ఉండటం / అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం / బరువైన వస్తువులను తోసే విషయంలోనూ ఈ జాగ్రత్తలు అవసరంచాలాకాలం పాటు దగ్గుతూ / తుమ్ములు వస్తూ ఉండే క్రానిక్ పల్మునరీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటూ దగ్గు రాకుండా చూసుకోవడం మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవడం పురుషుల్లో ప్రొస్టేట్ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం.హెర్నియాలు వారసత్వంగా వస్తుంటాయా? కొంతవరకు అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే జన్యుపరంగానూ, వాళ్ల దేహం తాలూకు స్వభావం వల్ల కడుపు కింది భాగంలోని పొరలు బలహీనంగా ఉండటం జరగవచ్చు. ఇలాంటి కుటుంబాల్లో తర్వాతి తరాల్లోనూ హెర్నియా రావచ్చు. అంతమాత్రాన తర్వాతి తరాల్లో ఇది అందరికీ వస్తుందని కాదుగానీ... హెర్నియా వచ్చేందుకు అవకాశాలు కాస్తంత ఎక్కువ.చివరగా... ముందుగా చెప్పినట్టు మైల్డ్ కేసుల్లో డాక్టర్లు వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో హెర్నియాను గమనిస్తూ ఉన్నప్పటికీ... డాక్టర్లు సర్జరీ తప్పదని చెప్పినప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లడమే మంచిది. ఎందుకంటే హెర్నియా బిగదీసుకుపోయే ‘స్ట్రాంగ్యులేషన్’ కేసుల్లో అది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చు. అంతేకాదు... కొన్నిసార్లు ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలెక్కువ. అందుకే డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించడం అవసరం.డాక్టర్ ఎన్. భరత్‌కుమార్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిర్వహణ: యాసీన్(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
అంతర్జాతీయం
విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్
అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 1996 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో (94) పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో అధికారికంగా విచారణ ప్రారంభమైంది.ఈ చార్జ్‌షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇదే విషయంపై అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మయామిలో మాట్లాడుతూ.. "30 ఏళ్ల కిందట హత్యకు గురైన నలుగురు అమెరికన్ల కుటుంబాలు ఇప్పటికి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు సాధరణ పౌరులు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీలక పాత్ర. అతడి అరెస్ట్ కోసం త్వరలోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అతడు తనంతట తాను అమెరికాకు వస్తాడని ఆశిస్తున్నాము. లేకపోతే ఇతర మార్గాల్లో మేమే రప్పిస్తామని" ఆయన పేర్కొన్నారు.అసలు 1996లో ఏమి జరిగిదంటే?'బ్రదర్స్ టు ది రెస్క్యూ' మయామి కేంద్రంగా పనిచేసే ఒక మానవతావాద సంస్థ. అప్పటిలో క్యూబాలోని కమ్యూనిస్ట్ దారుణాలను తట్టుకోలేక చిన్న పడవల్లో సముద్రం గుండా అమెరికాకు పారిపోయే క్యూబన్ శరణార్థులను ఆకాశం నుండి గుర్తించి, వారిని రక్షించడం ఆ సంస్థ పని. ఈ సంస్థకు చెందిన మూడు చిన్న సివిలియన్ విమానాలు 1996 ఫిబ్రవరి 24న ఫ్లోరిడా జలసంధి మీదుగా ప్రయాణించాయి. అయితేఅంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఈ ఘటనలో కార్లోస్ కోస్టా, అర్మాండో అలెజాండ్రే జూనియర్, మారియో డి లా పెనా, పాబ్లో మోరల్స్ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. ఆ సమయంలో రావుల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అతడి ఆదేశాల మేరకే అమెరికా సివిలియన్ విమానాలను కూల్చివేశారని అమెరికా న్యాయశాఖ నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్ల తర్వాత కాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్‌తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్‌లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్‌కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్మూద్ అహ్మదినెజాద్కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్‌ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి.
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైళ్లులలో మగ్గుతున్న 956 మంది ఖైదీలను విడుదల చేయాలని నహ్యాన్ ఆదేశించారు.సమాజంలో క్షమాగుణాన్ని,సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వివిద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ జరిమానాలు లేదా ఆర్థికపరమైన బకాయిలు చెల్లించలేక జైళ్లలోనే ఉంటున్న ఖైదీల అప్పుల మొత్తాన్ని యూఏఈ అధ్యక్షుడే స్వయంగా చెల్లించనున్నారు. దీంతో బయటకు వచ్చిన ఖైదీలు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు అజ్మాన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్-నుఐమి కూడా తన పరిధిలోని జైళ్ల నుండి 230 మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి సైతం 227 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో మొత్తం 1400కు పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా ప్రతీ ఏడాది రంజాన్, రంజాన్, బక్రీద్, జాతీయ దినోత్సవాల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఒక ఆనవాయితీగా వస్తోంది.
జాతీయం
కుల గణన జరగాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జన గణనతోపాటు కుల గణన చేపట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం మరోసారి తేల్చిచెప్పింది. సంక్షేమ పథకాలను రూపొందించి, అమలు చేయాలంటే వెనుకబడిన కులాల జనాభా లెక్కలు ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియాలని పేర్కొంది. కుల గణనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. కుల గణన అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గుర్తుచేసింది. సుధాకర్ గుమ్ముల అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుధాకర్ గుమ్ముల స్వయంగా హాజరై తన తరఫున తానే వాదనలు వినిపించారు. కులాల లెక్కలపై ప్రభుత్వం వద్ద ఇప్పటికే పుష్కలమైన సమాచారం ఉందని, గణాంకాలు అందుబాటులో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరోసారి కుల గణన అవసరం లేదని చెప్పారు. పిటిషనర్ వాదనను ధర్మాసనం తిరస్కరించింది.‘‘జనాభా లెక్కల సేకరణతోపాటు కుల గణన కూడా జరగాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఇందులో తప్పేముంది? వెనుకబడిన తరగతి ప్రజలు ఎంతమంది ఉన్నారో, వారి కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి తప్పక తెలిసి ఉండాలి’’అని వెల్లడించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. న్యాయస్థానాల పరిధికి మించిన అంశం కావడంతో ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలియజేసింది.
టెట్రా ప్యాక్‌ల్లో మద్యం.. మోసపూరితం
సాక్షి, న్యూఢిల్లీ: టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల వంటి ‘గుర్తించలేని ప్యాకేజింగ్’లో మద్యం విక్రయాలు సాగిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర ఇతర భాగస్వామ్య పక్షాలను ఆదేశించింది. కేంద్రంసహా అన్ని రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ‘డ్రంకెన్ డ్రైవింగ్ వ్యతిరేక కమ్యూనిటీ’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని, టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల మద్యం అమ్మకాలను నిషేధించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున అడ్వొకేట్ విపిన్ నాయర్ వాదనలు వినిపించారు. ఎక్సైజ్ విధానం కింద ‘సీసా’ అనే పదానికి నిర్వచనం అస్పష్టంగా ఉందని, దీనిపై కొంత ప్రామాణీకరణ జరగాలని చెప్పారు. ఆకుపచ్చ ఆపిల్ ఫోటోలు ఉన్న టెట్రా ప్యాక్‌ల్లో మద్యం ప్యాక్ చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం నిజంగా మోసపూరితమేనని ధర్మాసనం పేర్కొంది. టెట్రా ప్యాక్ చూసి వినియోగదారులు పొరబడుతున్నారని, పైన ఆపిల్ ఫోటో, లోపల వోడ్కా ఉంటోందని విపిన్ నాయర్ వెల్లడించారు. పౌరుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని తేల్చిచెప్పారు. ‘‘పొగాకు ప్యాకెట్లపై ఉన్నట్లుగా టెట్రా ప్యాక్‌లపై ఎలాంటి హెచ్చరిక గుర్తులు లేవు. ఇవి పండ్ల రసాల ప్యాకెట్ల మాదిరిగానే ఉంటాయి. లోపల మద్యం నింపుతున్నారు. మిరపకాయ, మామిడి వోడ్కాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పబ్లిక్ ప్రదేశాల్లో, వాహనాలు నడుపుతూ సులభంగా మద్యం తాగే అవకాశం కలుగుతోంది. మైనర్లు వీటికి త్వరగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రాల సరిహద్దులు దాటించి స్మగ్లింగ్ చేయడం కూడా సులభంగా మారుతోంది. ఈ తరహా విక్రయాలను నిషేధించేలా ఒక విధానాన్ని తీసుకురావాలి. ‘బాట్లింగ్’ అంటే కేవలం గాజు సీసాలు లేదా పారదర్శక కంటైనర్లు మాత్రమే అన్నట్లుగా ఏకీకృత నిర్వచనం ఇవ్వాలి. అంతేకాకుండా ప్లాస్టిక్ సాచెట్లు, పెట్ బాటిళ్లు, టెట్రా ప్యాక్‌ల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. వీటిని రీసైకిల్ చేయడం దాదాపు అసాధ్యం. ఆదాయం పెంచుకోవడానికే వాటిని ప్రోత్సహిస్తున్నారు. ప్రమాదకరమైన ప్యాకేజింగ్‌లో మద్యం అమ్మకాలను నిషేధించడం ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అత్యవసరం’’ అని అని విపిన్ నాయర్ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే: ధర్మాసనం పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పండ్ల రసాల ప్యాకెట్లను పోలి ఉండే టెట్రా ప్యాక్‌ల్లో విరివిగా మద్యం విక్రయించడం అత్యంత మోసపూరితమైన చర్య అని వ్యాఖ్యానించింది. ఇలాంటి విక్రయాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అభిప్రాయపడింది. గతంలో ఓ ట్రేడ్ మార్క్ వివాదానికి సంబంధించిన విచారణలోనూ టెట్రా ప్యాక్‌ల్లో మద్యం అమ్మకాలపై తాము అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే?
భారత వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అత్యంత శక్తిమంతమైన ఆయుధం రష్యా తయారీ S-400 Triumf నాలుగో స్క్వాడ్రన్ ఈ వారం భారత్‌కు చేరుకోనుంది. శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను ఆకాశంలోనే కూల్చివేయగల ఈ అత్యాధునిక వ్యవస్థ రవాణా ప్రక్రియ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒక చిన్న టీవీ లేదా ఫ్రిజ్ సురక్షితంగా ఇంటికి ఎలా చేరుతుందో అనుకునే మనకు, ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్‌కు ఎలా తరలిస్తారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.చరిత్రాత్మక ఒప్పందం భారత్–రష్యా మధ్య 2018లో దాదాపు 5.43 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు యూనిట్లు భారత వైమానిక దళంలో సేవలందిస్తుండగా, ఇప్పుడు నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది. భారత వాయుసేన ఈ వ్యవస్థను “సుదర్శన్ చక్ర”గా అభివర్ణిస్తోంది.ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్‌కు తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఇది అత్యంత సమన్వయంతో జరిగే భారీ లాజిస్టిక్ ఆపరేషన్. సముద్ర, వాయు, రోడ్డు మార్గాలను కలిపి ప్రత్యేక వ్యూహంతో ఈ తరలింపు చేపడతారు. భారీ క్షిపణి లాంచర్లు, ట్రాన్స్పోర్టర్ వాహనాలు వంటి పరికరాలను భారీ కార్గో నౌకల ద్వారా భారత తీర ప్రాంత పోర్టులకు తరలిస్తారు. మరోవైపు కమాండ్ అండ్ కంట్రోల్ మాడ్యూల్స్, అత్యాధునిక రాడార్లు, ఇంటర్‌సెప్టర్ క్షిపణులు వంటి సున్నితమైన పరికరాలను రష్యా నుంచి భారీ మిలిటరీ విమానాల ద్వారా నేరుగా భారత వైమానిక దళ స్థావరాలకు చేర్చుతారు.రవాణాకు ముందు భారత వైమానిక దళ అధికారులు రష్యాలోనే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని పరికరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత వాటిని ప్రత్యేక భద్రతా కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ప్రస్తుతం భారత్‌కు వస్తున్న నాలుగో యూనిట్‌కు సంబంధించిన ఈ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.సాధారణంగా చాలామంది S-400 అంటే కేవలం క్షిపణులు అమర్చిన ఒక పెద్ద ట్రక్కు మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి మొబైల్ యుద్ధ వ్యవస్థ. ఒక స్క్వాడ్రన్‌లో 16 ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, 600 కిలోమీటర్ల దూరంలో శత్రువులను గుర్తించగల రాడార్లు, లక్ష్యాలను ట్రాక్ చేసి క్షిపణులకు మార్గనిర్దేశం చేసే ఎంగేజ్మెంట్ రాడార్లు, ఎనిమిది మొబైల్ లాంచర్ యూనిట్లు, క్షిపణి రీలోడర్లు, జనరేటర్లు, మెయింటెనెన్స్ వాహనాలు ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థ కలిపి శక్తివంతమైన వైమానిక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.భారత్‌కు చేరుకున్న తర్వాత అసలు ఆపరేషన్ ప్రారంభమవుతుంది. పోర్టుల వద్ద కస్టమ్స్, భద్రతా క్లియరెన్స్ పూర్తయిన తరువాత ఈ భారీ కంటైనర్లను ప్రత్యేక మిలిటరీ ట్రక్కుల ద్వారా గమ్యస్థానాలకు తరలిస్తారు. ఈ రవాణా సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. గగనతలంలోనూ, రోడ్లపైనూ హై అలర్ట్ ప్రకటిస్తారు. అనంతరం భారత వైమానిక దళ సాంకేతిక నిపుణులు అన్ని భాగాలను ఒక భారీ లెగో సెట్స్‌లా అమర్చి పరీక్షలు నిర్వహిస్తారు. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించిన తర్వాతే ఆ వ్యవస్థను యుద్ధ సిద్ధంగా ప్రకటిస్తారు.ఐదో యూనిట్‌ను చైనా సరిహద్దులో ఇప్పుడున్న నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దులో మోహరించనున్నప్పటికీ, ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్‌కు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. అంతేకాదు, అదనంగా మరో ఐదు S-400 యూనిట్ల కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బహుస్థాయి “ఇండియన్ ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే భారత లక్ష్యంగా కనిపిస్తోంది.ఒకసారి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి చొరబడటం దాదాపు అసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, గగనం, రోడ్డు మార్గాల ద్వారా అత్యంత రహస్యంగా జరిగే ఈ భారీ రవాణా వెనుక భారత సైన్యం, ప్రభుత్వం చేస్తున్న కృషి ఇప్పుడు దేశ రక్షణలో మరో కీలక అధ్యాయంగా నిలుస్తోంది.
ట్విషా శర్మ కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్ : మాజీ మిస్ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ప్రకారం ఆమెది హత్య కాదు, ఆత్మహత్యేనని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఇదే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మే 12న ట్విషా తన అత్తగారింటి టెర్రస్‌లో జిమ్ పరికరాన్ని ఉపయోగించి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా పోస్టుమార్టం ఫలితాలతో సరిపోలిందని కమిషనర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కోరితే రెండో పోస్టుమార్టం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు.అయితే ట్విషా తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు ఎదుర్కొన్నందువల్లే ఆమె ప్రాణం కోల్పోయిందని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ట్విషా శర్మ భర్త సమ్రత్ సింగ్ లాయర్ కాగా.. అత్త గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి. ప్రస్తుతం భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. అత్తగారు న్యాయవాద నేపథ్యం ఉన్నవారు కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ట్విషా తండ్రి ఆరోపించారు.కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేసు స్వతంత్రంగా, వేగంగా దర్యాప్తు జరుగుతోందని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ను కేవలం రెండు రోజుల్లోనే నమోదు చేశామని, నిందితుడు సమ్రత్‌ను పట్టుకోవడానికి బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. అరెస్టులో ఆలస్యం జరిగినా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు.ట్విషా శర్మ, సమ్రత్ సింగ్‌ల వివాహం 2024 డిసెంబర్లో జరిగింది. ఇద్దరి పరిచయం ఒక డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు ఈ విషాదానికి కారణమయ్యాయని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. ట్విషా శర్మ మరణించిన సమయంలో ఆమె భర్త సమ్రత్ సింగ్,పొరిగింటి వ్యక్తి, ఇంట్లో సహాయకుడు అనుమానస్పదంగా కనిపించారు. వీరు ముగ్గురూ ఆమెను మెట్లపై నుంచి కిందికి తీసుకువస్తూ,సీపీఆర్ చేసే ప్రయత్నాలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. ట్విషా శర్మ మే 12న ఉదయం 7:20కి ఒంటరిగా మెట్లపైకి ఎక్కి టెర్రస్‌కి వెళ్లినట్ సీసీటీవీలో కనిపించింది.దాదాపు గంట తర్వాత ఆ ముగ్గురు పైకి ట్విషా ఉన్న రూమ్‌లోకి వచ్చారు. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ (రిటైర్డ్ జడ్జ్) ఓ గదిలోకి వెళ్లి, కొద్దిసేపటికి బయటకు వచ్చి కిందికి వెళ్లినట్లు కూడా ఫుటేజ్‌లో కనిపించింది.ట్విషా భర్త ప్రస్తుతం పోలీసుల నుంచి పరారీలో ఉన్నాడు. ట్విషా తల్లిదండ్రులు ఈ ముగ్గురి చర్యలు అనుమానాస్పదమని, వరకట్న వేధింపుల కారణంగా హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అని, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా అదే నిర్ధారిస్తున్నాయని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ట్విషా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దర్యాప్తుకు సిఫారసు చేశారు.
ఎన్ఆర్ఐ
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
క్రైమ్
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు.
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి
వరంగల్ లీగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు.
పోలీసుల అలసత్వమే ప్రాణం తీసిందా?
యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్‌కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్‌జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.పోలీసుల అలసత్వమేనా?ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్‌స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.ఫేమస్ అవుతున్న టైంలో.. పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్‌కి దగ్గరగా ఉండే స్టైల్‌తో పాటు పాప్ కల్చర్‌కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్‌గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.పంజాబ్‌లోనే ఎందుకిలా?ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్ఫీల్డ్ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..పంజాబ్‌లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్‌లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్‌స్టర్ కల్చర్‌తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
వీడియోలు
వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
జగన్ పై పవన్ 'కుట్ర ఢిల్లీ కేంద్రంగా మాస్టర్ ప్లాన్
అరవ శ్రీధర్ మరో సంచలన వీడియోను విడుదల చేసిన హర్ష వీణ
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్ మెన్ తొలగింపు
మార్కెట్లోకి కొత్త పార్టీ అల్లాడిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ
హ్యాపీ బర్త్ డే బావ.. బన్నీ ట్వీట్ వైరల్
ఏపీలో కొండెక్కిన ధరలు.. సామాన్యుడి బతుకు బరువెక్కే!
ప్రొఫెసర్ రామచంద్రయ్య సంచలనాత్మక ఇంటర్వ్యూ
జగన్ ఖాతాలోయి తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు
ఏపీలో గ్యాస్ కటకట సిలిండర్ కోసం కష్టాలు


