-
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
సీతారామం మూవీతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. అంతేకాదు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో గుంటూరుకారం భామ మీనాక్షి చౌదరి అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా దుల్కర్ సల్మాన్ తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇవాళ తన తల్లిదండ్రులు మమ్ముట్టి, సల్ఫత్ 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విషెస్ తెలిపారు. వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాకుండా తన పేరేంట్స్ గురించి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దుల్కర్ ఇన్స్తాలో రాస్తూ..'మీ ఇద్దరి 45 ఏళ్లబంధం ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి. మీ సొంత మార్గాల్లో మికోసం చిన్న ప్రపంచాన్ని సృష్టించారు. మీలో నేను భాగమై మీ ప్రేమను పొందడం నా అదృష్టం. హ్యాపీ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా, నాన్న! మీరిద్దరూ కలిసి అత్యంత అసాధారణమైన వాటిని కూడా సాధిస్తారు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవీంద్రతో కాంబోలో వస్తోన్న చిత్రంలో దుల్కర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు దుల్కర్ సూరారై పొట్రు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తోన్న పురాణనూరు చిత్రానికి సంతకం చేసినట్లు కూడా ప్రకటించారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
అనంతపద్మనాభ ఆలయం గురించి డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలో ఉచితం
శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి 'ఒనవిల్లు: ది డివైన్ బో' పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మార్చి 8 నుంచి మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ పడుతుండటం వల్ల ఈ డాక్యుమెంటరీని ఇతర భాష వారు కూడా చూస్తున్నారు. ఓనవిల్లు అంటే శ్రీ పద్మనాభస్వామి ఆలయ స్వామికి 'ఓనవిల్లు' అంటే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరిని "ఒన్వవిల్లు కుటుంబం" అంటారు. ఈ విల్లును తయారు చేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందు 41 రోజుల తపస్సును పాటిస్తారు. ఆ వంశీయులు ఏడు తరాలుగా ఏటా ఓనవిల్లును తయారు చేస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్టమైన సంప్రదాయ ఆచారం గురించి వచ్చిన ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, యువ నటుడు ఉన్ని ముకుందన్లు వాయిస్‌ని అందించడం విశేషం. సంపదకు రక్షణగా ట్రావెన్కోర్ కొంతకాలం క్రితం అనంతపద్మనాభ ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద ఉంటుందో ఎవరికీ తెలియని రహస్యం. -
ఓటీటీకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/zMSmETJMBw — Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024 -
భారీగా 'భ్రమయుగం' కలెక్షన్స్.. బిగ్ మార్క్‌ను దాటేసిన మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్టైన్మెంట్ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్ రావడంతో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మమ్ముట్టి సత్తా చాటుతున్నాడు. భ్రమయుగం ఓటీటీ రైట్స్ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్‌లో భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
ఖైదీలా స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
మమ్ముట్టి ఇప్పుడీ పేరు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంచలనం.. ఏడు పదుల వయస్సు ధాటినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో, మలయాళ మెగాస్టార్. 'యాత్ర' సినిమాతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయాడు.. తాజాగా 'భ్రమయుగం' సినిమాతో ప్రేక్షకులను మరీంత ఆశ్చర్యపరిచాడు. బ్లాక్ అండ్ వైట్‌లో మూడే పాత్రలతో 'భ్రమయుగం' సినిమా తీసి తన సత్తా ఎంటో నిరూపించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? అనుకుంటే సాధ్యమే అని నిరూపించాడు. ఒక స్టార్ హీరో ఒక గే పాత్ర చేయడం అంటే అంత సులభం కాదు.. 'కాదల్ ది కోర్'లో చేశాడు మమ్ముట్టి. అందరి హీరోల మాదిరి కాకుండా కొత్తదనాన్ని, ప్రయోగాన్ని, వైవిధ్యాన్ని చూపుతు తనదైన స్టైల్లో సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. 'టర్బో' పేరుతో మరో భిన్నమైన కథను తెరపైకి తీసుకురావడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ ప్రాజెక్ట్.. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను మమ్ముట్టి షేర్ చేశారు. పోలీసుస్టేషన్లో ఖైదీల మధ్యలో కూర్చుని కొత్త అవతారంలో మమ్ముట్టి కనిపించారు. ఈ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇదే క్రమంలో ఆయన 'బజూక' అనే మరో విభిన్న చిత్రంలో నటిస్తున్నారు. గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. 'బజూక'లో బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్ ఇప్పటికే వైరల్ అవుతుంది. బజూక సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement